గజ్వేల్: రుణాల రీ-షెడ్యూల్‌కు బ్యాంక్ మేనేజర్ సహకరించడం లేదంటూ పలువురు రైతులు ప్రజ్ఞాపూర్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ముందు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మేనేజర్‌ను నిలదీయడంతో ఉద్రిక్తత నెలకొన్నది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని అక్కారం, కోనాపూర్ తదితర గ్రామాలకు చెందిన పలువురు రైతులు 2013 ఏప్రిల్ నుంచి అక్టోబర్‌లోపు రుణాలను రెన్యూవల్ చేసి ప్రస్తుతం రీ-షెడ్యూల్‌కు అర్హత సాధించారు.
అయినా ప్రజ్ఞాపూర్ బ్యాంక్ మేనేజర్ రీ-షెడ్యూల్ చేయకుండా రెన్యూవల్ మాత్రం చేసి అతితక్కువ రుణం మాత్రమే ఇస్తానని చెప్పడంతో వారంతా ఆగ్రహానికి గురయ్యారు. రీ-షెడ్యూల్ ఎందుకు చేయవంటూ నిలదీశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొన్నది. ఈ సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఏఈఓ కృష్ణవేణి, తహశీల్దార్ బాల్‌రెడ్డి, పోలీసులు బ్యాంక్ వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు.
ఈ విషయం ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ఓఎస్‌డీ హన్మంతరావు దృష్టికి వెళ్లడంతో ఆయన గ్రామీణవికాస్ బ్యాంక్ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఫలితంగా మేనేజర్‌కు రుణాలు రీ-షెడ్యూల్ చేయాలని ఫోన్‌లో ఆదేశాలు వచ్చాయి. దీంతో రీ-షెడ్యూల్ ప్రక్రియ చేపడతామని, గత కొన్ని రోజుల క్రితం రీ-షెడ్యూల్‌కు అర్హత వున్నా... రెన్యూవల్ చేయించుకున్నవారికి కూడా న్యాయం చేస్తామని మేనేజర్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
రీ షెడ్యూల్‌పై అన్నదాతల ఆగ్రహం
Published Thu, Nov 6 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement
Advertisement