భారత్ లక్ష్యం 295 | India's target 295 in 5th oneday | Sakshi
Sakshi News home page

భారత్ లక్ష్యం 295

Published Fri, Sep 5 2014 6:15 PM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

భారత్ లక్ష్యం 295

భారత్ లక్ష్యం 295

లీడ్స్: భారత్తో చివరి, ఐదో వన్డేలో ఇంగ్లండ్ 295 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శుక్రవారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ పూర్తి ఓవర్లలో ఏడు వికెట్లకు 294 పరుగులు చేసింది.

రూట్ (113) సెంచరీ చేసి ఇంగ్లండ్ను ఆదుకున్నాడు. బట్లర్ (49), కుక్ (46) రాణించారు. మొదట్లో ఇంగ్లండ్ నింపాదిగా ఆడినా, చివర్లో వేగంగా పరుగులు రాబట్టింది. షమీ రెండు, భువనేశ్వర్, ఉమేష్, అశ్విన్, రైనా తలా వికెట్ తీశారు.

వన్డే సిరీస్ను ధోనీసేన 3-0తో గెల్చుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, తర్వాతి మూడు వన్డేల్లో భారత్ ఘనవిజయాలు నమోదు చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement