Aadi pinishetty
-
థ్రిల్లింగ్ శబ్దం
హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘శబ్దం’. ఈ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో సిమ్రాన్, లైలా లీడ్ రోల్స్‌లో నటించగా, 7జీ శివ నిర్మించారు. తెలుగు–తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘శబ్దం’ టీజర్‌ను హీరో వెంకటేశ్ షేర్ చేశారు. ‘‘ఆది పినిశెట్టి– అరివళగన్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘వైశాలి’ విజయం సాధించింది. ఇప్పుడు ‘శబ్దం’ వస్తోంది. ఈ సినిమాలోని చాలా సన్నివేశాలను పర్వతాలు, పర్యాటక ప్రదేశాల్లో చిత్రీకరించాం. అలాగే 120 ఏళ్ల క్రితం నాటి లైబ్రరీని కూడా నిర్మించాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
ఆది పినిశెట్టి చిత్రంలో నటి లైలా కీలక పాత్ర!
వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు అరివళగన్, నటుడు ఆది పినిశెట్టి కాంబినేషన్లో ఇంతకు ముందు ఈరం వంటి సక్సెస్ఫుల్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇదే కాంబినేషన్లో ఒక చిత్రం రూపొందుతోంది. ఇందులో ఆది పినిశెట్టికి జంటగా లక్ష్మీమీనన్ నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత లక్ష్మీమీనన్ ఈ చిత్రం ద్వారా రీఎంట్రీ అవుతున్నారు. ఈ చిత్రంతో దర్శకుడు అరివళగన్ నిర్మాతగాను మారడం మరో విశేషం. చదవండి: నేను నోరు విప్పితే.. మీరు ఎవరెవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పనా?: తమ్మారెడ్డి ఆయన ఆల్ఫా ఫ్రేమ్స్ సంస్థ 7జీ ఫిలింస్ శివతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తాజాగా నటి లైలా చేరారు. ఇంతకుముందు తెలుగు, తమిళ భాషల్లో కథానాయక నటించిన ఆ తర్వాత పెళ్లి చేసుకుని దూరంగా ఉంటూ వచ్చారు. అలాంటిది చాలా గ్యాప్ తర్వాత వదంతి అనే వెబ్ సీరీస్‌లో మెరిసిన లైలా ఇటీవల కార్తీ కథానాయక నటించిన సర్దార్ చిత్రంలో ముఖ్యపాత్రలో మళ్లీ వెండితెరపై కనిపించారు. తాజాగా ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. చదవండి: రెండు నెలల క్రితమే నరేశ్-పవిత్ర పెళ్లి చేసుకున్నారా? అరె ఏంట్రా ఇది! ఈ విషయాన్ని చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఆమె పాత్ర ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుందని వారు చెప్పారు. ఇంతకుముందు కామెడీ హర్రర్ జానర్లో పలు చిత్రాలు వచ్చిన వాటికి పూర్తి భిన్నంగా ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుందని దర్శకుడు తెలిపారు. దీనికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఫస్ట్ పోస్టర్, టీజర్ విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని దర్శకుడు తెలిపారు. -
‘వైశాలి’ డైరెక్టర్‌తో మరోసారి జతకట్టిన ఆది, ద్విభాషా చిత్రంగా శబ్దం..
‘వైశాలి’ వంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్లో ‘శబ్దం’ అనే చిత్రం రూపొందనుంది. 7ఎ ఫిలింస్ ఆల్ఫా ఫ్రేమ్స్‌పై 7ఎ శివ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బుధవారం (డిసెంబరు 14) ఆది బర్త్‌డే సందర్భంగా ‘శబ్దం’ చిత్రాన్ని ప్రకటించారు. ‘‘సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తాం. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. -
తన ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై స్పందించిన హీరోయిన్
హీరో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. నిక్కీ గల్రానీ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్ నిక్కీ గల్రానీ సోషల్ మీడియా వేదిక స్పందించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ తాను గర్భవతి అంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ‘నేను ప్రెగ్నెంట్ అంటూ కొందరు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఓ పని చేయండి డెలివరి డేట్ కూడా మీరే చెప్పేయండి’ అంటూ స్మైలీ ఎమోజీని జత చేసింది. చదవండి: ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం శుభ్రం చేసుకో అన్నాడు: నిధి అగర్వాల్ అదే విధంగా ‘ప్రస్తుతానికి నేను ప్రెగ్నెంట్ కాదు. కానీ భవిష్యత్తులో మాత్రం ఇది తప్పకుండ జరుగుతుంది. అప్పడు నేనే స్వయంగా చెప్తాను. అప్పటి వరకు ఇలాంటి పుకార్లను నమ్మకండి’ అంటూ తన ప్రెగ్నెంట్ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. కాగా కొన్నేళ్ల డేటింగ్ అనంతరం ఈ ఏడాది మేలో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టిలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. నిక్కీ, ఆది కలిసి ‘యగవరయినమ్ నా క్కాక’, ‘మరగధ నానయమ్’ సినిమాల్లో నటించారు. అదే సమయంలో వారిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే వారి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ బయటకు చెప్పలేదు. సీక్రెట్‌గా డేటింగ్ చేసిన ఆది-నిక్కీ ఈ ఏడాది పెళ్లి ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. చదవండి: తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్, నడవలేని స్థితిలో.. pic.twitter.com/1tucglygut — Nikki Galrani Pinisetty (@nikkigalrani) November 18, 2022 -
‘ది వారియర్’ మరోసారి అది నిరూపించింది: రామ్ పోతినేని
‘‘మా ‘ది వారియర్’ రిలీజ్ సమయంలో వర్షాలు పడుతున్నాయి. సినిమా వాయిదా వేయాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డాం. అయితే ప్రేక్షకులు వస్తారని గట్టిగా నమ్మాం.. మా నమ్మకం నిజమైంది’’ అని రామ్ పోతినేని అన్నారు. లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని, కృతీ శెట్టి జంటగా ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన చిత్రం ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్లో రామ్ మాట్లాడుతూ– ‘‘కోవిడ్ వచ్చినా, వర్షాలు వచ్చినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్ అని ‘ది వారియర్’ మరోసారి నిరూపించింది. ఈ చిత్ర నిర్మాతలతోనే నా తర్వాతి సినిమా ఉంటుంది’’ అన్నారు. లింగుసామి మాట్లాడుతూ.. నా తొలి తెలుగు చిత్రమిది. రామ్ లాంటి మంచి హీరో, శ్రీనివాసా చిట్టూరి లాంటి నిర్మాత, ఆది పినిశెట్టి, కృతి శెట్టి, మంచి టెక్నీషియన్స్ నాకు లభించారు. 'పందెం కోడి', 'ఆవారా', 'రన్' సినిమాలను ఎలా రిసీవ్ చేసుకున్నారో... అలా ఈ సినిమాకు చాలా పెద్ద ఆదరణ లభించింది. ఈ ఎనర్జీతో ఇంకా స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేయాలని అనుకుంటున్నాను’ అన్నారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. పక్కా కమర్షియల్ సినిమాలు ఏమేం కావాలో అవన్నీ 'ది వారియర్'లో ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. చూసిన వారంతా బాగుందని అంటున్నారు. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. వర్షాల్లో సినిమా విడుదలైనా ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. తర్వాత రోజు మరింత పికప్ అయ్యింది. ఇంతటి విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’అని అన్నారు. -
నిక్కీ గల్రానీతో ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఆది
ఆది పినిశెట్టి తాజాగా ది వారియర్ మూవీతో అలరించాడు. పెళ్లి అనంతరం విడుదలైన ఆయన తొలి చిత్రం ఇది. గురువారం(జూలై 14న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఇందులో ఆది విలన్ గురుగా కనిపించాడు. ఈ మూవీ రిలీజైన సందర్భంగా ఆది మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆది నటి నిక్కీ గల్రానీతో ప్రేమ, పెళ్లిపై ఆస్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: లలిత్ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్, వారెవరంటే! ‘నేను నిక్కీ మలుపు చిత్రం నుంచే మంచి స్నేహితులం. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు నాకు గొడవలు, మనస్పర్థలు వచ్చాయి. కొన్ని రోజులు మేం మాట్లాడుకోలేదు. సెట్లో మేం అసలు మాట్లాడుకునే వాళ్లం కాదు. దాదాపు షూటింగ్ అంతా అలానే పూర్తి చేశాం. ఇక చివరిలో మళ్లీ కలిశాం’ అని చెప్పుకొచ్చాడు. అలాగే ‘‘మలుపు అనంతరం ఇద్దరం కలిసి పలు సినిమాలు చేశాం. ఈ ప్రయాణంలో మా స్నేహం కాస్తా ప్రేమగా మారింది. మొదట నిక్కీనే నాకు ప్రపోజ్ చేసింది. తను నా దగ్గరకి వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. ఆ వెంటనే నేను కూడా ఓకే చెప్పాను. కొన్నాళ్లు ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి సమయం తీసుకున్నాం. ఆ తర్వాతే ఇంట్లోవాళ్లకి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ప్రస్తుతం మా ఇద్దరి ప్రయాణం చాలా సంతోషంగా సాగుతోంది. నేను, నిక్కీ కలిసి నటించిన ‘శివుడు’ సినిమా త్వరలోనే రాబోతుంది” అని చెప్పాడు. కాగా మే నెలలలో ఆది-నిక్కీలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మే 18వ తేదీన రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వీరి పెళ్లిలో టాలీవుడ్ హీరోలు నేచురల్ స్టార్ నాని, సందీప్ కిషన్ సందడి చేశారు. చదవండి: వేలెత్తి చూపేలా ఎదుగు: సుశాంత్ సోదరి కామెంట్స్‌కి రియా కౌంటర్ View this post on Instagram A post shared by Aadhi Pinisetty (@aadhiofficial) -
అమెజాన్ ప్రైమ్ కొత్త సిరీస్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..
Modern Love Hyderabad: Amazon Prime Announces Release Date: ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. సొంతగా సినిమాలు, వెబ్ సిరీస్‌ల నిర్మిస్తూ యంగ్ అండ్ న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో చిన్న హీరోలు, నటీనటులంతా ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీల్లో ప్రముఖంగా చెప్పుకునే వాటిలో ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియో. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ పేరుతో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ అలరిస్తోంది. తాజాగా 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' అనే వెబ్ సిరీస్ రానుంది. ఇందులో హీరోయిన్ నిత్యా మీనన్, రీతూ వర్మ, హీరో ఆది పినిశెట్టి, బిగ్‌బాస్ నాలుగో సీజన్ విన్నర్ అభిజిత్‌తోపాటు సీనియర్ నటి సుహాసిని, కోమలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 6 ఎపిసోడ్స్‌గా రానున్న ఈ వెబ్ సిరీస్‌కు నలుగురు డైరెక్టర్లు నగేష్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుదానం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా నెల క్రితం అమెజాన్ సంస్థ 'మోడ్రన్ లవ్ ముంబై' పేరుతో సిరీస్‌ను విడుదల చేసింది. అంతకుముందు ఏప్రిల్ 28న 'మోడ్రన్ లవ్ చెన్నై' కూడా రిలీజ్ కాగా ఇప్పుడు హైదరాబాద్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ bringing you 6 heartfelt stories of love all the way from Hyderabad 😍#ModernLoveOnPrime, July 8 #SICProductions @nareshagastya @hasinimani @komaleeprasad @MenenNithya #RevathyAshaKelunni #UlkaGupta #NareshVijayaKrishna @Abijeet #MalavikaNair @AadhiOfficial @riturv pic.twitter.com/lK7OdTzOv6 — amazon prime video IN (@PrimeVideoIN) June 22, 2022 -
ఓ ఇంటివాడైన హీరో ఆది, పెళ్లి ఫొటోలు వైరల్
యంగ్ హీరో ఆది పినిశెట్టి ఓ ఇంటివాడయ్యాడు. కోలీవుడ్ హీరోయిన్ నిక్కీ గల్రానీతో అతడు ఏడుగులు నడిచాడు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. స్నేహితుడి పెళ్లి సంబరాల్లో నేచురల్ స్టార్ నాని, యువ కథానాయకుడు సందీప్ కిషన్ సందడి చేశారు. ఇప్పటికే హల్ది వేడుకల్లో వీరు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆది, నిక్కీల పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే ఈ నూతన దంపతులు ఇండస్ట్రీ వర్గాల కోసం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేస్తారట! కాగా ఆది, నిక్కీలు ఎంతోకాలంగా ప్రేమించుకుంటున్నారు. 2015లో వచ్చిన యాగవరైనమ్ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు మరగాధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇదిలా ఉంటే ఆది ప్రస్తుతం 'వారియర్' మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు. చదవండి 👇 ఓటీటీలో సమంత, నయనతారల మూవీ, ఎప్పుడు? ఎక్కడంటే? నా నోట్లో మన్ను కొడితే పాపం తగులుతది, పద్మశ్రీ తిరిగిచ్చేస్తా.. -
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి డేట్ ఫిక్స్
Aadhi Pinisetty And Nikki Galrani Wedding Date Fixed: యంగ్ హీరో ఆది పెనిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ఇటీవల సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే వాటిపై ఎప్పుడు స్పందించని ఈ జంట వాటినే నిజం చేస్తూ మే 24న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని రెండు రోజులు ఆలస్యంగా ప్రకటిస్తూ తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. దీంతో వీరి పెళ్లి తేదీ కోసం ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు ఈ జంట ఫ్యాన్స్. చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం అయితే వీరి ఎంగేజ్మెంట్ జరిగి 15 రోజులు గడుస్తున్న ఇంకా పెళ్లిపై తేదీపై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ నేపథ్యంలో వారి పెళ్లికి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం ఈ జంట వివాహ తేది ఖరారైందని, ఈ నెల 18న మూడు మూళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఈ లవ్‌బర్డ్స్ త్వరలోనే వారి పెళ్లి తేదీని అనౌన్స్ చేస్తారా? లేక ఎంగేజ్మెంట్ తరహాలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటారా? తెలియాలంటే కొద్ది రోజులు వేయిట్ చేయాల్సిందే. చదవండి: అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం ‘యాగవరైనమ్ నా కక్కా’అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి-నిక్కీ తొలిసారి జంటగా నటించారు. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. అప్పటి నుంచి వీరిద్దరు సీక్రెట్‌గా లవ్‌ఎఫైర్ నడిపించారు. ఇదిలా ఉంటే ‘గుండెల్లో గోదారి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఆది పినిశెట్టి. ‘సరైనోడు’,‘నిన్ను కోరి’,'రంగస్థలం' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల గుడ్ లక్ సఖి చిత్రంలో నటించిన ఆది ప్రస్తుతం రామ్ పోతినేని ద్విభాష చిత్రం ది వారియర్లో ప్రతి కథానాయకుడిగా నటించాడు. -
గెట్ రెడీ
రామ్ తొలిసారి పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి లింగుసామి దర్శకుడు. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా చేస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో పోలీసాఫీసర్ సత్య పాత్రలో నటిస్తున్నారు రామ్. జూలై 14న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ చిత్రం టీజర్‌ను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు యూనిట్ వెల్లడించింది. ‘‘గెట్ రెడీ... ఈ నెల 14న సత్యను పరిచయం చేస్తున్నాం’’ అని రామ్ పేర్కొన్నారు. అక్షర గౌడ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. -
ఆ రోజే హీరోయిన్‌తో ఆది పినిశెట్టి పెళ్లి!
యంగ్ హీరో ఆది పినిశెట్టి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హీరోయిన్ నిక్కీ గల్రానీతో మార్చి 24న నిశ్చితార్థం జరుపుకున్న హీరో మరికొద్ది రోజుల్లో ఆమెతో ఏడడుగులు వేయనున్నాడు. వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. చెన్నైలోని ఫైవ్ స్టార్ హోటల్లో మే 18న వీరి వివాహం జరగనుందట. ఎంగేజ్మెంట్ సింపుల్‌గా చేసుకున్నారు కానీ పెళ్లి మాత్రం గ్రాండ్‌గా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆది, నిక్కీ.. ‘యాగవరైనమ్ నా కక్కా' సినిమాలో జంటగా నటించారు. తెలుగులో ఇది మలుపు పేరుతో విడుదలైంది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలాగే మరగద నానయం సినిమాలోనూ వీరు జంటగా నటించారు. ఇదిలా ఉంటే ఆది పినిశెట్టి ప్రస్తుతం క్లాప్, వారియర్ సినిమాలు చేస్తున్నాడు. చదవండి: నా కూతురితో కారులో ఉన్నాను.. అతడు అత్యాచారం చేస్తానని బెదిరించాడు ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ -
గుడ్ లక్ సఖి మూవీ ట్విటర్ రివ్యూ
‘నేను శైలజ’మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయింది అందాల భామ కీర్తి సురేశ్. తొలి సినిమాతోనే తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’మూవీతో కీర్తి సురేశ్ జాతకమే మారిపోయింది. ఆ సినిమా తర్వాత కీర్తి వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఒకపక్క స్టార్ హీరోలతో నటిస్తూ.. మరో పక్క లేడి ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన మరో లేడి ఓరియెంటెడ్ మూవీ ‘గుడ్ లక్ సఖి’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన మూవీ పాటలు, ట్రైలర్ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ. . కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం (జనవరి 28)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్.. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. #GoodLuckSakhi Overall A Mostly Lackluster Sports Drama! Keerthy did her best and the film had lscope for comedy and emotion but could not engage with a flat screenplay The makers did not even finish dubbing and the dialogues were hard to understand throughout Rating: 2/5 — Venky Reviews (@venkyreviews) January 28, 2022 సినిమా యావరేజ్‌గా ఉందని, కానీ కీర్తిసురేశ్ నటన మాత్రం అద్భుతంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. గుడ్ లక్ సఖి కాదు బ్యాడ్ లక్ కీర్తి అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూడతగ్గ సినిమా అని మరికొంతమంది చెబుతున్నారు. జగపతి బాబు ఆదిపినిశెట్టి పెర్ఫార్మన్స్ కూడా ఈ కథకి ప్లస్ అయిందని చెబుతున్నారు. #GoodLuckSakhi..! Solo release aithe kalisochindi kani NO Luck! Everything happens and ends abruptly with no reason..! Lacks the punch that is needed in sports drama..! Even shooting scenes did not have impact..! Feels like DSP is the only technician that worked honestly..! 2/5.! — FDFS Review (@ReviewFdfs) January 28, 2022 Papa account lo inkokati #GoodLuckSakhi pic.twitter.com/zmFHDvWDI2 — Kaushik🔔 (@ahvkboon) January 28, 2022 -
అమ్మాయిలు షూటింగ్ చేయడం కరెక్ట్ కాదు: నటుడు
Keerthy Suresh Good Luck Sakhi Trailer Is Out: కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రైఫిల్ షూటర్ పాత్రలో కీర్తి సురేష్, కోచ్ పాత్రలో జగపతిబాబు నటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను తాజాగా ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(సోమవారం) ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. మనదేశం గర్వపడేలా షూటర్స్‌ని తయారు చేయబోతున్నాను అంటూ జగపతి బాబు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో బ్యాడ్ లక్ సఖి నుంచి గుడ్ లక్ సఖిగా ఎలా మారిందన్న నేపథ్యంలో చిత్రాన్ని రూపొందించారని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ఆదిపినిశెట్టి కీలక పాత్రలోకనిపించనున్నారు. దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించారు. శ్రావ్యా వర్మ సహనిర్మాతగా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. -
లవర్‌బాయ్‌గా ఆది పినిశెట్టి, అది భ్రమ అంటున్న అనుపమ
► నన్ను ఎప్పుడైన దగ్గరగా చూడాలనుకుంటున్నారా? అంటూ క్లోజ్ ఫొటో షేర్ చేసిన అషురెడ్డి ► కర్తవ్యాన్ని పూర్తి చేసింది అంటూ సెల్ఫీ ఫొటో షేర్ చేసిన పూనమ్ కౌర్ ► శర్వానంద్, ఆదిత్య రాయ్‌లతో కలిసి ఫొటో దిగిన సిద్ధార్థ్, మహా సముంద్రం టీం కలిసినప్పుడు అంతే అంటున్నా హీరో ► లవర్ బాయ్‌గా సర్టిఫై అయ్యానంటున్న ఆది పినిశెట్టి ► పెర్ఫెక్ట్గా ఉండమంటే ఒక భ్రమే అంటున్నా అనుపమా పరమేశ్వరన్ ► చీరకట్టులో మైమరిపిస్తున్న శ్రద్ధదాస్ View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Aadhi (@aadhiofficial) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Nikki Galrani ✨ (@nikkigalrani) View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
స్ప్రింటర్‌గా ఆది పినిశెట్టి.. పోస్టర్ రిలీజ్
ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘క్లాప్’. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఐబి కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఆది స్ప్రింటర్‌గా కనిపిస్తున్నారు. ‘‘స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. సరైన స్ప్రింటర్‌లా కనిపించడానికి ఆది కఠినమైన శిక్షణ తీసుకున్నారు. తమిళ–తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఒలింపిక్స్‌లో భారతదేశం మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నందున మా సినిమా టీజర్ విడుదలకు ఇది సరైన సమయం అని భావించి, ఈ నెల 6న టీజర్ రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. Gearing up for the run! 🏁 #ClapTeaser#Ilaiyaraaja @aakanksha_s30 @Kurupkrisha @prithivifilmist @BigPrintOffl @SRCOffl @SSSMOffl @CNGS_2019 @PMM_Films @pravethedop @ClapMovie @LahariMusic @UrsVamsiShekar @DoneChannel1 pic.twitter.com/PNITGVEDYx — Aadhi🎭 (@AadhiOfficial) September 2, 2021 చదవండి : RC 15: మరో వివాదంలో డైరెక్టర్ శంకర్.. -
బై బై గోలీరాజు
‘మహానటి’ ఫేమ్ కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘గుడ్‌లక్ సఖి’. నగేష్ కుకునూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ‘దిల్’ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోలీ రాజు పాత్రలో హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. శనివారంతో గోలీ రాజు పాత్రధారి ఆది పినిశెట్టి సన్నివేశాలు పూర్తయ్యాయి. దీంతో చిత్రబృందం గోలీ రాజుకి బై బై చెప్పింది. ఈ సందర్భంగా చిత్ర దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఒక చురుకైన గ్రామీణ యువతి క్రీడల్లో అడుగుపెట్టి షూటర్‌గా ఎలా ఎదిగి ఊరికి పేరు తెచ్చిందనే కథాంశంతో తయారవుతున్న చిత్రమిది. షూటింగ్ ట్రైనర్‌గా జగపతిబాబు నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆగస్ట్ 15న రిలీజ్ చేసిన మా సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అధిక శాతం మహిళా సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తుండటం విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: చిరంతన్ దాస్. -
గుడ్‌లక్ సఖి.. టీజర్ వచ్చేసింది
మహానటి ఫేం కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న గుడ్‌లక్ సఖీ అఫీషియల్ టీజర్ వచ్చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్రబృందం శనివారం టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. 'హైదరాబాద్ బ్లూస్, డోర్, ఇక్బాల్ సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా జాతీయస్థాయిలో గుర్తింపును తెచ్చుకున్న నగేష్ కుకునూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రమాప్రభ, రాహుల్ రామకృష్ణ, తదితరులు నటిస్తున్నారు. కీర్తి సురేశ్ అచ్చమైన పల్లెటూరి పిల్లగా కనిపిస్తూ టీజర్లో ఆకట్టుకుంటుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి.. దేశం గర్వించే షూటర్‌గా ఎలా తయారైందన్న అంశంతో చిత్రం రూపుదిద్దుకుంది. కీర్తిని జాతీయ షూటర్‌గా తయారు చేసే కోచ్‌గా జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. టీజర్లో కీర్తి సురేశ్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్‌రాజు సమర్పణలో వార్త్ షాట్ మోషన్ ఆర్ట్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న గుడ్‌లక్ సఖీ చిత్రానికి సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
ఆది పినిశెట్టి ‘క్లాప్’మూవీ ప్రారంభమైంది
-
ప్రారంభమైన ఆది పినిశెట్టి ‘క్లాప్’
విభిన్నమైన పాత్రలను చేస్తూ వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆది పినిశెట్టి మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే ‘క్లాప్’ చిత్రంలో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్‌లో ఆది హీరోగా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజి సమర్పణలో పృథ్వి ఆదిత్య దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లు పై ఐబి కార్తికేయన్, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమా బుధవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అతిరథ మహారధులు మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సి. కళ్యాణ్, చంటి అడ్డాల, శ్రీమతి శోభారాణి, కొమర వెంకటేష్, హీరోలు నాని, సందీప్ కిషన్, ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్, రచయిత చిన్నికృష్ణ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పూజాకార్యక్రమాల అనంతరం హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ ఆకాంక్ష సింగ్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా క్లాప్ నివ్వగా మెగా నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తమిళ్ చిత్రానికిగాను హీరో నాని క్లాప్ నిచ్చారు. ‘క్లాప్’ బౌండెడ్ స్క్రిప్ట్‌ను ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్లు చిత్ర యూనిట్‌కు అందజేశారు. ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ‘పృథ్వి ఆదిత్య కథ చెప్పగానే వెంటనే ఈ సినిమా చేస్తాను అని చెప్పాను. అంతలా ఇంప్రెస్ అయ్యాను. వెరీ ఆర్ట్ టచ్చింగ్ మూవీ . డైరెక్టర్ చాలా టాలెంట్ వున్న వ్యక్తి. ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథ రాశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. వాటన్నిటికంటే ఈ క్లాప్ చిత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్ కన్విక్షన్ బాగా నచ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. రెండు షేడ్స్ వున్న పాత్రల్లో నటిస్తున్నాను. బాగా చెయ్యాలనే తపనతో వున్నాను. నిర్మాత కార్తికేయన్ నేను ఎప్పటినుండో సినిమా చెయ్యాలనుకుంటున్నాం, ఇన్నాళ్లకు కుదిరింది’ అన్నారు. దర్శకుడు పృథ్వి ఆదిత్య మాట్లాడుతూ.. ఇది వెరీ స్పెషల్ డే నాకు. వన్ ఇయర్ నుండి ఈ కథపై వర్క్ చేశాను. కార్తికేయన్‌కి పాయింట్ చెప్పగానే నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయమన్నారు. ఆది కథ విని వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అథ్లెటిక్ స్పోర్ట్స్ నేపథ్యంలో చిత్ర కథ సాగుతుంది’ అన్నారు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ.. ‘తెలుగులో ఇది నా మూడవ సినిమా. తమిళ్లో ఫస్ట్ సినిమా. చాలా ఎక్సయిటింగ్‌గా వుంది. ఈ చిత్రంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూర్స్కి థాంక్స్’ అన్నారు. -
స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడీలో కీర్తి సురేష్
‘హైదరాబాద్ బ్లూస్’, ‘ఇక్బాల్’ చిత్రాల దర్శకుడు నగేష్ కుకునూర్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్, ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడి జోనర్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా.. ప్రముఖ డిజైనర్ శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇ.శివప్రకాశ్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సినిమా నిర్మాణ రంగంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన నిర్మాతలు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమాను నిర్మిస్తుండటం విశేషం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. తను వెడ్స్ మను ఫేమ్ చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఇలా క్వాలీటీ విషయంలో మేకర్స్ కాంప్రమైజ్ కావడం లేదు. ప్రస్తుతం వికారాబాద్, పూణేల్లో షూటింగ్ జరుగుతోంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రం ఇప్పటికే నాలుగో భాగం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. -
10కే వాక్ అదుర్స్
గుంటూరు వెస్ట్: ‘ఆరోగ్యం కోసం నడక– గుంటూరు కోసం నడక’ నినాదంతో నిర్వహించిన 10కే వాక్ ఘనంగా ముగిసింది. ఆదివారం ఉదయం స్థానిక విద్యానగర్‌లోని ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్ ముందు ప్రారంభమైన ఈ పోటీలకు సినీ నటుడు ఆది పినిశెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాష్‌రెడ్డి నవ్వులను పూయించారు. కార్యక్రమ నిర్వహణా బాధ్యతను పోటీల కన్వీనర్ కోయ సుబ్బారావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ గుంటూరు ప్రజలకు చైతన్యమెక్కువన్నారు. ముఖ్యంగా ఇటువంటి ఈవెంట్స్‌ను బాగా ఆదరిస్తారని కొనియాడారు. 10కే వాక్ చైర్మన్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 14 ఏళ్లుగా నిర్విరామంగా నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఆది, తదితర నాయకులు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. యువత కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నక్కా ఆనంద్‌బాబు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎల్.వి.ఆర్. క్లబ్ కార్యదర్శి కోవెలమూడి రవీంద్ర (నాని), అడిషనల్ ఎస్పీ వై.టి.నాయుడు, డీఎస్పీ శ్రీజ, మలినేని కాలేజ్ డైరెక్టర్, చైర్మన్ మలినేని పెరుమాళ్ సుధాకర్, లాల్ వజీర్, వజ్జా రామకృష్ణ పాల్గొన్నారు. విజేతలు : అండర్–16 బాలురు : ఎం.కృష్ణమూర్తి నాయక్, బి.భరత్ రాజ్, షేక్ అబ్దుల్ రెహ్మాన్. అండర్ –16 బాలికలు : బి.నాగ హారిక, కె.అశ్విని భాయ్, బి.శ్రీనిధి. అండర్–25 యువకులు: బి.కాంతారావు, పి.రవి, షేక్ సుభాని అండర్–25 మహిళలు: ఐ.రాజేశ్వరి, పి.విజయ లక్ష్మి, షేక్ నూర్జహాన్‌లు వరుసగా ప్ర«థమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే వెటరన్ విభాగం, ప్రత్యేక విభాగాల్లో కూడా పలువురు బహుమతులందుకున్నారు. -
వెలుగుతున్న క్యారెక్టర్లు
కొన్ని క్యారెక్టర్లు వెన్నముద్దల్లా తెల్లటి కాంతిలీనుతాయి.కొన్ని క్యారెక్టర్లు కలర్ అగ్గిపుల్లల్లా రంగులు చిమ్ముతాయి. కొన్ని పాముబిళ్లల్లా పైకి లేస్తాయి. కొన్ని విష్ణుచక్రాల్లా గిర్రున తిరిగి... భూచక్రాల్లా నేలంతా దున్ని...ఢామ్ ఢామ్మున పేలే హీరో హీరోయిన్లతోపాటు ఇలాంటి క్యారెక్టర్లూ ఉంటేనే దీపావళి. 2018 కొందరికి బెస్ట్ క్యారెక్టర్లు ఇచ్చి బ్లెస్ చేసింది. బ్రైట్‌గా వెలిగించింది. ఇదిగోండి ఆ బ్రైట్ స్టోరీ. సినిమా అంటేనే దీపావళి. తెర మీద వెలుగుల ఝరి. ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడానికి దర్శక– నిర్మాతలు నటీనటులు, సాంకేతిక నిపుణులు అనే మందుగుండు సామగ్రిని తీసుకొని చీకటి నిండిన సినిమా హాళ్లలో వెలుగును నింపే ప్రయత్నం చేస్తుంటారు. సినిమా బాగా వెలగాలంటే హీరో అనే టెన్ థౌజండ్ వాలా, హీరోయిన్ అనే ఆకాశజువ్వతో పాటు సపోర్టు కోసం కాకరపువ్వొత్తులు, మతాబులు, భూచక్రాలు వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండాల్సిందే. హీరో హీరోయిన్ల గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఈసారి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వెలిగినవారిని చర్చిద్దాం. ఈ సంవత్సరం మంచి పాత్రలు చేసి నేల టపాకాయల్లా పేలి సందడి చేసిన వారు వీరంతా. వీళ్లు నవ్వించారు. ఏడ్పించారు. ఆలోచింప చేశారు. సినిమాలకు బలం చేకూర్చారు. కథకు ఒక క్యారెక్టర్ తెచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టులు వీరు. భూమిక చక్రం ‘అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా’... అని కుర్రకారు భూమిక అందానికి ఐస్ అయ్యారు గతంలో. ‘ఒక్కడు’, ‘సింహాద్రి’, ‘వాసు’, ‘జై చిరంజీవ’ వంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. ‘అనసూయ’ వంటి థ్రిల్లర్‌ను ఒంటి చేత్తో సక్సెస్ చేసిన నటి ఆమె. పెళ్లి తర్వాత కొన్నాళ్లు విరామం తీసుకున్నా తెలుగు ప్రేక్షకులు ఆమెను మర్చిపోలేదు. అందుకే నాని ‘ఎంసీఏ’తో కమ్‌బ్యాక్ ఇస్తే చప్పట్లు కొట్టారు. ఆ సినిమాలో భూమిక సీరియస్‌గా ఉండే ఆఫీసర్‌గా, మరిదిని అభిమానంగా చూసుకునే వదినలా నటించి మెప్పించారు. ఆమె ఇమేజ్ ఆ క్యారెక్టర్‌కు బలం అయ్యింది. ఆ తర్వాత ‘యూ టర్న్’లో ఘోస్ట్ పాత్రను పోషించారామె. తన జీవితాన్ని, తన బిడ్డ జీవితాన్ని కోల్పోయిన దుఃఖంలో దెయ్యంగా మారి ఆమె దుర్మార్గులను శిక్షిస్తారు. తాజాగా ‘సవ్యసాచి’లో నాగచైతన్య అక్క పాత్రను పోషించారు. భూచక్రం తక్కువ సేపు తిరిగినా ఎక్కువ స్పీడుతో వెలుగుతుంది. తాను ఉన్నది తక్కువ సేపే అయినా సినిమాలకు కావలసినంత వెలుగు ఇస్తున్నారు భూమిక. రావు రాకెట్ ‘వాణ్ణలా వదిలేయకండిరా... ఎవరికన్నా చూపించండిరా’ అనే రావు రమేష్ డైలాగ్ పెద్ద హిట్. ఇప్పుడు ఆయన తోటి నటులు తెర మీద ఆయన పండిస్తున్న పాత్రలను చూసి ‘అతడలా రెచ్చిపోతుంటే వదిలేయకండిరా... ఎలాగైనా ఆపండిరా’ అని అనుకుంటూ ఉంటారు. తండ్రి రావుగోపాలరావు పెద్ద నటుడే అయినా ఆ పేరు కంటే తన టాలెంటే ఎక్కువ ఉపయోగపడింది రావు రమేష్‌కు. ‘కొత్త బంగారు లోకం’, ‘పిల్ల జమీందార్’, ‘అత్తారింటికి దారేది’ సినిమాల్లో ఆయన వేసిన క్యారెక్టర్లు మెరిశాయి. ఆయన్నే దృష్టిలో పెట్టుకుని ‘సినిమా చూపిస్త మావా’ వంటి కథలు రాసుకున్నారు. ఈ ఏడాది ‘అజ్ఞాతవాసి’లో విలనిజమ్‌తో నవ్వులు పూయించి, ‘ఛల్ మోహన్ రంగా’, ‘రాజుగాడు’, ‘దేవదాస్’ సినిమాలతో ఎట్రాక్ట్ చేసి, నటుడిగా రాకెట్ వేగంలో దూసుకెళుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘అరవింద సమేత’ సినిమాల్లో ఆయన పాత్రలు ఆ సినిమాలకు కీలకంగా మారాయి. . ఇప్పుడీ బాంబుని తమిళనాడు దర్శకులు దిగుమతి చేసుకోవడానికి శ్రద్ధ చూపిస్తున్నారు. ‘సాగసం’ అనే తమిళ చిత్రంలో రావు రమేశ్ విలన్‌గా నటిస్తున్నారు. నవ్వుల మతాబు జంధ్యాల వెలిగించిన నవ్వుల మతాబు నరేశ్. ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘చిత్రం భళారే విచిత్రం’ వంటి సూపర్‌హిట్ కామెడీ సినిమాలు నరేశ్ ఖాతాలో ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక కొంతకాలం ఆయన స్ట్రగుల్ అయినా రెండు మూడేళ్లుగా ఆయన కెరీర్ గ్రాఫ్ చాలా ఉత్సాహకరంగా ఉంది. ఈ ఏడాది ఎక్కువ శాతం నవ్వులు పూయించిన నటుడు నరేశ్ అనే అనొచ్చు. ‘సమ్మోహనం’ చిత్రంలో నట పిచ్చి ఉన్న హౌస్ ఓనర్ పాత్రలో నరేశ్ పేల్చిన నవ్వులకు థియేటర్ పకపకలాడింది. ‘ఛలో’, ‘తొలిప్రేమ’, ‘ఛల్‌మోహన్ రంగ’, ‘దేవ దాస్’, ‘అరవింద సమేత’లో ఆయన చేసిన పాత్రలన్నీ అలరించాయి. కేవలం నవ్వించడమే కాకుండా ‘రంగస్థలం’ సినిమాలో ఎమోషనల్ సీన్స్ చేసి ఆడియన్స్ కళ్లలో నీళ్లు తెప్పించారు నరేశ్. బిజీ బాంబ్ ఈ ఏడాది దాదాపు రెండు నెలలకోసారి స్క్రీన్ మీద కనిపించిన బాంబు మురళీ శర్మ. ఈ బాంబుని ఒక్కో దర్శకుడు ఒక్కోలా స్క్రీన్ మీద పేల్చారు. జనవరి టు నవంబర్ సుమారు పది సినిమాల్లో వెలుగు నింపారు మురళీ శర్మ. ‘అజ్ఞాతవాసి’లో కామెడీ శర్మగా, ‘భాగమతి’, ‘టచ్ చేసి చూడు’ చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్‌గా, ‘అ!’ చిత్రంలో మాంత్రికుడిగా, ‘విజేత’ సినిమాలో బాధ్యతగల తండ్రిగా, ‘శైలజా రెడ్డి అల్లుడు’, ‘దేవదాస్’ చిత్రాల్లోనూ మెప్పించారు. ఈ ఏడాది ఎక్కువగా దర్శక– నిర్మాతలు పేల్చిన టపాసుల్లో మురళీ శర్మ ఒకరు. – ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది మా అమ్మ నా టార్చ్ బేరర్ ‘డీజే’లో రొయ్యలనాయుడు పాత్రను చూసి మా అమ్మగారు.. ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మీ నాన్న గారు చేసిన పాత్రను కంటిన్యూ చేసి శభాష్ అనిపించుకున్నావు. ఇక నీకు తిరుగులేదు’ అన్నారు. ఆ రోజు ఆమె ఆనందాన్ని చూసిన నేను ‘ఇక చాలు’ అనుకున్నాను. నా డైరెక్టర్స్ ఎన్నో మంచి పాత్రలను నాకిచ్చి ప్రోత్సహించారు. ‘అ ఆ’ చిత్రంలోని క్లైమాక్స్ చేసినప్పుడు దర్శకుడు త్రివిక్రమ్‌గారు ‘ఇది ఐకానిక్ సీన్ అవుతుందండి’ అన్నారు. ‘శత్రువులు ఎక్కడో ఉండరు.. మనతో పాటే మన చెల్లెళ్ల రూపంలో, కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారు’ అన్న తర్వాత ‘ఇప్పుడేం చేద్దాం అంటే.. చేసేదేముంది ఇక పిసుక్కోవటమే..’ అనే సీన్లోని డైలాగ్ ఇది. ఇప్పటికీ ఎక్కడికెళ్లినా అందరూ పిసుక్కోవటమే అంటూ నేను చెప్పిన డైలాగ్‌ను నాకే చెప్తుంటారు. అలాగే శ్రీకాంత్ అడ్డాల అన్ని సినిమాల్లోనూ చాలా మంచి రోల్స్ చేశాను. హరీష్ శంకర్ తన సినిమాలలో చాలా స్పెషల్‌గా క్యారెక్టర్‌ను నా కోసం తయారు చేస్తారు. ఒక నటుడికి ఇంత కన్నా ఆనందం ఏముంటుంది. – రావు రమేశ్ డబుల్ సౌండ్ బాంబు హీరోగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో డబుల్ సౌండ్ చేస్తున్న నటుడు ఆది పినిశెట్టి. ఈ ఏడాది ‘రంగస్థలం’, ‘యు టర్న్’ సినిమా విజయాలలో భాస్వరం వత్తిలా కీలక పాత్రలు పోషించారు.. ‘రంగస్థలం’లో ఆయన మరణాన్ని చూసి రెండు తెలుగు రాష్ట్రాలు కళ్లల్లో నీళ్లు నింపుకున్నాయి. ‘యు టర్న్’లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంటే జరుగుతున్న హత్యలను ఇతను ఛేదించగలడు అని ధైర్యం తెచ్చుకుంది. హ్యాపీ స్పేస్‌లో ఉన్నాను ఎన్ని పాత్రలు చేసినా ఆర్టిస్ట్ ఆకలి అనేది తీరదు. వచ్చిన పాత్రను సంతృప్తికరంగా చేయడంతో పాటు ఇంతకు ముందు రిపీట్ అయినట్టు కాకుండా చేసేందుకు జాగ్రత్త పడుతుంటాను. 2018 చాలా సంతృప్తికరమైన సంవత్సరం. సాధారణంగా నేను నా దర్శకులందరితో కలిసిపోతాను. తెలుగు ప్రేక్షకులు నా పాత్రలను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే ఇంతకు మించి ఏం కోరుకోను? అనిపిస్తుంది. సంవత్సరానికి 10 సినిమాలు చేస్తున్నాను అంటే తీరిక లేకుండా పని చేయాలి. కానీ నేను పని చేసే టీమ్ వల్ల ప్రత్యేకమైన వెకేషన్ కూడా అవసరం ఉండటం లేదు. అంత బావుంటుంది పని చేసే వాతావరణం. మంచి మంచి పాత్రలు రాస్తున్నారు దర్శకులు. అన్నీ తిరస్కరించడానికి వీలు లేనటువంటి పాత్రలే. వచ్చే నెల విడుదల కానున్న శర్వానంద్ ‘పడిపడి లేచె మనసు’లో కూడా చాలా భిన్నమైన పాత్ర పోషిస్తున్నాను. నేను ఎప్పుడూ మిమ్మల్ని (ప్రేక్షకులు) ఆనందింపజేయాలి, నన్ను మీరు ఆదరించాలి. ఇదెప్పుడూ ఇలానే సాగాలని కోరుకుంటున్నాను. – మురళీ శర్మ ఇంటింటా ఈశ్వరీ రజనీకాంత్.. హైడ్రోజన్ బాంబ్. అలాంటి పెను పేలుడు పదార్థం పక్కన నిలబడి, ఫ్రేమ్‌లో గెలవడం చాలా కష్టం. కానీ ‘కాలా’లో రజనీతో సమానంగా కొన్నిసార్లు డామినేట్ చేసి మంచి మార్కులు కొట్టేశారు ఈశ్వరీ రావు. ఇరవై ఏళ్ల క్రితం ‘ఇంటింటా దీపావళి’ చిత్రంతో పరిచయమైన ఈశ్వరీ రావు బాపు దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ సరసన ‘రాంబంటు’ సినిమాలో హీరోయిన్గా నటించారు. తమిళంలోనూ ఆమె హీరోయిన్ వేషాలు వేశారు. అయితే అప్పుడు రాని గుర్తింపు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వచ్చింది. ‘కాలా’లో కరికాలన్ భార్య చిట్టెమ్మగా, ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఫ్యాక్షనిస్ట్ బసిరెడ్డి భార్యగా కనిపించిన ఈ నటి ‘అర్జున్‌రెడ్డి’ తమిళ రీమేక్‌లో పని మనిషి పాత్ర చేశారు. తెలుగులో నిడివి తక్కువ ఉన్న ఈ పాత్రను తమిళంలో దర్శకుడు బాలా పెంచి ముఖ్యమైనదిగా మలిచారు. ఈశ్వరీ రావు ఇమేజ్ ఏ విధంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. -
‘యు టర్న్’ మూవీ రివ్యూ
టైటిల్ : యు టర్న్ జానర్ : సూపర్ నేచురల్ థ్రిల్లర్ తారాగణం : సమంత, ఆది పినిశెట్టి, భూమిక, రాహుల్ రవీంద్రన్, నరేన్ సంగీతం : పూర్ణచంద్ర తేజస్వీ దర్శకత్వం : పవన్ కుమార్ నిర్మాత : శ్రీనివాసా చిట్టూరి, రాంబాబు బండారు పెళ్లి తరువాత సినిమాల ఎంపికలో సమంత చాలా సెలెక్టివ్ గా ఉన్నారు. ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది రంగస్థలం, అభిమన్యుడు లాంటి సూపర్ హిట్స్ అందుకున్న సామ్ మరో సూపర్ హిట్ మీద కన్నేశారు. అందుకే కన్నడలో ఘనవిజయం సాధించిన యు టర్న్ సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన యు టర్న్ కు ఒరిజనల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన పవన్ కుమారే దర్శకత్వం వహించాడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యు టర్న్‌తో సమంత ఆశించిన విజయం సాధించారా..? లేడీ ఓరియంటెడ్ సినిమాతో ఆకట్టుకున్నారా.? కన్నడ ప్రేక్షకులను అలరించిన యు టర్న్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా..? కథ : రచన(సమంత) ఓ మీడియా సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తుంటుంది.అదే సంస్థలో ఉద్యోగం కోసం ఓ హ్యూమన్ ఇంట్రస్ట్ స్టోరి చేసేందుకు ప్లాన్ చేస్తుంది. అందులో భాగంలో ఆర్కేపురం ఫ్లైఓవర్‌పై రోడ్ బ్లాక్స్ ను తప్పించి యు టర్న్ తీసుకునే వారిని మీద స్టోరి చేయాలన్న ఆలోచనతో, యుటర్న్ తీసుకున్న వ్యక్తుల వెహికిల్ నంబర్స్ ద్వారా వారి అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు తెలుసుకుంటుంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా సుందర్ అనే వ్యక్తిని కలిసేందుకు ప్రయత్నించినా వీలుపడదు. కానీ అదే రోజు సుందర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవటంతో రచనను ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళతారు. విచారణలో భాగంగా రచన డైరీని పరిశీలించిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ డైరీలో ఉన్న వ్యక్తులందరూ సుందర్ లాగే గతంలో ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. అసలు ఆ డైరీలో ఉన్న వ్యక్తులు ఎవరు..? ఎలా చనిపోయారు.? వారి మరణానికి రచనకు సంబంధం ఏంటి.? ఈ సమస్యల నుంచి రచన ఎలా బయటపడింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; ఇన్నాళ్లు కమర్షియల్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారు. యు టర్న్ సినిమాను ఏరికోరి సెలెక్ట్ చేసుకున్నారు. తన పర్ఫామెన్స్ తో సినిమా స్థాయిని పెంచారు సమంత. ప్రేమ, భయం, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించారు. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. రచనకు సాయంచేసే పోలీస్ పాత్రలో ఆది పినిశెట్టి సరిగ్గా సరిపోయాడు. పెద్దగా వేరియేషన్స్ చూపించే అవకాశం లేకపోయినా.. ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. భూమిక తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతో మంచి ఎమోషన్స్ పండించారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో భూమిక నటన కంటతడిపెట్టిస్తుంది. సమంత ఫ్రెండ్ పాత్రలో క్రైమ్ రిపోర్టర్ గా రాహుల్ రవీంద్రన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇతర పాత్రలో నరేన్, రవి ప్రకాష్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : థ్రిల్లర్ జానర్లో తెరకెక్కే సినిమాలను ఓ సెక్షన్ ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారు. అందుకే టాప్ స్టార్లు కూడా అప్పుడప్పుడు థ్రిల్లర్ సినిమాల వైపు చూస్తుంటారు. సమంత కూడా నటిగా తన స్థాయిని మెరుగుపరుచుకునేందుకు కన్నడ సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఒరిజినల్ వర్షన్‌కు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ తెలుగు వర్షన్ ను కూడా డైరెక్ట్ చేశారు. తొలి పది నిమిషాలు కాస్త నెమ్మదిగా మొదలు పెట్టినా.. ఒక్కసారి అసలు కథ మొదలయ్యాక ఆడియన్స్‌ను కట్టిపడేశాడు దర్శకుడు. ఎక్కడ అనవసరమైన కామెడీ, సాంగ్స్ లాంటివి ఇరికించకుండా పర్ఫెక్ట్ థ్రిల్లర్‌లా సినిమాను నడిపించాడు. పూర్ణ చంద్ర తేజస్వీ సంగీతం సీన్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచింది. అయితే సెకండ్‌హాఫ్‌లో కొన్ని ట్వీస్ట్ లు ఆడియన్స్ ముందే అంచనా వేయగలిగేలా ఉన్నాయి. థ్రిల్లర్ సినిమాకు ఇది డ్రాబ్యాక్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సమంత నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : తొలి పది నిమిషాల అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు లేకపోవటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘యు టర్న్’కు డేట్ ఫిక్స్
స్టార్ హీరోయిన్ సమంత ఓ డిఫరెంట్ రోల్ నటిస్తున్న సినిమా యు టర్న్. కన్నడలో సూపర్ హిట్ అయిన యు టర్న్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు పవన్ కుమార్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన యు టర్న్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు, తమిళభాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఒకే రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యువ నటుడు రాహుల్ రవీంద్రన్, సీనియర్ హీరోయిన్ భూమికా చావ్లా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పూర్ణ చంద్ర తేజస్వి సంగీతమందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మరియు వివై కంబైన్స్ బ్యానర్స్ పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్నారు. -
జేబు శాటిస్ఫ్యాక్షన్ ఇంకా రాలేదు
‘‘నీవెవరో’ టీమ్ అంతా ఓ సైన్యంలా పనిచేశాం. నమ్మకం దేవుడితో సమానం. సినిమా తీసేవాళ్లు.. చేసేవాళ్లు.. చూసేవాళ్లు.. అందరికీ జాబ్ శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చిన సినిమా ఇది. అయితే జేబు శాటిస్ ఫ్యాక్షన్ ఇంకా రాలేదు’’ అని కోన వెంకట్ అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా హరినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్’లో కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘వెంకీ’ నుంచి ‘బాద్షా’ వరకు సినిమాలు చేసి సక్సెస్ అయినా కూడా... హౌస్ డ్రామాలు ఎన్ని రోజులు తీస్తారు? అన్నారు. రూట్ మార్చి ఎంవీవీ బ్యానర్ పెట్టి 2014లో కొత్త జర్నీ స్టార్ట్ చేశాం. ఈ జర్నీలో ‘‘నిన్నుకోరి, నీవెవరో’ సినిమాలు వచ్చాయి. కొన్ని వందల మంది వేల గంటలు పనిచేస్తే ఓ సినిమా వస్తుంది. అలాంటి సినిమాను ఓ పది రూపాయల పెన్‌తో కొట్టి పడేయడం సరికాదు.. ఇది నా ఆక్రోశం కాదు.. ఆవేదన. ప్రేక్షకుల కోసమే మేం సినిమాలు చేస్తాం. రాసేవాళ్లు అది అర్థం చేసుకుంటే చాలు’’ అన్నారు. ‘‘మా సినిమా రిలీజ్ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో కలెక్షన్స్ తక్కువగా ఉన్నా ప్రస్తుతం ఫుల్‌గా రన్ అవుతోంది. పదిశాతం మంది ప్రేక్షకులు సినిమాను విశ్లేషిస్తే.. 90 శాతం మంది సినిమాను ఎంజాయ్ చేయాలనుకుని వెళ్తారు. అలాంటి వారికి వందశాతం నచ్చే సినిమా ఇది’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘మా ప్రయత్నాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు హరినాథ్. ‘‘నాలోని కొత్త కోణాన్ని పరిచయం చేసిన చిత్రమే ‘నీవెవరో’’ అని రితికా సింగ్ అన్నారు.