ఇగ్నోలో కోర్సులకు  ఫీరియింబర్స్‌మెంట్‌ | reimbursement for open university courses | Sakshi
Sakshi News home page

ఇగ్నోలో కోర్సులకు  ఫీరియింబర్స్‌మెంట్‌

Published Mon, Jan 22 2018 6:05 PM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

reimbursement for open university courses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇగ్నో (ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం) 2018 విద్యాసంవత్సరానికి  దూరవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ సోమవారం విడుదలైంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజును రీయింబర్స్‌ చేయనున్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది. వివిధ రకాల సర్టిఫికేట్‌ కోర్సులు, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ ప్రొగ్రాంలకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీరీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. దరఖాస్తులకు చివరి తేది జనవరి 31. అభ్యర్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో గానీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాత్రం ఫీజును ముందుగా చెల్లించాలనీ, ప్రవేశాల ప్రక్రియ ముగిసిన తరువాత వారి ఫీజును తిరిగి చెల్లిస్తామని ఇగ్నో అధికారులు తెలిపారు. ఆఫ్‌లైన్లో దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌నుంచి అప్లికేషన్‌ ఫాంను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తుతో పాటు కులధ్రువీకరణ పత్రాలను జత చేసి పంపాలి. మిగతా వివరాలకు www.ignou.ac.in ను సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement