Suddala Ashok Teja
-
అతడు అడవిౖయె రోదించాడు... హెచ్చరించాడు!
ప్రకృతిలో ఒక భాగమైన మనిషి అత్యాశకు పోయి దాని సహజ సూత్రాలను అతిక్రమిస్తున్నాడు. ఫలి తంగా ఎన్నో దుష్పరిణా మాలకు కారకుడవుతు న్నాడు. ఈ విషయాన్ని చెప్పడం కోసం కవి సుద్దాల అశోక్ తేజ అడవి రూపమెత్తి ‘నేను అడవిని మాట్లాడుతున్నా’నని దండోరా వేశాడు. ‘‘అఖిల సృష్టికి ప్రాణముద్ర ప్రకృతి ప్రకృతికి వేలిముద్ర అడవి అడవి నిలువెత్తు సంతకం చెట్టు’’ అనేది సుద్దాల భావన. మానవ సమాజం ప్రగతి పేరుతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోంది. అయితే ఈ కవి ఉత్తమోత్తమ ప్రగతిని – ‘‘ఆసుపత్రులు లేని భూగోళం నా చిరకాలపు కల/ న్యాయస్థానాలకు పని కల్పించని దృశ్యం/ నేనూ హించే సుందర ప్రపంచం’’ అని స్వప్నిస్తున్నాడు. ఇది సాధ్యమా? కాదు, కాదని చెబుతూనే ఆ ‘సుందర ప్రపంచం’ ఎలా సాధ్యమో ‘నీళ్లు నమల కుండా’ ఇలా ప్రకటించాడు.‘‘హద్దు మీరిన వ్యాపారమే / చేసింది రాజ్యాంగేతర శక్తిగా / అధికార పదవీస్వీకారం/అధికార పదవుల్లో తిరిగే బొమ్మలకు / అసలు సిసలు సూత్రధారి/ తెరవెనుక బడా వ్యాపారి/ అడవి ధ్వంసం, కడలి ధ్వంసం/ వెరసి ప్రకృతి విధ్వంసం/ ఈ త్రిసూత్ర పథ కాలంలో/ ఎదుగు తున్నది కుటిల/ వ్యాపార త్రివిక్రమావతారం/ భయానికీ భయానికీ మధ్య / బతుకు నలుగు తున్నది/ ప్రకృతికీ మనిషికీ మధ్య / ఇనుపగోడ పెరుగుతున్నది/ ప్రకృతి సమాధిపైన ప్రగతి సౌధాలు / ఏ ఆర్థిక ప్రవక్త చెప్పాడిది/ ఏ పురోగ మన సూక్తం ఇది?! అంతేగాదు–‘‘జీవనంలో ఓడినవాడు, ఆధ్యా త్మిక జీవనం కోరినవాడు, సాయుధ రణ జీవనంలో చేరినవాడు, అరణ్యా నికే వస్తాడు – రావాలి!’’ ఎందుకంటారా?ప్రకృతి మోహినీ రూపంలో రాదు గాక రాదు/ మోహ రించిన ప్రళయ రూపంలో/ ఎదురెత్తులేస్తూ ఉంటుంది/ హిమాలయాలను కరిగిస్తుంది/ జలాశయాలను మరి గిస్తుంది/ అరణ్యాలను చెరిపే స్తుంది/ ‘లావా’లను కురిపి స్తుంది. కనుకనే – ‘‘చర్యకు ప్రతిచర్య/ హింసకు ప్రతి హింస/ అనివార్యం – అది / ప్రకృతి ప్రాణ సూత్రం/ మీ చేతలవల్ల/ జరుగుతున్న పాతకా లకు, / ఘాతుకాలకు/ ప్రతీఘాత తీవ్రత/ ఏ స్థాయిలో ఉంటుందంటే/ మీ ఊహకు అందనంత/ అందినప్పుడు మీరుండరు!/ పెడమార్గం పట్టిన / చెడుమార్గం తొక్కిన మీ/ చేష్టలవల్ల/ ధర మేధం, గిరిమేధం/ తరుమేధం, చివరికి సమస్త/ నరమేధం జరిగి తీరుతుంది/ నరవరా! మళ్ళీ మళ్లీ చెబుతున్నా/ హంతకులూ మీరే/ హతులూ మీరే!’’అందుకనే, సుద్దాల తీర్మానం – ‘‘ఏ పరిశో ధనైనా/ ఏ పురోగమనమైనా/ అరణ్యం అంగీ కరించే/ పర్యావరణం పరవశించే విధంగా’’ నేటి తరాలకు అభయంగా, రేపటి తరా లకు భరోసాగా ఉండాలన్నది సుద్దాల డిక్టేషన్! కనుకనే ‘‘వేల ఏళ్లు దాటొచ్చిన మానవ జాతి, ఇక వెనక్కెళ్లడం సాధ్యం కాదు గనుకనే, కుదరని వ్యవహారం కనుకనే – ఆ ప్రకృతినే ఆశ్రయించి, పిలిపించమని సుద్దాల అరణ్య రోదన, ఆయన సమస్త వేదన! కనుకనే ‘శ్రమ కావ్యం’ ద్వారా శ్రమ జీవుల ఈతిబాధల్ని కావ్యగతం చేసి ధన్యుడైన నేల తల్లి బిడ్డ సుద్దాల... తన అరణ్య కావ్యం ద్వారా ఈ చరా చర ప్రకృతిలో అసలు ముద్దాయి ఎవరో తేల్చినవాడు! మనిషే ఈనాడు ప్రకృతికి ప్రతి నాయకుడై వాతావరణ విధ్వంసానికి కారకుడని సుద్దాల మనోవేదనతో తీర్చిదిద్దినదే ఈ గొప్ప కావ్యం.నిరుపేదల బతుకులు చట్టు బండలవుతున్న పరిస్థితిని చూస్తూ తట్టుకోలేని సుద్దాల– ‘‘అడివమ్మ మాయమ్మ అతి పేద ధీర ఆ అమ్మకున్నది ఒక్కటే చీర’’ అన్న పాట నిరుపేద కుటుంబాల ఆర్థిక దైన్యాన్ని, గుండె కోతను ప్రపంచానికి వెల్లడించాడు. ఆ స్పందించ గల హృదయాలను ఆకట్టుకుని అక్కున చేర్చు కున్న సుద్దాల సదా ధన్యుడు! – ఏబీకే ప్రసాద్, సీనియర్ సం΄ాదకులు -
ఘనంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నాలుగో వార్షికోత్సవం
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న 67వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం లో నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో “ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు” సదస్సు ఘనంగా జరిగింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయపు ఉపకులపతి ఆచార్య డా. కె. పద్మరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని తమ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష, సాహిత్య వికాసాలకోసం జరుగుతున్న కృషిని సోదాహరణంగా వివరించారు.తానా పూర్వాధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, అంజయ్యచౌదరి లావు, ప్రస్తుత అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, ఉత్తరాధ్యక్షులు డా. నరేన్ కొడాలి, సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ సాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవం జరుపుకోవడంపట్ల హర్షాతిరేఖంతో శుభాకాంక్షలు, ఈ సాహితీ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు సమస్యలుండేవని, ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి వరకట్నం, మధు సేవ, చింతామణి, రక్త కన్నీరు, మా భూమి, పాలేరు లాంటి నాటకాలు, ప్రజా నాట్యమండలి, జననాట్య మండలి లాంటి సంస్థల ప్రభావం భూస్వామ్యుల, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకుల పోరాటం అయితే, తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమ గీతాలు, కళాకారుల ఆట పాటలు ప్రజా చైతన్యాన్ని తీసుకువచ్చాయన్నారు”.విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డా. గోరటి వెంకన్న, ప్రముఖ సినీగీత రచయిత డా. సుద్దాల అశోక్ తేజ, ‘తెలంగాణ రాష్ట్ర గీతరచయిత’ డా. అందెశ్రీ, సినీగీత రచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్, కళాభిమాని డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ప్రముఖ కవిశ్రీ గొడిశాల జయరాజు, గద్దర్ కుమార్తె డా. వెన్నెల గద్దర్, అరుణోదయ కళాకారిణి బండ్రు విమలక్క, బుర్రకథ కళాకారులు పద్మశ్రీ నాజర్ కుమారులు షేక్ బాబుజి (బుర్రకథ), ఏర్పుల భాస్కర్ (బైండ్ల గానం); డా. రవికుమార్ చౌదరపల్లి (ఒగ్గుకథ); పాతూరి కొండల్ రెడ్డి (యక్షగానం); దామోదర గణపతిరావు (జానపదగానం) మరియు చాట్రగడ్డ శ్రీనివాసుడు (డప్పువిన్యాసం) పాల్గొని ఎన్నో ఉదాహరణలతో చేసిన ఆసక్తికర ప్రసంగాలు, కళావిన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెద్వారా వీక్షించవచ్చును. -
ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రజాకార్’. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఈ సినిమాలోని ‘పోతుగడ్డ మీద..’ పాటను విడుదల చేశారు. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమంలో బాబీ సింహా మాట్లాడుతూ– ‘‘భీమ్స్‌గారి సంగీతం, సుద్దాల అశోక్తేజగారి సాహిత్యంలో ఏదో తెలియని భావోద్వేగం ఉంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కూడా మేం అంతే భావోద్వేగానికి లోనయ్యాం’’ అన్నారు. ‘‘సుద్దాల అశోక్‌తేజ, భీమ్స్గార్లు ఊరికే ఎమోషన్ కాలేదు. మా పూర్వీకుల చరిత్రలో అంతటి ఆవేదన నిండి ఉంది. భీమ్స్‌గారు పాడిన పాట వింటే పోతుగడ్డ మీద పుట్టిన భూమి బిడ్డల ఆత్మ ఘోషిస్తున్నట్లు ఉంటుంది’’ అన్నారు యాటా సత్యనారాయణ. ‘‘సుద్దాల హనుమంత, జానకమ్మల బిడ్డను కాకుంటే నా పాటలో ఇంత ఎమోషన్ ఉండేది కాదు. రజాకార్ ఉద్యమంలో మా అమ్మా నాన్న పాల్గొన్నారు. స్వాతంత్య్రం కోసం వారు నైజాంకు వ్యతిరేకంగా పోరాడారు. రజాకార్ ఉద్యమంలో ్రపాణాలు కోల్పోయిన కమ్యూనిటీ నుంచి వచ్చిన భీమ్స్ ఉండటం నాకు కలిసొచ్చింది. ఈ తరహా సినిమా తీయాలంటే డబ్బులు ఉంటే సరిపోదు.. ధైర్యం కావాలి. ఆ ధైర్యం గూడూరు నారాయణరెడ్డికి ఉంది’’ అన్నారు సుద్దాల అశోక్‌తేజ. ‘‘మా తాతగారు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ సమాజం ఎంత కష్టానికి గురైందో, ఎన్ని కన్నీళ్లను చూసిందో... వారందరి స్వరాలకు నేను స్వరాన్ని సమకూర్చానని చె΄్పాలి’’ అన్నారు భీమ్స్ సిసిరోలియో. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనుష్య త్రిపాఠి, కొరియోగ్రాఫర్ స్వర్ణ, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ పోతిరెడ్డి అంజిరెడ్డి పాల్గొన్నారు. -
ఈ పాట నా జీవితాన్ని మార్చేసింది: సుద్దాల అశోక్ తేజ
-
ఆ పాటకు ఎన్ని కష్టాలు పడ్డానో..!
-
అబ్దుల్ కలాం గారు నాతో ఒక మాట అన్నారు: సుద్దాల అశోక్ తేజ
-
సుద్ధాల అశోక్ తేజ రాసిన ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ సాంగ్ విన్నారా?
‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా.. మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘నీతోనే నేను’. అంజిరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమామిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం (టీచర్స్ డే) సందర్భంగా ఈ మూవీ నుంచి ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గొప్ప సమాజం రూప కల్పనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. అందుకనే వారిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తుంటారు. అలాంటి టీచర్స్‌కు అంకితమిచ్చేలా ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ పాటను రూపొందించారు.ప్రముఖ రచయిత సుద్ధాల అశోక్ తేజ ఈ పాటకు లిరిక్స్ అందించగా, ప్రముఖ సింగర్ మనో అద్బుతంగా ఆలపించారు. చిత్ర నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మంచి సమాజం కావాలంటే మనకు గొప్ప ఉపాధ్యాయులు కావాలి. టీచర్స్ వల్లే అది సాధ్యమవుతుంది. అలాంటి వారి గొప్పతనాన్ని తెలియజేసేలా మా సినిమాలో ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ పాట ఉంది. మంచి టీమ్ సపోర్ట్‌తో సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాం. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశాను. రామ్ అనే పాత్ర కూడా గవర్నమెంట్ టీచర్. అందులోని లోపాలను సరిదిద్దేక్రమంలో జరిగే కథే ఈ సినిమా’అని అన్నారు. ‘టీచర్స్ డే సందర్బంగా మా సినిమా నుంచి ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ పాటను విడుదల చేయటం ఆనందంగా ఉంది’అని డైరెక్టర్ అంజిరామ్ అన్నారు. -
కొత్త సినిమా లాంఛ్, గెస్టులుగా సుద్దాల అశోక్ తేజ, బొమ్మరిల్లు భాస్కర్
సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రాన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్, సుద్దాల అశోక్ తేజ ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హైదరాబాద్, కర్నూల్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. నరేంద్ర బుచ్చి రెడ్డిగారి నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ త్వరలో రిలీజ్ చేయనున్నారు. చదవండి: బికినీలో నిహారిక, ఫొటోలు వైరల్ రేవంత్‌కు శ్రీహాన్ వెన్నుపోటు పొడిచాడా? -
ఆ భావదారిద్య్రం రచయితలకు ఉండదు
ఒకటి మాతృభూమి పాట.. మరొకటి మాతృమూర్తి పాట... ఒకే సినిమాలోæవినపడిన ఈ రెండు పాటలూ భావోద్వేగానికి గురి చేశాయి. ‘ఆర్ఆర్ఆర్’లో సుద్దాల అశోక్‌తేజ రాసిన ‘కొమురం భీముడో, కొమ్మా ఉయ్యాలా’ పాటలవి. ఇవే కాదు.. 28 ఏళ్ల కెరీర్లో 2600 సినిమా పాటల ద్వారా దేశభక్తి, ఆనందం, ప్రేమ, బాధ... ఇలా మనిషి తాలూకు ప్రతి ఎమోషన్ని ఆవిష్కరించారు సుద్దాల అశోక్ తేజ. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోక్ తేజ చెప్పిన విశేషాలు. ► ఈ బర్త్ డే స్పెషల్ అంటే ముందుగా ‘ఆర్ఆర్ఆర్’ గురించే మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి మీరు రాసిన ‘కొమురం భీముడో, కొమ్మా ఉయ్యాలా’ రెండూ హిట్. ఈ పాటల గురించి మీ అనుభవం? సుద్దాల అశోక్ తేజ: నేనిప్పటి వరకూ రాజమౌళిగారి సినిమాలకు పాట రాయలేదు. విజయేంద్రప్రసాద్‌గారి ‘రాజన్న’ కి పాట రాశా. ఆ కథలో మా నాన్నకి (సుద్దాల హనుమంతు) సంబంధించిన జీవితం ఉంది. తెలంగాణ, నైజాం పోరాటంలో మా నాన్న, అమ్మ పాల్గొన్న ఘట్టాలు చెబుతూ ఒకానొక సన్నివేశం గురించి ఓ సందర్భంలో విజయేంద్ర ప్రసాద్‌గారికి చెప్పాను. దానికి ఆయన బాగా కనెక్ట్ అయిపోయి ఒక కథ తయారు చేశారు.. అదే ‘రాజన్న’ సినిమా. మా నాన్న జీవితంలో జరిగిన సన్నివేశానికి రాజమౌళిగారు ఓ పాట (వెయ్ వెయ్ దెబ్బకు దెబ్బ) నాతో రాయించారు. మా ఇద్దరి మధ్య ఉన్న తొలి పాట అనుబంధం అది. ‘ఆర్ఆర్ఆర్’ కోసం రాజమౌళిగారు పిలిపించి, ఎన్టీఆర్‌ని (కొమురం భీమ్ పాత్ర) ఆంగ్లేయులు శిక్షించే సందర్భంలో వచ్చే పాట రాయమన్నారు. ఈ పాటలో హీరో తనకు తానే ధైర్యం చెప్పుకుంటే బాగుంటుందన్నాను. కానీ, కీరవాణిగారు ‘మీరు పాట రాయండి.. ఆ తర్వాత ట్యూన్ ఇస్తాను’ అన్నారు. మూడు రిథమ్స్‌లో పాట రాసుకుని వెళ్లా. వాటిల్లో సినిమాలో ఉన్న పాట స్టైల్ అందరికీ నచ్చడంతో రాజమౌళిగారు అదే ఫైనల్ చేశారు. ఇక ‘కొమ్మా ఉయ్యాలా..’ గిరిజన బాలిక పాడే పాట. ఆ అమ్మాయి తల్లికి ఎంత కనెక్ట్ అయి ఉందో అని ఈ పాటలో చెప్పాం. ఆ అమ్మాయి జైలులో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కూడా తనకి భరోసా ఇస్తూ ఓ పాట పాడతాడు.. కానీ, నిడివి ఎక్కువ అయిందని ఆ పాట తీసేశారు. ఆ పాట కూడా నేనే రాశాను. ‘కొమురం భీముడో..’ పాట మాతృభూమితో, ‘కొమ్మా ఉయ్యాలా’ పాట మాతృమూర్తితో సంబంధం ఉన్నవి కాబట్టే ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ► మీ ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఇది. ఈ ట్రెండ్ రచయితలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? పాన్ ఇండియన్ సినిమా అని ఎక్కువ ఆలోచించి, ఓటీటీ సినిమాకి రాస్తున్నామని తక్కువ ఆలోచించి పాటలు రాసే భావదారిద్య్రం రచయితలకు ఉండదు. స్టార్ హీరోనా, కొత్త హీరోనా, స్టార్ డైరెక్టరా, కొత్త డైరెక్టరా? అని కాకుండా ఇచ్చిన సన్నివేశానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి? అని మాత్రమే రచయిత ఆలోచిస్తాడు. ► పాట మనిషి తేజస్సును పెంచుతుంది అంటారు. మీలోని తేజస్సుకు పాటే కారణమా? నిజమే.. పాట పసివాడిగా చేస్తుంది.. పడుచువాడిగానూ చేస్తుంది. వృద్ధాప్యం అనేది శరీరానికి సంబంధించినది కాదు.. ఆలోచనలకు సంబంధించినది. కొత్తదనం ఇవ్వాలనే తపన, తపస్సు వల్ల మనుషుల్లో కనిపించే తేజస్సు వేరుగా ఉంటుంది. ► రెండేళ్ల క్రితం మీకు లివర్ ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. మీరు ఊపిరి పోసిన మీ అబ్బాయి మీకు ఊపిరి పోయడం గురించి..? జన్మనిచ్చిన పుత్రుడే (అర్జున్ తేజ) తిరిగి నాకు జన్మనివ్వడం నా జీవితంలో జరిగిన ఒక ఊహించని ఘటన. లివర్ ప్లాంటేషన్‌కి ఎవరూ ముందుకు రాక చనిపోయిన వారిని నేను చూశా. నా అదృష్టం ఏంటంటే.. నా కూతురు, నా కుమారులు లివర్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. కానీ వయసులో చిన్నోడు కాబట్టి అర్జున్ తేజని డాక్టర్లు సెలక్ట్ చేసుకున్నారు. మే 23కి ఆపరేషన్ జరిగి రెండేళ్లు అవుతుంది.. అలా కొడుకే తండ్రి అయిన సన్నివేశం నా లైఫ్‌లో జరిగింది. ► పాట సాహిత్యాన్ని శబ్దం డామినేట్ చేస్తున్న ఈ పరిస్థితి గురించి ఏమంటారు? నిజమే.. 1980 నుంచే ఆ ట్రెండ్ ఉంది. అక్షరాలతో కూడుకున్న దాన్నే పాట అంటారు. సంగీతం కలిసిన సాహిత్యమే గీతం. అలాంటిది అక్షరాలు వినిపించకపోతే మాకు ఎందుకు సంతోషం ఉంటుంది? నేను బాధపడ్డ క్షణాలు కొన్ని లక్షలుంటాయి. శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. అయితే కీరవాణిగారి సినిమాల్లో ప్రతి పాట అందరికీ వినిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఎవర్నీ తప్పుబట్టలేం.. ఎవరి ట్రెండ్ వారిది. ► మీ తల్లితండ్రుల పేరుతో ఇస్తున అవార్డు గురించి... మా తల్లితండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మల పేరుతో ఓ ఫౌండేషన్ స్థాపించాను. మా నాన్నగారి పేరుతో గత పదేళ్లుగా జాతీయ పురస్కారం ఇస్తున్నాను. ► రచయితగా మీ నాన్న వారసత్వాన్ని మీరు తీసుకున్నారు.. మరి మీ వారసత్వాన్ని ఎవరు తీసుకున్నారు? పాటల విషయంలో నా వారసత్వాన్ని ఎవరూ తీసుకోలేదు.. కాకపోతే మా అమ్మాయి మాత్రం సంగీతం నేర్చుకుంది.. డిప్లొమా పాస్ అయింది. అమెరికా, లండన్‌లోని పిల్లలకు ఆన్లైన్లో సంగీత పాఠాలు చెబుతుంటుంది. ఒకరకంగా ఆమె నా బాటలో ఉన్నట్లు అనిపిస్తుంది. పాట నా జెండా.. కవిత్వం నా ఎజెండా.. శిఖరం నా నిచ్చెన లోయ నా విశ్రాంతి శయ్య ఓటమి నా ఆలోచనా మందిరం గెలుపంటారా.. చిన్న మలుపు మాత్రమే – సుద్దాల అశోక్‌తేజ -
సారంగదరియా, ఇది మామూలు క్రేజ్ కాదయా..
యూట్యూబ్‌ను షేక్ చేసిన సాయిపల్లవి సాంగ్స్ అనగానే అప్పట్లో రౌడీ బేబీ, ఇప్పట్లో సారంగదరియా పాటలే గుర్తొస్తాయి. ఈ పాటల్లో మత్తుందో, సాయి పల్లవి స్టెప్పుల్లో కిక్కుందో తెలీదు గానీ ఇవి రెండూ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్‌స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట తాజాగా యూట్యూబ్‌లో 200 మిలియన్ల వ్యూస్ సాధించింది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను మంగ్లీ ముగ్ధ మనోహరంగా ఆలపించింది. తెలంగాణ జానపదానికి తోడు పవన్ అద్భుత సంగీతం తోడవ్వడంతో ఈ పాట తక్కువ సమయంలోనే లక్షలాది మందిని ఆకర్షించింది. ఫిబ్రవరి 28న రిలీజైన ఈ పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు సాధించి 'అల వైకుంఠపురములో' చిత్రంలోని బుట్టబొమ్మ, రాములో రాములా పాటల పేరిట ఉన్న రికార్డులను తిరగరాసింది. 32 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఏకంగా 200 మిలియన్ల వ్యూస్ మైలురాయిని అందుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించారు. #SarangaDariya from #LoveStory is now the fastest 200 million+ viewed Lyrical in Tollywood 🔥💃🔥 ►https://t.co/4Q16GiS2er@chay_akkineni @sai_pallavi92 @sekharkammula @pawanch19 #Suddalaashokteja @iamMangli @SVCLLP @AsianSuniel #AmigosCreations @adityamusic @GskMedia_PR pic.twitter.com/XTsJ40od1z — Aditya Music (@adityamusic) May 24, 2021 చదవండి: మూడేళ్లలో రూ.5 కోట్లు పోగొట్టుకున్న సాయి పల్లవి! ‘సారంగ దరియా’ సాంగ్ తెలుగు లిరిక్స్.. మీ కోసం -
‘సారంగ దరియా’ సాంగ్ తెలుగు లిరిక్స్.. మీ కోసం
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదటిగా ఈ మూవీలోని ‘నీ చిత్రం చూసి’ అనే పాటను విడుదల చేశారు. ఆ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల మరో పాట ‘సారంగ దరియా’ను చిత్రం బృందం విడుదల చేయగా.. ఆ పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రేక్షకుల మదిలో మారుమోగుతున్న ‘సారంగ దరియా’ పాట లిరిక్స్ మీ కోసం.. పల్లవి: దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా.. దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా చరణం: కాళ్ళకు ఎండీ గజ్జెల్.. లేకున్నా నడిస్తే ఘల్ ఘల్.. కొప్పులో మల్లే దండల్.. లేకున్నా చెక్కిలి గిల్ గిల్.. నవ్వుల లేవుర ముత్యాల్.. అది నవ్వితే వస్తాయ్ మురిపాల్.. నోట్లో సున్నం కాసుల్.. లేకున్నా తమల పాకుల్.. మునిపంటితో మునిపంటితో.. మునిపంటితో నొక్కితే పెదవుల్.. ఎర్రగా అయితదిర మన దిల్ చురియా చురియా చురియా.. అది సుర్మా పెట్టిన చురియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా !! దాని కుడీ భుజం!! చరణం: రంగేలేని నా అంగీ.. జడ తాకితే అయితది నల్లంగి మాటల ఘాటు లవంగి.. మర్లపడితే అది శివంగి తీగలు లేని సారంగి.. వాయించబోతే అది ఫిరంగి గుడియా గుడియా గుడియా.. అది చిక్కీ చిక్కని చిడియా.. అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా.. దాని సెంపలు ఎన్నెల కురియా.. దాని సెవులకు దుద్దులు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా దాని నడుం ముడతలే మెరియా.. పడిపోతది మొగోళ్ళ దునియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా.. దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా చిత్రం : లవ్ స్టోరీ సంగీతం : పవన్ సీహెచ్ రచన: సుద్దాల అశోక్ తేజ గానం : మంగ్లీ -
సారంగదరియా నాతో పాడించలేదు: కోమలి భావోద్వేగం
ప్రేక్షకుల టేస్ట్ మారింది. సినిమాలోని మాస్ సాంగ్స్ కన్నా యూట్యూబ్‌లో వచ్చే జానపదాలకే జై కొడుతున్నారు. ఫలితంగా లక్షలాది వ్యూస్‌తో జానపద పాటలు మరోసారి ప్రాణం పోసుకుంటున్నాయి. దీంతో వీటికి సినిమాల్లోనూ స్థానం కల్పిస్తున్నారు. అయితే మొదట పాడినవాళ్ల దగ్గర నుంచి అనుమతి తీసుకోవడమే కాక వారికి క్రెడిట్స్ ఇవ్వాల్సిందే. లేదంటే చిక్కులు తప్పవు. తాజాగా లవ్ స్టోరీ సినిమాలో సూపర్ డూపర్ హిట్టైన 'సారంగ దరియా..' పాట మీద కూడా ఇలాంటి వివాదమే మొదలైంది. పల్లెల్లో ఉన్న ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చింది తానేనంటూ మీడియా ముందుకొచ్చింది కోమలి. అమ్మమ్మ దగ్గర నుంచి ఈ పాట నేర్చుకున్నాని, కానీ ప్రజలకు చేరువ చేసింది తాను కాబట్టి ఈ సాంగ్ తన సొంతమని చెప్తోంది. "రేలారే రేలా ప్రోగ్రాం సమయంలో సుద్దాల అశోక్‌తేజ నా పాట విన్నారు. లవ్ స్టోరీలో ఈ పాటను వాడుకున్నారని తెలియగానే అశోక్ తేజకు ఫోన్ చేశాను. ఇది ఎవరి సొంతం కాదు, నువ్వు పుట్టకముందే ఈ పాట నా దగ్గరుంది అని చెప్పాడు. కానీ ఈ పాటను ఆయన ఎప్పుడూ వెలుగులోకి తీసుకురాలేదు. సినిమాలో ఈ పాట నాతో పాడించనందుకు బాధేసింది. నా బాధను చూసి నాకు నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తానని శేఖర్ కమ్ముల హామీ ఇచ్చారు. కానీ సారంగరదరియా నాతో ఎందుకు పాడించలేదు? ఎందుకు అవకాశమివ్వలేదు? ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు అనేదే నా బాధ" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కాగా ఈ పాట సేకరించింది కోమలి అని సుద్దాల అశోక్ తేజ సైతం అంగీకరించాడు. చదవండి: తస్సాదియ్యా! నాగచైతన్య సినిమాకు అంత బిజినెస్సా? -
రైతు బంద్
గోధుమ ధుమధుమ లాడుతూ– కేంద్ర దుశ్శాసన పర్వాలు ధూళిలో కలవాలని శపిస్తుంది. వరి గొలుసులు తెంపుకున్న వడ్లు ఒడ్లు– వరాలు తెంచుకుని– ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు దిక్కులే మాకు షెడ్లు అంటున్నాయ్ పత్తి– పాలకుల ప్రవృత్తి చూళ్లేక శ్వేత రక్తం వాంతి చేసుకుంటుంది కంది– చలికి దగ్గుతూ కళ్లెలు– కళ్లెలుగా ఖాండ్రించి ఉమ్ముతుంది. మిరప– మిరియం కలిసి కారాలు నూరుతున్నై బియ్యం– పప్పు, ఉప్పు వంటి వంటింటి దినుసులు రోడ్లమీద కడుపు మండి కుత కుత ఉడికిపోతున్నై అధికార భవన భోజన పదార్థాలు పాలకుల పులినోట్లోకి వెళ్ళడం జన్మ జన్మల పాపంగా విలపిస్తున్నై పవర్లో ఉన్న నేతల్ని చుట్టుకొనివున్న సూట్లు కుర్తాలు ధోతులూ పంచెలు చీరలు అనకొండల్ని చుట్టుకున్నట్టు అనునిమిషం చిరచిరలాడుతూ ఛీత్కరించుకుంటున్నాయి ఏడు డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత ఉగ్రత కొని తెచ్చుకోలేక తన్నుతాను అసహ్యించుకుంటుంది కురుస్తున్న మంచు నేను నేలకు రాలిపోయేవేళ ఎందుకొచ్చారు బిడ్డలారా అంటూ పశ్చాత్తాపంతో కరిగి కన్నీటి చిమ్మై తప్పు మన్నించమని రైతుల పాదాల్ని ముద్దుపెడుతుంది రోడ్లమీద కొచ్చిన రైతులకోసం ప్రాణంలేని ట్రాక్టర్లు ఇళ్ళుగా మారి రైతుల్ని కడుపులో దాచుకుంటున్నై ఏలెటోని మీద నేల ఎత్తి ఏడు దోసిళ్ళ మన్నుపోస్తుంది ఎగ్గు సిగ్గులేని ఏలికలు పట్టపగ్గాల్లేని పాలకులు చర్చలమీద చర్చలకు రమ్మంటూ ‘రమ్మి’ ఆట ఆడుకుంటున్నారు మీరు పెట్టే బిచ్చపుకూడు తినమని రైతులు తమ చద్దులు తామే తింటున్నా కూడా లజ్జా– మానం– శరం లేని అధికారం రైతులు కోరిన కార్పొ‘రేట్’ చట్టాలు రద్దుచేయడం లేదు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేరకం కదా గుద్దే నైజం – అందుకే ఢిల్లీలో రైతుల అడుగుల ధ్వని లండన్‌లో రాస్తారోకో చేస్తుంది ఈ రోజు దేశం ఆకాశపు టంచుల్లో నిలుచున్న ధిక్కార పతాక సన్నివేశం వ్యాసకర్త డాక్టర్ సుద్దాల అశోక్ తేజ కవి, సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత -
అతడో...మాటల మంత్రశాల
పాటల నెలరేడు, పాటల చెలికాడు, పాటల విలుకాడు.. అసలు పాటల ‘కల’వాడు బాలుగారు. నిజానికి నిజమైన బాలుగారి జీవితం ఇప్పుడు ప్రారంభమైంది. భౌతిక రూపం అదృశ్యమై జ్ఞాపక రూపం దృశ్యమానమవడం మొదలైంది. బాలూ సర్ లైఫ్ స్టార్టెడ్ నౌ... బాలుగారి గానం విశ్వలీనమై విశ్వగానం మారింది. పాట ప్రేమికులారా వినపడుతుందా. కళ్లు తెరిస్తే బాలు విషాద అంతిమయాత్ర దృశ్యం. కళ్లు మూసుకుంటే బాలు విశ్వగానాలాపనా దృశ్యం. కారణజన్ముల మరణమంటే కళ్లముందు దీర్ఘ శయ్యపై పడుకోవడం కాదు. గుండె గుండెలో మేల్కోవడం... మరణ భవంతిలోకి పోవడంకాదు. జ్ఞాపకాల జనన స్రవంతిలోకి రావడం కదా మరణమంటే.. బాధోంకి బర్సాతే కాదూ యాదోంకి బారాత్ కూడా.. ఒక్కసారే కోట్ల హృదయాల్లో మేల్కోవడం ఒక్కడికి సాధ్యమవుతుందా. హంస ఎగిరిపోయాక కూడా ఈ ఒక్కడికే సాధ్యమైంది. డెబ్బె నాలుగేళ్ల జీవన మధురిమలో యాభై నాలుగేళ్ల సరిగమ. యాభై నాలుగేళ్ల పరిశ్రమంలో యాభై ఆరక్షరాల పరాక్రమం. ఒకేరోజు 21 కన్నడ పాటల రికార్డింగ్, 19 తమిళ పాటలు మరో రోజు హిందీలో 16 పాటలు పాడటం గాయకమాత్రులకు సాధ్యమా. గంధర్వ గాత్రుడికది సుసాధ్యమైంది. సులభసాధ్యమైంది. తొలి తొలి తొలకరి రోజుల్లోనే మహానటుడు, మహా నాయకుడు ఎంజీఆర్ బాలుగారితో పాడించటానికి మూడువారాలు నిరీక్షించడం జరుగుతుందా? జరిగి తీరింది బాలు గంధర్వుడికి. అది ఎంజీఆర్ సహృదయమైనా బాలుగారికి సాక్షాత్ సరస్వతీ ఆశీర్వాదం కదా. మహర్జాతకుడు. కఠోరదీక్షాపరుడు. సమయ నిబద్ధుడు, అనన్యసామాన్య ప్రతిభావం తుడు బాలు. ఆయనకే చెల్లింది. తన పూజా మందిరంలో తన పాటే ప్రార్ధన కావడం. తన అంతిమయాత్రలో తనను తనపాటే సాగనంపడం ఎవరికి జరిగింది? ఏ గుడికెళ్లినా తన పాటే నివాళిగా ఉంది. దాదాపు 11 భాషల్లో 37 వేల పైగా పాటలు పాడటం మధుర గేయాలు పాడేవేళ పాటల నెలరేడు, పాటల చెలికాడు.. రుధిర గేయాలు పాడేవేళ పాటల విలుకాడు. అగ్ని కురిపించినా.. అమృతం ఒలికించినా అశ్రుధార వర్షించినా ఆ శ్వేత మేఘం బాలు కంఠం. ‘చూడు పిన్నమ్మా’ అన్న గొంతు వేయి గొంతుకల విప్లవ శంఖమైంది. విశాల గగనంలో చంద మామ అన్న గళం అగ్నినేత్ర మహోగ్ర జ్వాలా నిగళమై నాకు జాతీయ పురస్కార మందించింది. పాటల విశ్వరూపమతడే. మాటల విశ్వవిద్యా లయమ తడే. పాట గురించి చెబుతున్నపుడు పాటల పాఠశాల అతడే. మాటల మానవ సంబంధాల గురించి చెబుతున్నపుడు మాటల మంత్రశాల అతడే... అమృతం ఆయన స్వరభాష. వినమృతం ఆయన శరీర భాష. కృతజ్ఞత ఆయన జీవన పర్యంత భాష. శబరిమలకు వెళ్లినప్పుడు తనను డోలీలో మోసుకెళ్లిన కూలీలకు పాదాభివందనం చేయడం. సభ జరిపే వారికి ‘నా పేరుకు ముందు డాక్టర్–పద్మ భూషణ్ గానగంధర్వ ఇలా విశేషణాలు పెట్టొద్దని లేఖ రాయడం. నేనోసారి పాడుతా తీయగాలో ఒక పక్షి జీవిత కాలంలో ఎప్పుడూ నేలపై కాలూనదు. అందుకే ఆ పక్షిని భారతీయ ధ్వజంగా భావించి భరద్వాజ పక్షి అంటా రని చెబితే చేతులు జోడించి ‘నిజంగా ఈ విషయం నాకు తెలియదు తేజాగారూ’ అనడం. ఏ కృతజ్ఞత, వినమ్రతా విభాగం లోకి వస్తుందో.. బాలుగారిని అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాను. వీలు కాలేదు. ఇప్పుడు అసలు వీలు కాదుగా. ఎన్నో నేర్చుకున్నాం తన నుండి. తెలుగు భాష– తెలుగు శ్వాస– తెలుగుపై ఆశ. తన ‘పాడుతా తీయగా’ పాఠశాల (పాటశాల)లో ఎన్ని కొత్త గొంతుకలు ప్రాణం పోసుకున్నాయి. పాఠాలు నేర్చు కున్నాయి. ఇంతవరకు ఏ గాయకుడిలా ‘ఆచార్య’ పాత్ర పోషించాడు. ఏ మైకెల్జాక్సన్, ఏ మహ్మద్రఫీలు చేయగలిగారు. ‘పాడుతా తీయగా’ తరతరాలకు చెరిగిపోని స్వర విశ్వవిద్యాలయంగా సుస్థిరం చేసి వెళ్లిపోయాడు. ఎక్కడికెళ్లాడు. తెలుగుభాషా భారతి ‘కంఠాభరణం’గా యాభైనాలుగు సంవత్సరాలు మెరసి ఇపుడు స్వర్గలోక భారతీ ముంజేతి కంకణంగా మారడానికి వెళ్లిపోయాడు. అక్కడ గంధర్వ బాలబాలికలకు సినారేను ముఖ్య అతిథిగా కూచోబెట్టి తెలుగు పాట నేర్పించడానికి ‘పాడుతా తెలుగు పాట తీయగా’ కార్యక్రమ నిర్వహణకు వెళ్లాడు. నారద తుంబురులకు కనువిందుగా వీనుల విందుగా అచ్చెరువుగా.. అల్విదా బాలుగారు. అక్కడ నిరంతరం మీ గాన అధ్యాపనం సాగించండి. ‘ఏ కరోనా’ ఢరోనాలు అక్కడ లేవు. ‘తెలుగు పాట గ్యారంటీ’... వ్యాసకర్త: సుద్దాల అశోక్‌తేజ, ప్రముఖ సినీ గీత రచయిత, జాతీయ అవార్డు గ్రహీత -
కవి మనసు ఖాళీగా ఉండదు
‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను...’ (‘ఠాగూర్’ సినిమా) పాటతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న రచయిత సుద్దాల అశోక్‌తేజ. ఇటీవల ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకొచ్చాయి. వాటి గురించి అశో క్‌తేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య మీడియాలో నేను పోయానని ఒకరు, విషమంగా ఉన్నానని మరొకరు మాట్లాడుతున్నారు. అవన్నీ పుకార్లే. నాకు ఆపరేషన్ జరిగి దాదాపు 47 రోజులైంది. చక్కగా కోలుకుంటున్నాను. నేను బావుండాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి మామూలు మనిషి అవ్వాలని ఎంతోమంది స్నేహితులు, బంధువులు కోరుకున్నారు. అనారోగ్యం శరీరానికే కానీ, కవి మనసుకు కాదు. అది ఖాళీగా ఉండలేదు. అందుకే నేను ఈ అనారోగ్యం, కరోనా టైమ్‌లో కూడా రాస్తూనే ఉన్నాను. గతంలో నేను ‘శ్రమకావ్యం’ అని రాశాను. ఇప్పుడు ‘అరణ్య కావ్యం’ రాస్తున్నా. 70 నుండి 80 అధ్యాయాలు ఉండే పెద్ద కవిత ఇది. దాని పేరు ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’. అడవి వల్ల ప్రపంచానికి ఎంత మేలు జరిగింది? అలాంటి అడవిని ఎన్ని రకాలుగా హింసించారు? అనే విషయాలను ప్రస్తావిస్తూ అడవి తన గోడు వెళ్లబోసుకుంటుంది. అడవి హింసించబడటం వల్ల అనేక ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఆçస్పత్రిలో చేరకముందు, ఆపరేషన్ అయిన మూడో రోజు నుండే నేను ఈ కవితను రాస్తూ బిజీగా ఉన్నాను. ఇవికాకుండా నూతన నటీనటులతో వస్తున్న ‘సతి’ అనే సినిమాకి పాట రాశాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాపై ఏమైనా రూమర్స్ వస్తే నమ్మొద్దని అందరికీ తెలియజేసుకుంటున్నాను’’ అన్నారు. -
ఆరోగ్యంపై స్పందించిన అశోక్ తేజ
హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించారు. తను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు. ఆరోగ్యం విషమించిందనే వార్తల్లో నిజం లేదని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘మిత్రులకు, శ్రేయాభిలాషులకు, పాట అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి నమస్కారం. మీ అందరి ప్రేమ వల్ల, ప్రభుత్వ సహాయ, సహకారాల వల్ల కాలేయ మార్పిడి చికిత్స అనంతరం.. రోజురోజుకు కోలుకుంటున్నాను.(చదవండి : నిర్మాతగా మారిన మెగాస్టార్ కుమార్తె) ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. మళ్లీ పాటలు రాస్తున్నాను. కరోనా నేపథ్యంలో అందరిలాగే జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నా ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే అశోక్ తేజ ఆరోగ్యం విషమంగా ఉందని కొన్ని వార్తలు వినబడుతున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు’ అని తెలిపారు. -
ఆరోగ్యంపై స్పందించిన అశోక్ తేజ
-
సుద్దాల అశోక్ తేజకు శస్త్రచికిత్స.. !
హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలిలోని ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. అయితే ఆపరేషన్ నిమిత్తమై ఆయనకు బీ నెగిటివ్ రక్తం అవసరం ఉన్నట్టుగా సమాచారం. ఈ విషయాన్ని ఆయన స్నేహితులు ధ్రువీకరించారు. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దిశ చట్టం తెచ్చిన సీఎం జగన్‌కు జేజేలు
సాక్షి, నెల్లూరు (వేదాయపాళెం): మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టం తీసుకురావడం ఎంతో శ్లాఘనీయమని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి చట్టం తీసుకువచ్చిన సీఎం జగన్‌కు జేజేలు పలుకుతున్నట్లు చెప్పారు. ఇలాంటి చట్టాన్ని అన్ని రాష్ట్రాలు తీసుకువచ్చి, అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతికోత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం నెల్లూరు వచ్చారు. అక్కడ విలేకర్లతో మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన దిశ ఘటన నేపథ్యంలో 21 రోజుల్లో నేరస్తులను శిక్షించడానికి ఏపీలో దిశ చట్టం తీసుకురావడం గొప్ప విషయమన్నారు. -
‘ఆర్ఆర్ఆర్’ మరో ఇంట్రస్టింగ్ అప్డేట్
బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్(వర్కింగ్ టైటిల్). మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటి వరకు కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే ప్రకటించిన ఆర్ఆర్ఆర్ టీం అంతకు మించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కనీసం హీరోయిన్ల పేర్లను కూడా ప్రకటించలేదు. తాజాగా ఈసినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణీ సోషల్ మీడియా ద్వారా బయట పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్లోని ఓ పాటకు సుద్ధాల అశోక్ తేజ సాహిత్య అందిస్తున్నట్టుగా వెల్లడించారు కీరవాణి. పోరాట స్ఫూర్తిని రగిల్చే పాటలు రాయటంలో అశోఖ్ తేజకు మంచి పేరుంది. గతంలో చిరంజీవి ఠాగూర్ సినిమా కోసం రాసిన నేను సైతం పాటకు జాతీయ అవార్డును కూడా అందుకున్నారు అశోక్ తేజ. Suddala Ashokteja garu started writing lyrics for RRR . He is amazingly fast and at the same time brilliant 🙏 — mmkeeravaani (@mmkeeravaani) 13 March 2019 -
‘సంక్రాంతి అంటే అదే’
సంక్రాంతికి కవులు పదాలను పతంగులుగా చేసి ఎగురవేస్తారు. పద్యాలను ఇళ్ల ముందరి ముగ్గుల వలే అందంగా తీర్చిదిద్దుతారు. పాటలను బాణీకట్టి ఆడపిల్లల కిలకిలలకు జోడు కడతారు. కవులు సంక్రాంతి వస్తే పాతభావాలను భోగిమంటల్లో వేసి దగ్ధం చేయమంటారు. కొత్త చైతన్యాన్ని గడపలకు తోరణాలుగా కట్టమంటారు. కళలు వెల్లివిరిసే సమాజమే సంతోషకరమైన సమాజం. కవులు సమాజ శ్రేయస్సు ఆకాంక్షిస్తారు. సమాజం కవుల వాక్కుకు చప్పట్లు అర్పించాలి. అభ్యుదయమే అసలైన క్రాంతి. పురోగమించడమే అసలైన సంక్రాంతి. స్వాగతం మంచు పరచిన దారి మళ్లివెలుగు వెచ్చని బాటలోకి అడుగుపెట్టే రవికిరణమా సంక్రాంతి ఆభరణమా స్వాగతం హరివిల్లు రంగుల ముగ్గులన్నీ పరచి వాకిట తేనెలొలికే పలుకు తీయని స్వాగతం పాడిపంటలు పచ్చదనమై ఆడిపాడే పల్లె వెలుగై నిదుర మబ్బులు మేలుకొలిపే పల్లె సీమల పాట స్వరమై భోగి వెలుగుల జిలుగు మంటలపాతనంతా ఆహుతంటూ పలుకు తీయని స్వాగతం పిల్లపాపలనెల్లకాలం పదిలమంటూపసిడి పంటల పరిమళాలను జల్లుజల్లుగ భోగిరోజున పళ్ళు పూలై తలతడిమి జారే దీవెనలుగా ఆశీస్సులన్నీ అడుగుఅడుగున వెన్నంటి నిలిచే చిలక పలుకుల స్వాగతం. రాతిరంతా వెలుగు మడుగై వేలికొసలన రంగు రూపై కొత్త చిత్రపు ముగ్గు మధ్యన పూలరెక్కల పాన్పుపై గౌరీ దేవిగపూజలందే ప్రాణదాతకు ప్రకృతికి గొంతువిప్పిన గొబ్బిపాటల స్వాగతం పాతకొత్తల మేలుకలయిక గంగిరెద్దుల నాట్య హేలకు సన్నాయి రాగం డోలు శబ్దం నింగికెగసే గాలి పటమైహరిలోరంగహరీ అక్షయపాత్రన వెలిగే దక్షత నింగే నేలై తెలిపే స్వాగతం విందు వినోదం ఆహ్లాదంపితృదేవతల పరమార్థం జంతు సేవలకు తీర్చు ఋణం అతిథి దేవులకు ఆడబిడ్డలకు వెచ్చని మమతల ప్రతిరూపం మాటమాటనా మరువపు మొలకల స్వాగతం. – సుద్దాల అశోక్‌తేజ సమైక్య క్రాంతి పండగ వస్తుంది.. వెళుతుంది. ప్రతి పండగనీ మనం చేసుకుంటాం. అయితే అర్థాన్ని తెలుసుకుని చేసుకుంటున్నామా? లేదా? అన్నది ముఖ్యం. కొత్త బట్టలు, పిండి వంటలు ఇవి ఎలానూ ఉంటాయి. వాటితో పాటు సంక్రాంతి తాలూకు అర్థాన్ని పిల్లలకు చెప్పాలి. పుష్యమాసంలో పంట ఇంటికి వస్తుంది. ‘నేను తినడానికి ముందు సమాజంలో ఉన్నవాళ్లకు నా వంతుగా ఇస్తా’ అనే సంప్రదాయం ఏదైతే ఉందో అదే సంక్రాంతి అంటే. సమైక్య క్రాంతి అని అంటాం. అంటే ఒక మంచి మార్పు. మనది పల్లెటూరు బేస్ అయిన సంస్కృతి కాబట్టి పంట ఇంటికొచ్చే రోజు ప్రత్యక్షంగా వస్తువు ఉత్పత్తి చేయకపోయినా మానసిక వికాసానికి తోడ్పడే కళల మీదే జీవనాధారంగా బతుకుతున్నవాళ్లకు ధాన్యం కొలిచి ఇవ్వడం సంక్రాంతి. ఇది చేయడానికి రాజులే అవ్వాల్సిన అవసరంలేదు. ఎవరైనా చేయొచ్చు. భోగి మంటలు, గొబ్బెమ్మలు, ఇలా సంప్రదాయబద్ధంగా చేసుకుంటాం. అమెరికాలాంటి దేశాల్లో స్థిరపడ్డవాళ్లకు కొంచెం ఇబ్బందే. ఎందుకంటే అమెరికాలో పేడతో పనులు చేయడం అనేది శుభ్రం కాదని వాళ్లు ఒప్పుకోరు. మీరు అమెరికాకు పోవద్దు. వెళితే అమెరికాకు తగ్గట్టే ఉండాలి. సంక్రాంతి వచ్చినప్పుడు ఏదో చట్టవిరుద్ధమైన పని చేస్తున్నట్లు రహస్యంగా పేడ సేకరించి తలుపులేసుకుని, గొబ్బెమ్మలు పెట్టి, ఇంగ్లిష్ మాట్లాడే మీ పిల్లలకు పట్టు లంగాలు తొడిగి ‘బొహియల్లో.. బొహియల్లో..’ అని తిప్పకండి. సంక్రాంతి పండగ అర్థం చెప్పండి. ఎలక్ట్రికల్ భోగి మంట వేసుకుంటున్నారు. కానీ ఆ భోగి మంట అర్థం పిల్లలకు చెప్పండి. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లందరూ ఆ రోజు ఒకచోట కలవండి. అవసరమైనవాళ్లకు ఇవ్వండి. అంతేకానీ పేడ చుట్టూ తిరగక్కర్లేదు. నా బాల్యంలో సంక్రాంతి గురించి చెప్పాలంటే.. ఉత్సాహం కలిగించే పండగల్లో ఇదొకటి. సంక్రాంతి అంటే భోగి మంట. భోగి మంట అంటే ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ ఎక్కడ నిప్పుల్లో పడేస్తామో అని పెద్దవాళ్లు కంగారు పడేవాళ్లు (నవ్వుతూ). – సిరివెన్నెల అందుకే ఈ పండగంటే ఇష్టం సంక్రాంతి అనగానే చక్కనైన ముగ్గులు చూసి చుక్కలన్నీ చాటుకుపోయే వేకువ సన్నివేశం. కలశంతో పొద్దున వచ్చే తులసీదాసుల హరి కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, సన్నాయి మేళాలు, నవధాన్యాల పిండి వంటలు, అల్లుళ్ల సందడి, ఆడబిడ్డల వైభోగం, కోడి పందెం, యెద్దుల పరుగులు, రచ్చబండల యక్షగాన రూపకాలు, హేమంతపు గాలులు, వెన్నెల రాత్రులు, ఎల్తైన పంట రాశులు, వాగునీట యెద్దుల ఈతలు, లేగ మెడలో మువ్వల గంటలు, రేగిపండ్లు, పిండిపూలు, పసుపు కుంకుమల గొబ్బెమ్మలు, ఆహ్లాదం, ఆనందం... ప్రకృతి యెడల భక్తిభావం... ఇలాంటి మంచి పండగ అంటే నాకు చాలా ఇష్టం. కారణం.. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. వ్యవసాయానికి, గ్రామీణ జీవితానికి శోభాయమానంగా ఉండే పండగ కాబట్టి రైతులు ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ పండగ నాకిష్టం. మహిషాసురుణ్ణి చంపిన సందర్భంగా దసరా పండగ చేసుకుంటారు. నరకాసురుడి అంతమే దీపావళి పండగ. సంక్రాంతికి ఇలాంటిది లేదు. ఇది రైతుల పండగ. అందరి పండగ. మా తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో సంక్రాంతి బాగా చేస్తారు. – గోరటి వెంకన్న, కవి అలా రెండు సంక్రాంతులు గడిచాయి సంక్రాంతి అనగానే నాకు నేను రెండు రకాలుగా గుర్తొస్తాను. ఇండస్ట్రీకి రాకముందు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. అంతకుముందు ఆ తర్వాతలా అన్నమాట. అంతకు ముందు సంక్రాంతి అనగానే ఫ్యామిలీతో అందరం కలిసి ఉండటం. అరిసెలు ఆరగించడం. అరిసెలు చేయటంలో మోస్ట్ ఫేవరేట్ ప్లేస్ మా అమ్మమ్మ గారిల్లు. అందుకే పండగ అంటే అమ్మమ్మగారింట్లోనే. అమ్మమ్మగారి ఊళ్లో ఉన్న ఫ్రెండ్స్‌తో కలిసి గాలి పటాలు ఎగరేయటం. గాలి పటాలెగరేసుకుంటూ విన్న పాటలతో పాటు నేను పెరిగాను. ముఖ్యంగా ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారు రాసిన కొన్ని పాటలను ఇక్కడ ప్రస్తావించాలి. అప్పుడు ఆ పాటల్లోని భావాలను వింటూ ఎప్పటికైనా నేను మంచి పాటలు రాయాలనుకునేవాణ్ని. ఆ పాటలు ఏంటంటే... ‘వర్షం’ చిత్రంలోని ‘కోపమా నా పైనా, ఆపవా ఇకనైనా అంతగా బుసకొడుతుంటే నేను తాళగలనా..’ అనే ప్రేమ పాటలు వింటూ ఆ పాటలోని అక్షరాలతో ఓ సంక్రాంతి గడిచింది. మరో సంక్రాంతికి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలోని ‘రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే... ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా...’ అంటూ శాస్త్రిగారు రాసిన మాటలు నేను ఈ ఇండస్ట్రీకి రావటానికి స్ఫూర్తినిచ్చాయి. విషయం ఏంటంటే ఆ రెండు చిత్రాలు నిర్మించిన యం.యస్. రాజుగారిని సంక్రాంతి రాజు అని పిలిచేటంత హిట్టయ్యాయి ఆ సినిమాలు. ఇక ఆ తర్వాత కథ ఏంటంటే.. అలా పాటలు వింటూ సంక్రాంతి చేసుకున్న నేను ఇక్కడికొచ్చాక ‘శతమానం భవతి’ సినిమాలో సంక్రాంతిని ఉద్దేశించి ‘హైలో హైలెస్సారో... ఆదిలక్ష్మీ, అలిమేలమ్మకు అందమైన గొబ్బిళ్లు... కన్నెపిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొబ్బిళ్లు...’ అనే పాట రాశాను. ఆ పాట పెద్ద హిట్. ప్రతి సంక్రాంతి పండక్కి ప్రేక్షకులు ఈ పాట వింటూ పండగ చేసుకోవాలన్నది నా ఆకాంక్ష. సంక్రాంతి అంటే తెలుగువాళ్లందరి సిరి. బంధువులందర్నీ ఓ చోట కలిపి మన మనసులను ఆనందింపజేసే పండగ ఇది. – శ్రీమణి ఇది కర్షకుల పండగ పండిన పంట ఇంటికొచ్చే రోజు, పడిన కష్టం చేతికొచ్చే రోజు సంక్రాంతి. వ్యవసాయమే ఆధారంగా మనుగడ సాగే మన భరత ఖండంలో ఏ పేరున జరుపుకున్నా ప్రధానంగా ఇది కర్షకుల (రైతులు) పండగ. పండగంటేనే సంతోషం. అందునా ఇది పెద్ద పండగ. మరి అంత సంతోషంగా రైతు జీవితం గడుస్తుందా? ప్రశ్నార్థకమే. ఉన్నంతలో పండగ జరుపుకోవడం కాకుండా ఉన్నతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అసలైన అర్థంతో పండగ జరుపుకునే దిశగా సంక్రాంతుల్లో సంక్రమం చేయాలని ఆకాంక్ష. – రామజోగయ్య శాస్త్రి -
జన జ్వాలాదీప్తి
మన తరిమెల నాగిరెడ్డి – మానవతా మూర్తి మనందరి స్ఫూర్తి జగమెరిగిన నాగిరెడ్డి – జగజగీయమూర్తి/ కీర్తి జన జ్వాలాదీప్తి అరుణారుణ వజ్రఖచిత ఖడ్గధితర నాగిరెడ్డి అణువణువున కరిగె దయా కరుణధార నాగిరెడ్డి క్షణం – క్షణం అనుక్షణం – రణరంగంలాగా కదిలినాడు దినం – దినం జీవితాన్ని – పణం పెట్టి నిలిచినాడు జననం – మరణం – మధ్యన జనం కొరకు బతికినాడు ‘‘మన‘‘ తెల్లవాడు – నల్లవాడు ఇద్దరి పరిపాలనలో రాజద్రోహి ముద్రపడిన మాతృభూమి ప్రేమికుడు జీవితమే భారతీయ కమ్యూనిస్టు చరిత్రగా విప్లవజెండా పట్టిన అనంతమహాత్ముడతడు కటకటాల జైలులోన మల్లెలు పూయించినాడు స్నేహం – స్వేచ్ఛా– విప్లవ కపోతమై బతికినాడు బావమరిది – ముఖ్యమంత్రి పీఠంపై ఉంటేనేం కడదాకా తనది ప్రజా హృదయ పీఠమన్నాడు వర్గ శత్రువుల వైపున – కన్న తండ్రి ఉన్నా సరే ‘ఖబడ్దార్’ అని చెప్పిన కమ్యూనిస్టు నిబద్ధుడు బాతాఖాని షాపని – అసెంబ్లీని వదిలిపెట్టి ఆఖరి ఊపిరిదాకా ఆగని రణ యాత్రికుడు స్పష్టత – సమకాలీనత– నిజాయితీ – దూరదృష్టి సమరూపుడే నాయకుడని ఆచరణలో చూపినాడు ‘‘మన‘‘ విదేశీ అప్పులను తెచ్చి – స్వదేశీ పత్రికలలోన సదా పోజుకొట్టే ముఖ్యమంత్రి – ప్రధానమంత్రులను ఎన్నాళ్లీ – భారతాన్ని తాకట్టులో పెడతారని ఏనాడో ప్రశ్నించిన ఎరుపెక్కిన కాలజ్ఞాని మార్క్స్ చెప్పే సమసమాజ భావనకై పోరాడే కమ్యూనిస్టులెప్పుడు జాతి వ్యతిరేకులు కాదంటూ విదేశీయ కంపెనీల – ప్రపంచబ్యాంకు దళారుల ఆజ్ఞలకు తలవంచిన – నాటి – నేటి పాలకులే భారత జాతీయతకు విఘాతకులు అన్నాడు మిత – అతి – అవకాశవాదాలకు ఎదురునిల్చి పూలను – రాలను ప్రేమగా అందుకున్న స్థితప్రజ్ఞుడు ప్రజానేత ‘‘మన‘‘ చీలినారు కమ్యూనిస్టు వీరులని స్వార్థపరులు తమ చంకలు గుద్దుకొని గద్దెలపై వుండనిండి ఏదో ఒక రోజు – మన కమ్యూనిస్టు పార్టీలు ఏకమై ఎర్రజెండ ఎగరేస్తాయన్నాడు మార్క్సిజాన్ని మన దేశపు ప్రజల సంస్కృతులతోని కలగలిసిన నాడె ప్రజలు కలిసొస్తారన్నాడు నిజం – కమ్యూనిజం – భువిని పాలించుట తథ్యమన్నాడు కమ్యూనిస్టు విశ్వరూప కదన గీత పలికినాడు ‘‘మన‘‘ (నేడు తరిమెల నాగిరెడ్డి 42వ వర్ధంతి సందర్భంగా) – సుద్దాల అశోక్‌తేజ ప్రముఖ కవి, గీత రచయిత -
దాసరి సినీ అవార్డుల ప్రదానోత్సవం
ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ (ఫాస్) ఈ ఏడాది దాసరి ఫిల్మ్ అవార్డు విజేతల ఎంపిక వివరాలను సంస్థ అధ్యక్షులు, పూర్వ సెన్సార్ బోర్డ్ సభ్యులు కె. ధర్మారావు వెల్లడించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 6న హైదరాబాద్‌లో జరగనుంది. డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా శేఖర్ కమ్ముల (ఫిదా), ఉత్తమ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఉత్తమ గాయని మధుప్రియ, ప్రశంసా దర్శకుడు అవార్డు వడ్డేపల్లి కృష్ణ (లావణ్య విత్ లవ్‌బాయ్స్), దాసరి ప్రతిభా పురస్కారాలను సంపూర్ణేష్ బాబు, శివపార్వతి, సంగీత దర్శకులు వాసూరావు, మాటల రచయిత సంజీవని, దాసరి విశిష్ట సేవా పురస్కారాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు లయన్ డా.ఎ. నటరాజుకు ప్రదానం చేయనున్నారు. ఫాస్–దాసరి కీర్తి కిరిట సిల్వర్క్రౌన్ అవార్డులను దర్శకులను కోడి రామకృష్ణ, టీవీ యాంకర్ సుమ కనకాలకు అందజేయనున్నారు. దాసరి జీవన సాఫల్య పురస్కారాన్ని సూపర్‌హిట్ సినీ వార పత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ నిర్మాత బీఏ రాజు అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి జమున హాజరు కానున్నారు. సభాధ్యక్షులుగా కైకల సత్యానారాయణ వ్యవహరిస్తారు. డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ. బి సభను ప్రారంభించనున్నారు. సన్మానకర్తగా దర్శకుడు ఎన్.శంకర్ విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్‌గా రేలంగి నరసింహారావు, ఫెస్టివల్ చైర్మన్‌గా లయన్ ఎ. విజయ్‌కుమార్ వ్యవహరించనున్నారు. శ్రీమతి టి.లలితబృందం దాసరి సినీ విభావరి నిర్వహించనున్నారు. -
మట్టి పరిమళం సుద్దాల..
