మెదక్, సిద్దిపేటలో పరిశ్రమలు: కేసీఆర్
మెదక్, సిద్దిపేటలో పరిశ్రమలు: కేసీఆర్
Published Wed, Jul 2 2014 6:17 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
హైదరాబాద్: సర్పంచ్‌ల నుంచి ఐఏఎస్ హోదా ఉండే ఉద్యోగులందరికి మర్రి చెన్నారెడ్డి మావనవనరుల విభాగంలోనే శిక్షణ ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నారు.
బుధవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరులు విభాగం కార్యాలయాన్ని కేసీఆర్ సందర్శించడమే కాకుండా పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూసేకరణ కోసం ఐదుగురితో మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ అన్నారు.
మెదక్, సిద్దిపేటలో పరిశ్రమలు స్థాపించేందుకు నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ మీడియాకు వెల్లడించారు. కేసీఆర్‌తో ఆస్ట్రేలియా ప్రతినిధులు భేటీ అయిన సంగతి తెలిసిందే. పరిశ్రమలను స్థాపించేందుకు ఆస్ట్రేలియా ప్రతినిధులు ఉత్సాహం చూపినట్టు కేసీఆర్ వెల్డడించారు.
Advertisement