వాటర్‌ట్యాంకును పరిశీలిస్తున్న ఎస్‌ఈ, అధికారులు
ఇబ్రహీంపట్నం(కోరుట్ల) : మిషన్‌భగీరథ ద్వారా మూడు వారాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందిస్తామని మిషన్ భగీరథ ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు అన్నారు. మండలంలోని డబ్బా గ్రామంలో వాటర్‌గ్రిడ్ వద్ద పంప్‌హౌస్‌లో భారీ విద్యుత్ మోటర్లను ఆన్ చేసి గుట్టపైన ఉన్న 30 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంకుకు నీళ్లు ఎక్కించి గ్రామాలకు వెళ్లే పైప్‌లైన్లకు నీటిని విడుదల చేశారు. గ్రిడ్‌నుంచి ఎక్కడా ఎలాంటి అవంతరాలు లేకుండా గుట్టపైకి నీళ్లు చేరడంతో ట్రయిల్‌రన్ విజయవంతం అయినట్లు ఆనందం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచారు.
అనంతరం ఎస్‌ఈ మాట్లాడుతు పంప్‌హౌస్ నుంచి 644 హెచ్‌పీ సామర్థ్యం గల రెండు విద్యుత్ మోటార్లను నడిపిస్తూ డబ్బాగుట్ట ట్యాంకుకు నీళ్లు ఎక్కిస్తున్నామని, ఈ ట్యాంకు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మక్కపేట వద్ద గల 4 లక్షల లీటర్ల కెపాసిటీ గల ట్యాంకుకు ఎక్కించి నిరంతరం ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల గ్రామాలతోపాటు మెట్‌పల్లిలోని ఐదు గ్రామాలకు ఇక్కడనుంచి పైప్‌లైన్ల ద్వారా నీళ్లు వెళ్తాయని వివరించారు. మరో పైప్‌లైన్ ద్వారా కోరుట్ల, జగిత్యాల ధర్మపురి వరకు వెళ్తాయని తెలిపారు. ప్రస్తుతం పైప్‌లైన్ల ద్వారా నీటిని విడుదల చేశామని ఎక్కడైన లీకేజీ ఉన్నాయో సిబ్బంది పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త ట్యాంకులు, పైప్‌లైన్ నిర్మాణాలు పూర్తికాగనే వాటికి కనెక్షన్ ఇచ్చి నీటిని సరాఫరా చేస్తామని చెప్పారు. ఆయన వెంట ఈఈ జ్ఞాన్‌కుమార్, డీఈ శేఖర్‌రెడ్డి, ఏఈ మల్లేశ్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment