పాకిస్థాన్లో వివిధ జైళ్లలో నలుగురు భారతీయులును విడుదల చేయాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను శిరసావహిస్తు దిల్ బాగ్ సింగ్, సునీల్తోపాటు మరో ఇద్దరు భారతీయులను విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పాకిస్థాన్ హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.
దేశంలో అక్రమంగా ప్రవేశించారు అనే అభియోగాలపై వారిని గతంలో అరెస్ట్ చేశారని తెలిపారు. పాకిస్థాన్ కోర్టు వారికి విధించిన శిక్ష కాలం పూర్తి అయిందని తెలిపారు. ఆ నలుగురు విడుదల కోసం దేశంలోని విదేశీ ఖైదీలకు సంబంధించిన చట్టాలకు సంబంధించిన ప్రక్రియను పరిశీలిస్తున్నామని చెప్పారు. వారిని త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.