మాజీ రంజీ క్రికెటర్ల భేటీ | former ranji cricketers meet for lodha instructions | Sakshi
Sakshi News home page

మాజీ రంజీ క్రికెటర్ల భేటీ

Published Mon, Nov 28 2016 11:27 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

former ranji cricketers meet for lodha instructions

సాక్షి, హైదరాబాద్: మాజీ రంజీ క్రికెటర్లు ఆదివారం జింఖానా గ్రౌండ్‌‌సలోని హెచ్‌సీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. క్రికెట్ ప్లేయర్ల సంఘం (సీపీఏ) అధ్యక్షుడు మనోహర్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్‌లో 34 మంది హైదరాబాద్‌కు ఆడిన మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. లోధా కమిటీ సిఫార్సుల్ని హెచ్‌సీఏ అమలుచేయడంపై వీరంతా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మాజీలు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. ప్రస్తుత నిబంధనల మేరకు కొత్త ప్లేయర్ల సంఘాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇందుకోసం స్టీరింగ్ కమిటీని నియమించారు.

 

ఈ కమిటీ హెచ్‌సీఏతో సమన్వయంతో పనిచేస్తుంది. ఇది కేవలం మధ్యంతర కమిటీ మాత్రమేనని విజయ్ మోహన్‌రాజ్ స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఎన్నుకునేవరకు మాత్రమే ఇది పనిచేస్తుందన్నారు. ఈ కమిటీలో ఎం.వి.నరసింహారావు, వెంకటపతి రాజు, నోయల్ డేవిడ్, విజయ్ మోహన్‌రాజ్‌లు ఉన్నారు. ఇందులో ఐదో సభ్యుడిగా శివలాల్‌యాదవ్‌ను తీసుకోవాలని భావిస్తున్నారు. ఆయన సమ్మతి మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement