మాట్లాడుతున్న శాంతరమేష్ కుటుంబసభ్యులు
హిమాయత్‌నగర్: న్యాయం కోసం పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాం..వివిధ పార్టీలకు సంబంధించిన నేతలను కలిశాం. అయినా న్యాయం జరగలేదు. నాపై దాడులు జరిగాయి, నా వద్ద కార్లను బలవంతంగా లాక్కున్నారు నాకు న్యాయం చేయమని పోలీసులను కోరితే వ్యగ్యంగా మాట్లాడి మానసిక క్షోభకు గురి చేశారని ‘జోయిల్ అసోసియేట్స్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్’ పార్టనర్స్ తలారి సుజాత, శాంతరమేష్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధార భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాయం జరగకపోతే మరికొద్ది రోజుల్లో నేను, నా భార్య, నా కుమార్డె, కుమారుడు కలసి ఆత్మహత్య చేసుకుంటామంటూ విలపించారు.
శాంతరమేష్ మాట్లాడుతూ..మాది పశ్చిమగోదావరి జిల్లా దొంబేర గ్రామం. 1996లో నగరానికి వలస వచి, నేరెడ్‌మేట్‌లో ఉంటున్నాం. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. మేం ఎస్సీ కార్పొరేషన్ కింద సబ్సిడీలో 16 కార్లు తీసుకుని నా తమ్ముడు రామకృష్ణకు చెందిన ‘లాజిస్టిక్’ అనే సంస్థకు లీజుకు ఇచ్చాం. మాకు రూ.50 లక్షలు నష్టం చూపించాడు. దీంతో కృష్ణారెడ్డి అనే వ్యక్తి వద్ద నుంచి రూ.4 వడ్డీతో రూ.15లక్షలు అప్పుగా తీసుకుని నా తమ్ముడు రామకృష్ణకు ఇప్పించాను. రామకృష్ణ తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో మధ్యలో ఉన్న కారణంగా నావి 13 కార్లను కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డిలు దౌర్జన్యంగా లాక్కున్నారు. ఈ విషయంపై నేరెడ్‌మేట్ పోలీసులను సంప్రదిస్తే చర్యలు తీసుకోవాల్సిన వాళ్లు వ్యగ్యంగా మాట్లాడుతూ నన్ను మానసిక క్షభకు గురి చేస్తున్నారన్నారు. నా ఇద్దరు పిల్లలను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment