న్యూఢిల్లీ: తన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షల్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విన్నూత్నంగా తెలియజేశాడు. ఈరోజు(జూన్3వ తేదీ) విరాట్ కోహ్లి సోదరుడు వికాశ్ కోహ్లి 39వ బర్త్‌డే సందర్భంగా విషెస్‌ను తెలిపాడు. ‘హ్యాపీ బర్త్‌డే బిరదార్.. 40 ఏళ్లకు ఇంకా ఏడాదే ఉంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు తమ చిన్ననాటి ఫోటోను కోహ్లి షేర్ చేశాడు. ఒకవైపు విరాట్ కోహ్లి తన క్రికెట్ కెరీర్‌తో బిజీగా ఉండగా, వికాశ్ కోహ్లి మాత్రం తన రెస్టారెంట్ వ్యాపారాలను చూసుకుంటున్నాడు. ఒక సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్న వికాశ్.. పలుమార్లు ఫుడ్ అవార్డులను కూడా అందుకున్నాడు. (నాది కూడా అభినవ్ వర్ణ వివక్ష స్టోరీనే)
ఢిల్లీలో న్యూవా రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు. దీనికి విరాట్ కోహ్లి ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2018లో ఈ రెస్టారెంట్ ఫుడ్ అవార్డును గెలుచుకుంది. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జరుగుతున్న సమయంలో వికాశ్ కృష్ణన్ మ్యాచ్‌లను వీక్షించడానికి ఎక్కువగా స్టేడియాలకు వస్తాడు. కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడుతున్న మ్యాచ్‌లకు వికాశ్ హాజరవుతూ ఉంటాడు. వికాశ్ భార్య పేరు చేత్నా కాగా వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ఆర్యవీర్. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం క్రికెట్ ఈవెంట్లు ఇంకా ఆరంభం కాకపోవడంతో కోహ్లి ఇంట్లోనే ఉంటూ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాడు. (హార్దిక్ మాటల్లో ఆంతర్యం ఏమిటి?)
Comments
Please login to add a commentAdd a comment