మహబూబ్‌నగర్, వనపర్తిలోని 13 కేంద్రాల్లో పరీక్ష
ఒక్క నిమిషం నిబంధనతో పరుగులు పెట్టిన విద్యార్థులు
వనపర్తిలో చెమటకు ఓఎంఆర్ షీట్లు తడుస్తున్నాయని ఇన్విజిలేటర్లతో వాగ్వాదం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : వనపర్తి, మహబూబ్‌నగర్ పట్టణాల్లో గురువారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఎంసెట్-2015 ప్రశాతంగా జరిగింది. కేంద్రాల వద్ద 144సెక్షన్ విధించడంతో పాటు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. మహబూబ్‌నగర్ డీఎస్పీ కృష్ణమూర్తి అన్ని కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. మొత్తం 13 కేంద్రాలలో ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగంలో మొత్తం 14,235 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13,074 మంది హాజరయ్యారు.
1121మంది గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంల మొత్తం 6,568 మంది విద్యార్థులకు గాను 6,052 మంది హాజరయ్యారు. 516 మంది గైర్హాజరయ్యారు. మెడిసిన్ విభాగంలో 7,667 మంది విద్యార్థులకు 7,022 మంది హాజరయ్యారు. 605 మంది గైర్హాజరయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని 8కేంద్రాలలో ఇంజనీరింగ్ 4,870 మంది విద్యార్థులకు 4,477 మంది విద్యార్థులు హాజరయ్యారు. 393 మంది గైర్హాజరయ్యారు.
మెడిసిన్ విభాగంలో 5,860 మంది విద్యార్థులకు గాను 5,313 మంది విద్యార్థులు హాజరయ్యారు. 507మంది గైర్హాజరు అయ్యారు. వనపర్తిలో 5 కేంద్రాలలో ఇంజనీరింగ్ పరీక్షకు 1,698 మందికి గాను 1,575 మంది హాజరయ్యారు. 123మంది గైర్హాజరు అయ్యారు. మెడికల్ విభాగంలో 1,807 మంది విద్యార్థులకు గాను 1709 మంది హాజరయ్యారు. 98మంది గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి, రీజినల్ కో ఆర్డినేటర్లు డాక్టర్ కె.సుధాకర్, పి.సునీల్‌కుమార్‌లు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
అదేవిధంగా ఫైయింగ్‌స్క్వాడ్ బృందాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్‌లు, అబ్జర్వర్లు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతించారు. వారివెంట తెచ్చుకున్న ప్యాడ్‌లు, చేతి గడియారాలు, సెల్‌ఫోన్‌లను లోపలికి అనుమతించలేదు. మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, అవకతవకలకు తావులేకుండా ఎంసెట్ ప్రశాంతంగా ముగిసింది.
పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ప్రకటించడంతో పలువురు విద్యార్థులు ఉరుకులు, పరుగులతో పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. వనపర్తి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫ్యాన్లు లేకపోవడంతో చెమటకు ఓఎంఆర్ షీట్లు తడిచిపోతున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఇన్విజిలేటర్లు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ప్రశాంతంగా ఎంసెట్
Published Fri, May 15 2015 3:04 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM
Advertisement