పట్టుకోసం పెద్దపీట
పాలమూరు జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పదవుల పందేరం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మంత్రివర్గ విస్తరణలో మహబూబ్‌నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి మండలిలో చోటు కల్పించారు. భౌగోళిక పరంగా, అసెంబ్లీ స్థానాలపరంగా రాష్ట్రంలో కీలకంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా పదవుల పందేరం చేసినట్లు కనిపిస్తోంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒక ఎంపీ, ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని జిల్లాలో టీఆర్‌ఎస్ బల మైన పక్షంగా ఆవిర్భవించింది.
కాంగ్రెస్ పార్టీ నాగర్‌కర్నూల్ ఎంపీ సీటుతో పాటు ఐదు అసెం బ్లీ సీట్లను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు టీడీపీ అభ్యర్థులు కూడా రెండు అసెంబ్లీ స్థానా ల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు లో మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ బలాన్ని విస్తరించడమే లక్ష్యంగా సీఎం పావులు కదుపుతున్నట్లు మంత్రివర్గ విస్తరణ తీరు వెల్లడించింది.
ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరు ణ, జి.చిన్నారెడ్డి, ఎస్.సంపత్‌కుమార్ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్ పాలనతీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేకపోవడం వల్లే విపక్ష నేతలను కట్టడి చేయలేకపోతున్న భావన టీఆర్‌ఎస్ నేతల్లో వ్యక్తమైం ది. మరోవైపు దక్షిణ తెలంగాణ పట్ల వివక్ష చూ పుతున్నారనే ధోరణిలో ఇటీవల విపక్ష ఎమ్మెల్యే లు మాట్లాడారు.
ఈ నేపథ్యంలో పదవుల పందేరంలో జిల్లాకు పెద్దపీట వేయడమే మార్గమని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. ఎంపీ జితేం దర్‌రెడ్డిని ఇప్పటికే లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్‌గా నియమించారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్‌కు పార్లమెంటరీ కార్యదర్శి పోస్టు కట్టబెట్టారు. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే పొలిట్‌బ్యూరో సభ్యుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ప్రణాళిక సంఘం ైవె స్ చైర్మన్ పదవి దక్కడం జిల్లాలో పార్టీ బలోపేత మవుతుందని భావిస్తున్నారు.