పెళ్లి మండపంలో వరుడి అరెస్ట్ | The arrest of the groom in the wedding chapel | Sakshi
Sakshi News home page

పెళ్లి మండపంలో వరుడి అరెస్ట్

Published Wed, Oct 19 2016 1:39 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

పెళ్లి మండపంలో వరుడి అరెస్ట్ - Sakshi

పెళ్లి మండపంలో వరుడి అరెస్ట్

బెంగళూరు(బనశంకరి) :  పెళ్లిపందిరిలో సందడి నెలకొంది. వధూవరుల బంధువులు, స్నేహితులతో ఆ ప్రాంతం కోలాహంగా ఉంది. ఓ వైపు వధువు, మర వైపు వరుడు పెళ్లి పీటలపైకి చేరుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతలోనే   మంటపంలోకి వచ్చిన పోలీసులు ఏకంగా వరుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ హఠాత్‌పరిణామంతో పెళ్లికి వచ్చిన పెద్దలు, బంధువులు ద్రిగ్భాంతికి గురయ్యారు. మరికొద్ది క్షణాల్లో  పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు ఓ హత్య కేసుకు సంబంధించి కటకటాలపాలయ్యాడు. దీంతో వివాహం ఆగిపోయింది. ఈ ఘటన చిక్కమంగళూరు జిల్లా, జిన్నాపుర వర్తకుల భవనంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..చిక్కమంగళూరు జిల్లా, ముడిగెరె తాలూకా, జీ.హొసహళ్లి గ్రామానికి చెందిన యువతితో సుల్లా తాలూకాలోని ఎనేకల్ గ్రామానికి చెందిన ఎస్‌వీ.కిరణ్ అనే యువకుడికి వివాహం నిశ్చయమైంది.

ఈమేరకు మంగళవారం జిన్నాపుర వర్తకుల భవనంలో వివాహ ఏర్పాట్లు చేశారు. వరుడిని పెళ్లి పీటలపైకి తీసుకెళ్లేందుకు బంధువులు సమాయత్తమవుతుండగా  అక్కడకు చేరుకున్న రామనగర పోలీసులు వరుడు కిరణ్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బెంగళూరు నగరంలో బీఎస్‌సీ నర్సింగ్ చదువుతున్న సమయంలో కిరణ్  ఓ వృద్ధుడిని హత్యచేసినట్లు ఆరోపణలున్నాయి. ఈమేరకు కిరణ్‌కోసం పోలీసులు గాలిస్తున్నారు. పక్కా సమచారంతో పోలీసులు మంగళవారం జిన్నాపుర చేరుకొని కిరణ్‌ను అరెస్ట్ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement