కేంద్ర కేబినెట్‌ విస్తరణ: లైవ్‌ అప్‌డేట్స్‌ | Cabinet Reshuffle: new ministers take oath | Sakshi
Sakshi News home page

కేంద్ర కేబినెట్‌ విస్తరణ: లైవ్‌ అప్‌డేట్స్‌

Published Sun, Sep 3 2017 2:09 PM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

కేంద్ర కేబినెట్‌ విస్తరణ: లైవ్‌ అప్‌డేట్స్‌ - Sakshi

కేంద్ర కేబినెట్‌ విస్తరణ: లైవ్‌ అప్‌డేట్స్‌

న్యూఢిల్లీ: చాన్నాళ్లుగా ఆసక్తి రేపుతున్న కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ నేడు జరగనుంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కేబినెట్‌ విస్తరణ, కొత్త కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం పై లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవి.

  • పౌరవిమానాయాన శాఖ మంత్రిగా గజపతిరాజు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ సహాయమంత్రిగా సుజనా చౌదరి కొనసాగనున్నారు.
  • పాతశాఖల్లోనే కొనసాగనున్న అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి
  • దివంగత ఇందిరా గాంధీ తర్వాత రక్షణశాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్‌ ఘనత
  • వాణిజ్య, జౌళి శాఖల సహాయమంత్రిగా సమర్థంగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌.. ఆమె ప్రతిభకు బహుమానంగా అత్యంత కీలకమైన రక్షణశాఖ కేటాయించిన ప్రధాని మోదీ
  • అందరిలో తీవ్ర ఆసక్తి రేపిన రక్షణశాఖ అనూహ్యంగా నిర్మలా సీతారామన్‌కు దక్కడం గమనార్హం.
  •  నిర్మలా సీతారామన్‌కు రక్షణశాఖ, పీయూష్‌ గోయల్‌కు రైల్వేశాఖ
  • పోర్ట్‌ఫోలియోల కేటాయింపు..: పెట్రోలియం, స్కిల్‌ డెవలప్‌మెంట్ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్‌, గనులశాఖ మంత్రిగా నరేంద్ర  తోమర్, వాణిజ్యశాఖ మంత్రిగా సురేశ్‌ ప్రభు, సమాచారశాఖ మంత్రిగా స్మృతి ఇరానీ
  • ద్యుత్‌ మంత్రి: ఆర్కే సింగ్‌ (స్వతంత్ర హోదా), టూరిజం మంత్రి: అల్ఫాన్స్‌ (స్వతంత్రహోదా)
    ఆర్థికశాఖ సహాయమంత్రి: శివప్రతాప్‌ శుక్లా, పట్టణాభివృద్ధి సహాయమంత్రి: హర్దీప్‌సింగ్‌ పూరి
     
  • కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాకపోవడంపై కేంద్రమంత్రి ఉమాభారతి వివరణ. నా సమస్యలెప్పుడో పరిష్కారమయ్యాయి. నాకేమీ కోపం లేదు: ఉమాభారతి
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement