జాతీయ రహదారిపై ఉన్న ఆ భవనంలో ఓ కాలేజీ నడుస్తున్నట్టు ఆ ఊరివాళ్లకే తెలియదు. ఎందుకంటే, అక్కడ ఎన్నడూ జనసంచారం కనిపించదు. కాలేజీ అన్నాక విద్యార్థులు, అధ్యాపకులు ఉండాలి. కానీ, అక్కడ అలాంటి పరిస్థితులు లేవు. ఆ కాలేజీలో వంద మంది విద్యార్థులు చదువుతున్నట్టు రికార్డులలో మాత్రమే ఉంటుంది. కాలేజీకి విద్యార్థులు రాకపోగా, అందులో పని చే స్తున్నట్టు చెబుతున్న అధ్యాపకులు ఇతర ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్నారు.తరగతులు కాగితాలపైనే నడుస్తున్నాయి. భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామ శివారులో ఉన్న అహ్మద్ డీఎడ్ కాలేజీ వ్యవహారం ఇది.
కామారెడ్డి: 2012లో మైనారిటీ కోటాలో అహ్మద్ డీఎడ్ కాలేజీ ఏర్పాటై ంది. 2012-14 విద్యా సంవత్సరానికిగాను మొదట దీనికి అనుమతి లభించలేదు. అప్పటికే యాజమాన్య ం 50 మంది విద్యార్థులకు సీ ట్లను అమ్ముకుంది. చివరకు కోర్టును ఆశ్రయించి అనుమతి పొందింది. కాలేజీలో 40 సీట్లు కౌన్సెలింగ్ ద్వారా, పది సీట్లు యాజమాన్య కోటా ద్వారా భర్తీ చేసుకోవాల్సి ఉన్నా, తగు సమయంలో అనుమతి లభించలేదన్న ఆరణంతో మొత్తం 50 సీట్లను మేనేజ్‌మెంట్ కోటాలోనే భర్తీ చేసుకున్నారు.
రెండేళ్లలో ఏనాడూ తరగతులు నిర్వహించిన పాపాన పోలేదు. స్థానికులకు సీట్లు ఇస్తే తరగతులు నిర్వహించమనే ఒత్తిడి ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇతర ప్రాంతాలకు చెందినవారికి సీట్లు అమ్ముకున్నారు. ఆ బ్యాచ్‌కు సంబంధించి విద్యార్థులు పరీక్షల విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొని, చివరి క్షణంలో హాల్‌టిక్కెట్లు పొందారు. ఓ విద్యార్థిని వద్ద డబ్బులు తీసుకుని ప్రవేశం ఇచ్చిన యాజమాన్యం ఆమెను మరిచిపోవడంతో పరీక్షకు దూరమైంది. విద్యార్థిని తరపువారు ఆందోళనకు దిగడంతో రెండు లక్షల రూపాయలు పరిహారం చెల్లించినట్టు సమాచారం. ఆమె ప్రవేశమపుడు సమర్పించిన సర్టిఫికేట్లను ఇవ్వడానికి ఇప్పటికీ సదరు విద్యార్థినిని ఇబ్బంది పెడుతున్నారు.
ఇష్టానుసారం
2013-15 విద్యా సంవత్సరంలో కౌన్సెలింగ్‌లో ఇక్కడ ముగ్గురు మాత్రమే జాయిన్ అయ్యారు. మిగతా 47 సీట్లను యాజమాన్యం ఒక్కో సీటుకు రూ.1.50 లక్షల ను ంచి రెండు లక్షల వరకు వసూల్ చేసుకుని అమ్ముకుంది. వీరంతా నాన్ మైనారిటీలే కావడం గమనార్హం. తరగతులకు ముగ్గురి నుంచి పది మంది వరకు విద్యార్థులు హాజరవుతున్నారు. ఇద్దరు అర్హతలు లేని అధ్యాపకులు వారికి పా ఠాలు చెబుతున్నారు. కొందరు విద్యార్థులు యాజమాన్య కోటాలో జాయిన్ అయ్యేందుకు హైదరాబా ద్‌లోని కరస్పాండెంట్ వద్దకు వెళ్లి డబ్బులు చెల్లించడమే తప్ప వారికి కాలేజీ ఇక్కడ ఉందన్న సంగ తి కూడా తెలియకపోవడం గమనించదగిన విషయం.
సీట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుని
గత ఏడాది కన్వీనర్ కోటాలో భర్తీ చేయాల్సిన 40 సీట్లను ముందే అమ్ముకున్న యాజమాన్యం,అధికారులను మేనేజ్ చేసుకుని ఆ సీట్లను కన్వీనర్ కోటాకు జతచేసు కుని రెండు వైపులా లబ్ధి పొందింది. విద్యార్థుల నుంచి లక్షలు వసూలు చేసి, ప్రభుత్వం ద్వారా కన్వీనర్ కోటాకు సంబంధించిన కామన్ ఫీజునూ రా బట్టుంది. తద్వారా యాజమాన్యం అటు ప్రభుత్వాన్ని ఇటు విద్యార్థులను మోసగించింది. తమ పేర్లు కన్వీనర్ కోటాలో ఉన్న విషయం డబ్బులు చెల్లించి సీట్లు పొందిన విద్యార్థులకే తెలియదంటే యాజమాన్యం విద్యా వ్యాపారం ఎలా చేస్తుందో స్పష్టమవుతోంది.
ప్రిన్సిపాల్ దేవరకొండలో
అహ్మద్ డీఎడ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా రికార్డులలో ఉన్న వ ్యక్తి నల్గొండ జిల్లా దేవరకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఒక అధ్యాపకుడు తెలంగాణ యూనివర్సిటీలో అకడమిక్ కౌన్సిలర్‌గా, మరో అధ్యాపకుడు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్నారు. దీంతో కాలేజీలో పాఠాలు బోధించేవారు లేకుండాపోయారు. ఇద్దరు అర్హతలేని అధ్యాపకులు, ఓ క్లర్క్‌తో కాలేజీ నడుస్తున్నట్టు తెలుస్తోంది. యాజమాన్యం హైదరాబాద్‌లో ఉంటూ కాలేజీని నిర్వహిస్తోంది. ప్రిన్సిపాల్ కనుసన్నలలో నడవాల్సిన కాలేజీ అంతా కరస్పాండెంట్ నిర్వహణలో ఉంది. విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు, కాలేజీ రికార్డులు కూడా హైదరాబాద్‌లోని కరస్పాండెంట్ ఆధీనంలోనే ఉంటాయని తెలుస్తోంది.
ల్యాబ్‌లు లేవు.. లైబ్రరీ లేదు
డీఎడ్ కాలేజీలో తరగతి గదులు, ల్యాబోరేటరీలు, లైబ్రరీ...ఇలా అన్నింటికి కలిపి 18 గదులు అవసరం ఉంటాయి. ఇక్కడ ఉన్న గదులు అసంపూర్తిగా నిర్మించారు. ఇక్కడ ఎలాంటి లైబ్రరీ లేకపోగా, విద్యార్థులకు అవసరమైన సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్, సైకాలజీ, ఆర్ట్ ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియెన్స్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయలేదు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ కాలేజీ విషయంలో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడానికి కారణం డబ్బులు చేతులమారడమేనని తెలుస్తోంది. డీఎ డ్ సీట్ల అక్రమ దందాతోపాటు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఈ కాలేజీ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఆ కాలేజీ కాగితాలలోనే!
Published Mon, Dec 29 2014 3:20 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM
Advertisement
Advertisement