దేవాలయంలో ఆత్మాహుతి దాడి: ఆరుగురు మృతి
కైరో: ఈజిప్టులోని అత్యంత పురాతమైన కర్నక్ దేవాలయంలో బుధవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది. మరో 10 మంది గాయపడ్డారని తెలిపింది. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. అయితే మృతుల్లో పౌరులు, భద్రత సిబ్బంది ఎంత మంది ఉన్నారన్నది ఇంకా గుర్తించలేదన్నారు. దేవాలయంలోకి ప్రవేశించి వ్యక్తి తనకు తానుగా పేల్చివేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.