యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణిలో నూతన గనుల ఏర్పాటు కోసం రాష్ట్రప్రభుత్వం రూ.ఆరు వేల కోట్లు కేటాయించిందని, మరో రూ.6 వేల కోట్లు కేంద్రప్రభుత్వం కేటాయించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధు అన్నారు. ఆదివారం ఆర్జీ–2 ఏరియా ఓసీపీ–3 కృషిభవన్, ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1 సీహెచ్‌పీలో జరిగిన వేర్వేరు గేట్ మీటింగుల్లో కార్మికుల నుద్దేశించి ప్రసంగించారు.
గోదావరి పరివాహక ప్రాంతం వెంట ఉన్న 160 కిలోమీటర్ల పొడవునా పలు నూతన గనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయన్నారు. కార్మికులు బాణం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. జాతీయ సంఘాల మూలంగానే వారసత్వం పోయిందన్నారు. దీని ఆధారాలను సైతం కార్మికులకు చదివి వినిపించారు. మీ ప్రాంతంలో తిరిగే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చూసి ఓటెయ్యాని, పనిచేయకుంటే నిలదీయాలని పిలుపునిచ్చారు. మా యూనియన్‌గానీ, మేం గానీ, సరిగా పనిచేయకుంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని ఓడించాలని కోరారు.
Published Mon, Oct 2 2017 2:38 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement