ఆదిలాబాద్లో న్యాయమూర్తుల ప్రత్యేక పూజలు
జైనత్: ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని ఆదివారం హైకోర్టు జడ్జితో పాటు, జిల్లా న్యాయమూర్తులు దర్శించుకున్నారు. జైనత్ మండల కేంద్రంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ అధికారులు న్యాయమూర్తులకు దివ్యప్రసాదాలను అందజేశారు. లక్ష్మీ నారాయణ స్వామి వారికి సోమవారం వ్రతోత్సవంతో పాటు, మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఆలయాన్ని దర్శించుకున్న వారిలో రాష్ట్ర హైకోర్టు జడ్జి జి.చంద్రయ్య, హైకోర్టు రిటైర్డ్ జడ్జి డాక్టర్ ఏతిరాజులు, ఆదిలాబాద్ జిల్లా జడ్జి గండి గోపాల కృష్ణమూర్తి, అడిషనల్ జడ్జి కుంచాల సునీత తదితరులు ఉన్నారు.