ముంబై: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై జస్టిస్ లోధా కమిటీ రెండేళ్ల వేటు వేసిన నేపథ్యంలో నేడు (ఆదివారం) ఐపీఎల్ పాలక మండలి సమావేశం కానుంది. తాజా పరిస్థితులపైనే కాకుండా ఈ టి20 ఫార్మాట్‌ను ఎలా జరపాలనే విషయంపైనా సభ్యులు చర్చించనున్నారు.
ఈ కీలక సమావేశానికి అనారోగ్య కారణాలరీత్యా బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా హాజరుకాబోరని సమాచారం. చెన్నై టీమ్ ప్రిన్సిపల్‌గా వ్యవహరించిన గురునాథ్ మెయ్యప్పన్, రాజస్తాన్ జట్టు సహ యజమానిగా ఉన్న రాజ్ కుంద్రా బెట్టింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారణ అయినందున ఆ రెండు జట్లపై లోధా కమిటీ వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే అవినీతి మచ్చ పడిన ఈ లీగ్‌కు ఇప్పుడు కొత్త రూపు తెచ్చేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.
నేడు ఐపీఎల్ పాలక మండలి భేటీ
Published Sun, Jul 19 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM
Advertisement
Advertisement