సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందో లేదో తెలియదు గానీ.. ఈ ప్రపంచం అంతా మాత్రం ఇంటర్నెట్ చుట్టే తిరుగుతోంది. మొబైల్ ఇంటర్నెట్ రేట్లు తగ్గడంతో ఇప్పుడు నెట్ అన్నది సామాన్యుడి నట్టింట్లోకి వచ్చి తిష్టేసి మరీ కూర్చొంది. మనం కూడా శ్రద్ధగా దించిన తల ఎత్తకుండా తలా ఓ లైక్, ఓ షేరు చేసుకుంటూ.. నెట్టింట్లో మునిగి తేలుతున్నాం. ఇదంతా పక్కనపెడితే.. మనకు బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి.. ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్ వాడుతుంటారు. ఒకరు నెలకు రూ.450 ప్లాన్ అయితే.. మరొకరు రూ.3 వేలది వాడుతుంటారు.
ఇంతకీ మన దేశంలో నెలకు బ్రాడ్‌బ్యాండ్‌కు అయ్యే సగటు వ్యయం ఎంత? మిగతా దేశాల్లో రేట్లు ఎలా ఉన్నాయి? షాక్ కొట్టే రేట్లు ఏయే దేశాల్లో ఉన్నాయి? అన్న వివరాలు మీకు తెలుసా.. కొన్ని దేశాల్లో మనతో పోలిస్తే.. మరీ తక్కువగా ఉంటే.. సరైన బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాలు లేని ఆఫ్రికా దేశాల్లో నెల జీతం ఇంటర్నెట్‌కే తగలెట్టాల్సిన స్థాయిలో రేట్లున్నాయి. ఇరాన్‌లో అత్యంత తక్కువగా నెలకు సగటు ధర రూ.350 ఉంటే.. అత్యధికంగా ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో రూ.60 వేలు, ఆస్ట్రేలియా సమీపంలోని పపువా న్యూ గినీలో రూ.37 వేలుగా ఉంది.
బ్రాడ్‌బ్యాండ్‌కు అయ్యే సగటు వ్యయం (నెలకు)
రూ.1,280 కన్నా తక్కువ
రూ.1,280–రూ.3,194 మధ్య
రూ.3,194–రూ.6,389 మధ్య
రూ.6,389–రూ.12,779 మధ్య
రూ.12,779–రూ.31,948 మధ్య
రూ.31,948 అంతకన్నా ఎక్కువ
Comments
Please login to add a commentAdd a comment