సాక్షి, హైదరాబాద్: పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ–సికింద్రాబాద్ (07711) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ ఓ ప్రకటనలో తెలి పారు. ఈ రైలు ఈ నెల 9న రాత్రి 11 గంటలకు విజయవాడలో బయలుదేరి మరుసటి ఉదయం6.45కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–గూడూర్ (82740) సువిధ రైలు 10వ తేదీ రాత్రి 8.15కు బయలుదేరి మరుసటి ఉదయం 6.50కి చేరుకుం టుంది.సికింద్రాబాద్–మచిలీపట్నం (82743) సువిధ రైలు ఈ నెల 11న రాత్రి 9.40కి బయలుదేరి మరుసటి ఉదయం 6.05 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment