ఇబ్రహీంపట్నంరూరల్: అడవిలో అనుమానాస్పద స్థితిలో నిలిపివేసిన కారు కలకలం రేపుతోంది. గత నాలుగు రోజులుగా అడవిలో ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కారులో ఎమన్నా ఉందా అని భయపడుతున్నారు. మండల పరిధిలోని నాగన్‌పల్లి గ్రామంలో ఏ నోట విన్నా కారు గురించే. వివరాల్లోకి వెళితే.. నాగన్‌పల్లి గ్రామం శివారులోని మూల మలుపు వద్ద ఉన్న దాసర్‌రాయి సమీపంలోని చెట్ల పొదల్లో మారుతీ 800 కారు నిలిపి ఉంది. గత నాలుగు రోజులుగా అక్కడే ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. సోమవారం కొందరు యువకులు ధైర్యం చేసి కారు వద్దకు వెళ్లి చూశారు. కారు నెంబరు ఏఐడబ్ల్యూ–9495 నెంబరు కలిగి తెల్లరంగు కారును గుర్తించారు. నాలుగు చక్రాలలో గాలిపోయి ఉంది. కారు కనెక్షన్లు తొలగించి ఉన్నట్లు యువకులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment