గాంధీభవన్‌లో పొన్నాల సాక్షిగా ఘటన
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవలు మరోసారి భగ్గుమన్నాయి. సభ్యత్వ నమోదు సమీక్షలో రభస చోటుచేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాల సమీక్ష సమావేశం శనివారం గాంధీభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి న కార్యకర్తల సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్, పార్టీ కార్యదర్శి టి.నిరంజన్ మధ్య వివాదం మొదలైంది. దానం తీరు వల్లే నగరంలో కాంగ్రెస్ ఒక్క ఎమ్మె ల్యే స్థానాన్నీ గెలవలేక పోయిందని నిరంజన్ విమర్శించడంతో గొడవ మొదలైంది. దీనికి ప్రతిగా, అసలు మీరంతా ఎవరు?, ఎవరు మి మ్మల్ని ఆహ్వానించారని దానం అనడంతో వా గ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఇరువర్గాల కార్యకర్తలు తోపులాడుకున్నారు.
అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, సభ్యత్వ నమోదును ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు మాట్లాడుతూ సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకుని పనిచేయాలన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సిటిజన్లకు అండగా ఉంటాం...
సీనియర్ సిటిజన్స్ అనుభవాలను పార్టీ అభివృద్ధి కోసం వినియోగించుకుంటామని గాంధీభవన్‌లో జరిగిన సీనియర్ సిటిజన్స్ ఫోరం సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య అన్నారు.