కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం నర్సింహులపల్లె గ్రామానికి చెందిన విద్యార్థి చెర్పూరి దినేష్ యూదవ్(22) ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాకు చెందిన రవికుమార్, మాధవిల రెండో కుమారుడైన దినేష్ ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీలో బీఆర్క్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అక్కడి హాస్టల్‌లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. ఆదివారం సాయంత్రం హాస్టల్‌కు వచ్చిన దినేష్ ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు.
ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే దినేష్ తల్లితండ్రులతో పాటు ఇతర కుటుంబసభ్యులు సోమవారం ఢిల్లీ వెళ్లారు. ఇటీవల జరిగిన పరీక్షల్లో వెనకబడిపోవడంతో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
దినేష్ మొదటి నుంచి చదువులో చురుకైన విద్యార్థి అని బంధువులు తెలిపారు. టెన్త్, ఇంటర్‌లో టాప్ మార్కులు సాధించాడన్నారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలోనే డెహ్రడూన్‌లో ఆర్‌ఐఎంసీ పోటీ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరికే అవకాశం ఉండగా, దీనిని దినేష్ సాధించినట్లు బంధువులు తెలిపారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించిన పరీక్షల్లో రెండు సార్లు మూడో ర్యాంక్ సాధించాడు. అయితే రెండుసార్లు ఇంటర్వ్యూలో వెనకబడిపోవడంతో బీఈ ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు.
ఢిల్లీలో కరీంనగర్ జిల్లా విద్యార్థి ఆత్మహత్య
Published Tue, Sep 29 2015 8:11 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement