జకార్తా: కొత్త సీజన్‌ను టైటిల్‌తో ప్రారంభించాలని భావిస్తోన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆ దిశగా దూసుకెళ్తోంది. ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్‌లో సింధు క్వార్టర్స్‌కు చేరుకుంది. లీ జురుయ్‌తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో గెలిచేందుకు శ్రమించిన సింధు... ప్రిక్వార్టర్స్‌లో సులువుగా గెలుపొందింది. సింధుతో పాటు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్ సింధు 23–21, 21–7తో గ్రెగోరియా మరిస్కా టుంజుంగ్ (ఇండోనేసియా)పై 37 నిమిషాల్లోనే విజయం సాధించింది. తొలి గేమ్‌లో గట్టి పోటీనిచ్చిన గ్రెగోరియా రెండో గేమ్‌లో సింధు ధాటికి తేలిపోయింది.
మరో మ్యాచ్‌లో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ 21–17, 21–15తో ఫిత్రియాని ఫిత్రియాని (ఇండోనేసియా)పై 43 నిమిషాల్లోనే గెలుపొందింది. ముఖాముఖీ రికార్డులో సైనా 5–0తో ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–14, 21–9తో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత కెంటా నిషిమోటో (జపాన్)ను చిత్తుగా ఓడించాడు. పురుషుల డబుల్స్ విభాగంలో భారత జోడీకి నిరాశ ఎదురైంది. డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి (భారత్) ద్వయం 14–21, 21–17, 10–21తో ఐదో సీడ్ కిమ్ ఆస్ట్రుప్–ఆండర్స్ స్కారుప్ రస్‌మసెన్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment