'ఆ మీడియా సంస్థలను జైల్లో పెట్టిస్తాం' | AAP defends Kejriwal, claims 3 news channels are ‘paid medi | Sakshi
Sakshi News home page

'ఆ మీడియా సంస్థలను జైల్లో పెట్టిస్తాం'

Published Fri, Mar 14 2014 3:49 PM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

'ఆ మీడియా సంస్థలను జైల్లో పెట్టిస్తాం' - Sakshi

న్యూఢిల్లీ : ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీడియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  కొన్ని మీడియా సంస్థలు డబ్బుకు అమ్ముడుపోతున్నాయని ఆయన ఆరోపించారు. డబ్బు తీసుకుని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అనుకూలంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయని కేజ్రీవాల్ విమర్శించారు. ఆప్ అధికారంలోకి రాగానే ఆ మీడియా సంస్థలను జైల్లో పెట్టిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఆప్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ  మోడీకి అనుకూలంగా వార్తలు ప్రసారం చేస్తున్న మూడు టీవీ ఛానల్స్ (ఇండియా టీవీ, ఇండియా న్యూస్, జీ టీవీ)లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఆప్ కు వ్యతిరేకంగా  టౌమ్స్ నౌ ఛానల్ కథనాలు ప్రసారం చేస్తోందన్నారు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోపణలను బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలు కూడా కేజ్రీవాల్ ఆరోపణలు ఖండించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement