వాల్ పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎస్సై మల్లయ్య
చిలప్‌చెడ్(నర్సాపూర్): ఏ దశలో ఉన్న వ్యక్తులైనా మనస్తాపం చెంది తోందరపాటు పనులు చేస్తూ, తమ జీవితాలతో పాటు తమను నమ్ముకున్న కుటుంబ సభ్యుల జీవితాలను కూడా నాశనం చెయ్యొద్దని స్థానిక ఎస్సై మల్లయ్య కోరారు. శుక్రవారం జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆదేశాల మేరకు మనిషి వ్యర్థమైన ఆలోచనలతో జీవితం నాశనం చేసుకోవద్దు అనే అంశంపై అవగాహన కల్పించే గోడ పత్రికను ఆవిష్కరించారు. చిలప్‌చెడ్ మండలంలోని గ్రామాలలో ఆ గోడ పత్రికలు అంటించే విధంగా చర్య తీసుకున్నామన్నారు.
అనంతరం మాట్లాడుతూ విద్యార్ధులు బాగా చదువుకుని స్థిరపడే విధంగా ఆలోచించాలి కానీ మార్కులు తక్కువగా వచ్చాయని, తల్లితండ్రులు మందలించారని మనస్తాపానికి లోను కావద్దన్నారు. యువతీ యువకులు ప్రేమ విఫలమైందని, చదివిన చదువులకు జాబ్‌లు రాలేదన్న కారణంగా చెడు మార్గాల వైపు వెళ్లడంలాంటివి చేయవద్దన్నారు. రైతులు పంట పండటం లేదని, నీళ్లు తగ్గాయని తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment