హైదరాబాద్, ఆంధ్ర జట్ల ఘన విజయం
రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’లో హైదరాబాద్, ఆంధ్ర జట్లకు కీలక విజయాలు దక్కారుు. ఇరు జట్లు బోనస్ పారుుంట్‌తో ఈ మ్యాచ్‌లు గెలుచుకోవడం విశేషం. ఆంధ్ర జట్టు ఇన్నింగ్‌స, 38 పరుగుల తేడాతో త్రిపురను చిత్తుగా ఓడించగా... హైదరాబాద్ 10 వికెట్లతో సర్వీసెస్‌పై ఘన విజయం సాధించింది. సీజన్‌లో ఆంధ్రకు ఇది మూడో గెలుపు కాగా, హైదరాబాద్‌కు రెండోది. తాజా ఫలితం అనంతరం ఆంధ్ర 22 పారుుంట్లతో గ్రూప్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. హైదరాబాద్ మొత్తం 17 పారుుంట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 21 నుంచి జరిగే తమ తర్వాతి మ్యాచ్ లో ఆంధ్ర, కేరళతో (గువాహటిలో)... హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్‌తో (వల్సాడ్‌లో) తలపడతారుు.
32 పరుగులకే 7 వికెట్లు...
వల్సాడ్ (గుజరాత్): ఓవర్‌నైట్ స్కోరు 165/3తో బుధవారం చివరి రోజు ప్రారంభించిన త్రిపుర, ఆంధ్ర బౌలర్ల ధాటికి తమ రెండో ఇన్నింగ్‌సలో 315 పరుగులకే ఆలౌటైంది. యశ్పాల్ సింగ్ (59) అర్ధసెంచరీ చేయగా, అభిజిత్ డే (43) ఫర్వాలేదనిపిం చాడు. ఒక దశలో 183/3తో మెరుగ్గా కనిపించిన ఆ జట్టు... మరో 32 పరుగులు జోడించి చివరి 7 వికెట్లు కోల్పోరుుంది. ఆంధ్ర బౌలర్లలో విజయ్ కుమార్, భార్గవ్ భట్ చెరో 4 వికెట్లతో చెలరేగారు. విహారి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
రాణించిన రవికిరణ్...
ముంబై: హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి రోజే 11 వికెట్లు కోల్పోరుు సర్వీసెస్ అనూహ్యంగా తలవంచింది. బుధవారం 360/9తో ఆట ప్రారంభించిన సర్వీసెస్ అదే స్కోరు వద్ద చివరి వికెట్ కోల్పోరుుంది. దాంతో 220 పరుగుల భారీ ఆధిక్యం అందుకున్న హైదరాబాద్, ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించింది. అనంతరం రెండో ఇన్నింగ్‌సలో సర్వీసెస్ 239 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ సింగ్ (59) టాప్ స్కోరర్ కాగా, వికాస్ యాదవ్ (47), వికాస్ హాథ్‌వాలా (44) కొద్దిగా పోరాడారు. రవికిరణ్ (4/32) ప్రత్యర్థిని కుప్పకూల్చగా, సిరాజ్ 3 వికెట్లు తీశాడు. అనంతరం 20 పరుగుల విజయ లక్ష్యాన్ని హైదరాబాద్ వికెట్ కోల్పోకుండా 4.5 ఓవర్లలో అందుకుంది.