-
రెహమాన్ విడాకులు.. ఆస్తి పంపకాలపై లాయర్ ఏమన్నారంటే?
సంగీత సామ్రాట్ ఏఆర్ రెహమాన్ 29 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికాడు. భార్య సైరా భానుకు విడాకులు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే అతడి శిష్యురాలు మోహిని డే కూడా తన భర్త మార్క్ హార్ట్సచ్కు విడాకులు ఇస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రెండు విడాకులకు ఏమైనా సంబంధం?ఈ క్రమంలో ఈ రెండు విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. దీనిపై సైరా భాను లాయర్ వందన షా స్పందించారు. ఈ రెండు జంటల విడాకులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. రెండు విడాకులు వేర్వేరు అని నొక్కి చెప్పారు. రెహమాన్-సైరా పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారన్నారు. ఆస్తి పంపకాలుఅందుకు గల కారణాలను చెప్పే స్వేచ్ఛ తనకు లేదన్నారు. ఆస్తి పంపకాలు, భరణం వంటి వాటి గురించి ఇంకా ప్రస్తావన రాలేదని, ఒకవేళ వచ్చినా వాటి గురించి బయటకు చెప్పలేనని తెలిపారు. కాగా ఏఆర్ రెహమాన్, సైరా భానుల వివాహం 1995 మార్చిలో జరిగింది. ఈ దంపతులకు ఖతీజా, రహీమా, అమీన్ అనే పిల్లలు సంతానం.చదవండి: ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది! -
'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)
రీసెంట్ టైంలో మలయాళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ 'కిష్కింద కాండం'. రూ.7 కోట్ల ఖర్చు పెట్టి థియేటర్లలో రిలీజ్ చేస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అప్పు పిళ్లై (విజయ రాఘవన్) ఆర్మీ మాజీ అధికారి. అడవిని ఆనుకుని ఉండే పెద్ద ఇంట్లో ఉంటాడు. ఓరోజు ఈయన గన్ మిస్ అవుతుంది. ఎన్నికల టైం కావడంతో తుపాకీని స్టేషన్లో అప్పగించాలని నోటీసులు ఇస్తారు. కట్ చేస్తే ఓ కోతి చేతిలో గన్ కనిపిస్తుంది. అది తనదేనని అప్పు పిళ్లై కన్ఫర్మ్ చేస్తాడు. ఇతడికి అజయ్ చంద్రన్ (ఆసిఫ్ అలీ) అనే కొడుకు. అజయ్ తొలి భార్య చనిపోవడం, కొడుకు కనిపించకుండా పోవడంతో అపర్ణ (అపర్ణా బాలమురళి)ని రెండో పెళ్లి చేసుకుంటాడు. అజయ్ చంద్రన్ మొదటి భార్య ఎలా చనిపోయింది? మిస్ అయిన కొడుకు ఏమయ్యాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!)ఎలా ఉందంటే?మిస్టరీ థ్రిల్లర్ అనగానే దాదాపు ఒకే ఫార్మాట్లో స్టోరీ ఉంటుంది. ఓ హత్య, దాని చుట్టూ సాగే దర్యాప్తు. హంతకుడిని పోలీసులు పట్టుకోవడం ఇదే కాన్సెప్ట్ కనిపిస్తుంది. కానీ 'కిష్కింద కాండం' పూర్తిగా డిఫరెంట్. పాట, ఫైట్ లాంటివి ఏం ఉండవు. ఎప్పుడూ చూసే మిస్టరీ థ్రిల్లర్ లాంటి సినిమానే కానీ నేపథ్యమే వేరు. దానిని చూపించిన విధానం చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కథ కూడా ఎక్కువ పాత్రలు లేకుండా చాలా సింపుల్‌గా తేల్చేశారు.మతిమరపు వ్యక్తి, కనపడకుండా పోయిన తుపాకీ, బుల్లెట్ గాయంతో చనిపోయిన కోతి, తప్పి పోయిన పిల్లాడు ఇవే ఈ కథ లోని ముఖ్యమైన అంశాలు. ఇంతకీ మించి చెబితే సినిమాలోని థ్రిల్‌ని మీరు మిస్ అయిపోతారు. ఎందుకంటే చిన్న స్టోరీ లైన్ మీద ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో.. చూస్తున్న ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చోబెట్టడం అంటే అంత ఈజీ కాదు. కానీ 'కిష్కింద కాండం' అది చేసి చూపించింది. రైటింగ్ పరంగా ఇది టాప్ క్లాస్ వర్క్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)కథ, మాటలు అందించిన బాహుల్ రమేశ్.. సినిమాటోగ్రఫీ కూడా చేశారు. కథ రాసుకున్న వాడే కెమెరా పడితే ఆ విజువల్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. మూవీ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. చెప్పాలంటే తొలి అరగంట జరిగే సీన్లు చూస్తే బోర్ కొట్టేస్తుంది. కానీ ఆ తర్వాత ఉల్లిపాయ ఒక్కో పొర విప్పినట్లు కథలో ఒక్కో లేయర్ రివీల్ అవుతూ ఉంటుంది. అప్పటివరకు సస్పెన్స్, థ్రిల్లింగ్‌గా సాగే ఈ చిత్రం.. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఓ రకమైన సంతృప్తితో పాటు ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.'జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరం', 'ఎవరికీ ఉపయోగపడని నిజాలు తెలుసుకుని ఏం చేస్తాం'.. సినిమా చూసిన తర్వాత ఈ రెండు డైలాగ్స్ మీకు తెగ నచ్చేస్తాయి. అలానే తండ్రి గజిని, కొడుకు కమల్ హాసన్ అని మీకు కచ్చితంగా అనిపిస్తుంది. కమర్షియల్ మూవీస్ అంటే ఇష్టపడేవాళ్లు, స్లోగా సాగే సినిమాలంటే ఇష్టం లేనివాళ్లకు ఇది నచ్చకపోవచ్చు. కాబట్టి దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకోండి. రెండు గంటల నిడివితో తీసిన మిస్టరీ థ్రిల్లర్.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులు
బంగారంపై రుణాల కోసం బ్యాంకులు, గోల్డ్ లోన్ అందించే సంస్థలు నెలవారీ చెల్లింపు ప్రణాళికలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత రుణ పంపిణీ ప్రక్రియలో అంతరాలను గుర్తించినట్లు ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లో వెల్లడించింది. కొత్తగా అమలు చేయాలనుకుంటున్న విధానం ప్రకారం రుణగ్రహీతలు లోన్ ప్రారంభమైనప్పటి నుంచే ఈఎంఐల ద్వారా ఏకకాలంలో వడ్డీ, అసలు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటి వరకు ఉన్న పరిస్థతిబంగారు ఆభరణాలపై రుణం తీసుకునేవారు నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో కలిపి మొత్తం అప్పు తీరుస్తున్నారు. వినియోగదారుల వద్ద నగదు ఉన్నప్పుడు పాక్షికంగా రుణం చెల్లించే అవకాశం ఉంది. కానీ నెలవారీ ఈఎంఐ పద్ధతి లేదు. ఒకవేళ రుణగ్రహీతలకు రుణ కాలావధి కంటే ముందే డబ్బు సమకూరితే ఒకేసారి రుణం తీర్చే వెసులుబాటు అయితే ఉంది.ప్రతిపాదిత విధానంబంగారంపై రుణాలిచ్చే బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు తనఖా పెట్టుకుని అప్పు ఇచ్చిన నెల నుంచి వడ్డీ, అసలును ఏకకాలంలో ఈఎంఐ రూపంలో చెల్లించేలా ప్రతిపాదనలున్నాయి. ఆర్థిక సంస్థలు కూడా రుణగ్రహీతలకు లోన్లు ఇచ్చేందుకు వీలుగా టర్మ్ లోన్లును తీసుకోవచ్చనేలా విధానాల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!అంతరాలు గుర్తించిన ఆర్బీఐతనఖాపెట్టిన బంగారం విలువను కొన్ని సంస్థలు సరిగ్గా లెక్కించడం లేదని ఆర్బీఐ గుర్తించింది. దాంతోపాటు అప్పు తీర్చని వారికి సంబంధించిన బంగారాన్ని వేలం వేయడంలో అవకతవలు జరుగుతున్నాయని తెలిపింది. రుణం ఇచ్చేందుకు బంగారం విలువనే ప్రాతిపదికగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అప్పు చెల్లించేవారి చెల్లింపుల రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. రుణాన్ని రోలోవర్ చేయకుండా నెలవారీ చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
సేఫ్టీలో జీరో రేటింగ్: భద్రతలో ఫ్రెంచ్ బ్రాండ్ ఇలా..
అతి తక్కువ కాలంలోనే అధిక అమ్మకాలు పొందిన సిట్రోయెన్ కంపెనీకి చెందిన 'సీ3 ఎయిర్‌క్రాస్' (C3 Aircross) ఇటీవల క్రాష్ టెస్టులో జీరో సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ వార్త ఒక్కసారిగా సిట్రోయెన్ కారు కొనుగోలు చేసిన వారికి భయాన్ని కలిగించింది.సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ 'లాటిన్ ఎన్సీఏపీ' క్రాష్ టెస్టులో జీరో రేటింగ్ సాధించింది. అయితే ఇక్కడ టెస్ట్ చేయడానికి ఉపయోగించిన మోడల్ 'బ్రెజిల్ స్పెక్' కావడం గమనార్హం. ఇది గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుంచి మంచి అమ్మకాలతో దూసుకెల్తూనే ఉంది. అయితే సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ అని తెలియడంతో.. రాబోయే అమ్మకాలు బహుశా తగ్గే అవకాశం ఉంది.సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ సొంతం చేసుకుందన్న విషయాన్ని లాటిన్ ఎన్సీఏపీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. క్రాష్ టెస్ట్ కోసం ఎంచుకున్న మోడల్ రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి స్టాండర్డ్ ఫీచర్స్ పొందింది.అడల్ట్ సేఫ్టీలో 33.01 శాతం, చైల్డ్ సేఫ్టీలో 11.37 శాతం స్కోర్ సాధించిన సీ3 ఎయిర్‌క్రాస్.. ముందున్న ప్రయాణికులకు పటిష్టమైన భద్రత అందించడంలో విఫలమైంది. సైడ్ ఇంపాక్ట్ కూడా ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం. తలకు కూడా మంచి రక్షణ అందించడంలో కంపెనీ సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో ఇది ప్రయాణికులకు భద్రత అందించడంలో విఫలమైందని లాటిన్ ఎన్సీఏపీ ధ్రువీకరించింది.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉన్న సీ3 ఎయిర్‌క్రాస్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి రెండూ కూడా అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధరలు రూ. 6.16 లక్షల నుంచి రూ. 10.15 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. -
నల్గొండ డీఈవో లీలలు.. భార్య ఉండగానే మరో మహిళతో..
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండ డీఈవో భిక్షపతి లీలలు వెలుగులోకి వచ్చాయి. భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆ మహిళ ద్వారా ముగ్గురు పిల్లలకు భిక్షపతి తండ్రి అయినట్లు మొదటి భార్య ఆరోపిస్తోంది. ప్రియురాలితో ఉండగా డీఈవో భిక్షపతిని భార్య రెడ్ హ్యాండెడ్ పట్టుకుంది. పెళ్లైన నెలకే వదిలేశాడంటూ డీఈవో ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. గతంతోనూ డీఈవోపై అనేక ఆరోపణలు రాగా, గత కొన్నేళ్లుగా నల్లగొండ డీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. తనను మోసం చేసి వేరే కాపురం పెట్టాడంటూ డీఈవో భిక్షపతి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో మహిళతో ఉంటూ తనకు విడాకుల నోటీసులు పంపించారని.. ఈ వ్యవహారం ఏంటని ప్రశ్నిస్తే చంపుతానంటూ బెదిస్తున్నారని ఆమె తెలిపారు. -
పుష్ప 2: శ్రీలీల ఐటం సాంగ్ వచ్చేది ఆ రోజే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప సినిమాలో 'ఊ అంటావా మావా..' సాంగ్ ఓ రేంజ్లో హిట్టయింది. ఈ ఐటం సాంగ్‌లో సమంత తన స్టెప్పులతో, హావభావాలతో అదరగొట్టేసింది. ఈసారి ఆ జోష్ ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2లో మరో ఐటం సాంగ్ ప్లాన్ చేశారు. సమంత స్థానంలో డ్యాన్స్ క్వీన్ శ్రీలీలను తీసుకున్నారు.తాజాగా ఈ సాంగ్ రిలీజ్ డేట్ ప్రకటించారు. కిస్సిక్ పేరుతో రానున్న ఈ పాట నవంబర్ 24న రాత్రి 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. అందులో బన్నీ నడుముపై శ్రీలీల వయ్యారంగా వాలింది. పోస్టరే ఇలా ఉంటే పాట ఇంకెంత బాగుంటుందో అని ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సాంగ్ కోసం శ్రీలీల రూ.2 కోట్ల పారితోషికం తీసుకుందని ఫిల్మీదునియాలో టాక్! ఇకపోతే సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2: ద రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. #Kissik 📸 song from #Pushpa2TheRule Flashing Worldwide on November 24th from 7:02 PM ❤🔥It is time for Icon Star @alluarjun & Dancing Queen @sreeleela14 to set the dance floor on fire 🔥A Rockstar @Thisisdsp's Musical Flash⚡⚡GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER,… pic.twitter.com/Qi5E7nRO5X— Mythri Movie Makers (@MythriOfficial) November 21, 2024 చదవండి: అమరన్ టీమ్ రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలి: విద్యార్థి -
