మరిపెడ : వర్గీకరణ విషయంలో సీఎం కె.చంద్రశుఖర్‌రావు మాట తప్పుతారనే అనుమానం ఉందని, అదే జరిగితే మరోసారి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. మరిపెడ మండల కేంద్రం లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కాకముందు వర్గీకరణకు అనుకూలమని చెప్పి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, మాటమార్చారన్నారు. దళితులను మభ్యపెట్టేందుకు భూపంపిణీ కార్యక్రమం చేపట్టారని ధ్వజమెత్తారు. రెండు నెలలు గడిచినా... ఒక్క గ్రామంలో కూడా దళితులకు భూమి ఇవ్వలేదని ఆరోపించారు. ఇవన్నీ దళితులను మోసం చేసే కుట్రలో భాగమేనన్నారు.
ఇన్ని మాటలు తప్పిన సీఎం ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు మౌనం వహిస్తున్నారు ఎందుకో... అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం నాయకత్వంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి రాజయ్య, ఎంపీ కడియం శ్రీహరిపై ఉందన్నారు. ఈ నెల చివరి వరకు వర్గీకరణ విషయంలో తేల్చకుంటే నవంబర్ 2 నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లా కేంద్రంలో భూగర్భ డ్రెరుునేజీ వ్యవస్థను నిర్మిస్తామని చెప్పి మూణ్నెళ్లు గడిచాయన్నారు. ఆజాంజహి మిల్లు కంటే 20 రెట్లు పెద్ద ఫ్యాక్టరీ పెడతానని చెప్పిన కేసీఆర్... ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ర్ట ప్రభుతృంలో జవాబుదారీ తనం కొరవడిందని, ఐదు శాఖలు సీఎం వద్దే ఉంచుకోవడం వల్ల సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రైతన్నల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. విద్యుత్ శాఖ కూడా సీఎం వద్దే ఉందని, అరుునా విద్యుత్ సంక్షోభం ఏర్పడడం సిగ్గుచేటన్నారు.
అధికారంలోకి రాకముందు వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని, రైతులకు 9 గంటలపాటు పగలు కరెంటు ఇస్తామని చెప్పారని, ఈ రోజు మరో మూడేళ్లు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పు డు ఉన్న ఉద్యోగాలు పీకేసే దిశగా సీఎం చూస్తున్నారని ధ్వజమెత్తారు.
సమావేశంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దూడెపాక వెంకన్న, ఎంపీటీసీ జినుక మంజుల, మాజీ ఎంపీటీసీ వీరన్న, ఉదయ్‌కుమార్‌మాదిగ, ఎడెల్లి వెం కన్న, సైదులు, మిడతపెల్లి శ్రీనివాస్ పాల్గొ న్నారు. కాగా, మద్దూరు మండలం లద్నూరు గ్రామంలో అనారోగ్యానికి గురైన ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మంద యాదయ్య మాదిగను మంద కృష్ణ పరామర్శించారు.
సీఎం మాట తప్పితే ఉద్యమిస్తాం
Published Sun, Oct 19 2014 12:51 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement