ఫ్లోరిడా: టెంపాలోని హెటీఎఫ్ ఆడిటోరియంలో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్‌ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఏర్పాటు చేసింది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అట్లాంటా, ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ టెంపా బే, నాట్స్ టెంపా బే విభాగాలు సంయుక్తంగా ఈ సర్వీసెస్ క్యాంప్‌ను ఏర్పాటు చేశాయి. దాదాపు 350 మందికి పైగా ఇక్కడ సేవలను వినియోగించుకున్నారు. వీసా రెన్యూవల్స్ కు సంబంధించి 100మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. పవర్ ఆఫ్ అటార్నీ, లైఫ్ సర్టిఫికెట్, లీగల్ డాక్యుమెంట్లకు సంబంధించి 50 మందికి పైగా దరఖాస్తు చేస్తున్నారు.
ఇమ్మిగ్రేషన్ సేవలకు సంబంధించి ఇంత మంచి కార్యక్రమాన్ని నాట్స్ చేపట్టినట్టుందుకు స్థానిక తెలుగువారితో పాటు భారతీయులు నాట్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. టెంపా నాట్స్ చాప్టర్ సమన్వయకర్త రాజేశ్ కాండ్రు నేతృత్వంలో ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాట్స్ వాలంటీర్లు దీని కోసం ప్రచారం చేయడంతో పాటు ఈ సేవా కేంద్రంలో తమ విలువైన సేవలు అందించారు. టెంపాలో తెలుగువారి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా నాట్స్ తెలిపింది.
టెంపాలో నాట్స్ కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్
Published Thu, Jul 18 2019 8:34 PM | Last Updated on Thu, Jul 18 2019 8:37 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment