యూపీలోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ
లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ యూపీ పర్యటనలో ఎస్పీ, బీఎస్పీలను టార్గెట్ చేస్తూ విమర్శల దాడి పెంచారు. సమాజ్‌వాద్, బహుజన్‌ల గురించి మాట్లాడే వారు అధికారం కోసం కుయుక్తులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. యూపీలో ఈ రెండు పార్టీలు అధికారం కోసమే ఏకమయ్యాయని ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన ఈ పార్టీలు ఇప్పుడు రాజకీయ లబ్ధితో కాంగ్రెస్‌తో చేతులు కలిపాయని సంత్ కబీర్ నగర్ జిల్లాలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ అన్నారు.
ఇటీవల జరిగిన కైరానా లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్‌ల మద్దతుతో ఆరెల్డీ అభ్యర్థి బీజేపీని మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఎస్పీ, బీఎస్పీ నేతలకు సమాజ్, బహుజన్ వంటి పదాలు పట్టవని వారు కేవలం తమ కుటుంబాల కోసమే తపన పడతారని మోదీ విమర్శించారు.
కాగా, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అత్యదికంగా 80 ఎంపీ సీట్లున్న ఉత్తర్ ప్రదేశ్ కీలకంగా మారింది. బీజేపీకి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు సమిష్టిగా పోటీ చేసి గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తుండగా, విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment