వడోదర: రంజీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టు సత్తా చాటింది. తొలిసారిగా సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో హర్యానాపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆట నాలుగో రోజు హర్యానా నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సెమీస్ లో అడుగుపెట్టింది. 30.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు సాధించింది. ఓపెనర్ ఇషాన్ కిషాన్(86) అర్ధసెంచరీతో రాణించాడు.
146/2 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన హర్యానా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి 262 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ బౌలర్లలో షహబాజ్ నదీం 4, లెగ్ స్పిన్నర్ సామర్ ఖాద్రి 3 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో హర్యానా 258, జార్ఖండ్ 345 పరుగులు చేశాయి. రెండు ఇన్నింగ్స్ లో కలిపి 11 వికెట్లు పడగొట్టిన నదీం 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా ఎంపికయ్యాడు.
నదీం అదుర్స్, సెమీస్ లో జార్ఖండ్
Published Mon, Dec 26 2016 6:06 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
Advertisement