సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం ఆగట్లేదు. ఆదివారం మళ్లీ 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఒకేరోజు మరో ముగ్గురు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 858కి చేరుకోగా, మొత్తం 21 మంది చనిపోయారు. అయితే ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ఎలాంటి బులిటెన్ విడుదల చేయలేదు.
కానీ రాత్రి 8 గంటలకు తయారైన బులెటిన్ బయటకు లీక్ అయింది. కాగా, కరోనా నుంచి ఇప్పటివరకు 186 మంది కోలుకొని నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు ప్రస్తుతం 651 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని రెనివట్లకు చెందిన రెండు నెలల మగశిశువు కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. చదవండి: మే 7 వరకు ఇళ్లకే పరిమితమవ్వండి
రాష్ట్రంలో స్టాక్ వివరాలు...
పీపీఈ కిట్లు: 3.04లక్షలు
నమూనా సేకరణ కిట్లు: 61,119
టెస్టింగ్ కిట్లు: 21,366
హెచ్‌సీక్యూలు: 12.35లక్షలు
వైద్య సిబ్బంది తీసుకున్న హెచ్‌సీక్యూలు: 50,807
Comments
Please login to add a commentAdd a comment