జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక ఎదురీదుతోంది. శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌లో ఆట ముగిసే సమయానికి లంక జట్టు 28.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 80 పరుగులు చేసింది. కుశాల్ మెం డిస్ (41; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక ఇంకా 346 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో మాథ్యూస్ (11 బ్యాటింగ్), చండిమాల్ (3 బ్యాటింగ్) ఉన్నా రు. వెలుతురులేమి కారణంగా ముందుగానే ఆటను నిలిపివేశారు.
ఫిలాండర్, రబడాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆమ్లా (134; 16 ఫోర్లు) త్వరగానే పెవిలియన్‌కు చేరాడు. లంక బౌలర్ల విజృంభణకు తమ చివరి ఏడు వికెట్లను దక్షిణాఫ్రికా 88 పరుగులకే కోల్పోయింది. ప్రదీ ప్, కుమారలకు నాలుగేసి వికెట్లు దక్కాయి.
శ్రీలంక 80/4
Published Sat, Jan 14 2017 12:49 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
Advertisement
Advertisement