ఎంగిలివారంగ పాటతోనే ఆ ఇంట పొద్దుపొడుపు. ఇంట్లో పని చేసుకుంటూ అమ్మ పాడేది.. తన పనులు చేసుకుంటూ నాన్న పాడేవారు.. పిల్లలు శ్రుతులు, రాగాలయ్యేది. వచ్చేటోళ్లు పాటలై వొస్తరో.. పాటల కోసమే వస్తరో కానీ.. చేతులతోని దరువేసే వాళ్లు, బుర్రలు వాయించేవాళ్లు.. తాళం కొట్టేవాళ్లు.. దీనికి నాన్న చేతిలోని హార్మోనియం తోడై రాగమందుకుంటే.. ఆ ఇల్లు పాటకు పుట్టినిల్లయ్యేది. అదే సుద్దాలలోని సుద్దాల హనుమంతు ఇల్లు. కదిలించే గీతాలు..భావాలు అశోక్‌తేజ రాసిన ‘ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమ్యం, ఒకటే గమనం’ గొప్ప అనుకూల ఆలోచన కలిగించే పాట. ఎందరికో ధ్యేయాన్ని అందించిన పాట. ఆయన స్త్రీకి ఇచ్చిన గౌరవమే పనిపాటలకిచ్చి పాటలు కట్టిండు. పనినొక సంస్కృతి జేసిన ఘనత కష్టజీవిది. ‘టప, టప, టప, టప, టప, టప చెమటబొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే’ అనే పాట పనితో పాటే పుట్టింది. పని–పాటతో జతకట్టింది అనే పాట ఇటీవల అశోక్‌తేజ రాసిన శ్రమకావ్యానికి మూలభూతాలు, టపటపటప, పరికరాలు పుట్టించిన పాటలు ఎందరినోళ్లల్ల పండిన పాటలు. అశోక్‌తేజ ‘శ్రమకావ్యా’న్ని రచించిన తీరు కొత్తది. ఈ కావ్యంలో శ్రమీ, శ్రములు (శ్రమ యొక్క స్త్రీ, పురుష కాల్పనిక పాత్రలు) పాత్రధారులు. ఈ రచనను ‘శ్రమహాకావ్యం’ అని, కవిని ‘శ్రమహాకవి’ అని అన్నారు దీనికి ముందు మాట రాసిన రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి. ఆ ఇంట పాటతోనే పొద్దుపొడుపు పాటతోటి ఉద్యమానికి బాటకట్టిన ప్రజాకవి సుద్దాల హనుమంతు. పాటంటే ఆయన గుండెలోంచి ఉబికి వచ్చే సెల. తాను పుట్టిన పాలడుగులో హరికథకుడు, ఆధ్యాత్మిక గురువు అంజయ్య శిష్యరికంలో ఆయన కళాకారుడిగా ఎదిగాడు. మంచి గొంతు.. ధ్వన్యనుకరణలో దిట్ట. అద్భుతంగా హార్మోనియం వాయిస్తూ తను పాడుతుంటే.. విన్నవాళ్లదే భాగ్యం. సొంతగా పాట కట్టేవాడు. నటన, వాద్య, గానాలబ్బిన ఆయన తొలిసారి తన ఊళ్లో కంటబడ్డ వెట్టి పాపయ్య దుఃఖాన్ని మనసు మీదికి తీసుకుని– ‘వెట్టిచాకిరి విధానమో రైతన్న.. ఎంత చెప్పినా తీరదో కూలన్న..’ అనే పాటకట్టిండు. నైజాం పాలన అంతమైనాక సుద్దాలకు చేరుకున్న హనుమంతు వారసత్వంగా వచ్చిన ఆయుర్వేద వైద్యవృత్తిని చేపట్టాడు. దాంతోపాటే సాంస్కృతిక సేనానిగా కొనసాగాడు. తనతో తన భార్య జానకమ్మ సమవుజ్జీనే. పిల్లలు పిల్లపాటలు. భారతి గొంతెత్తి పాట పాడుతుంటే హనుమంతు భావుకత్వంతో తన్మయుడయ్యే వారు. ఆ నోట జనం పాట.. సుద్దాల అశోక్ తేజ.. హనుమంతు పెద్దకొడుకు. మరో ఇద్దరు కొడుకులు ప్రభాకర్, సుధాకర్. బిడ్డ భారతి. పిల్లలకు ఇంట్లో విన్న పాటలన్నీ కంఠో‘పాట’మే. సుద్దాల హనుమంతు.. ‘పల్లెటూరి పిల్లగాడ..’ పాటతో ప్రసిద్ధుడు. పసులుకాసే పిల్ల గాని ఆర్తిని, బాధను పాటగా కట్టిన వాగ్గేయకారుడాయన. తండ్రికి తగ్గట్టే అశోక్‌తేజ– ‘కన్నతల్లీ మమ్ముల కన్నప్పటి నుంచీ కడుపునిండా తినలేదు మెతుకు.. కింటినిండ కనలేదు కునుకు..’ అంటూ బతుకుపాట కట్టాడు. ఇందులోనే– ‘యజమాని ముప్పయి పసులమందను నేను అజుమాయించకపోతి ఆరేండ్లపోరణ్ణి.. ఒక పెయ్య దప్పించుకుపొయ్యి ఆముదపుచేండ్ల ఆకులు రెండూ మేసి నామొచ్చిపడిపోతే, ఇనుపచువ్వలు కాల్చి నా ఈపూల గుంజీరి’ అనడం ద్వారా తండ్రి పాటకు కొడుకు కొనసాగింపనిపిస్తుంది. ఇది పాట వారసత్వం. అశోక్‌తేజ చదువుల కోసం హైదరాబాద్ చేరి.. అక్కడి జీవితానుభవాలను పాటలుగా కట్టి పాడాడు. ఆయన పాటల్లో ఎన్నదగినది.. ‘రాయి, సలాక, ఇసుక, ఇటుక, తాపీ, తట్ట గోడ మీద గోడ, మేడ మీద మేడ, కట్టిపోరా కూలోడా’. ఈ పాటలో ఇండ్లు కట్టే కూలోల్ల బతుకుబొమ్మను సజీవంగా చిత్రించారు. జనగీతాలు.. తండ్రివేసిన పాటల బాటలో తన పాటల బండిని తోలుకుంటూ వచ్చిండు అశోక్‌తేజ. ఆయన పాటల్లో కవిత్వముంటది. కానీ తన సినీగేయాల్లో కొన్నింటిలోనే కవిత్వముంటుంది. చిత్రమేమిటంటే అశోకన్న తనుగా రాసుకున్న పాటల్లో చాలామట్టుకు సినిమాల్లో వచ్చుడు విశేషం. ‘నీకు మచ్చాలేడా లేసేలువలే లేవులే’’ ఈ పాట ఎంత ప్రజాదరణ పొందిందో!. ఇందులో రైతును చందమామతో పోల్చి చెప్పే అలంకారీయత ఉంది. తన పాటల్లో రూపకాలను ఎక్కువగా వాడతారు అశోక్‌తేజ. తను రాసిన పాట ‘అడివమ్మ మాయమ్మ అతిపేదదీరా, ఆ యమ్మకున్నది ఒక్కటే చీరా, ఆ చీర రంగేమొ ఆకుపచ్చనిది, ఆ తల్లి మనసేమొ రామసక్కనిదీ ఆకలైతె చెట్టు అమ్మయితది.. ఆయుధాలడిగితే జమ్మిచెట్టయితది..’ అసాధారణ భావాల గీతమిది. ‘ఆమె’కు పాటతో పట్టాభిషేకం.. అశోక్‌తేజ ‘ఆడదాన్నిరో నేను ఆడదాన్నిరో నేను ఈడ ఎవనికి కానిదాన్ని ఏడిదాన్నిరా’ అనే పాట రాసిండు. ఆయన గురించి పాపినేని శివశంకర్ ‘స్త్రీ హృదయమున్న పురుషకవి’ అన్నారు. హనుమంతు కొంతవరకు రాసి వదిలివెళ్లిన వీర తెలంగాణ యక్షగానాన్ని పూరించారు అశోక్‌తేజ. దాని కోసం ఎంతో సాధన చేశారు. ‘పుల్లాలమంటివి కదరా.. ఇదిగో పులిపిల్లాలమై వచ్చితిమి గనరా’, ‘ఇంతీ ఏ యింటిదానివే’ అనే పాటలు ఆ వరుసలోనివే. ‘ఆలి నీకు దండమే. అర్ధాంగి దండమే. ఆడకూతురా నీకు అడుగడుగున వందనం..’ ఈ పాటలొక్కొక్కటే స్త్రీ హృదయాన్ని గౌరవించే ఆణిముత్యాలైన కవితా గీతాలు. పాటమ్మా.. నీకు వందనాలమ్మా.. ‘నేలమ్మ.. నీకు వేనవేల వందనాలమ్మా’.. ఈ నేలను ఇంత గొప్పపాటగా ఎవరు మలచగలిగారు? భూమిని తల్లిగా భావించి కీర్తించిన కవులెందరున్నా.. ఇట్ల నేలను వర్ణించిన కవి కానరాడు మనకు. ‘సాలేటి వానకే తుళ్లింత ఇంక సాలు, సాలుకు నువ్వు బాలింత.. ఇంత వానకే పులకరించిపోయిన భూమి, విత్తులు చల్లిన సాలు, సాలుకు బా లింత అవుతుంది. నేలమ్మవుతుంది..’ ఇదీ అశోక్ తేజ నేలమ్మను దర్శించిన వెలువరించిన తత్వం. తన ఒంటిమీద బిడ్డల చితులు కాల్చుకున్న తల్లెవరన్న వుంటరా? నేలమ్మను కవి ఊహ చేయడంలో ఒక ప్రత్యేక కవిత్వ శిల్పముంది. -
యాస భాషల అలయ్ బలయ్
పొద్దు పొద్దున్నే ముద్దబంతుల్లా ఆయన అక్షరాలను పూయిస్తున్నారు. ఆ చేతిలోని కలం చకచకా సాగుతోంది. ప్రపంచ తెలుగు మహాసభల కోసం నాలుగు పేజీల కవితను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అది పూర్తి కాగానే నేరుగా విషయానికి వచ్చేశారు. ‘తెలుగు స్థితిగతులెలా ఉన్నాయి?’ అని అడగ్గానే ‘భాష భేషుగ్గా ఉంది’ అంటూ ‘సాక్షి’తో తన అంతరంగాన్ని పంచుకున్నారు తెలుగు సినీ పాటల రేడు సుద్దాల అశోక్‌తేజ. తెలంగాణ వాడు బువ్వదినే ఏళయితే ఎవ్వరొచ్చినా సరే.. ‘తిందాం రా’ అనేటోడే తెలంగాణవాడు తురక, తెలుగు అనే అరమరిక లేక తన పిల్లలను ‘బేటా’ అని పిలిచేటోడు తెలంగాణ వాడు జమ్మి చేతులుంటే చాలు జన్మ శత్రువెదురొచ్చినా ‘అలయ్ బలయ్’ ఇచ్చేటోడు తెలంగాణ వాడు కొవ్వెక్కిన మదం కాదు పువ్వొసంటి మనసుతోని ‘నువ్వు’ అని పిలిచేటోడు తెలంగాణ వాడు కారణాలేవైనా.. మన భాష, సంస్కృతులు మరుగునపడిపోయాయి. లేదా చీకట్లోకి నెట్టివేయబడ్డాయి. ఆ చీకటి పొరలను, దుమ్మూధూళిని తొలగించి.. వెలుగులోకి తెచ్చే సందర్భమే ఈ మహాసభలు. నేటితరానికి మన సంస్కృతీ సంప్రదాయాలను, మన భాషా సౌందర్యాన్ని తెలపడానికి ఇదే అదను. మహానుభావులకు దక్కుతున్న గౌరవం హాలుడు, పోతన, పాల్కురికి సోమనాథుడు, పంప మహాకవి, సుద్దాల హనుమంతు, భాగ్యరెడ్డి వర్మ, రుద్రమదేవి, సురవరం ప్రతాపరెడ్డి కవిత్వానికి, సంఘ సంస్కరణలకు, సాహిత్యానికి, పోరాటానికి పెట్టింది పేరైన వీరందరి పేరిట నగరం అంతటా స్వాగత తోరణాలు వెలియడం అద్భుతం. ఇది ఎనలేని సారస్వత సంపదను వారసత్వంగా అందించిన మహానుభావులకు దక్కుతున్న గౌరవం. వీరంతా ఎవరనే ఆలోచన నేటితరానికి కలిగితే చాలు. ఇలా చేస్తే తెలుగే వెలుగు భాష తెలుగుకు పూర్వవైభవం కలిగించే దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు తొలిమెట్టే ఈ మహాసభలు. ఇప్పటికే 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు తప్పనిసరి చేయడానికి ప్రభుత్వం నుంచి కృషి జరుగుతోంది. ఇంకా, న్యాయస్థానాల్లో తెలుగులోనే వాద ప్రతివాదనలు జరగాలి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తెలుగులోనే వ్యవహారాలు సాగాలి. తెలుగు వస్తేనే ఉద్యోగావకాశాలనే నిబంధన పెట్టాలి. ఇవన్నీ ప్రభుత్వం తరపున జరిగితే తెలుగు అధికారికంగా వ్యవహారికంలోకి వచ్చినట్టే. తెలుగు భాష ముప్పు వాకిట లేదు. భాష ఖూనీ అయిపోవడం లేదు. పరభాష, యాసల వల్ల తెలుగు పలుచనైపోవడం లేదు. తనలో పరభాషా పదాలను కలుపుకొని ఇంకా సుసంపన్నమవుతోంది. విశ్వమానవులం కావద్దా? కొన్ని పరిస్థితుల రీత్యా ప్రస్తుతం ఆంగ్లం నేర్చుకోక తప్పని పరిస్థితి. మన పిల్లలు ‘విశ్వ మానవులు’గా ఎదగాలంటే దాన్ని నేర్వాల్సిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వద్దంటే.. నిమ్న వర్గాల పిల్లల పురోగతిని అణచిపెట్టడమే. స్థానిక భాష, రాజభాష, ప్రపంచ భాష... ఈ మూడింటిలో నైపుణ్యం సాధిస్తేనే సంఘ వికాసం. - సీహెచ్‌ఎమ్ నాయుడు -
గోరటి, సుద్దాలకు జాలాది పురస్కారం
9న విశాఖలో ప్రదానం ద్వారకానగర్ (విశాఖ దక్షిణం): సినీ కవి డాక్టర్ జాలాది పేరిట ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు.. ఈ ఏడాది సుప్రసిద్ధ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజను ఎంపిక చేసినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాలాది జయంతి ఉత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంత్రి గంటా ఆవిష్కరించారు. ఈ నెల 9న విశాఖలోని సిరిపురం ‘వుడా చిల్డ్రన్ ఎరీనా’లో నిర్వహించే జాలాది జయంతి ఉత్సవాల్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. -
దాసరి దేవుడు, నా సర్వస్వం...
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇక లేరన్న వార్త వినగానే ఒక క్షణం పాటు మనసంతా కకావికలం అయిందని సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాసరావు అన్నారు. దాసరి మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన దగ్గర పనిచేయడం నిజంగా అదృష్టమన్నారు. ‘ఓసే రాములమ్మ’ చిత్రంలో పాటను తనతో దాసరి పట్టుబట్టి మరీ పాడించారని వందేమాతరం తెలిపారు. ఈ సందర్భంగా దాసరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరి ఇక లేరనేది.. తెలుగు చిత్ర పరిశ్రమకు దురదృష్టకరమైన వార్త అన్నారు. గీత రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ...’ దాసరి నారాయణరావు నా దేవుడు, నా జీవితం...నా సర్వస్వం. ఆయన లేకుండా ఈ రోజు సుద్దాల అశోక్ తేజ లేడు. గత 22 ఏళ్లుగా ఆయన సొంతబిడ్డలా నన్ను చూసుకున్నారు.’ అని అన్నారు. అలాగే మహోన్నత శిఖరం ఇక లేరనే వార్తను నమ్మలేకపోతున్నానని సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. -
సుద్దాల అశోక్‌తేజతో సరదాగా కాసేపు
-
దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా
చిన్నతనంలోనే కొన్ని కారణాల వల్ల తల్లి నుంచి వేరుపడిన కొడుకు, తన తల్లితో నేనే నీ కొడుకుని అని పరోక్షంగా చెప్పే సందర్భంలో పాట రాయమని పూరి జగన్నాథ్ అడిగారు. నాకు వెంటనే మహాభారతం, శకుంతలోపాఖ్యానంలో నన్నయ రాసిన పద్యం గుర్తుకు వచ్చింది. శకుంతల తన చిన్ని కుమారుడిని వెంట పెట్టుకుని దుష్యంతుడి సభకు వెళ్లి, తనను స్వీకరించమని అడిగితే, ‘నువ్వు ఎవరో నాకు తెలియదు’ అంటాడు. ఆ సందర్భంలో ‘విపరీతార్థములేటికి’... అనే పద్యం చెబుతుంది శకుంతల. కుమారుడిని ఆలింగనం చే సుకుంటే, ఆ కుమారుడు తనవాడో కాడో తెలుస్తుందని చెప్పే ఘట్టాన్ని గుర్తుకు తెచ్చుకున్నాను. ఇక్కడ లోఫర్ చిత్ర కథలో... తన ఎదురుగా ఉన్న వ్యక్తి తన కొడుకేనని తల్లికి తెలియదు. కాని ఆవిడ తన తల్లి అని కొడుక్కి తెలుసు. ‘అమ్మా! నేను నీ కొడుకుని, నన్ను గుర్తు పట్టు’ అనే సన్నివేశానికి తగ్గట్టు ఈ పాట రాయాలి. చిన్నప్పుడే తల్లి నుంచి వేరు పడ్డ కొడుకు పాడే పాట ఇది. సువ్వీ సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా మాటాడే ఈ బొమ్మ నా తలపై సెయ్యే పెట్టి నీ కడుపులో పేగును అడుగు మన ఇద్దరి నడుమన ముడి ఏందో అది గొంతెత్తి సెప్పుతాది ఇనుకోవే దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే సాలమ్మా ఏలో ఏలో ఏలో ఏలా ఏలా నేను ఊగింది నీ ఒడూయల్లో ఏలో ఏలో ఏలో ఏలా ఏలా నువ్వే సెప్పాలి అమ్మ అమ్మెవ్వరో ఈ పల్లవిలో తాను ఆ తల్లి గీసిన బొమ్మనని ఆ తల్లి ఎదురుగా నిలబడి పాడతాడు. మాతృత్వాన్ని ప్రతిబింబించే పాట ఇది. నా జీవితాన్ని మా అమ్మ ప్రభావితం చేసింది. నా చేత పుస్తకాలు చదివించింది. ఒక స్త్రీని నేను గౌరవంగా చూస్తున్నానంటే అందుకు మా అమ్మ కారణం. అందరిలోనూ ఆవిడను చూస్తాను. అదే ఈ పాటలో చూపాను. తల్లి పేగు బంధం చెప్పరానిది. తల్లీకొడుకుల మధ్య ఉండే బంధం చెప్పరానిది. ఆ బంధాన్ని వర్ణించడం ఎవ్వరి తరమూ కాదు. ఆ తల్లి ఒడి అనే ఊయల్లోనే పసిపాప ఊగుతూ హాయిగా నిద్రిస్తుంది. అమ్మ ఎవరు అనే విషయాన్ని అమ్మే చూపుతుంది. తన చేతితోనే తల్లి బిడ్డకు ప్రపంచాన్ని చూపుతుంది. అటువంటి తల్లికి దూరమైన కొడుకు కంటికి తల్లి కనిపిస్తే ఆ ఆనందానికి అవధులే ఉండవు. ఇక చరణంలో 1. కాళ్ల మీద బజ్జోపెట్టి లాల పోసినావో ఏమో మళ్లీ కాళ్లు మొక్కుతాను గుర్తుకొస్తానేమో చూడు ఎండి గిన్నెల్లో ఉగ్గుపాలు పోసి నింగి సందమామను నువ్వు పిలవలేదా అవునో కాదో నువ్వు అడగవమ్మా మబ్బు సినుకై సెబుతాది నీకు ఎన్నెలమ్మ దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా బాల్యంలో తల్లి పసిపాపను కాళ్ల మీద పడుకోబెట్టుకుని లాల పోస్తుంది. ఆ కాళ్ల మీదే పసిపాపకు జోల పాడుతుంది. వెండి గిన్నెతో ఉగ్గుపాలు పోస్తుంది. ఆకాశంలో ఉన్న చందమామను పిలిచి కిందకు తీసుకువస్తుంది. అంతటి ఉన్నతమైన తల్లి తన చెంత ఉంటే చాలు, తనకు దునియాతో పనేమీ లేదంటాడు. తల్లి తన గర్భంలో బిడ్డకు ఒక ఆకారం తీసుకువస్తుంది. తన రక్తాన్ని పాలుగా మార్చుతుంది. అంతటి ఉన్నతమైన తల్లికి తాను దూరమయ్యానని బాధపడతాడు తనయుడు. తల్లీ కొడుకుల మధ్య ఉండే మాతృత్వపు తాత్వికత కనిపిస్తుంది ఈ పాటలో. 2. తల్లి కోడి పిల్లనొచ్చి తన్నుకెళ్లే గద్ద లñ క్క ఎత్తుకెళ్లినోడు నన్ను పెంచలేదు మనిషి లెక్క సెడ్డ దారుల్లోకి నేను ఎళ్లినాక సెంపదెబ్బ కొట్టి మార్చేసే తల్లి లేక ఎట్ట పడితే అట్ట నేను బతికినాను ఇప్పుడిట్టా వస్తే నేను తలుపు ముయ్యబోకే దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా కోడి తన పిల్లల్ని ఆడిస్తుండగా ఒక గద్ద వచ్చి కోడిపిల్లను ఎత్తుకుపోయిన విధంగా నా తండ్రి నన్ను ఎత్తుకుపోయాడు. నన్ను సరిగా పెంచలేదు. తప్పు చేస్తే చెంప మీద కొట్టే తల్లి నా దగ్గర లేదు. అందుకే నేను ఎలా పడితే అలా బతికాను. ఇప్పుడు నీ దగ్గరకు నేను వస్తే, తలుపులు వెయ్యకమ్మా అని తల్లిని వేడుకుంటాడు ఈ చరణంలో. సొంత కొడుకును, తల్లి దగ్గర నుంచి తండ్రి వేరు చేసి తీసుకుÐð ళ్లిపోతాడు. ఏ మాత్రం క్రమశిక్షణతో పెంచకపోవటం వల్ల తప్పుదారి పడతాడు కొడుకు. ఈ చరణంలో చిత్ర కథ అంతా చెప్పాను. తప్పు చేసిన కొడుకు తాను చెడు మార్గంలో ఉన్నానని తెలుసుకుని, తల్లి దగ్గరకు వస్తాడు. తాను తప్పు చేస్తే ఆ తల్లి తన చెంప మీద ఒక దెబ్బ వేస్తుంది. ఆ దెబ్బతో తాను మారగలననుకుంటాడు నాయకుడు. తల్లి గొప్పదనాన్ని వివరించే ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. సంభాషణ: డా. వైజయంతి -
తెలుగు పాటలో తియ్యదనం తగ్గింది
మంచి పాటలు పది కాలాల పాటు పదిలం ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కొయ్యూరు: తెలుగింటి ఆడపడుచును పల్లకిలో ఊరేగించినంత అందంగా ఒకప్పుడు మన పాట ఉండేదని, నేడు అదే తెలుగింటి అమ్మాయిని జీపునకు కట్టి ఈడ్చినట్టుగా తయారైందని ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఉద్యమం నడిపిన మంప, రాజేంద్రపాలెంలలో స్మారకమందిరాలను ఆయన ఆదివారం సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు పాటల్లో తేడాలొచ్చాయి నాటికీ నేటికి తెలుగుపాటల్లో చాలా తేడాలొచ్చాయి. అప్పట్లో సంగీతాన్ని సాహిత్యం అధిగమించేలా ఉంటే ఇప్పుడు సాహిత్యాన్ని సంగీతం అధిగమిస్తుంది. పాట మంచిదైతే పది కాలల పాటు ప్రజల మదిలో ఉంటుంది. ఇప్పుడు మంచి పాటలు రాసే రచయితలు ఎందరో ఉన్నా అలా రాసే అవకాశం తగ్గిపోతుంది. దర్శక నిర్మాతలు చెప్పిన దానికి వీలుగా రాయాలి. ‘నేను సైతం’ జాతీయఅవార్డు అందుకున్నా ఠాగూర్‌కు నేను రాసిన ‘నేను సైతం’ పాటకు జాతీయ అవార్డు రావడం ఎన్నటికీ మరువలేను. ఆ అవార్డు తీసుకున్న మూడో తెలుగు పాటల రచయితను అయినందుకు ఆనందంగా ఉంది. ‘ధ్రువ’కు రాసే అవకాశం ప్రస్తుతం రామ్‌చరణ్ నటిస్తున్న ధ్రువలో ఒక పాట రాసేందుకు చర్చలు జరిగాయి. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. శేఖర్‌కమ్ముల తీస్తున్న సినిమాకు పాటలు రాసే దానిపై చర్చలు జరుగుతున్నాయి. తన్మయత్వం పొందాను మన్యంలో అల్లూరి నడయాడిన ఈ ప్రాంతాన్ని చూసిన వెంటనే మనసు తన్మయత్వానికి లోనయింది. ‘అల్లూరి’ ప్రాంతాల అభివృద్ధికి వందకోట్లు ఇవ్వాలి బ్రిటిష్ సేనలకు వ్యతిరేకంగా గొప్ప సాయుధ పోరాటం నడిపిన అల్లూరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఆయన నడయాడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు తక్షణం రూ.వంద కోట్లు కేటాయించాలి. ‘భగత్‌సింగ్’లాంటి పోరాటయోధుడు జలియన్ వాలాబాగ్ సంఘటన తర్వాత భగత్‌సింగ్ పోరాటయోధుడైతే ఇక్కడ నేరుగా ఉద్యమాన్ని నడిపిన గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు. పంజాబ్ ప్రభుత్వం భగత్‌సింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. అల్లూరి ప్రాంతాలను ఇలా ఉంచడం బాధాకరం అల్లూరి సీతారామరాజు సినిమా రాక ముందు పడాల రామారావు రాసిన ఆంధ్రాశ్రీ పుస్తకంలో ఉన్న అల్లూరి చరిత్రను మా తండ్రి ద్వారా చదివి ఆలకించాను. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తున్నా అల్లూరి నడయాడిన ప్రాంతాలను ఈ విధంగా ఉంచడం బాధాకరం. మ్యూజియం ఏర్పాటు చేయాలి ఇప్పుడు పుష్కరాలకు ప్రభుత్వం ఎంత కేటాయించి వైభవంగా నిర్వహిస్తుందో అదే విధంగా అల్లూరి ప్రాంతాలకు పుష్కరశోభను తీసుకురావాలి. మ్యూజియం ఏర్పాటు చేసి అల్లూరి వాడిన వస్తువులను భద్రపరచాలి. ఆయనకు సంబంధించిన అన్ని విషయాలను, తిరిగిన ప్రాంతాల వివరాలను అందులో పొందుపరచాలి. రోజుకు పదివేల మంది పర్యాటకులు సందర్శించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. -
బ్రతుకు అంటే గెలుపు
‘‘శ్రీహరి పాత్ర బాక్సింగ్ పోటీల కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సాంగ్ కావాలి. అది ఆ ఒక్క సందర్భం కోసమే కాదు...మొత్తం యూత్‌కూ కనెక్ట్ కావాలి’’ ఇది దర్శకుడు ఎన్.శంకర్ ‘భద్రాచలం’ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్న టైంలో చెప్పిన మాటలు. ట్యూన్ క్యాచీగా, లిరిక్స్ కూడా అందుకు తగ్గట్టే ఉండాలనేది మరో సూచన. అప్పుడే నేను నా ఇంటర్మీడియేట్ రోజుల్లోకి వెళిపోయా. అప్పట్లో కాలేజీలో చదువుకుంటూనే రోజుకు ఏడు రూపాయాల జీతం కోసం బిల్డింగ్ కన్స్ట్రక్టర్ వర్కర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసేవాడిని. అంత ఎండలో బతుకు పోరాటం చేస్తున్న ఆ కూలీల కోసం నాలుగు లైన్లను ట్యూన్‌తో ‘‘రాయి సల్లాయి ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంటు చెమట గోడ మీద గోడ మేడ మీద మేడ కట్టిపోరా కూలోడ పట్టణాల్లో మేడ’’ ఇలా నేను ట్యూన్‌తో సహా వినిపించేసరికి సంగీత దర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్, ఎన్.శంకర్లకు తెగ నచ్చేసింది. అప్పుడిక ఈ పాట రాయడం మొదలుపెట్టా. ఏ పని చేసే వాళ్లలోనైనా స్ఫూర్తి రగిలించాలి. అందుకోసం నేను మొదట రాసిన లైన్లు ‘‘గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు ’’ ఇక దానికి లింక్‌గా అప్పుడు ‘‘ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం’’ అని రాశా. ‘‘కష్టాలు రానీ కన్నీళ్లు రానీ ఏమైనా గానీ ఎదురేది గానీ ఓడిపోవ ద్దు రాజీపడొద్దు నిద్దే నీకొద్దు నీకేది హద్దు’’ మనం ఎంచుకునే బాటలో పూలూ ఉంటాయి, ముళ్లూ ఉంటాయి. అన్నిటినీ తట్టుకోవాలి. ఎవరికీ భయపడకూడదు. శ్రమించడం మాత్రం ఆపకూడదు. విజయానికి హద్దులుండవు. ‘‘రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి ఆ గెలుపు చప్పట్లే గుండెల్లో మోగాలి’’ చిన్నప్పుడు అమ్మ ఓ విషయం చెప్పేది. మన మనసుకు నచ్చిన మాట ఎవరైనా చెబితే వాళ్లకు చప్పట్లు కొట్టాలి. ఇంకో అయిదేళ్లకో, పదేళ్లకో మనం కూడా స్టేజ్ మీద ఉండాలి. మనమూ అలా చప్పట్లు కొట్టించుకునే స్థాయిలో ఉండాలి. గెలుపు చప్పట్లు గుండెల్లో మారుమోగాలి. ‘‘నీ నుదిటి రేఖలపై సంతకమే చేస్తున్నా ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం’’ మన కష్టాలనే తమవిగా భావించే వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి నేస్తం తోడుంటే జీవితంలో ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. అప్పుడు ఓటమిని కూడా ఒక విజయంగా భావిస్తాం. ‘‘నమ్మకమే మనకున్న బలం నీలికళ్లలో మెరుపే నిలవాలి కారు చీకట్లో దారి వెతకాలి గాలి వానల్లో ఉరుమై సాగాలి తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి’’ ఇక్కడ మీకో విషయం చెప్పాలి. నేను సినిమాల్లోకి కొత్తగా వస్తున్న రోజులవి. అప్పుడే కృష్ణవంశీగారితో పరిచయమైంది. నేను అప్పుడేదో సందర్భంలో మాట అన్నా. ‘‘ఏదో మీరు ఉన్నారని సినిమాల్లోకి వచ్చేశాను’’ అని నేనెంటే అప్పుడాయన ‘‘ఇక్కడ ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు. నీ మీద నమ్మకముంటేనే సినిమాల్లోకి రా. లేకపోతే వద్దు’’ అని చెప్పిన మాట ఇప్పటికీ నా మనసులో బలంగా నాటుకుపోయింది. ఈ పాట రాసేటప్పుడు ఆయన మాటలు బాగా ప్రభావం చూపించాయి. ఎంత మంది ఎదురొచ్చినా గెలుపు వైపు పరుగు ఆపకూడదు. ‘‘నిద రోక నిలుచుంటా వెన్నెలలో చెట్టువలె నీకోసం వేచుంటా కన్నీటి బొట్టు వలె అడుగడుగు నీ గుండె గడియారం నేనవుతా నువు నడిచే దారులలో ఎదురొచ్చి శుభమవుతా రాశిగా పోసిన కలలన్నీ దోసిలి నిండా నింపిస్తా చేతులు చాచిన స్నేహంలా ముట్టుకున్నావా మువ్వ అవుతుంది పట్టుకున్నావా పాటే అవుతుంది అల్లుకున్నావా జల్లే అవుతుంది హత్తుకున్నావా పాటే అవుతుంది మనకు తోడుగా ఉండే ఆత్మీయుల మనోభావాలను ఈ వాక్యాల్లో ఆవిష్కరించాను. మన అనుకునే వాళ్లు మన గమ్యం కోసం తోడునీడగా ఉంటారు.‘ నిదరోక నిలుచుంటా వెన్నెలలో చెట్టువలె’ అనేది చాలా కొత్తగా రాశాను. అప్పటికది కొత్త ఎక్స్ప్రెషన్. అనకాపల్లిలో మీటింగ్‌కు వెళ్లినప్పుడు డీఎస్పీగా సెలెక్ట్ అయిన ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి నా పాటను ప్రింట్ తీయించుకుని గోడ మీద అతికించుకున్న విషయాన్ని చెప్పింది. రోజూ ఉదయాన్నే లేచి ఆ పాటను చూసి స్ఫూర్తి పొందానని చెప్పడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఇప్పటివరకూ 1200 సినిమాల్లో రెండు వేలకు పైగా పాటలు రాశాను. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ధ్వజస్తంభంలా నిలిచే పాటల్లో ఇదొకటి. -
నేను పుట్టకముందే మా ఇంట్లో పాట పుట్టింది
ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ పిఠాపురం టౌన్ : తాను పుట్టక ముందే తన ఇంట్లో పాట పుట్టిందని ప్రముఖ గేయ రచయిత, జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ అన్నారు. ఆదిత్య స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన ఆయన బుధవారం సాయంత్రం విలేకర్లతో ముచ్చటించారు. పాట అనేది తన ఇంట్లో పుట్టిన ఆడపడచులాంటిదన్నారు. నాలుగో తరగతి చదువుతున్న సమయంలోనే తాను గేయాన్ని రచించినట్టు తెలిపారు. తన తల్లిదండ్రులు జానకమ్మ, హనుమంతులు స్వాతంత్ర సమరయోధులన్నారు. తండ్రి మంచి గేయ రచయిత అన్నారు. ప్రముఖ కవులు దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ భావాల కలయికతో తాను గేయ రచయితగా ఎదిగానని సుద్దాల తెలిపారు. మానవ సంబంధాలు, అభ్యుదయ భావాలు, అమ్మదనంతో కలకలిపిన పాటలంటే ఎక్కువ ఇష్టపడతానని చెప్పారు. తన పాటల్లో వీటికే ప్రాధాన్యం ఉంటుందన్నారు. తనకు తానే పోటీగా పాట రచన చేస్తున్నట్టు తెలిపారు. తనకు మొదటి గురువు తండ్రి హనుమంతప్ప కాగా, అనంతరం సి.నారాయణరెడ్డి, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రిల అడుగుజాడల్లో నడిచినట్టు వివరించారు. పాండురంగడు సినిమాలో అమ్మనాన్నల మీద తాను రాసిన పాట తనకిష్టమైనదని అన్నారు. అన్ని సాహిత్యాలకూ జానపదం తల్లివంటిదన్నారు. ఠాగూర్ సినిమాకు తనకు జాతీయ అవార్డు వచ్చిందని, శ్రీశ్రీ, వేటూరి తర్వాత జాతీయ అవార్డు అందుకున్నది తానేనని అశోక్‌తేజ తెలిపారు. -
సుద్దాల అశోక్ తేజకు సాహితీ పురస్కారం
పరకాల(వరంగల్): ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజకు పల్లేరు స్వయంప్రభ స్మారక సాహితీ పురస్కారం లభించింది. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పల్లేరు వీరస్వామి తన భార్య పేరిట ఏర్పాటు చేసిన పల్లేరు స్వయంప్రభ స్మారక సాహితీ పురస్కరాన్ని ఈ ఏడాది అశోక్‌తేజకు అందించారు. వరంగల్ జిల్లా పరకాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వరంగల్ రేంజ్ డీఐజీ బి.మల్లారెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అశోక్‌తేజకు అందించారు. ప్రతిఏటా సాహితీరంగంలో విశేష కృషి చేసిందుకుగాను ఈ అవార్డు ఇస్తున్నారు. కాగా, ఇప్పటివరకు 9 మంది ప్రముఖులకు ఈ అవార్డును ప్రదానం చేశారు. -
మచ్చ ఉందని జాబిల్లి దాక్కుందా!
పాట నాతో మాట్లాడుతుందిత డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత జీవితంలో అద్భుతమైన మలుపు ఏ నిమిషంలో వస్తుందో తెలియదు. ‘‘తేజా! సితారలో రిపోర్టర్‌గా ఉన్న నా తండ్రి సినీ గీతరచనా తారగా సినీ సిరా సితారగా మారి సౌందర్యం, సామర్థ్యం కవల జలపాతాలుగా కలబోసుకున్న - అనితర సాధ్య చరిత్ర సింహాసనాధీశ్ - మహేష్‌బాబు సినిమాకు సోలో గీతరచయితగా ప్రతిష్ఠా విశిష్టుడుగావడం ఎవరైనా ఏ నిమిషంలోనైనా ఊహించామా? అంతెందుకు... నీ పాట మురారి సినిమాలో ‘బంగారుకళ్ల బుచ్చమ్మ’ గీతాన్ని - మీతో ఇంటర్వ్యూ చేసి సితారలో అద్భుతంగా విశ్లేషించినప్పుడైనా మీరు తను కాబోయే గీతరచయిత అని ఊహించావా?’’ సుదీర్ఘమైన ఆమె మాటలను వింటూండగానే... గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ నా తండ్రి’ అందా పాట. మళ్లీ తనే... నేను ‘మనసారా’ చిత్రంలో ‘పర్వాలేదు’ పాటను. సంగీతం శేఖర్ చంద్ర. దర్శకులు రవిబాబు. సన్నివేశం చెప్పారు ‘హీరో - తన అందంపై తనకు చిన్నచూపుతో కథానాయికపై అభిమానాన్ని, అనురాగాన్ని చూపుతాడు. ముఖం చూపకుండా ‘మాస్క్’తో కనిపిస్తుంటాడు. ఒకరోజు ‘ఎందుకిలా’ అంటే, ‘నేను అంత బాగుండను’ అని వాపోతాడు. ‘నువ్వెలా ఉన్న నాకిష్టమే’ అనే భావంతో కథానాయిక అలతి మాటలతో పాడాలి రవీ’’ అని దర్శక రవి చెప్పారు. ఇక మొదలైంది నా తండ్రిలో మేధోమథనం.ఆలోచనా తపస్సులో ఉన్న నా తండ్రితో ‘‘తండ్రీ! పాటకోసం దిగులుపడుతున్నావా?’’ అన్నాను. ‘‘ఫర్లేదు. నువ్వెళ్లు’’ అన్నాడు. కరెక్ట్... తండ్రీ! ‘‘ఫరవాలేదు. నువ్వెలా ఉన్నా ఫరవాలేదు అని పల్లవి చేయకూడదూ’’ అన్నాను అంతే. ‘‘ఫరవాలేదు. ఫరవాలేదూ చూడచక్కగున్నా లేకున్నా ఏం ఫరవాలేదు నువ్వెలా వున్నా పర్లేదూ ఊరూ పేరు వున్నా లేకున్నా పరవాలేదు ముఖమే కాదు... నీకు గొప్ప పేరు నీదో ప్రసిద్ధమైన ఊరు గాకున్నా లేకున్నా ఫర్లేదు అనే భావాన్ని అద్భుత సహజ సుందరంగా - అలవోకగా... మాట్లాడినట్టు పల్లవి పూర్తిచేశాడు. అనుపల్లవిని ఇలా అల్లుకున్నాడు. పల్లవి ఆధారంగా... అనుసంధానంగా... ‘‘నువ్వు ఎవ్వరైనా పర్లేదు. నీకు నాకు స్నేహం లేదు. నువ్వంటే కోపం లేదు. ఎందుకీ దాగుడు మూతలు అర్థం లేదూ మచ్చేదో ఉన్నదని మబ్బులో జాబిల్లి దాగుండిపోదు. దర్శకుడు చెప్పినట్టు రాస్తూనే తను ఎక్కడ ఎలా ఫిరంగి లాంటి భావాన్ని సన్నివేశ సొరంగంలో దూర్చాలో తెలిసిన కవితాపద్య యుద్ధ విద్య తెలిసిన పదభావ సైనిక యోధుడు భాస్కరభట్ల కనుకనే... ‘‘మచ్చతనకుందని మబ్బులో దాగుంటుందా జాబిల్లి’’ అనే కొసమెరుపు చేర్చి రసైక శ్రోతలను, ప్రేక్షక రసజ్ఞులను ‘ఔరా’ అనిపించడం సినీకవికి నిత్యకృత్యం దివారాత్రుల వ్యవసాయం... తరువాత తొలిచరణం - ‘మగాడ్ని వర్ణించే జాబితా తీసుకొని - మళ్లీ ఓ కొసమెరుపివ్వు తండ్రీ!’ అన్నాను. ‘‘ఉంగరాల జుట్టే లేదా - నాకు పర్లేదు రంగు కాస్త తక్కువ అయినా - మరి పర్లేదు’’ రాయగానే రంగు తక్కువ గురించి చెప్పారుగా. పై రెండు లైన్లకు కొసమెరుపుగా ఏ రంగులేని రాతిరి గురించి చెప్పు తండ్రీ! అనగానే, ‘‘మసిలాగా ఉంటుందని తిడతామా రాతిరినీ తనలోనే కనలేమా మెరిసేటి సొగసులని. అందంగా లేనూ అని - నిన్నెవరూ చూడరనీ నువ్వెవ్వరు నచ్చరనీ నీకెవ్వరు చెప్పేరూ ఎంతమంచి మనసో నీది - దానికన్న గొప్పది లేదూ అందగాళ్లునాకెవ్వరూ ఇంత నచ్చలేదూ నల్లగా వున్నానని కొమ్మల్లో దాగుండిపోదూ అని ముగించాడు. స్త్రీలు అందం, పర్సనాలిటీ - ఎత్తు కన్నా ప్రేమించే హృదయాన్ని - తన పట్ల గల బాధ్యతను, తనకు ఇవ్వబోయే భద్రతను చూస్తారని తెలియని చాలామంది యువకులకు చిన్న లెస్సన్ కూడా పనిలో పనిగా పూరించాడు భాస్కరభట్ల. ఇంక రెండో చరణాన్ని కొనసాగిస్తూ... ‘‘పోతన పద్యం’’ పడ్మనయనమ్మిలవాడు గుర్తుచేస్తే రివర్స్‌గా... అంతలేసి కళ్లుండకున్నా - కోరమీసం లేకున్నా పరదాలెందుకు అని మది నిన్నడగని సరదా పడుతుందంటూ ఎవ్వరేం అన్నా సరే నీ చేయి వదిలేది లేదంటూ పూర్తించాడు తేజా నా తండ్రి నన్ను’’ అంటూ భాస్కరభట్ల ఐపాడ్లోకెళ్లి కూచుంది. -
నిను కనలేని కనులుండునా కన్నయ్యా....
పాట నాతో మాట్లాడుతుంది ఉభయకుశలోపరి - అది - ఇదీ లేకుండా ‘‘నా గీతావళి ఎంతదూరం ప్రయాణం చేసినా అందాక ఈ భూగోళమ్మున అగ్గిపెట్టెదను నిప్పుల్ వోసి హేమంతభామా గాంధర్వ వివాహమాడెదను ద్రోమణ్యుష్ణ గోళమ్ముపై ప్రాణాకాశనవారుణాస్ర జలధారల్ చల్లి చల్లార్చెదన్’’ చింతలతోపులో కురియుచిన్కులకున్ - తడిముద్దయైన బాలింతయొడిన్ శయించు పసిరెక్కల మొగ్గనువోని బిడ్డకున్ - బొంతలు లేవుకప్పుటకు - బొంది హిమంబయిపోవునేమొ సాగింతును రుద్రవీణ పైనించుక వెచ్చని అగ్నిగీతముల్. పద్యాలు వినిపించి సినీగీతాలు రాయకముందే జైలుగోడల పైన స్వాతంత్య్ర యుద్ధ పద్యాలు రాసిన - రుద్రవైణికుడు నా తండ్రి దాశరథి. అంది దాశరథి పాట. అవును కండగల పద్యం. కలకండలాంటి భావగీతం - కర్రూర కళికలాంటి సినీగీతం - బాలగీతం - ఏదైనా ఏకకాలంలో రాయగలిగిన దాశరథి. ‘ఇంతకు నీవే పాటవు’ నేను ‘కన్నయ్య’ పాటను అంది - అరుదైన ఇతివృత్తం నాది అన్న ఆత్మవిశ్వాసంతో ఓహో.... చిత్రం ‘నాదీ ఆడజన్మే’ పాడింది సుశీల - నటించింది మహాభినేత్రి సావిత్రి - సంగీతం ఆర్.సుదర్శనం. కథాపరంగా నల్లని అమ్మాయ్ సావిత్రి. అవమానాలకు గురి అవుతూంటుంది. ఆ బాధ కృష్ణ భగవానుని ముందు తెలియపరచాలి. పాట తేటతనం తెలిసినవాడు కనుక ‘కృష్ణయ్యా నల్లని కృష్ణయ్య’ అని కాకుండా ‘కన్నయ్యా నల్లని కన్నయ్యా’ అంటూ పల్లవి తొలిపాదం కదిలింది. తెల్లని కాగితం వేదికపై నీలి సిరాక్షరి నర్తకీమణిలాగా నల్లని కన్నయ్య నీవు నల్లగున్నావని నిను చూడకుండా ఉంటారా ఎవరైనా అనే భావాన్ని... ‘నిను కనలేని కనులుండునా’ అని రెండో పాదం కదిలింది. ఇంక దర్శకుడు తెలిపిన కథానుగుణభావాన్ని... నిను ప్రేమింతురే - నిను పూజింతురే నను కనినంత నిందింతురే.... నిందింతురే ‘రే’ అక్షరం పెట్టడంలో ఎంత ఔచిత్యమో... నిందిస్తున్నారు అనే వేడుకోలుతో పాటు నిందిస్తారెందుకు అనే ప్రశ్న కూడా సంధించాడు. పద సంధానం తెలిసిన కవి సవ్యసాచి కదా దాశరథి. ఇక ఆపైన ‘నా గుణం తెలుసుకోని ఇంట నన్ను ఎందుకు పడవేశావు - నన్ను వెలిచేయాలనుకునే వారికి నన్నెందుకు బలిచేశావు. నీకేం సిరివుంది చూసుకుని మురిసిపోడానికి ‘సిరి’ అంటే సంపద అనే కాదు శ్రీమహాలక్ష్మి నిన్నూ నీ రంగునీ, నీ గుణాన్ని అర్థం చేసుకునే నీ అర్ధభాగం ఉంది. మంచి గుడి ఉంది. ఆ గుడిలో నీకు మంచి స్థానం ఉంది. ఇంక నాలాంటి దీనురాలిపై నీకెందుకుంటుంది దృష్టి అనే ఒక నిష్ఠూర భావనతో గుణమెంచలేనింట పడవేతువా - నను వెలివేసె వారికె బలిచేతువా సిరి చూసుకుని నీవు మురిసేవయా - మాచి గుడి చూసుకొని నన్ను మరిచేవయా- ఇంక రెండో చరణంలో... బంగారు రంగు కాకుండా బంగారం లాంటి మనసిచ్చావు. అందమైన శరీరపు వన్నెలేకుండా అందమైన గుణమిచ్చావు. ఈ మనసు - గుణము సాధారణమైన కళ్లకు కనిపించేవి కావు పైగా నల్లని రంగు పులిమి వెక్కిరింపుల మధ్య వేసి ఎలా బతుకమంటావు - ‘‘బంగారు మనసునే ఒసగినావు అందు. అందాల గుణమునే పొదగినావు మోముపై నలుపునే పులిమినావు ఇట్లు - నన్నేల బతికింపదలచినావు అని ముగించి దేవుడి పాటలలో ఒక అపూర్వ ఇతివృత్తంతో రాసి మరపురాని పాటగ మిగిలించాడు నా తండ్రి’’ అని... వస్తా అశోక్‌తేజా అంటూ ఏ నల్లనయ్య గుడిగంటల నాదాలలోకో వినీనమైంది ఆ పాట. -
కోడలికి అత్త స్వాగతం
డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత నా పాట నాతో మాట్లాడుతుంది నా పాట నాతో మాటాడింది. ఈ వారం నా గురించి చెప్పవూ అంటూ బుంగమూతి పెట్టి రాగాల గారాలు పోయింది. నా పాట - నీ గురించి చెప్పాలంటే ఇంకా ఎన్నో చెప్పాలి... అనుకుంటూ... జ్ఞాపకాల పారిజాత వనవిహారినయ్యాను. అప్పటికి ‘నమస్తే అన్న’, ‘మాయదారి కుటుంబం’, ‘రెండో కౄష్ణుడు’, ‘నిరంతరం’ సినిమాలకు రాశాను. మాయదారి కుటుంబంలో దర్శకరత్న దాసరి ప్రధాన పాత్ర చేస్తున్నారు. అందులో నటుడు ఉత్తేజ్ది ఒక పాత్ర. నేను ఉత్తేజ్ ఇంట్లో ఉండేవాణ్ణి. మా అక్కయ్య కొడుకే. ఉత్తేజ్ నన్ను దాసరిగారికి అన్నపూర్ణ స్టూడియోలో పరిచయం చేశాడు. మరునాడు ఉదయం 6-45కు రమ్మన్నారు. 6-44కు వారి దగ్గరికెళ్లా. ఆశ్చర్యం గురువుగారు అప్పటికే స్నానించి తెల్లని వస్త్రాల్లో కూచుని ఉండి నాకు షాక్ ఇచ్చారు. ప్రముఖ వ్యక్తికైనా, సాధారణ వ్యక్తికైనా ‘సమయపాలన’లో తేడా చూపకూడదనే పాఠం తొలిరోజే నేర్పిన గురువుగారికి పాదాభివందనం చేశాను. ఇంతవరకు రాసిన సినీగీతాలు కాదు మీ ఊళ్లో - నీ కోసం రాసుకున్న పాట వినిపించమంటే ‘నేలమ్మ’ ‘ఆకుపచ్చ చందమామ’ ‘టపటప చెమటబొట్లు’ వినిపించా. దగ్గరకు తీసుకుని వెన్నుతట్టి ‘నిన్ను సినీపరిశ్రమకు రాకుండా ఆపడం బ్రహ్మతరం కూడా కాదు, నేను అద్భుతమైన అవకాశం ఇస్తాను వెళ్లిరా’ అన్నాడు. ఆ తర్వాత తను అక్కినేని ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ‘రాయుడుగారు - నాయుడుగారు’ సినిమాకు మద్రాస్ పిలిపించి తన ఆఫీసులోనే ఉండమన్నారు. దాసరి ‘పాట తయారి సభ’ భువన విజయంలా ఉంటుంది. దాసరి శ్రీకౄష్ణదేవరాయలులా కూచుని ఉంటే సంగీత దర్శకులు, పాటల రచయితలు, సహకార దర్శకులు టేప్ రికార్డర్‌తో సిద్ధంగా ఉంటారు. అదో అద్భుత సన్నివేశం. కేకే నగర్లో ఆఫీస్. బిక్కుబిక్కుమంటూ నేను. ప్రతిభాన్విత రచయిత తోటపల్లి మధు ఒక కొత్త పాటల రచయితను గురువు గారికి పరిచయం చేశారు. సన్నివేశం ఇలా చెప్పారు... ఆ కొత్త రచయిత (నేనూ కొత్త రచయితనే అప్పుడు) నేనూ కూచున్నాం. కొత్త కోడలును ఆహ్వానిస్తూ తాను, సుజాత పాడే గీతం- తెలుగుతనం ఉట్టిపడుతూ ఆ ‘కట్టూబొట్టూ’ కనపడుతూ ఉండాలి అన్నారు దాసరి. నన్ను రాయమనలేదు. వారం గడిచింది. ఓ వైపు కథాచర్చలు - మరోవైపు ఈ పాట సభ. ఆ కొత్త రచయిత సుమారు 60 పాటలు రాసి వినిపించారు. దర్శక బౄందానికి నచ్చట్లేదు. ఆ తరువాత ఒక ప్రముఖ పాటల రచయితను పిలిపించి అదే సన్నివేశం చెప్పారు. మరికొన్ని రోజులు గడిచాయి. ‘పాట’ పల్లవులు నచ్చట్లేదు. నేనేమో ఖాళీగా ఉంటున్నాను. ఒక రాత్రి నా పాట నాతో మాట్లాడడం ప్రారంభించింది. అవునూ! పాట నిన్ను రాయమనలేదు, అయినా నీవు అదే సన్నివేశానికి రాయొచ్చుగా అంది. ‘‘అలా చెప్పకుండా రాస్తే తప్పేమో’’ అన్నాను. ‘‘ఏం రాస్తే కొడతారా? నీకు చెప్పలేదు కదరా ఎందుకు రాశావ్ అంటారు. బాగుంటే సమయం వౄథా కాకుండా రాసినందుకు మెచ్చుకుంటారు కదా’’ అంది. ‘గురువుగారు మీకు జోహారు, అత్తచేత కోడల్ని స్వాగతించే సన్నివేశం సమకూర్చడంలో ఎంత సామాజిక స్పౄహ తండ్రి మీకు’ అనుకుని- ‘‘గడపలో కుడిపాదమెట్టూ కోడలా కడుపులో పెట్టుకుని దాచుకుంటానమ్మా ఒట్టు - నా ఒట్టు - మా వొట్టు (మా యొక్క మరియు మామయ్యపై ఒట్టు) దేవుడొట్టూ’’ కడుపులో పెట్టుకుని దాచుకుంటాననడంలో పల్లెతనం - తల్లితనం వెరసి తెలుగింటి చల్లదనం సమకూరింది. ఇంక ‘ట్టూ’లతో సాగిపోయింది. పసుపు కుంకుమ కలిపినట్టూ పసిడి వన్నెల కన్నెబొట్టూ కలికి పలుకూ తేనెబొట్టూ కట్టుకున్నది కంచిపట్టూ చీరకట్టూ నుదట చిన్నబొట్టు అచ్చుగుద్దినట్టు - చూడ సిరులిచ్చు మా తల్లి మాలచ్చిమైనట్టు ॥ పల్లవి క్షణాల్లో కుదిరింది తనకుతానే తెలుగు ఓణి - తెలుగు బాణీ తొడుక్కొని. కట్నాలకోసం కోడళ్లను కాల్చిచంపే అత్తమామల విషపుటాలోచన పటాపంచలయేలా ఉండాలి మొదటి వాక్యం అనుకున్నాను. కొట్టివేతలు, కామాలు లేకుండా పాట పూర్తయింది. ఏ పెరడుదీ మల్లెచెట్టు - ఎవ్వారె ఈ తోడబుట్టు మీగడలు గిలకొట్టినట్టు - ఈ గడుసుదే ఇంటిగుట్టు నడకతీరు - ఇంటి నడతతీరు - ఇంక నగవు తీరు ఇదిగో నట్టింట నా పంటలచ్చియే దిగినట్టు వినయాలు నుడుగులైనట్టు - విజయాలు అడుగులైనట్టు ప్రతిభ కన్నుల దాగినట్టు - పట్టుదల ముక్కు చూపెట్టు ఆదిలక్ష్మి - మర్యాదలక్ష్మి - రావె ఇష్టలక్ష్మి నాకు అష్టలక్ష్మి భోగ భాగ్యమీలైనట్టు... పూర్తి చేశా. మరునాడు భయభయంగా దాసరి కోడెరైక్టర్ ‘రవన్న’కు రహస్యంగా వినిపిస్తే ‘భలే వాడివయ్యా నీ భయం పాడుగానూ రా’ అంటూ చేయిపట్టుకుని గురువుగారి చాంబర్లోకి తీసుకెళ్లి... గురువుగారూ మనపాట అద్భుతంగా వచ్చిందనడం, పాటనే పాడి వినిపించడం... ‘శభాష్’ అని కీరవాణి గార్ని పిలిపించడం... పాటకు బాణీ రికార్డింగ్ గంటల్లో జరిగింది. నా పాట నా జ్ఞాపకాలపేటికలోకి వెళ్లింది. -
మండలి రేసులో గులాబీ గుర్రాలెవరో..!
- పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీకి భారీ క్యూ - తెరపైకి తటస్థుల పేర్లు - అధినేత ఆశీస్సులున్న వారికే చాన్స్? హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో మండలి టికెట్ల లొల్లి గుబులు రేపుతోంది. వచ్చే నెలలో ఖాళీ అవుతున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రెండు నియోజకవర్గాల నుంచి పోటీకి అధికార పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనికి అనుగుణంగానే టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యా అధికంగానే ఉండడం... పార్టీతో సంబంధం లేని తటస్థుల పేర్లూ తెరపైకి రావడంతో ఇది మరింత రసవత్తరంగా సాగుతోంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ ఎన్నికలు ఉండడంతో పార్టీ ఆసాంతం మండలి ముచ్చట్లలో నే మునిగిపోయింది. పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న డాక్టర్ కె.నాగేశ్వర్ (మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్), కపిలవాయి దిలీప్ కుమార్ (వరంగల్ - ఖమ్మం - నల్లగొండ )ల పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం కూడా అదేరోజు ముగియనుంది. మండలి ఎన్నికల్లో బరిలో దిగాలనుకునేవారు ముందునుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడంపై దృష్టి పెట్టారు. అధికార టీఆర్ఎస్లో ప్రస్తుత పరిస్థితి చూస్తే పట్టభద్రుల నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక అంత తేలిక కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘కడియం’ ైవె పే మొగ్గు! వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో ఆయనకు మండలిలో చోటు కల్పిస్తారని ముందునుంచీ ప్రచారం జరుగుతోంది. అయితే, ఎలాంటి ఇబ్బంది ఉండని ఎమ్మెల్యే కోటా నుంచే ఆయనను మండలికి పంపుతారని భావించినా... వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి కడియం పేరు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో వివిధ రాజకీయ సమీకరణల వల్ల టికెట్లు ఇవ్వలేకపోయిన వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు పోటీ పడుతున్నారు. వరంగల్ జిల్లాకే చెందిన తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నాయకుడు మర్రి యాదవరెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా టీఆర్ఎస్ అధినేతను కోరినట్లు తెలుస్తోంది. ప్రచారంలో సుద్దాల అశోక్‌తేజ పేరు మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. ఇందులో సినీ పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. వామపక్షాల కూటమి ఈసారి ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను కాదని సుద్దాల అశోక్‌తేజను బరిలోకి దింపాలని యోచిస్తుండగా... ఆయన మాత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతుతోనే పోటీ చేస్తానని, లేదంటే పోటీలో ఉండనని చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు కేసీఆర్ మద్దతు ఇస్తే నాగేశ్వర్ కూడా బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, వారిద్దరూ ఈ విషయమై ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. మరోవైపు టీఎన్జీవో నేత దేవీప్రసాద్‌ను ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలన్న వ్యూహంలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. కానీ, దేవీప్రసాద్ తనకు ఎమ్మెల్యే కోటాలో అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ పూల రవీందర్ ద్వారా పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి ద్వారా టీపీఆర్టీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి కూడా తమకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. -
నా పాట నాతో మాట్లాడుతుంది
అవును.... పాట కాగితంపైకి రాబోయే ముందు, రాస్తున్నప్పుడు, రాసిన తర్వాత నాతో మాట్లాడుతుంది. పూర్వం ధన్వంతరి దగ్గరకు ఎవరైనా వ్యాధిగ్రస్తులు రాగానే వారి శారీరక, మానసిక పరిస్థితి తెలుసుకుని, తన ఔషధమూలికల వనములోకి వెళ్లి నిశితంగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చూసేవాడట. ఆ వ్యాధి తగ్గించగల ఔషధమూలిక తన కొమ్మలనో, రెమ్మలనో ఊపి, ‘ధన్వంతరీ నేను పనికొస్తానా చూడు’ అనేదట. అలా నా సన్నివేశానికి తగిన పల్లవినిస్తూ పాట నాతో మాట్లాడడం మొదలు పెడుతుంది. మైకేలేంజిలోతో శిల మాట్లాడినట్టు, కృష్ణశాస్త్రితో ప్రకృతి మాట్లాడినట్టు, రవివర్మతో కుంచె మాట్లాడినట్టు, అమరశిల్పి జక్కన్నతో ఉలి మాట్లాడినట్టు, సచిన్ టెండూల్కర్‌తో బ్యాట్ మాట్లాడినట్టు... పాట తన కవితో మాట్లాడుతుంది. నాతో మాత్రమే కాదు ఏ పాటల రచయితతోనైనా పాట మాట్లాడుతుంది. సంకల్పాన్ని పరమ ప్రాణంగా భావించుకునే ప్రతి వ్యక్తి ఆత్మకణం బ్రహ్మకణంతో ట్యూన్ అవుతూనే ఉంటుంది. అలాగే కవికి పాటకి ఒక తపస్సంబంధం ఉంటుంది. కనుకనే పాట నాతో మాట్లాడుతుంది అంటున్నాను. డా॥సుద్దాల అశోక్‌తేజ,పాటల రచయిత ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలోని ‘నీలిరంగు చీరలోన...’ : పాట పాటమాలి నానక్‌రాంగూడలో ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్ జరుగుతోంది. కృష్ణవంశీ కబురు పంపాడు. వెళ్లాక ఆయన అన్నమాట: ‘మీరు రాయబోయే పాట ఈ సినిమాకి గుండెకాయలాంటిది’. ‘ప్రతి పాట గురించి డెరైక్టరు ఇలాగే అంటారు...’ అని నవ్వాను నేను. ‘ఈ పాటలో జీవితం ఉండాలి, పండుగలుండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి... అలాగని సుత్తిపాట కాకుండా అట్రాక్ట్ చేసేవిధంగా మొదలెట్టాలి’ అన్నాడు. నాలుగురోజుల తర్వాత ఒక పాట తీసుకెళ్లాను. కృష్ణవంశీకి నచ్చలేదు. ఆ పాటలో ‘నీలిరంగు చీర’ అన్న పదమొక్కటే నచ్చిందన్నాడు. మళ్లీ ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు ‘నీలిరంగు చీర...’ అనేది కేంద్ర బిందువు. పాట పాడేది ప్రకాశ్‌రాజ్, జయసుధ. హీరో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాని పాడడు. ఇక్కడ జీవితం గురించి చెప్పాలి... అదే సమయంలో అట్రాక్షన్‌గా ఉండాలన్నది నాకు బాగా నచ్చింది. జీవితం గురించి అట్రాక్షన్‌గా చెప్పలేం. ‘ఒకటే జననం... ఒకటే మరణం...’ అన్నట్టు వెళ్లిపోతుంది. సీరియస్‌నెస్ ఉన్నదగ్గర ఆకర్షణ ఎక్కడ ఉంటుంది? మలేరియా బిళ్లను షుగర్ కోటింగ్‌తో ఇవ్వాలి. ‘నీలిరంగు చీర...’ అమ్మాయి కట్టుకునే వస్త్రం. ఆ సమయంలోనే నా మనసు పలికిన విషయం... ‘ఒరేయ్ అశోక్‌తేజా, జీవితానికి మించిన హొయలొలికించే జాణ ఇంకోటేదైనా ఉంటుందా!’ అని. ఇలాంటి సందర్భాన్నే నా పాట నాతో మాట్లాడుతుందని అన్నాను. జీవితాన్ని మించిన నెరజాణ లేదు. ఎప్పుడు ఏడిపిస్తుందో, నవ్విస్తుందో... ఎప్పుడు శిఖరానికి తీసుకెళుతుందో... పాతాళానికి పడేస్తుందో... పాపం అమ్మాయిల్ని నెరజాణలంటారుగానీ, అమ్మాయికంటే లక్ష రెట్లు ఎక్కువ నెరజాణ జీవితమే. ఇలా ఆలోచిస్తుండగా ఓ అర్ధరాత్రి వచ్చిన ఆలోచన ఏంటంటే... ‘అమ్మాయి గురించి చెబుతూ చెబుతూ వెళ్లి... అమ్మాయి కాదురా అమాయకుడా... జీవితంరా ఇది’ అని చెబితే ఎలా ఉంటుంది అని ఫిక్స్ అయ్యాను. ‘‘నీలిరంగు చీరలోన/ చందమామ నీవె భామా ఎట్ట నిన్ను అందుకోనే/ ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా/ నిన్ను ఎట్ట అదుముకోనే’’ మామూలుగా స్త్రీకి ఏడు రంగులుండవు. కానీ స్త్రీలో కేవలం శృంగారమే ఉండదు. అమ్మ ఉంది. తోబుట్టువుంది. స్నేహితురాలుంది. చిన్నారి వేలు పట్టుకుని నడిచే కూతురుంది. అందుకే ఏడు రంగులున్న నడుము అన్నాను. స్థిరంగా ఉన్నదాన్ని కౌగిలించుకుంటాం గానీ తిరుగుతున్నదాన్ని ఎలా కౌగిలించుకుంటాం. జీవితం కూడా ఒకే దగ్గర ఉండదు. ‘‘ముద్దులిచ్చి మురిపిస్తావే/ కౌగిలిచ్చి కవ్విస్తావే అంతలోనే జారిపోతావే’’ పదేళ్లకిందటి నా జీవితం ఎక్కడుంది! ఎప్పుడో నా చేజారిపోయింది. ‘‘మెరుపల్లె మెరిసే జాణ/ వరదల్లె ముంచే జాణ ఈ భూమిపైన నీ మాయలోన/ పడనోడు ఎవడే జాణ’’ ‘‘జాణ అంటే జీవితం.. జీవితం నెరజాణరా దానితో సైయ్యాడరా ఎదురీదరా/ ఏటికీ ఎదురీదరా’’ ఈ పల్లవి చూపించగానే కృష్ణవంశీ బిగ్గరగా కౌగిలించుకున్నాడు. ‘అద్భుతమైనటువంటి ట్విస్ట్ ఇచ్చావు అశోక్.. ఇక చరణాల్లో ఏం చేస్తావో నీ ఇష్టం’ అన్నాడు. మరొక వారం రోజుల్లో చరణాలు రాసుకుని వెళ్లాను. చరణాలు నచ్చాయి. కానీ మద్రాసులో మ్యూజిక్ డెరైక్టర్‌కి ఇచ్చాక... ఆయననుకున్న ట్యూన్లకి, నేను రాసిన చరణాలు పొంతన కుదర్లేదు. మ్యూజిక్ డెరైక్టర్ యువన్‌శంకర్‌రాజా. ‘చరణాలకు నేను ముందు ట్యూన్ ఇస్తాను. దానికి తగ్గట్టు మార్చ’మన్నాడు. నేనూ, కృష్ణవంశీ మద్రాసులో హోటల్ రూం తీసుకుని వారంరోజులుండి ఆ పనికానిచ్చాం. కృష్ణవంశీ ఇల్లు ఆ పక్కనే ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి కలిసేవాడు. మొదటి చరణంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పమన్నాడు. ఈ పాటకు సంబంధించి నా లక్ష్యమొక్కటే, అటు సి.నారాయణరెడ్డిగారికీ కనెక్ట్ అవ్వాలి, ఇటు సామాన్యుడికీ అర్థంకావాలి. చరణం: 1 ‘‘రాక రాక నీకైవచ్చీ పున్నమంటి చిన్నది ఇచ్చే కౌగిలింతె బతుకున వచ్చే సుఖమని’’ ‘‘పువ్వులాగ ఎదురే వచ్చి ముల్లులాగ ఎదలో గుచ్చీ మాయమయ్యె భామవంటిదే కష్టమనుకో’’ ‘‘ఏదీ కడదాకా రాదని/ తెలుపుతుంది నీ జీవితం నీతో నువు అతిథివనుకోని ’’ మనిషికి తనను మించిన అతిథి, ఆత్మీయుడు మరొకరు లేరు. ‘‘జాణకాని జాణరా - జీవితం నెరజాణరా జీవితం ఒక వింతరా - ఆడుకుంటే పూబంతిరా’’ బంతి మనల్ని ఆడుకుంటదా, మనం బంతితో ఆడు కుంటామా అనేది మన శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. చరణం: 2 ‘‘సాహసాల పొలమే దున్నీ/ పంట తీసే బలమే ఉంటే ప్రతిరోజు ఒక సంక్రాంతి అవుతుందిరా’’ ‘‘బతుకు పోరు బరిలో నిలిచీ/ నీకు నువ్వే ఆయుధమైతే ప్రతీపూట విజయదశమీ వస్తుందిరా’’ నీకు నువ్వే ఆయుధమవ్వాలనడంలో రెండు అర్థాలున్నాయి. ఒకటి ప్రపంచంతో పోరాడి గెలవాలి. నీలో ఉన్న బలహీనతలతోనూ పోరాడి గెలవాలి. ఇందులో ప్రతి మాట యూత్‌కి కౌన్సెలింగ్లా ఉపయోగపడాలి. అందుకే రామ్‌చరణ్‌తేజ స్టేజ్‌పై ‘ఇంతవరకూ చాలా సినిమాలు చేశాను అంకుల్. కానీ నాకు ఇంత మంచి పాట ఇచ్చింది మీరే’ అన్నాడు. ‘‘నీపై విధి విసిరే నిప్పుతో ఆడుకుంటే దీపావళి’’ దీపావళి నిప్పుతో ఆడుకునే పండగ. ప్రమాదంతో ఆడుకోవడం. మనిషి జీవితంలో విధి ఎప్పుడూ నిప్పులు జల్లుతానే ఉంటుంది. ‘‘చెయ్ రా ప్రతి ఘడియ పండుగే/ చెయ్ర...చెయ్ర...చెయ్ జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా జీవితం ఒక జాతర చేయడానికే జన్మరా జీవితం ఒక జాతర చేయడానికే జన్మరా’’ రంగులరాట్నంలో ఒకడు గుర్రంమీద ఎక్కుతాడు, ఒకడు గాడిద మీద ఎక్కుతాడు. ఎవరు ఏ వాహనం ఎక్కినా అందరినీ ఒకేవిధంగా తిప్పుతుంది. ఒకే గమ్యానికి చేర్చుతుంది. ప్రతి ఒక్కరి ప్రారంభం ఒక్కటే, ప్రస్థానం ఒక్కటే. జీవితం ఒక ఉత్సవంలాంటిది. జాతర చేయడానికే వచ్చాం. అందుకే జాతర చేయడానికే ఈ జన్మరా... అని ముగించాను. రిపోర్టింగ్: భువనేశ్వరి -
అది శంకర్ గారి గొప్పదనమే..!
-
సుద్దాల అశోక్ తేజకు గురజాడ పురస్కారం
విజయనగరం: మహాకవి గురజాడ అప్పారావు 14వ విశిష్ట పురస్కారాన్ని ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ అందుకున్నారు. విజయనగరంలోని గురజాడ కళాభారతిలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుద్దాల మాట్లాడుతూ... గురజాడ అప్పారావు విశిష్ట పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వాడుక భాషకు ప్రాణం పోసిన బ్రహ్మ గురజాడని అభివర్ణించారు. సాంఘిక విప్లవాన్ని తన గుండె లోతుల్లో జీర్ణించుకుని అందుకోసం మహోన్నతమైన దారిని ఏర్పరచిన మహనీయుడు గురజాడ అని కొనియాడారు. ద్వారం వెంకటస్వామినాయుడు, ఆదిభట్ల, ఘంటసాల, సుశీల వంటి ఎందరో మహానుభావులు నడయాడిన ఈ గడ్డలో పాద ధూళిని తాను సింధూరంగా ధరిస్తున్నానని అన్నారు. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడూతూ ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్‌కు, హరికథకు ఆదిభట్ల నారాయణదాసు, రచనకు గురజాడ చిరునామాగా నిలిచారన్నారు. 125 ఏళ్ల క్రిందట రాసిన కన్యాశుల్కం ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉందంటే ఆయన రచనా శైలి గొప్పదనమని గుర్తుచేశారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ గురజాడ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మాట్లాడుతూ మహాకవి గురజాడ విజయనగరానికే కాదు భారతదేశానికే కీర్తిని తెచ్చిపెట్టారన్నారు. భూమిపై తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం, తెలుగు అక్షరం ఉన్నంతకాలం గురజాడ రచనలు చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందుగా అతిథులు గురజాడ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించారు. సభకు సమాఖ్య అధ్యక్షుడు పివి.నరసింహరాజు అధ్యక్షత వహించారు. గురజాడ మనవడి భార్య గురజాడ సరోజినీదేవి, ఆమె కుమారుడు ప్రసాద్, కోడలు ఇందిరలు, సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ అధిక సంఖ్యలో సాహితీప్రియులు పాల్గొన్నారు. -
సుద్దాలకు నాగభైరవ అవార్డు ప్రదానం
నెల్లూరు: ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని పురమందిరంలో ఆదివారం ప్రతిష్టాత్మక డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా అశోక్‌తేజను నాగభైరవ అవార్డు కమిటీ అధ్యక్షుడు వెన్నెలకంటి, అతిథులు సత్కరించి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రచయిత సలీం పాల్గొన్నారు. -
సుద్దాలకు గురజాడ పురస్కారం
విజయనగరం: ప్రముఖకవి, సినీగేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజకు గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేయనున్నట్టు గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు పి.వి.నరసింహ రాజు తెలిపారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30న గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని సమాఖ్య ఆధ్వర్యంలో సాహితీ చైతన్యోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశ్ మాట్లాడుతూ 30వ తేదీ ఉదయం గురజాడ స్వగృహంలో గురజాడ చిత్రపటం వద్ద నివాళులర్పించి ఆయన కలం నుంచి జాలువారిన గీతాలను ఆలపిస్తూ, ఆయన వినియోగించిన వస్తువులతో ఊరేగింపుగా గురజాడ గ్రంథాలయానికి చేరుకుంటారన్నారు. అనంతరం గ్రంథాలయంలో గురజాడ సాహితీ సదస్సు జరుగుతుందని తెలిపారు. సాయంత్రం జరిగే కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజకు పురస్కారం అందజేయనున్నట్టు తెలిపారు. -
23న సుద్దాలకు నాగభైరవ అవార్డు ప్రదానం
నెల్లూరు: ప్రతిష్టాత్మక డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు-2014 అవార్డును ప్రముఖ సినీకవి సుద్దాల అశోక్‌తేజకు ఈనెల 23న ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు అవార్డు కమిటీ అధ్యక్షుడు వెన్నెలకంటి, ప్రధాన కార్యదర్శి చిన్నివెంకటేశ్వరరావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే ప్రముఖ కవి అద్దంకి శ్రీనివాస్‌కు నాగభైరవ సాహితీ అవార్డు , ఆరుగురు కవులకు నాగభైరవ స్ఫూర్తి అవార్డులను అందజేయనున్నట్టు వెల్లడించారు. వారిలో ఏటూరి నాగేంద్ర కుమార్(నెల్లూరు), కోసూరు రవికుమార్(గుంటూరు), తూమాటి సంజీవరావు(చెన్నై), కోకావిమలకుమారి(విజయవాడ), అద్దేపల్లి జ్యోతి(కాకినాడ), శ్రీరామకవచం(ఒంగోలు) ఉన్నారని తెలిపారు. -
‘కొమరం భీమ్ జాతీయ అవార్డు’ని అందుకున్న సుద్దాల అశోక్‌తేజ
-
కొమరం భీమ్‌నే ఇంటికి తీసుకెళ్తున్నంత సంబరంగా ఉంది
‘‘గిరిజన పోరాట యోధుడు, ఆదివాసీల ఆరాధ్యదైవం కొమరం భీమ్. ఆ మహనీయుని పేరిట స్థాపించిన జాతీయ పురస్కారాన్ని నాకందించడం గర్వంగా ఉంది. కొమరం భీమ్‌నే నా ఇంటికి తీసుకెళ్తున్నంత సంబరంగా ఉంది’’ అని రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. భారత్ కల్చరల్ అకాడమీ, కొమరం భీమ్ స్మారక పరిషత్, ఆదివాసి సంస్కృతి పరిరక్షణ సమితి, ఓం సాయితేజ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘కొమరం భీమ్ జాతీయ అవార్డు’ని ఈ ఏడాది సుద్దాల అశోక్‌తేజకు అందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో 50 వేల 101 రూపాయల నగదు, దుశ్శాలువా, జ్ఞాపికతో సుద్దాలను సన్మానించారు. ఈ సందర్భంగా సుద్దాల స్పందిస్తూ -‘‘సినిమా రంగంలో ఇప్పటివరకూ 30 అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులన్నీ ఓ ఎత్తు... ఈ పురస్కారం ఓ ఎత్తు. దాసరి నారాయణరావు, కేవీ రమణాచారిగార్ల ప్రోత్సాహం వల్లే సినీ పరిశ్రమలో రచయితగా ఈ స్థాయికి రాగలిగాను. దాసరి గారి ‘పరమవీర చక్ర’ సినిమాకోసం కొమరంభీమ్పై పాట రాసే అదృష్టం కూడా నాకు కలిగింది. ఆనాటి కృషి ఈ విధంగా ఫలించిందనుకుంటున్నాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కొమరం భీమ్ మనవడు కొమరం సోనేరావు, పరుచూరి గోపాలకృష్ణ, బాబూమోహన్, రమణాచారి, సముద్రాల వేణుగోపాలాచారి, వెనిగళ్ల రాంబాబు, శాసనసభ్యులు రసమయి బాలకిషన్, కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
భార్యకు క్షమాపణ చెప్పండి!
సుద్దాల అశోక్‌తేజ - అంతర్వీక్షణం సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఇటీవల గీతం యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. నల్లగొండ జిల్లా సుద్దాల అనే గ్రామంలో, 1960 వైశాఖ పున్నమి రోజు పుట్టిన అశోక్‌తేజ అంతరంగాన్ని వీక్షించే ప్రయత్నం ఇది! మీలో నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం? నచ్చని లక్షణం... మా ఆవిడను విసుక్కోవడం. నచ్చే లక్షణం దేవతామూర్తుల తర్వాత స్త్రీమూర్తులను అంతగా గౌరవించడం. ఎదుటి వారిని చూసే దృష్టి కోణం? వీరి నుంచి నేర్చుకోగలిగింది ఏమిటి అని. ఎలాంటి వారిని ఇష్టపడతారు? మానవీయత ఉన్న వారిని ఏడు జన్మల స్నేహితులుగా భావిస్తాను. డాక్టరేట్ అందుకున్న క్షణంలో కలిగిన భావం? సినిమా అవార్డులు ఆ ఏడాది వచ్చిన సినిమాల ఆధారంగా ఇస్తారు. డాక్టరేట్ అనేది మన పనిని ఆమూలాగ్రం మూల్యాంకనం చేసి ఇచ్చేది. కాబట్టి ఎన్నో రెట్లు ఎక్కువ ఆనందాన్ని పొందాను. గౌను వేస్తున్నప్పుడు అద్భుతమైన, అప్రమేయమైన ఆనందం కలిగింది. మీకు నచ్చిన పుస్తకాలు..! అమ్మ టైలరింగ్ చేస్తున్నప్పుడు నేను చదివి వినిపించిన వాటిలో మాక్సిం గోర్కీ రాసిన ‘అమ్మ’ నవల బాగా నచ్చింది. నాన్న ఒళ్లో కూర్చోబెట్టుకుని కంఠతా వచ్చేలా చదివించిన మహాప్రస్థానం నా రక్తంలో ఇంకి పోయింది. ఏ రంగలో స్థిరపడాలనుకునేవారు? ... ఆరవ తరగతి నుంచి డాక్టర్ సి.నా.రె.లా సినీరచయిత కావాలనుకునేవాడిని. అలాగే అయ్యాను. మీరు ఎక్కువ ఇష్టపడే వ్యక్తి ఎవరు? ఒకరు కాదు ఇద్దరు. అమ్మ, మా ఆవిడ. మిమ్మల్ని ప్రభావితం చేసిన వారు! మొదట నాన్న. తర్వాత నారాయణరెడ్డి. తొలి పాట రాసినప్పటి అనుభూతి ... తొమ్మిదేళ్లకే రాశాను. అనుభూతి తెలియని వయస్సది. ఎనిమిదవ తరగతిలో పాఠాన్ని పాటగా రాసినప్పుడు వచ్చిన ప్రశంస అనిర్వచనీయం. తొలి సంపాదన! ... దాసరి నారాయణరావు నా పాటలు విని ‘‘నీ పాటలు తీసుకుంటాను’’ అని కవిని ఊరికే పంపకూడదంటూ మూడువేల రూపాయలిచ్చారు. ఆ డబ్బుతో నా కుటుంబాన్నంతటినీ (అక్క- బావతోపాటు) తిరుపతికి తీసుకెళ్లాను. అది నా మనసును నింపిన తొలి సంపాదన. అలాంటి మనసు నిండిన మరో సంఘటన? నా భార్య నిర్మలతో కలిసి ఓ ఫంక్షన్కెళ్తుండగా ఒక ఫోన్. అవతలి వ్యక్తి ‘‘వైస్ చాన్స్లర్గారు మాట్లాడతారు’’ అని చెప్పారు. ఏదో కార్యక్రమం గురించేమో అనుకున్నాను. ఆయన డాక్టరేట్ గురించి చెప్పారు. నన్ను నేను తట్టుకోవడానికి నిర్మల చేతిని గట్టిగా పట్టుకున్నాను. మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి? ...ఒకరిద్దరు కాదు. సినిమా రంగంలో ఇది మామూలే. అప్పుడలా చేసి ఉండాల్సింది కాదు అనిపిం చిన పని... నిర్ణయం? ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను పునరాలోచించుకోవాల్సిన అవసరమే రాలేదు. ఎవరికైనా క్షమాపణ చెప్పారా? మా ఆవిడకే. విసుక్కుని నొప్పించాను అనిపిస్తుండేది. అంతే... క్షమాపణ చెప్పేశాను. మీలా ఆలోచించే భర్తలు తక్కువేమో? ఇది భర్తలకు సూచన... ‘భార్యకు క్షమాపణ చెప్పడానికి వెనుకాడవద్దు. మీరు క్షమాపణ చెప్పిన విషయాన్ని ఆవిడ ఎవరికీ చెప్పదు. సత్యభామ కాళ్లు పట్టుకున్న విషయాన్ని కృష్ణుడు తనంతట తాను చెప్పుకున్నాడే తప్ప సత్యభామ చెప్పలేదు’. భాగస్వామికి సమయం కేటాయిస్తున్నారా? సినిమా ప్రయత్నాల సమయంలో ఒకరినొకరు దినాలు, నెలలు కూడా మిస్సయ్యాం. పాటల్లో ఉపయోగించే భావం... కృష్ణశాస్త్రి మెత్తదనాన్ని, శ్రీశ్రీ కత్తిదనాన్ని మేళవించి రాశాను. కవిత్వం, సాహిత్యం తెలియని వారికి కూడా హృదయం లోపల ఒక సున్నితమైన పాయింట్ ఉంటుంది. నా కలం ములుకు ఆ బిందువును తాకాలన్నట్లు రాస్తాను. కుటుంబ జీవితంలో ఆనందపడిన క్షణాలు? నా కూతురికి ఇద్దరు కూతుళ్లు. నా కొడుక్కి ఒక కొడుకు. వారితో ఆడుకుంటుంటే గర్భగుడిలో దైవం సాన్నిహిత్యంలో ఉన్నట్లుంటుంది. ఒక్క రోజు మిగిలి ఉంటే ఏం చేస్తారు? మొదలు పెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముగించాల్సిన పని ఒక్కటీ లేదు. ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? ఎక్కువ మా ఆవిడతోనే. అయితే అన్నీ ప్రమాదానికి దారితీయని చిల్లర అబద్ధాలే. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు? మళ్లీ ఇలాగే... ప్రజల మనసులను తాకే రచయితగా... పుట్టించమని కోరుకుంటాను. మీ గురించి మీరు ఒక్కమాటలో... మాటతోనైనా, పాటతోనైనా హృదయాలను కదిలించే వ్యక్తిని. - వి.ఎం.ఆర్ -
స్టార్ రిపోర్టర్@ కోటి
ట్రిపుల్ రైడర్స్‌కు టై.. ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ కంట పడతామేమోనని ! ఆటోవాలాకు హడల్ .. సిగ్నల్ జంప్ చేసినందుకు చలాన్‌తో ఇరగదీస్తాడని ! సెలబ్రిటీలకు భయం.. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద బుక్ చే సి ఇమేజ్ ఇస్త్రీ చేసేస్తాడని! రాంగ్ రూట్లో వెళ్లే వాళ్లు.. లెసైన్స్ ఇంట్లో మరచిపోయామని కాకమ్మ కబుర్లు చెప్పేవాళ్లు.. పాత బండికి ఇన్సూరెన్స్ ఎందుకని అడిగేవాళ్లు.. ట్రాఫిక్ పోలీసులంటే వసూల్రాజాలని నెగెటివ్‌గా భావిస్తారు. తప్పుదారిలో వెళ్తూ చిక్కిన వారికి చలాన్లు రాస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను చూసిన వారందరూ అన్యాయంగా డబ్బులు గుంజుతున్నాడని అనుకుంటారు. నిబంధనల గీత దాటిన వారికి వాత పెడితేనే సెట్ అవుతారంటారు ట్రాఫిక్ పోలీసులు. పొల్యూషన్ పరుచుకున్న దారి.. చెవుల్లో జోరీగల్లా హారన్లు.. కంటిలో నలుసులా ధూళి.. గంటల తరబడి నిల్చుని అలసిన కాళ్లు.. సిటీ రోడ్లపై ట్రాఫిక్ సిబ్బంది పడే కష్టాలు ఇంతింత కాదు. ఇన్ని నెగెటివ్ యాస్పెక్ట్స్లో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులను ‘సిటీ ప్లస్’ తరఫున ‘స్టార్ రిపోర్టర్’గా మ్యూజిక్ డెరైక్టర్ కోటి పలకరించారు. కోటి: హాయ్.. స్టార్ రిపోర్టర్‌గా మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఉద్యోగంలో ఉన్నవారికి చాలా ఓర్పు కావాలి. రోజుకు వేల మందిని కంట్రోల్ చేస్తుంటారు.. శ్రీనివాసులు: వందలాది మందిని కంట కనిపెట్టాలి.. పొరపాటుగా డ్రైవ్ చేస్తున్నవారిని కంట్రోల్ చేయాలి. ఒకరు సిగ్నల్ జంప్ చేస్తారు.. ఇంకొకరు రాంగ్ రూట్లో వస్తుంటారు.. అన్నీ ఓపిగ్గా చూసుకోవాలి. మా డ్యూటీనే అంత కదా సార్. కోటి: సిటీ ట్రాఫిక్‌లో ఓ గంట ఇరుక్కుపోతేనే తట్టుకోలేం. అలాంటి ది మీరు రోజంతా దుమ్ము, ధూళిలో ఉంటారు కదా.. మీ పరిస్థితేంటి ? ఆజామ్: ఒక్క మాటలో చెప్పాలంటే మాది రిస్కీ జాబ్ సార్. ప్రతి రోజూ ఉదయం బెల్లం, నానబెట్టిన శనగలు కలిపి తింటే డస్ట్ నుంచి ఎలర్జీ రాకుండా ఉంటుంది. మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్‌లో ఇవి అందుబాటులో ఉంటాయి. సురేష్ కుమార్: ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా మిగతా ఉద్యోగులతో పోలిస్తే మా లైఫ్ టైం ఐదారేళ్లు తక్కువే సార్. కోటి: అవునా.. ఎలర్జీ రాకుండా బెల్లం, శనగలు పని చేస్తాయా..? శ్రీనివాసులు: యస్ సార్. పీల్చిన దుమ్ముని క్లియర్ చేసే శక్తి వాటికి ఉంటుంది. కోటి: గంటల తరబడి ఉండాలంటే ఓపిక కూడా బాగానే ఉండాలి కదా..! ధనుంజయ్: మాలో ఓపిక పెంచడం కోసం ఏడాదికి రెండు లేదా మూడు సార్లు బీఓసీ (బిహేవియర్ ఆఫ్ ఓరియంటేషన్ కోర్స్) ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో యోగా, మెడిటేషన్ ఉంటాయి. దాంతో మాకు సెల్ఫ్ కంట్రోల్ పెరుగుతుంది. కోటి: ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి గురించి చెప్పండి..? కుమారస్వామి: నేను చిక్కడపల్లి స్టేషన్ పరిధిలో పని చేస్తాను. అక్కడ ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. 80 శాతం మంది రూల్స్ ఫాలో అవుతారు. అసలు చిక్కల్లా 20 శాతం మందితోనే. గల్లీల్లో కూడా తమ స్పీడ్ ప్రదర్శించాలనుకుంటారు. సిగ్నల్స్ ఫాలో అవ్వరు. ఏమైనా అంటే మమ్మల్నే టీజ్ చేస్తూ పోతారు. కోటి: ఇప్పుడు సిటీలో వెహికల్స్ పెరిగాయి. ఇంటింటికీ బైకులు, కార్లున్నాయి! సురేష్‌కుమార్: సిటీలో చాలా రోడ్లు నిజాం జమానావే. ఆ కాలంలో ఉన్న వాహనాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగాయి. ఇక మా పరిస్థితి ఊహించుకోండి. కోటి: రోడ్డుపై చిన్న సంఘటన జరిగినా.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది. ధనుంజయ్: దానికి కారణం.. ఇరుకు రోడ్లు, పెరిగిన వాహనాలు, పద్ధతి లేని డ్రైవింగ్ అనుకోరు. మేం సరిగా పనిచేయకపోవడం వల్లే ట్రాఫిక్ జామ్ అయిందనుకుంటారు. శ్రీనివాసులు: నడిరోడ్డు మీద ఏదైనా పెద్ద బండి ఆగిపోతే ట్రాఫిక్ స్తంభించిపోతుంది. అందరూ ట్రాఫిక్ పోలీసులేరని ఆవేశపడిపోతుంటారు. వాళ్లు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలోనే ఉన్నారని ఏ ఒక్కరూ అర్థం చేసుకోరు. కోటి: డ్రంక్ అండ్ డ్రైవ్‌ని ఎంత వరకూ కంట్రోల్ చేయగలుగుతున్నారు? శ్రీనివాసులు: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇండియాలో చేసిన సర్వేలో.. రోడ్డు ప్రమాదాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగినవే ఎక్కువని తేలింది. హైదరాబాద్, జలంధర్‌లో ఈ ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించింది. తాగడం అనేది వారి పర్సనల్. కానీ.. తాగి డ్రైవ్ చేసే హక్కు వాళ్లకు లేదు. రాజు: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన కల్పించడానికి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ వెహికల్ ఏర్పాటు చేశాం. దీన్ని నగరంలో అక్కడక్కడ రోడ్డుపక్కన ఆపి ఉంచుతాం. రోడ్డు ప్రమాదాలపై సీసీ ఫుటేజ్ ఆధారంగా రూపొందించిన ప్రోగ్రామ్స్ అందులో తిలకించవచ్చు. కోటి: రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు మీరు స్పందించే తీరుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. శ్రీనివాసులు: ఉద్యోగ ధర్మంగా మాత్రమే కాదు సార్.. అలాంటి సందర్భాల్లో ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తుంటాం. అలాగే అంబులెన్స్ వెళ్లే దారులను క్లియర్ చేయడంలో వేగంగా స్పందిస్తాం. ఆ టైంలో ఒక ప్రాణాన్ని కాపాడే బాధ్యత మాపై ఉందని గుర్తుంచుకుంటాం. కోటి: చివరిగా ప్రశ్న.. ప్రజలందరూ అడుగుదామనుకునే ప్రశ్న. ట్రాఫిక్ పోలీసులు అనగానే చలాన్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తారని ఆరోపణ, అలాగే లంచాలు కూడా.. శ్రీనివాసులు: మేం వసూలు చేసే డబ్బులను చూస్తారు కానీ మేం ఇచ్చే చలాన్ స్లిప్ చూడరు. ఆ వాహనదారుడు చేసిన తప్పు ఎవరికీ పట్టదు. ముందు మమ్మల్ని నెగటివ్‌గా చూడ్డం మానేయాలి సార్. కోటి: ట్రాఫిక్ పోలీస్ అంటే తప్పు చేయకుండా కాపు కాసే అన్న అనే భావన అందరికీ రావాలి. తప్పు చేసినపుడు మన పెద్దలు దండించినట్టే వీరు కూడా ప్రవర్తిస్తారు. ఎండనకా, వాననకా గంటల తరబడి నిలబడి మన ప్రాణాలను కాపాడుతున్న వీరికి మనం సహకరిద్దాం. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వడంలో సిటీ ఈజ్ ద బెస్ట్ అనిపించుకుందాం. ఇదే ఈ ‘కోటి’ ఆశ. కోటి : నేనొకసారి కేబీఆర్ పార్కు దగ్గర అందరూ పార్కు చేశారు కదా అని నేనూ రాంగ్ ప్లేస్‌లో పార్క్ చేశాను. వచ్చి చూస్తే కార్కు లాక్ వేసేశారు. పోలీసుల దగ్గరికి వెళ్లి సారీ చెప్పి ఫైన్ కట్టాను. అమెరికా వెళ్లొచ్చిన ప్రతి ఒక్కరు అక్కడి ట్రాఫిక్ రూల్స్ గురించి గొప్పగా చెబుతారు. అక్కడ రూల్స్ పాటించిన వారు ఇక్కడకు వచ్చేసరికి రాంగ్ పార్కింగ్లు, సిగ్నల్ జంప్ చేస్తారు. అమెరికాలో రెడ్ సిగ్నల్స్ పడగానే వెహికల్స్ ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. గ్రీన్ సిగ్నల్ పడగానే స్టార్ట్ చేసుకుని వెళ్లాలి. అలాంటి టెక్నాలజీ మనకూ అందుబాటులోకి వస్తే పొల్యూషన్ కొంతైనా తగ్గుతుంది. సుద్దాల పాటకు కోటి ట్యూన్ ట్రాఫిక్ పోలీసులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రాఫిక్ ఎడ్యుకేషన్ వెహికల్లో కోటి కాసేపు గడిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా రూపొందించిన రోడ్డు ప్రమాదాల సంఘటనల వీడియోను వీక్షించారు. దానికి బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ హిందీలో ఉండటాన్ని గమనించిన కోటికి.. ఆ పాట తెలుగులో ఉంటే బాగా అర్థమవుతుంది కదా అన్న ఆలోచన వచ్చింది. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు విషయం చెప్పగానే ఆయన లిరిక్స్ రాయడానికి ఓకే అన్నారు. పాట రాగానే తానే ట్యూన్ కట్టి సిటీ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థకు డెడికేట్ చేస్తానని చెప్పారు కోటి. -
కన్నులపండుగగా గీతం వర్సిటీ స్నాతకోత్సవం
-
దర్శకేంద్రుడు, సుద్దాలకు డాక్టరేట్లు
విశాఖపట్నం: ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్లకు గీతం యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్లను ప్రకటించింది. మంగళవారం విశాఖపట్నంలోని గీతం యూనివర్శిటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే అగ్నిక్షిపణుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త, డి.ఆర్.డి.వో డైరెక్టర్ జనరల్ అవినాష్ చందర్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్‌ను ప్రకటించింది. ఈ నెల 13న జరిగే యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఈ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నట్లు గీతం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వివిధ రంగాలకు చెందిన రాఘవేంద్రరావు (సినీ రంగం), సుద్దాల అశోక్ తేజ (సాహిత్యం), శైలజాకిరణ్ (పారిశ్రామిక)లకు గౌరవ డాక్టరేట్లకు... అవినాష్ చందర్ (శాస్త్ర సాంకేతిక) డాక్టర్ ఆఫ్ సైన్స్ కి ఎంపిక చేసినట్లు గీతం పేర్కొంది. -
'సూర్యుడే సెలవనీ..' : పాట పుట్టిందిలా
-
కవి స్వేచ్ఛాజీవి
- సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆ కలానికి జనం బాధలు, కష్టాలు, కన్నీళ్లు తెలుసు. ఆ సాహిత్యం.. ప్రజా సమస్యల ప్రతిబింబం. పదంపదంలో ఉద్యమపథం.. మాటమాటలో పోరాట కెరటం. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. తెలుగు పద ప్రయోగంలో కొత్త ఒరవడిని సృష్టించి.. తెలుగు పాటకు జాతీయ కీర్తి తెచ్చిపెట్టిన సినీకవి, సాహితీమూర్తి సుద్దాల అశోక్ తేజ. ఆయన రాసిన పాటల పూదోటలో ఎన్నో కుసుమాలు.. మరెన్నో కాంతి శిఖరాలు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్న అశోక్ తేజ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. - విజయవాడ కల్చరల్ సాక్షి : కృష్ణవేణి క్రియేషన్స్ ఆధ్వర్యంలో అభినందన సత్కారం అందుకున్నందుకు అభినందనలు.. అశోక్ తేజ : థ్యాంక్స్.. సాక్షి : మీది సుదీర్ఘ సినీ ప్రస్థానం కదా.. ఇందులో మీరు నేర్చుకున్నదేమిటీ? అశోక్ తేజ : లౌక్యం నేర్చుకున్నా. లౌక్యం మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. సాక్షి : ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. అవన్నీ స్వేచ్ఛగా రాసినవేనా.. అశోక్ తేజ : కవి ఎప్పుడూ స్వేఛ్చాజీవే. అతడిని శాసించేవారు ఏకాలంలోనూ ఉండరు. సాక్షి : ప్రజాకవిగా జనంకోసం బతికిన సుద్దాల హనుమంతు కుమారుడు మీరు. మీపై మీ తండ్రి ప్రభావం ఏమైనా ఉందా.. అశోక్ తేజ : నా మాట.. పాట.. అంతా మా నాయనగారే. నేను ఈస్థానంలో ఉండటానికి ఆయనే కారణం. అందుకే ఆయన పేరుతో ప్రారంభించిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడేళ్లుగా కవులను సత్కరిస్తున్నా. సాక్షి : మీరు రాసిన ఏ పాటకైనా జాతీయ అవార్డు వస్తుందని ఆశపడ్డారా.. అశోక్ తేజ : నాకు బాగా ఇష్టమైన పాటల్లో ‘ఒకటే మరణం ఒకటే జననం..’ అనే పాటకు వస్తుందని ఆశపడ్డా.. సాక్షి : సినీ రంగంలో ప్రతిభకు స్థానం ఉందా.. అశోక్ తేజ : తప్పకుండా ఉంటుంది. సినీ రంగంలో నాకు గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు. అరుునా నేను 20ఏళ్లు ఈ రంగంలోనే నిలబడ్డా. కాసింత అదృష్టం కూడా ఉండాలి. సాక్షి : మీ పాటల వెనుక ప్రోత్సాహం ఎవరు? అశోక్ తేజ : జనం ఉన్నారు. జనం కోసం బతికిన కవులున్నారు. నా పాట వెనున ఆవేదన ఉంది. అన్నింటికంటే నా తండ్రి ఉన్నారు. సాక్షి : సినీకవికి కావాల్సిన అర్హతలేమిటీ? అశోక్ తేజ : సాహిత్యం తెలిసి ఉండాలి. కాస్త సంగీత పరిజ్ఞానం కూడా అవసరం. సాక్షి : తెలుగు సినిమా పాటల్లోని ఆంగ్ల పదాల వల్ల భాష చనిపోతోందని భాషావేత్తల ఆవేదన. దీనికి మీ సమాధానమేంటి? అశోక్ తేజ : ఆంగ్ల పదాలు 20 శాతం ఉంటే ఫర్వాలేదు. అంతకుమించి ఉంటే ప్రమాదమే.. సాక్షి : ఒక పాట రాసిన తరువాత.. ఇది ఇంకా బాగా రాసుంటే బాగుండేదని అనిపించిన సంఘటనలేమైనా ఉన్నాయూ.. అశోక్ తేజ : దాదాపు లేవు. ఒక పాట రాసిన తరువాత దాని గురించి నేను ఆలోచించను. సాక్షి : తెలంగాణ రాష్ర్ట సాధనకు కవులంతా ఏకమయ్యూరు. సీమాంధ్రలో ఆ స్ఫూర్తి లేకపోవ డానికి కారణం. అశోక్ తేజ : అది వారివారి ఆలోచనా పరిధిని బట్టి ఉంటుంది. సాక్షి : ఇప్పటివరకు ఎన్ని సినిమాలకు పాటలు రాశారు. అశోక్ తేజ : 800 సినిమాల్లో 2వేలకు పైగా పాటలు రాశాను. సాక్షి : జానపద కళలను కాపాడుకోవటమెలా.. అశోక్ తేజ : కేవలం వ్యక్తుల వల్లో.. కళాసంస్థల వల్లో అది సాధ్యం కాదు. ప్రభుత్వం కళా పీఠాలు స్థాపించాలి. వాటికి సంపూర్ణ అధికారాలు ఇవ్వాలి. దేశం మెత్తంమీద ఉన్న జానపద సంపదల వివరాలు తెలుసుకోవాలి. వాటిని ప్రదర్శించే వారికి ఉపాధి సౌకర్యాలు కలిపించాలి. సాక్షి : ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగును ఎలా కాపాడుకోవాలి? అశోక్ తేజ : భాషను బతికించుకోవాలంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. భాషను కాపాడుకోవాలన్న ఆలోచన ప్రజలకు రావాలి. -
ఎగిరిపోతే....
