రసూల్‌ను తీసుకోకపోవడం దురదృష్టకరం
కాశ్మీర్ క్రికెటర్ ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్‌ను చివరి వన్డేలో ఆడించకపోవడం దురదృష్టకరమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అయితే తాను తీసుకున్న నిర్ణయాన్ని కోహ్లి సమర్థించుకున్నాడు. జట్టులో స్థానంలో ఎంతో మంది ఎదురు చూస్తున్నారని చెప్పాడు. జింబాబ్వేతో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో ఆడేందుకు రిజర్వు బెంచ్ ఆటగాళ్లు రెండు నెలలు నుంచి ఎదురుచూస్తున్నారని వెల్లడించాడు. రవీంద్ర జడేజా స్థానంలో రసూల్‌ను ఆడించాల్సిందని అడిగిన ప్రశ్నకు... ఏ మ్యాచ్ను తాను తక్కువగా తీసుకోనని స్పష్టం చేశాడు.
భారత జట్టు తరఫున ఆడిన తొలి కాశ్మీర్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరిన పర్వేజ్ రసూల్‌కు జింబాబ్వే టూర్లో నిరాశే ఎదురైంది. ఆఖరి వన్డేలోనూ తుది జట్టులో అతనికి చోటు దక్కలేదు. దీంతో భారత జాతీయ జట్టులో అరంగేట్రం కోసం రసూల్ మరి కొంతకాలం వేచి చూడక తప్పడం లేదు. ఈ సిరీస్ ద్వారా ఉనాద్కట్, మోహిత్, పుజారా, రాయుడులకు వన్డేల్లో అరంగేట్రం అవకాశం కల్పించిన భారత్... రసూల్‌ను మాత్రం విస్మరించింది.
వన్డే సిరీస్ గెలిచిన తర్వాత కూడా రసూల్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవడం దారుణమని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. స్వదేశంలో పక్కనబెట్టడం కంటే ఇది మరీ దారుణంగా ఉందని ట్విట్టర్‌లో ఘాటుగా విమర్శించారు. తుది జట్టులో రసూల్‌కు అవకాశం కల్పించకపోవడాన్ని కేంద్ర మంత్రి శశి థరూర్ కూడా తప్పుబట్టారు.