వైఎస్సార్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం | fire accident in ysr district | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Published Thu, Jan 4 2018 7:18 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident in ysr district - Sakshi

సాక్షి, బద్వేలు: వైఎస్సార్‌ జిల్లాలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. బద్వేలు గురుకుల పాఠశాల సమీపంలో అగ్నిప్రమాదం సంభవించి సుమారు వెయ్యి గుడిసెలు కాలి బూడిదయ్యాయి. కొంతకాలం క్రితం సీపీఐ నేతల ఆధ‍్వర‍్యంలో నిరుపేదలు ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.

ఇవాళ రాత్రి ఒక‍్కసారిగా మంటలు చెలరేగి చూస్తుండగానే వెయ్యి గుడిసెలు దగ‍్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో వంటగ్యాస్‌ సిలిండర్లు పేలుతూ గాలిలోకి ఎగిరాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ‍్బంది వచ్చేలోగానే గుడిసెలు నేలమట‍్టమయ్యాయి. సిలిండర‍్ల పేలుడు శబ్దాలకు భయంతో చుట్టుపక‍్కల జనం పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో భారీగానే ఆస్తి నష‍్టం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement