ఆప్కు అన్ని సీట్లు రాకపోవచ్చు: సుష్మా | Sushma Swaraj makes light of favourable pre-poll surveys on AAP | Sakshi
Sakshi News home page

ఆప్కు అన్ని సీట్లు రాకపోవచ్చు: సుష్మా

Published Sat, Jan 11 2014 4:43 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

ఆప్కు అన్ని సీట్లు రాకపోవచ్చు: సుష్మా - Sakshi

ఆప్కు అన్ని సీట్లు రాకపోవచ్చు: సుష్మా

ఆమ్ ఆద్మీ పార్టీకి రాబోయే లోక్సభ ఎన్నికల్లో 50-60 వరకు లోక్సభ స్థానాలు రావొచ్చని, అవి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారం చేపట్టడానికి అడ్డం పడొచ్చంటూ కొన్ని సర్వేలు చెప్పడాన్ని లోక్సభలో విపక్షనేత, బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ తేలిగ్గా తీసుకున్నారు.

ఈ సర్వేలు ఎప్పుడూ అంత నిజం కాకపోవచ్చని ఆమె అన్నారు. పార్టీ పెట్టి ఏడాది అయినా.. అప్పుడే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ లాంటి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పలు రాజకీయ పార్టీలు ఖంగుతిన్నాయి. ఇక వరుసపెట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంపై ఆమె స్పందిస్తూ ఈ విషయంలో కఠిన విచారణ జరిపించాలన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా ర్యాలీలో పాల్గొనేందుకు ఆమె నాగ్పూర్ వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement