సాక్షి, మెదక్: రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టినన్ని సంక్షేమ పథకాలు దేశం లోని ఏ రాష్ట్రంలో కూడా లేవని, అందుకే దేశం తెలంగాణవైపు చూస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమ వారం మెదక్‌కు వచ్చిన ఆయన మెదక్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కొత్తగా నిర్మించిన పీఏసీఎస్ భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం మెదక్ కలెక్టరేట్‌లో పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణకు పంచాయతీకో ట్రాక్టర్ చొప్పున 115 ట్రాక్టర్లను సంబంధిత సర్పంచ్‌లకు అందజేశారు. మిగతా గ్రామాలకు త్వరలో అందజేయనున్నట్లు తెలిపారు. తర్వాత కలెక్టరేట్‌లో ‘పల్లె ప్రగతి–పారిశుధ్యం, వరిధాన్యం సేకరణ’కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఇకపై 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని ఏటా 3 పర్యాయాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
దేశం తెలంగాణవైపు చూస్తోంది
Published Tue, Nov 5 2019 3:28 AM | Last Updated on Tue, Nov 5 2019 7:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment