దేశానికిది అత్యంత ప్రమాదకర సంకేతం:మమత
కోల్కతా: పార్లమెంట్ లో తెలంగాణ ఆమోదం పొందిన తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. కాంగ్రెస్-బీజేపీలు రెండూ కుమ్మక్కయ్యి తెలంగాణ బిల్లు ఆమోదానికి పూనుకున్నాయని విమర్శించారు. తమ రాజకీయ అజెండాలే ప్రధానంగా భావించి ప్రధాన పార్టీలు రెండూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణకు ఒడిగట్టాయన్నారు. ఇది దేశానికి అత్యంత ప్రమాదకర సంకేతమని మమత స్పష్టం చేశారు.
ముఖ్యమైన బిల్లు వ్యవహారంలో ఈ రెండు పార్టీలు కుమ్మక్కు అయితే.. రాష్ట్రాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అడుగడునా మంటకలిపారన్నారు.