వేట్టయన్, కంగువా, సినిమాల ఎఫెక్ట్.. కోలీవుడ్ కీలక నిర్ణయం
ఇండియన్2, వేట్టయన్, కంగువా సినిమా ఫలితాలతో తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాలు అనుకున్నంత స్థాయిలో రానించలేదు. దీంతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా నష్టాలు తప్పలేదు. సినిమా బాగున్నప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక అంచనాకు వచ్చింది.సినిమా విడుదలైన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్, నెటిజన్లు ఇచ్చే రివ్యూలు సినిమా రిజల్ట్‌పై పడుతుందని కోలీవుడ్ నిర్మాతలు గ్రహించారు. భారీ బడ్జెట్‌తో ఈ ఏడాదిలో తెరకెక్కిన సినిమాలపై వారి రివ్యూలు చాలా ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఇండియన్2. వేట్టయాన్,కంగువా సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పలు యూట్యూబ్ ఛానల్స్ తెరపైకి వచ్చాయి. మూవీ బాగలేదంటూ రివ్యూలు ఇవ్వడం చేశాయి. దీంతో ఈ చిత్రాలపై చాలా ప్రభావం చూపింది. భవిష్యత్‌లో ఇండస్ట్రీకి ఇదొక సమస్యగా మారుతుందని వారు భావించారు. దీనిని అరికట్టేందుకు థియేటర్ యజమానులు ముందుకు రావాలని తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. కొత్త సినిమా విడుదలైన రోజున థియేటర్ ప్రాంగణంలోకి యూట్యూబ్ ఛానల్స్ వారిని అనుమతించరాదని వారు తెలిపారు. పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది. రివ్యూల పేరుతో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలను దూషించినా వదిలిపెట్టమని వారు హెచ్చరించారు.కంగువా, సినిమా విడుదల సమయంలో ఫస్ట్ డే నాడే దారుణమైన రివ్యూలు ఇవ్వడంతో రెండోరోజు సినిమాకు వెళ్లే వారిపై ప్రభావం చూపింది. ఇందులో సూర్య నటన బాగుంది అంటూనే.. సినిమా ఏమాత్రం బాగాలేదని కామెంట్లు చేశారు. ఈ విషయంపై నటి జ్యోతక కూడా రియాక్ట్ అయింది. కంగువా సినిమాపై వచ్చిన నెగటివ్ రివ్యూలు చూసి తాను ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపింది. ఒకరకంగా ఈ రివ్యూల వల్లే సినిమాకు మైనస్ అయిందని ఆమె చెప్పుకొచ్చింది. సినిమా మొదటిరోజే ఇంతటి నెగిటివ్ రివ్యూలు చూడటం బాధగా ఉందని తెలిపింది. కానీ, ఈ చిత్రంలోని పాజిటివ్స్‌ను ఎవరూ చెప్పలేదని ఆమె పేర్కొంది. -
చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల యువ బ్యాటర్.. 152 బంతుల్లో 419 నాటౌట్
ముంబైలో జరిగే హ్యారిస్ షీల్డ్ టోర్నీలో సంచలనం నమోదైంది. 15 ఏళ్ల యువ బ్యాటర్ ఆయుశ్ షిండే చరిత్ర సృష్టించాడు. కేవలం 152 బంతుల్లో 43 ఫోర్లు, 24 సిక్సర్ల సాయంతో 419 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హ్యారిస్ షీల్డ్ టోర్నీ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోర్. జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ జట్టు తరఫున ఆడిన ఆయుశ్.. పార్లే తిలక్ విద్యామందిర్తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఆయుశ్ క్వాడ్రాపుల్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ నిర్ణీత 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 648 పరుగులు చేసింది. జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఇన్నింగ్స్‌లో ఆర్య కార్లే 78, ఇషాన్ పాథక్ 62 (నాటౌట్) పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన తిలక్ విద్యామందిర్ 39.4 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా జనరల్ ఎడ్యుకేషన్ అకాడమీ 464 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తిలక్ విద్యామందిర్ తరఫున ఆధేశ్ తవడే (41), దేవరాయ సావంత్ (34) టప్ స్కోరర్లుగా నిలిచారు. మ్యాచ్ అనంతరం క్వాడ్రాపుల్ సెంచరీ హీరో ఆయుశ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో తాను 500 పరుగులు స్కోర్ చేయాలని అనుకున్నానని చెప్పాడు. అయితే ఓవర్లు ముగియడంతో సాధ్యపడలేదని తెలిపాడు. ముంబై తరఫున ఆడాలంటే తాను ఇలానే భారీ స్కోర్లు చేస్తూ ఉండాలని పేర్కొన్నాడు. ఏదో ఒక రోజు టీమిండియాకు ఆడటమే తన కల అని తెలిపాడు. ఆయుశ్ క్రికెటింగ్ జర్నీ ధృడ నిశ్చయం మరియు త్యాగాల మధ్య సాగింది. ఆయుశ్ తండ్రి సునీల్ షిండే తన కొడుకుకు క్రికెట్ పట్ల ఉన్న మక్కువ చూసి తన కుటుంబాన్ని సతారా నుంచి ముంబైకి మార్చాడు. ప్రస్తుతం సునీల్ నవీ ముంబైలో ఓ చిన్న కిరాణా షాప్ నడుపుతూ ఆయుశ్ క్రికెట్ ఎదుగుదలకు తోడ్పడుతున్నాడు. ఆయుశ్ ఆరేళ్ల వయసు నుంచి బ్యాట్ పట్టినట్లు సునీల్ గుర్తు చేసుకున్నాడు. -
మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో ట్రయిల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం గురువారం (నవంబర్21) విచారణ చేపట్టింది. మద్యం పాలసీ కేసు సంబంధించి ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. అయితే, ఇదే మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై స్పందించాలని ఈడీని కోరింది.మద్యం పాలసీ కేసులో ఈడీ మద్యం పాలసీ కేసులో ఈడీ తాజాగా మరిన్ని ఆధారాల్ని సేకరించింది. సేకరించిన ఆధారాలతో అనుగుణంగా కేజ్రీవాల్‌ను విచారణ చేపట్టాలని కోరుతూ ట్రయల్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ట్రయల్ కోర్టు పరిశీలించింది. కేజ్రీవాల్‌పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ట్రయల్ కోర్టు నిర్ణయం అనంతరం ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లలో ట్రయల్ కోర్టులో విచారణ కావాలని స్పష్టం చేసింది.దీంతో పలు మార్లు సమన్లు జారీచేసినా కేజ్రీవాల్ స్పందించలేదు.ఈ తరుణంలో ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించలేమని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. -
ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 9న 'యూపీఐ 123 పే' (UPI 123Pay) పరిచయం చేస్తూ.. లావాదేవీల పరిమితులను కూడా రూ.5,000 నుంచి రూ. 10,000లకు పొడిగించింది. అయితే ఇదెలా పనిచేస్తుంది? ఎలాంటి ఫోన్లలకు సపోర్ట్ చేస్తుందనే మరిన్ని విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.ఇది వరకు యూపీఐ లావాదేవీలు చేయాలంటే.. తప్పకుండా ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండాలి. కానీ ఇప్పుడు అందుబాటులోకి రానున్న యూపీఐ 123 పే.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. ఇది స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తుంది.యూపీఐ 123 పే చెల్లింపులు నాలుగు పద్ధతుల్లో అందుబాటులో ఉన్నాయి. అవి ఐవీఆర్ నెంబర్స్, మిస్డ్ కాల్స్, ఓఈఎమ్ ఎంబెడెడ్ యాప్‌లు, సౌండ్-బేస్డ్ టెక్నాలజీ. అంటే యూజర్ తమ లావాదేవీలను ఈ నాలుగు పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఇవన్నీ 2025 జనవరి 1 కంటే ముందు అమల్లోకి వచ్చేలా బ్యాంకులకు.. ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.యూపీఐ 123 పే కస్టమర్లు బహుళ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉండకూడదు. కస్టమర్ మరొక ఖాతాను జోడించాలనుకుంటే.. వారు తప్పనిసరిగా ప్రస్తుత బ్యాంక్ ఖాతాను రిజిస్టర్ చేసి, ఆపై మరొక బ్యాంక్ ఖాతాను జోడించాలి.UPI 123PAYతో బ్యాంక్ ఖాతాను ఎలా లింక్ చేయాలి?•మొదట ఏదైనా ఐవీఆర్ నెంబర్‌కి కాల్ చేయండి•కాల్ చేసిన తరువాత మీ భాషను ఎంచుకోండి•మీ బ్యాంక్ ఖాతాను నమోదు చేయడానికి ఎంచుకోండి•మీ డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయండి•యూపీఐ పిన్ సెట్ చేసుకోండి.•పై దశలను పాటిస్తే మీ యూపీఐ 123 పేతో బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది.