సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు పరీక్షలు చేయించుకున్న ప్రతి వంద మందిలో 14 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా టెస్టుల పాజిటివ్ రేట్(టీపీఆర్) 14.39 శాతానికి ఎగబాకడమే ఇందుకు నిదర్శనం. జాతీ య స్థాయిలో ఇది 6.11 శాతం ఉండగా, రాష్ట్రం లో రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏప్రిల్ 28 నాటికి రాష్ట్రంలో 5.2 శాతం మాత్రమే టీపీఆర్ ఉండగా, మే 14 నాటికి 6.07 శాతానికి పెరిగింది.
ఆ తర్వాత మే 15 నుంచి జూన్ 16 మధ్య కాలంలో రెట్టింపు అయింది. జూన్ 16న 12.6 శాతానికి పెరగ్గా.. ప్రస్తుతం 14.39 శాతానికి ఎగబాకింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే రాష్ట్రంలో వైరస్ చాప కింద నీరులా వ్యాప్తి చెందినట్టు తెలుస్తోంది. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలో కరోనా నిర్థారణ కోసం పరీక్షలు చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో 20 మందికి వైరస్ సోకినట్టు ఫలితాలొస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న జీహెచ్‌ఎంసీతో పాటు పరిసర జిల్లాల పరిధిలోని 30 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో గత వారం రోజులుగా టెస్టుల సంఖ్యను పెంచడంతో పాజిటివ్ కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి.
జూన్ 16 నుంచి కేసుల వివరాలిలా..
Comments
Please login to add a commentAdd a comment