కల్యాణం.. కమనీయం
ఆరుట్లలోవైభవంగా రాజరాజేశ్వరి కల్యాణోత్సవం
హాజరైన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
ఆరుట్లలోవైభవంగారాజరాజేశ్వరి కల్యాణోత్సవం
హాజరైన మంత్రులుఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి
పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు
మంచాల: ఆరుట్ల గ్రామంలోని శివాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారి కల్యాణోత్సవం ఆదివారం కన్నుల పండువగా సాగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి స్థానిక సర్పంచ్ యాదయ్య, ఆలయ నిర్మాత వెదెరె పాండు రంగారెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. మొదటగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు అమ్మవారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. జంగిరెడ్డి కళా బృందం ప్రదర్శన, పాటలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఆలయాలను అభివృద్ధి చేస్తాం..
పురాతన, చారిత్రక ఆలయాల అభివృద్ధికి పాటుపడతామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల రాజరాజేశ్వరి మాత కల్యాణోత్సవానికి రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం దేవాలయాల అభివృద్ధి విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కోసం భక్తులు ఆలయాలకు వస్తారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వరంగల్‌లోని మేడారం ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పించామన్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని పురాతన దేవాలయాలు, వాటి స్థితిగతుల వివరాలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, ఆలయాలు అభివృద్ధి చేసేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గుండెమోని జయమ్మ, ఇబ్రహీంపట్నం ఎంపీపీ నిరంజన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, మంచాల సహకార సంఘం చైర్మన్ సికిందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, మొద్దు అంజిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, నోముల రవి, చింధం రఘుపతి, కందాల శ్రీశైలం, చంద్రయ్య, సీహెచ్ జంగయ్య, శేఖర్, సురేష్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.