-
పాట వెనుక కథ 29th June 2014
-
పాట వెనుక కథ 22nd June 2014
-
తెలంగాణ సాహితీ సౌరభాలను వెండితెరపై పరిమళింపజేస్తాం
యాదగిరిగుట్ట : మరుగున పడిపోయిన తెలంగాణ సాహితీ సౌరభాలను వెండితెరపై పరిమళింపజేసేందుకు కృషి చేస్తున్నామని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. బుధవారం ఆయన యాదగిరిగుట్టలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతను కలిశారు. ఈ సందర్భంగా ఆయన తన మనసులోని భావాలను ప్రత్యేకంగా పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... సినిమా శక్తివంతమైన ప్రచార సాధనం.. తెలంగాణలో అద్భుత సాహిత్య సంపద ఉంది. పుస్తకాల రూపంలో కొందరికే అందుబాటులో ఉన్న సాహిత్య సంపదను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం జరగాలి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఈ తరుణంలో తెలంగాణ సాహిత్యం, కళారూపాలు, తెలంగాణ భాష, యాస, సంస్కృతికి పెద్దపీట వేయాలి. వీటికి తగిన వేదిక సినిమానే. సినిమా చాలా శక్తివంతమైన ప్రచార సాధనం. ఇది సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు అందుబాటులో ఉంటుంది. సినిమా ద్వారా తెలంగాణ సాహిత్యం, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పవచ్చు. ఇందు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం కూడా తీసుకుంటున్నాం. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి.. సినిమా కథలు, పాటలలో తెలంగాణ భాష, యాస, సాహిత్యాన్ని గౌరవప్రదంగా చూపించాలి. అలాగే ఈ ప్రాంతంలో అనేక వీరోచిత గాధలు, సాంఘిక, పౌరాణిక కథలు ఉన్నాయి. వాటిని వెండి తెరపై ఆవి ష్కరించాల్సి ఉంది. రాయితీలు కల్పిం చాలి.. తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయాలి. పెద్ద ఎత్తున నిధులు, రాయితీలు కల్పించాలి. అలాగే 24 క్రాఫ్ట్స్ల తెలంగాణ సినీ కళాకారులు పరిశ్రమ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలి. అవకాశం కోసం ఎదురు చూస్తున్నా.. నేను ఇప్పటి వరకు రాసిన పాటలు ఎంతగానో సంతృప్తినిచ్చాయి. జాతీయ అవార్డు రావడం జీవితంలో మరిచిపోలేని ఘట్టం. చరిత్రలో నిలిచిపోయేలా సినిమాలకు సాహిత్యం అందించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నా. ముఖ్యంగా జిల్లావాసినైనందున ఈ ప్రాంత చరిత్ర, ఇక్కడి సాహిత్యాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.. అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నా.. తప్పకుండా ఈ ప్రాంత చరిత్ర, గొప్పదనాన్ని ఏదో ఒక సినిమాలో సాహిత్య, దృశ్య రూపంలో చూపించేందుకు కృషి చేస్తా. -
పాట వెనుక కథ 16th June 2014
-
పాట వెనక కథ
-
తల్లిదండ్రులు.. పిల్లలకు సవుయూన్ని కేటారుుంచాలి
నర్సంపేట, తల్లిదండ్రులు విద్యార్థులకు కొంత సవుయూన్ని కేటారుుంచాలని, అప్పుడు పిల్లల అభిరుచులు తెలుస్తాయని సినీ గేయు రచరుుత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. నర్సంపేట పట్టణంలోని ఫాత్‌ఫైండర్ స్కూల్ డే వేడుకలను స్థానిక రెడ్డి ఫంక్షన్హాల్లో వుంగళవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రవూనికి అశోక్‌తేజ వుుఖ్య అతిథిగా హాజరయ్యూరు. జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. తవు పిల్లలు డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ కావాలనుకుంటారని, వారు ఏ ఉద్యోగం సంపాదించాలనుకున్నా.. గొప్ప వునుషులుగా మిగిలితే చాలన్నారు. వూనవత్వాన్ని వుంచిన బహుమతులు లేవని, వూనవ సంబంధాలను మించి గొప్ప విషయుం లేదన్నారు. డీఎస్పీ కడియుం చక్రవర్తి వూట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహిస్తూ సన్మార్గంలో పయునించేలా కృషి చేయూలన్నారు. పిల్లలు తప్పులు చేయుకుండా సరైన పద్ధతులు నేర్పించినప్పుడే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన సాంసృ్కతిక కార్యక్రవూలు అలరించారుు. ఉత్తవు ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహువుతులను అందజేశారు. ఈ కార్యక్రవుంలో పాఠశాలల చైర్మన్ వెంకటేశ్వర్, సిబ్బంది ఆంజనేయుులు, కౌసర్, జుబేదాఖాన్, సరళ, సుభానొద్దీన్, దిలీప్కువూర్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 4. -
మరణంకంటే జీవితం గొప్పది
ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక సీవీఎన్ రీడింగ్ రూంలో ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుద్దాల విలేకర ్లతో మాట్లాడారు. అశోక్‌తేజ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. ‘‘నాపై మా నాన్న సుద్దాల హనుమంతు ప్రభావం చాలా ఉంది. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడంతో పాటు తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. మా కుటుంబ సభ్యులంతా సాంస్కృతిక చైతన్యం ఉన్నవారే. నేను ఎన్నో జానపద గేయాలతో పాటు పలు పాటలు రాశాను. సినీ రంగంపై ఉన్న అభిమానం నన్ను ఆ వైపు నడిపించింది. 1994లో ‘నమస్తే అన్న’ సినిమాలో రాసిన ‘గరం గరం పోరి.. నా గజ్జెల సవ్వారి’ నా మొదటిపాట. దాసరి నారాయణరావు, వందేమాతరం శ్రీనివాస్‌ల కాంబినేషనల్లో నేను రాసిన చాలా పాటలు హిట్టయ్యాయి. 2003లో ఠాగూర్ సినిమాకు రాసిన ‘నేను సైతం..’ పాటకు జాతీయ అవార్డు లభించింది. తెలుగు సినిమా పాటకు జాతీయ అవార్డులు పొందిన శ్రీశ్రీ, వేటూరి సుందరరామమూర్తిల సరసన నా పేరుకూడా చేరడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ తరువాత మరో రెండు నంది అవార్డులు వచ్చాయి. ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమా నా కెరీర్‌ను మలుపు తిప్పింది. భద్రాచలం సినిమాలో రచించిన ‘ఒకటే జననం, ఒకటే మరణం’ పాట నా స్వీయానుభవంలో నుంచి పుట్టింది. ఈ పాట అనేక మందిని కదిలించింది. పాండురంగడు సినిమాకు రాసిన ‘మాతృదేవోభవ అన్నమాట మరిచాను..’ పాట చాలా మంచిపేరు తెచ్చింది. డాక్టర్ సీ నారాయణరెడ్డి నా అభిమాన కవి. సినిమా వ్యాపార కళగా మారింది 700 సినిమాల్లో 17 వందల పాటలు రాశా. ‘ఆకుపచ్చ చందమామా..’ అంటూ రైతులపై రాసిన పాట జనాదరణ పొందింది. మానవ త్వానికి, అనుబంధ బాంధవ్యాలకు ప్రాధాన్యత ఇస్తూ రాసిన పాటలు అనేకం ఉన్నాయి. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పుల ఫలితంగా సినిమా వ్యాపార కళగా మారింది. గుండెను కదిలించే పాటలు రాసే అవకాశం తక్కువనే చెప్పాలి. అయినప్పటికీ మానవ సంబంధాల గొప్పదనాన్ని, మనిషితనాన్ని ఆవిష్కరించే పాటలను అప్పుడప్పుడూ రాసేందుకు కృషి చేస్తున్నా. నటనపై ఆసక్తి ఉంది నేను కేవలం సినీగేయ రచయితను మాత్రమే కాదు నటనపై కూడా ఆసక్తి ఉంది. ‘ఆ ఐదుగురు’ సినిమాలో ఒగ్గు కళాకారునిగా నటిస్తున్నా. వీర తెలంగాణ చిత్రంలో ఒక పాట కూడా పాడా. ఆ ఐదుగురు సినిమాకు పాటలతో పాటు మాటలు కూడా అందిస్తున్నా. తమ్మారెడ్డి భరద్వాజ నిర్మిస్తున్న ప్రతిఘటన చిత్రంలో మహిళలపై జరిగే అత్యాచారాలను నిరసిస్తూ ‘ఎందుకురా మాపై పగ, మాపై కసి, ఎందుకింత కక్ష, ఎందుకింత వివక్ష, పాములనీ తెలిసీ పాలు పోసినందుకా’ అనే పాటను అశోక్ తేజ మీడియా ముందు పాడి వినిపించారు. ట్రస్టు పేరిట సేవా కార్యక్రమాలు నా తల్లిదండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మల పేరిట ట్రస్టును స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నా. జానపద కళలకు సంబంధించిన మ్యూజియం స్థాపించాలనే కోరిక ఉంది. ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలినా తెలుగు భాషకు కలిగే ముప్పేమీ ఉండదు. సమాజాన్ని, సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేస్తేనే మంచి పాటలు రాయగలం. ఉదయ్‌కిరణ్ మృతి బాధించింది సినీ హీరో ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య నన్ను బాధించింది. పిరికితనం, పలాయనవాదం పనికిరావు. మనిషి ఆశావాదంతో వ్యవహరించాలి. ధైర్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. పాట, ఉత్తమ సాహిత్యం అందుకు ఆసరా కావాలి’’. - న్యూస్‌లైన్, ఒంగోలు కల్చరల్ -
ఈ నల్లని రాలలో... ఏ కన్నులు దాగెనో...
మా ఊరు నల్లగొండ జిల్లాలోని సుద్దాల. మా గ్రామం నుండి నాలుగు కిలోమీటర్లు నడిచి సీతారామపురం గ్రామానికి వెళ్లి చదువుకునేవాళ్లం. ఆ దారిలో నల్లని గుట్టలు ఉండేవి. అక్కడ మేమంతా ఆడుకొనేవాళ్లం. అప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నాను. మొట్టమొదటగా నేను బాగా ఇష్టపడిన పాట అమరశిల్పి జక్కన్న (1964) చిత్రంలోని ‘ఈ నల్లని రాలలో... ఏ కన్నులు దాగెనో...’. ఈ పాట విన్నప్పుడల్లా నాలో నాకే ఏవో తెలియని సందేహాలు కలిగేవి. ఈ రాళ్లలో కళ్లు ఎలా ఉంటాయి? ఇలా ఆ పాట నన్ను బాగా ఆలోచింప జేసింది. సి.నారాయణరెడ్డిగారు రాసిన ఈ పాట ‘అమరశిల్పి జక్కన్న’ సినిమాలోకి రాకముందే ‘రామప్ప’ అనే నాటకంలో ఉంది. దానిని పాలగుమ్మి విశ్వనాథంగారు స్వరపరిచారు. సినిమాలో దీనికి మరో బాణీ అందించారు సాలూరి రాజేశ్వరరావుగారు. ఈ పాట నన్ను ఎంతగానో ఇన్‌స్పయిర్ చేసింది. పాట విన్న తర్వాత నాకు గీతరచయితగా మారాలనే కోరిక కలిగింది. అంతేకాదు... టైటిల్స్‌లో నా పేరు సినారెగారి పేరు తర్వాత ఉండాలనే కోరిక కూడా కలిగింది. ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాతో ఆ కోరిక తీరింది. ఈ నల్లని రాలలో... ఏ కన్నులు దాగెనో/ ఈ బండల మాటున... ఏ గుండెలు మ్రోగెనో... అనే పల్లవిలో కళ్లు చూస్తాయి, రెప్పలు ఆర్పుతాయి, వాటికొక జ్ఞానం ఉంది. అయితే రాళ్లకు అవి ఉండవు కానీ కంటిపాపలలో నల్లదనాన్ని చూసి ఒక సామ్యాన్ని తీసుకున్నారు. కాబట్టి ‘ఈ నల్లని రాలలో’ అని మొదలుపెడతారు. గుండెకి స్పందించే గుణం, ధ్వనించే గుణం ఉంటుంది. కానీ బండకు ఈ రెండు గుణాలు లేవు. స్పందించే గుణం ఉన్నవాటిని స్పందించని గుణం ఉన్నవాటికి ఆపాదించడం ఈ పాట మొత్తంలో మనకు కనిపిస్తుంది. పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి/మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి... ఇది రాళ్ల గురించి రాసిన పాట. రాళ్లు అడవుల్లో కదలకుండా, మెదలకుండా ఉండే జడపదార్థం. అవి ‘పద్మాసనం వేసుకొని తపస్సమాధిలో మునిగి ఉన్న ఋషుల్లాగ ఉన్నాయి’ అనడమనేది అద్భుతమైన ఎక్స్ప్రెషన్. ‘రాత్రి నల్లని రాతి పోలిక’ అంటారు శ్రీశ్రీ. రాతిని ముట్టుకుంటే తెలుస్తుంది. రాత్రిని అనుభవిస్తే తెలుస్తుంది. అలా పోల్చడం గొప్ప విషయం. మునులు ప్రత్యేక ఆశయం కోసం తపస్సు చేస్తారు. చలన పదార్థాన్ని, జడపదార్థమైన రాతితో పోల్చడమనే వినూత్నమైన ఆలోచనా విధానానికి ఈ పాట నిలువుటద్దం. ఇలా పోల్చడం నన్ను బాగా ఆకట్టుకుంది. ‘కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు/ ఉలి అలికిడి విన్నంతనే గలగలమని పొంగిపొరలు’ అనే చరణంలో... ప్రవహించే గుణానికి పలికే శబ్దం ఉంటుంది. ఉదాహరణకు నది ప్రవహిస్తూ గలగలమని శబ్దం చేస్తూంటుంది. అలాంటి శబ్దమే లేని, కదలికే లేని రాళ్లు ఉలి శబ్దం వినగానే గలగలమని ప్రవహిస్తాయి. కదలలేని ఆ రాళ్లకు చెవులు లేవు, రాయి ప్రవహించదు. కానీ చెవులు లేని వాటికి వినబడినట్లు, కదలలేనివి ప్రవహించినట్లు పోల్చుతూ, ఉలి చప్పుడు వినగానే గలగలమని పొంగుతాయనడం అనన్యసామాన్యమైన ఆలోచన. పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును/ జీవమున్న వునిషికన్న శిలలే నయువునిపించును... అసలు రాయి అనేది కఠినమైనది. లోన వెన్న కనిపించును అన్నారు సినారె. రాళ్లు పైకి ఎంత కఠినంగా కనిపించినా, చెక్కుతూ పోతే ఎలా అంటే అలా ఒదిగే ఒక మైనంలాగ ఒదుగుతుందనే విషయం శిల్పాలు చెక్కే శిల్పులకు మాత్రమే తెలిసిన శిల్పరహస్యం. అయితే ఈ విషయం నారాయణరెడ్డిగారే ఎలా పట్టారని నా ప్రశ్న. నా నృషి కురు తే కావ్యం... అంటే కవి... ఋషి అయితే తప్ప కావ్యాన్ని సృష్టించలేడు. ఆయన ఋషి కాబట్టే అంత భావగర్భితంగా రాయగలిగారు. మనిషికి జీవం ఉంది, రాళ్లకు జీవం లేదు. మనుషులకన్నా రాళ్లే గొప్పవని ఒక సార్వకాలీనమైన సామాజిక మధన జనిత సత్యాన్ని వేమనలాగ చివరి వాక్యంలో చేర్చారు. అంటే శిలల కంటే కఠినమైనవాళ్లు ఈ సమాజంలో ఉన్నారన్నారు. ఈ సినిమాలో నాయికా నాయకులకు వివాహమయ్యాక, చిన్న అపోహకు గురై విడిపోతారు. అంటే కథకు అనుసంధానిస్తూ లోక సత్యాన్ని కూడా ఈ పాటలో చెప్పారు సినారె. సంభాషణ : నాగేష్