హన్మకొండ : మూడు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఇప్పటి వరకు సాగు మొదలు పెట్టని రైతులు హలాలు పట్టారు. వర్షాలతో వాగులు, ఒర్రెలు ఉప్పొంగుతున్నాయి. జిల్లాలో 50 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా భూపాలపల్లిలో 57.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దేవరుప్పుల మండలంలో వర్షం లేదు. జిల్లాలో సగటున 19.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
21 మండలాల్లో 20 మిల్లీ మీటర్లకు పైగా వర్షం పడింది. చేర్యాలలో 18.2 మిల్లీ మీటర్లు, మద్దూరులో 20.2, నర్మెటలో 18.8, బచ్చన్నపేటలో 9, జనగామలో 6.4, లింగాల ఘనపూర్‌లో 8.4, రఘునాథపల్లిలో 8.2, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 22.4, ధర్మసాగర్‌లో 31.2, హసన్‌పర్తిలో 28.6, హన్మకొండలో 34.6, వర్థన్నపేటలో 12.4, జఫర్‌గఢ్‌లో 12.6, పాలకుర్తిలో 6.2, కొడకండ్లలో 8, రాయపర్తిలో 12.4, తొర్రూరులో 9, నెల్లికుదురులో 10.2, నర్సింహులపేటలో 5.4, మరిపెడలో 2.2, డోర్నకల్‌లో 6.4, కురవిలో 11.4, మహబూబాబాద్‌లో 10.4, కేసముద్రంలో 12.2, నెక్కొండలో 14.8, గూడూరులో 16.4, కొత్తగూడలో 10.2, ఖానాపూర్‌లో 12.8, నర్సంపేటలో 14, చెన్నారావుపేటలో 15.4, పర్వతగిరిలో 14.2, సంగెంలో 16.8, నల్లబెల్లిలో 8.4, దుగ్గొండిలో 10.2, గీసుకొండలో 25,2, ఆత్మకూర్‌లో 25.6, శాయంపేటలో 30.8, పరకాలలో 32.4, రేగొండలో 33.4, మొగుళ్లపల్లిలో 27.6, చిట్యాలలో 31.8, గణపురంలో 40, ములుగులో 30.4, వెంకటాపూర్‌లో 37.4, గోవిందరావుపేటలో 28, తాడ్వాయిలో 40.2, ఏటూరునాగారంలో 45.4, మంగపేటలో 36.6, వరంగల్‌లో 30 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లా అంతటా వర్షం
Published Tue, Jul 12 2016 1:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement