Aditya Roy Kapoor
-
హీరోతో లైగర్ భామ బ్రేకప్.. అప్పుడే బాయ్‌ఫ్రెండ్ దొరికేశాడా?
బాలీవుడ్ భామ, లైగర్ బ్యూటీ అనన్య పాండే చివరిసారిగా ఖో గయే హమ్ కహాన్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ తన తొలి వెబ్ సిరీస్ కాల్ మీ బేలో కనిపించనుంది. తాజాగా అనన్య ముంబయిలో జరిగిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లిలో సందడి చేసింది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో అనంత్ బారాత్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.అయితే గతంలో హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ముద్దుగమ్మ ఆదిత్య రాయ్ కపూర్‌తో మార్చి 2024లో బ్రేకప్ చేసుకుంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఇద్దరు కూడా ఈ విషయంపై ఎక్కడా మాట్లాడలేదు. కానీ మార్చి నుంచి ఈ జంట దూరంగానే ఉంటున్నారు.తాజాగా అనంత్ అంబానీ పెళ్లిలో మరొకరితో అనన్యపాండే కనిపించింది. దీంతో అందరిదృష్టి అతనిపైనే పడింది. ఎవరా మిస్టరీ మ్యాన్? అంటూ తెగ ఆరా తీస్తున్నారు నెటిజన్స్. తీరా చూస్తే అతని పేరు వాకర్ బ్లాంకో అని.. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఒకరినొకరు ఫాలో అవుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. దీంతో అనన్య అతనితో డేటింగ్లో ఉందా? అంటూ ఫ్యాన్స్ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. -
హీరోయిన్‌తో బ్రేకప్! మరో బ్యూటీతో హీరో పార్టీ!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమాయణాలు, బ్రేకప్పులు సర్వసాధారణమైపోయాయి. కొన్ని జంటలైతే పెళ్లి పీటలెక్కడం ఖాయమనుకునే సమయానికి అనూహ్యంగా విడిపోవడానికే మొగ్గుచూపుతున్నాయి. ఇటీవలి కాలంలో బాలీవుడ్ లవ్ బర్డ్స్ అనన్య పాండే- ఆదిత్య రాయ్ కపూర్ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. హీరోయిన్‌తో పార్టీ !దీనిపై అటు అనన్య, ఇటు ఆదిత్య ఎవరూ స్పందించనేలేదు. ఇంతలో ఆదిత్య రాయ్ కపూర్ మరో హీరోయిన్‌తో పార్టీ చేసుకున్నాడంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సారా అలీ ఖాన్‌తో అతడు పార్టీలో పాల్గొన్నాడు. వీరిద్దరూ మెట్రో ఇన్ ఢిల్లీ అనే సినిమా సెట్స్‌లో డైరెక్టర్ అనురాగ్ బసు బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అది సహజమే..ఒక సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నప్పుడు ఆ మాత్రం స్నేహం, సాన్నిహిత్యం ఉండటం సహజమే అని అభిమానులు వెనకేసుకొస్తున్నారు. కొందరు మాత్రం బ్రేకప్ అయిన బాధ లేకుండా ఆదిత్య మరో హీరోయిన్‌తో ఇంత చనువుగా ఉండటం ఏమీ బాలేదని కామెంట్లు చేస్తున్నారు. #SaraAliKhan and #AdityaRoyKapur celebrating #AnuragBasu sir's bday on the sets of #MetroInDino 🥹💕 pic.twitter.com/pab1vBwa68— sakt` (@SarTikFied) May 8, 2024 -
లైగర్ భామతో డేటింగ్.. యంగ్ హీరో రిప్లై ఇదే !
బాలీవుడ్ తారలే కాదు.. సినీ ఇండస్ట్రీలో డేటింగ్ రూమర్స్ తరచుగా వినిపిస్తుంటాయి. అలా రూమర్స్ కొన్నిసార్లు నిజమైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలానే రూమర్స్‌తో మొదలైన పెళ్లిబంధంతో ఒక్కటైన బాలీవుడ్ జంటలు కూడా ఉన్నాయి. వారిలో సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ, పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా, ఇటీవలే పెళ్లి చేసుకున్న రణ్‌దీప్ హుడా-లైస్రామ్ కూడా ఉన్నారు. తాజాగా ఈలిస్ట్‌లో లైగర్ భామ అనన్య పాండే, బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ చేరిపోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు పెద్దఎత్తున రూమర్స్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా గతంలో అనన్య బర్త్‌డేను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఎక్కడా కూడా తమ రిలేషన్‌పై నోరు విప్పలేదు. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోకు హాజరైన ఆదిత్య రాయ్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అర్జున్ కపూర్‌తో కలిసి పాల్గొన్న ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అనన్యతో డేటింగ్ గురించి ప్రశ్నలు సంధించారు కరణ్ జోహార్. అయితే ఆ ప్రశ్నకు ఆదిత్య రాయ్ కపూర్ చాలా ఫన్నీగా సమాధానమిచ్చారు. ఆదిత్య మాట్లాడుతూ..'నన్ను రహస్యాలు మాత్రం అడగవద్దు. అయితే నేను కచ్చితంగా అబద్ధాలైతే మాత్రం చెప్పను' అని అన్నారు. అంతే కాకుండా తన మాజీ లవర్ శ్రద్ధా కపూర్ గురించి కూడా ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు కరణ్. మీరు అనన్య పాండే, శ్రద్ధా కపూర్‌తో కలిసి లిఫ్ట్‌లో చిక్కుకుంటే.. ఏం చేస్తారని ఆదిత్యను అడిగారు. అయితే దీనికి పక్కనే ఉన్న అర్జున్ కపూర్ ఫన్నీ ఆన్సరిచ్చాడు. 'కచ్చితంగా రొమాన్స్ చేస్తాడు.. కానీ ఎవరితో చేస్తాడో మాత్రం తెలియదు'.. ఐ యామ్ జస్ట్ జోకింగ్ అని నవ్వుతూ చెప్పాడు. అనన్య, ఆదిత్య రిలేషన్ కాగా.. లైగర్ భామ అనన్య, ఆదిత్య రాయ్ కపూర్ కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. గతేడాది కృతి సనన్ దీపావళి పార్టీలోనూ జంటగా కనిపించారు. అప్పటి నుంచే రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరు చాలాసార్లు విదేశాలకు వెళ్తూ విమానాశ్రయాల్లో జంటగా కనిపించారు. అంతకు ముందే సారా అలీఖాన్‌తో కలిసి అనన్య పాండే సైతం కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. మేమిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. కాగా.. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 14న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ప్రసారం కానుంది. మరోవైపు ప్రస్తుతం ఆదిత్య, అనన్య సినిమాలతో బిజీగా ఉన్నారు. అనన్య పాండే నటించిన డ్రీమ్ గర్ల్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
ప్రియుడికి బర్త్ డే విషెస్ చెప్పిన లైగర్ భామ.. పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇటీవలే కాపీ విత్ కరణ్ షోలో పాల్గొన్న తమ రిలేషన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తామిద్దరం మంచి స్నేహితులమని వెల్లడించింది. తాజాగా ఇవాళ తన ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ విష్ చేశారు. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో అతని ఫోటోను షేర్ చేశారు. ఆదిత్య ఫోటోను షేర్ చేస్తూ "హ్యాపీ బర్త్‌డే ఏడీ" అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఇటీవలే అనన్య బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఇద్దరు కలిసి మాల్దీవులకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను అనన్య సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఏడాది డ్రీమ్ గర్ల్-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అనన్య.. ప్రస్తుతం కో గయే హమ్ కహాన్ చిత్రంలో నటిస్తోంది. అర్జున్ సింగ్ డైరెక్షన్లో గౌరవ్ ఆదర్శ్ నటిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
హీరోతో డేటింగ్.. నిజం బయట పెట్టేసిన హీరోయిన్!
బాలీవుడ్ భామ ఇటీవలే అనన్య పాండే ఇటీవలే తన పుట్టినరోజును జరుపుకున్నారు. తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇద్దరు కలిసి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తూ వీడియోలో కనిపించారు. తాజాగా ఇండియాకు తిరిగొచ్చిన భామ కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. మరో నటి సారా అలీ ఖాన్‌తో కలిసి పాల్గొంది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: 'అసలు ఏంట్రా ఇదంతా.. ఏం చేస్తున్నారు హౌస్‌లో..'!) అయితే ఈ షోలో పాల్గొన్న సారా అలీ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ షోలో పాల్గొన్న సారాను కరణ్ ఆసక్తిక ప్రశ్న వేశారు. ప్రస్తుతం అనన్య పాండే వద్ద ఉన్న వస్తువు ఏంటి? అని అడిగారు. దీనికి సారా స్పందిస్తూ 'ది నైట్ మేనేజర్' అంటూ సమాధానమిచ్చింది. అయితే ఇది విన్న అనన్య తెగ సిగ్గు పడిపోయింది. తాను అనన్య రాయ్ కపూర్‌గా భావిస్తున్నాను అంటూ మనసులో మాట చెప్పేసింది. దీంతో వీరిద్దరి రిలేషన్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. గత కొన్ని నెలలుగా ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్‌లో ఆదిత్య రాయ్ కపూర్ నటించారు. కాగా.. సారా అలీ ఖాన్ మెట్రో అనే చిత్రంలో కనిపించనుంది. అనురాగ్ బసు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్‌తో స్క్రీన్‌ను పంచుకోనుంది. మరోవైపు అనన్య పాండే.. ఖో గయే హమ్ కహాన్ అనే చిత్రంలో నటించనుంది. ఆ తర్వాత కాల్ మీ బే అనే అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్‌లో కూడా నటించనుంది. (ఇది చదవండి: ప్రియురాలిని పెళ్లాడనున్న మిస్ యూనివర్స్ మాజీ భాయ్ ఫ్రెండ్!) -
విజయ్ దేవరకొండ హీరోయిన్.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్!
బాలీవుడ్ భామ అనన్య పాండే బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. లైగర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. తాజాగా ఈ ముంబై ముద్దుగుమ్మ తన 25వ పుట్టినరోజును జరుపుకుంటోంది. తన బర్త్ డే వేడుకల కోసం మాల్దీవులకు చెక్కేసింది భామ. అంతే కాకుండా వేడుకలకు భాయ్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఒకరోజు ముందే ఆమె ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్ ముంబై విమానాశ్రయంలో వెళ్తూ కెమెరాలకు చిక్కారు. దీంతో ఇద్దరు కలిసి బర్త్ డే వేడుకల కోసం మాల్దీవుస్కు వెళ్లినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా ఈ బర్త్ డే భామ మాల్దీవుల్లో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ది ఫర్ఫెక్ట్ హ్యాపీ బర్త్ డే మార్నింగ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే గతంలో ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి చాలాసార్లు వార్తల్లో నిలిచింది. ఆదిత్య రాయ్ కపూర్‌తో కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే! ఓ బ్రిడ్జిపై వీరిద్దరూ హగ్ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ లవ్ బర్డ్స్ షికారుకు వెళ్లగా.. ప్రియుడు ఆదిత్య కారు నడుపుతుంటే అనన్య అతడి పక్కనే కూర్చుని కనిపించింది. కాగా.. ఈ ఏడాది అనన్య పాండే.. డ్రీమ్ గర్ల్-2 చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా సరసన నటించింది. చుంకీ పాండే స్పెషల్ విషెస్ అనన్య పాండే పుట్టిన రోజు సందర్భంగా ఆమె తండ్రి చుంకీ పాండే ఎమోషనల్ పోస్ట్ చేశారు. అనన్య త్రోబ్యాక్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనన్యతో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ "హ్యాపీ హ్యాపీ హ్యాపీ సిల్వర్ జూబ్లీ మై డార్లింగ్.. లవ్ యు ఫరెవర్" అనే క్యాప్షన్‌తో తన ప్రేమను చాటుకున్నారు. కాగా.. ఆమె తండ్రి చుంకీ పాండే మూడు దశాబ్దాల కెరీర్లో 100కు పైగా సినిమాల్లో నటించాడు. View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) -
అతనితో డేటింగ్.. కాబోయే భర్త గురించి లైగర్ భామ ఆసక్తికర కామెంట్స్!
లైగర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కొత్త హీరోయిన్ అనన్య పాండే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది భామ. అయితే ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్లో ఉందంటూ గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా ఇటీవలే ఇద్దరు కలిసి కారులో వెళ్తూ కెమెరాలకు చిక్కడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. (ఇది చదవండి: 'పుష్ప-2 మరో రేంజ్లో ఉండనుంది'.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన నటుడు!) అయితే ప్రస్తుతం డ్రీమ్ గర్ల్-2 నటిస్తోన్న భామ ఆ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అతను ఎలా ఉండాలో వివరించింది. అతనిలో తాను కోరుకునే లక్షణాల గురించి వెల్లడించింది. కాగా.. అనన్య పాండే, ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్- 2 ఆగస్ట్ 25న శుక్రవారం విడుదలవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని 2019 హిట్ ఫిల్మ్ డ్రీమ్ గర్ల్‌కి సీక్వెల్‌గా తెరకెక్కించారు. అనన్య మాట్లాడుతూ..' ఓ గాడ్. నాకు మా నాన్నే ఆదర్శం. నాకు కాబోయే వారు మా నాన్నలా దయగా, ప్రేమగా, ఫన్నీగా ఉండాలి. ఆయనే నాకు బెంచ్‌మార్క్. మా నాన్న అత్యుత్తమ వ్యక్తి. అందుకే అతనికి అలాంటి లక్షణాలే ఉండాలి. అయితే ఇటీవల నా సినిమాలు లేకపోవడంతో నా వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా వారి దృష్టి నా సినిమాలపై పెడతారేమో వేచి చూడాలి.' అని అన్నారు. ఆదిత్య రాయ్ కపూర్‌తో రిలేషన్‌పై మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే డ్రీమ్ గర్ల్-2 తర్వాత ఫర్హాన్ అక్తర్ చిత్రంలో నటించనుంది. ఆ తర్వాత విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కించే సైబర్ థ్రిల్లర్‌లో కనిపించనుంది. (ఇది చదవండి: ఇంతదాకా వచ్చాకా సిగ్గెందుకు? ప్రియుడితో అనన్య షికారు!) -
స్టార్ హీరోతో డేటింగ్లో లైగర్ భామ.. స్పందించిన హీరోయిన్ తండ్రి!
ఇటీవల బాలీవుడ్ భామ అనన్య పాండే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైన సంగతి తెలిసిందే. ఎందుకంటే గత నెలలో ఈ జంట ఇటీవల పోర్చుగల్ ట్రిప్‌కు వెళ్లగా.. అక్కడ వీధులు, రెస్టారెంట్లలో జంటగా దిగిన ఫోటోలు కాస్తా నెట్టింట దర్శనమివ్వడంతో డేటింగ్ గాసిప్స్ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తండ్రి చంకీ పాండే ఈ వార్తలపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన కూతురి రిలేషన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'భాగ్ సాలే'.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?) చంకీ పాండే మాట్లాడుతూ..' నటీనటుల జీవితంలో రిలేషన్స్‌పై రూమర్స్ రావడమనేది సాధారణమైన విషయం. మేము గ్లామర్‌లో వృత్తిలో ఉన్నాం. ఇలాంటివన్నీ జరగాల్సినవే. కెరీర్‌కు ఇది నష్టం కలిగించినప్పటికీ.. వీటిని మనం కట్టడి చేయలేం. అనన్య చాలామంది హీరోలతో అద్భుతంగా నటించింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'లో టైగర్ ష్రాఫ్ సరసన, 'పతి, పత్నీ ఔర్ వో'లోని కార్తీక్ ఆర్యన్‌తో సినిమాలు చేసింది. ఆమెకు ఇది ఓ అద్భుతమైన ప్రయాణం. ఈ విషయంలో నాకు ఎవరినీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. తనకి నేను చెప్పేది ఒక్కటే.. నా కంటే మెరుగ్గా ఉండాలి.' అని అన్నారు. కాగా.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. విజయ్ దేవరకొండతో 'లైగర్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ఆయుష్మాన్ ఖురానాతో 'డ్రీమ్ గర్ల్' సీక్వెల్ కోసం సిద్ధమవుతోంది. ఆ తర్వాత విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీలో నటించనుంది. ఆదిత్య రాయ్ కపూర్'ది నైట్ మేనేజర్'లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: 83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!) -
'లైగర్' భామ డేటింగ్.. ఆ స్టార్ హీరోతో కలిసి!
Ananya Pandey Aditya Roy Kapoor: టాలీవుడ్లో తక్కువ గానీ బాలీవుడ్లో మాత్రం హీరోయిన్లు డేటింగ్, బాయ్ ఫ్రెండ్స్ విషయంలో ముందుంటారు. ఇప్పుడున్న స్టార్ హీరో హీరోయిన్లు దాదాపుగా డేటింగ్-రిలేషన్ లాంటి వాటిలో ఉండి వచ్చినవాళ్లే. వాళ్ల గురించి ఇప్పుడేం చెప్పట్లేదు. హీరోయిన్ అనన్య పాండే మాత్రం ప్రస్తుతం ఓ హీరోతో సీరియస్ డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. దాన్ని బయటపెట్టేసింది కూడా. హీరోయిన్గా నో హిట్ సాధారణంగా హీరోయిన్ అయిన తర్వాత ఒకటి కాకపోతే మరో సినిమాతో అయినా హిట్ కొడతారు. అందుకోసం ప్రయత్నిస్తారు. కానీ అనన్య పాండేని చూస్తే అలా అస్సలు అనిపించదు. ఎందుకంటే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వో, కాలీ పీలీ, గెహ్రాయాన్, లైగర్ చిత్రాల్లో నటించింది. కానీ వీటిలో ఏ ఒక్కటి హిట్ అవ్వలేదు. (ఇదీ చదవండి: 'బలగం' హీరోయిన్‌కి అవమానం!) రెండో బాయ్ ఫ్రెండ్ తండ్రి చుంకీ పాండే నటుడు కావడంతో ఇండస్ట్రీలోకి వచ్చిన అనన్య పాండే.. సక్సెస్ కంటే డేటింగ్ రూమర్స్‌తోనే ఎక్కువ పాపులర్ అయింది. గతంలో హీరో ఇషాన్ కట్టర్ తో 'కాలీ పీలీ' సినిమా చేసింది. షూటింగ్ సమయంలో వీళ్లిద్దరూ డేటింగ్ చేశారు, ఆ తర్వాత విడిపోయారని సమాచారం. ఇప్పుడు హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. స్పెయిన్‌లో హగ్గులు గతేడాది దీపావళి సందర్భంగా హీరోయిన్ కృతిసనన్ పార్టీ ఇచ్చింది. అప్పుడు లీక్ అయిన ఓ ఫొటో వల్ల అనన్య-ఆదిత్య డేటింగ్ విషయం బయటపడింది. ఇప్పుడు వీళ్లిద్దరూ స్పెయిన్‌లోని ఓ కన్సర్ట్ చూడటానికి వెళ్లారు. ముంబయి నుంచి విడివిడిగానే వెళ్లినప్పటికీ ఇన్ స్టాలో స్టోరీలు పోస్ట్ చేయడంతో ఒకేచోట ఉన్నారని అందరికీ అర్థమైంది. అలానే ఓ బ్రిడ్జిపై హగ్ చేసుకున్న పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీళ్ల డేటింగ్ నిజమని తేలిపోయింది. Maro mujhe #AdityaRoyKapur #AnanyaPanday pic.twitter.com/RjSEwhGEYM — Alyaa 💕 (@birdiealyaa) July 12, 2023 (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఎప్పటికీ తనని క్షమించను: సింగర్) -
అనన్య ఫ్యాన్‌గర్ల్ మూమెంట్.. ‘ఆయన నాకు చేయి ఊపారు’
ఎట్టకేలకు తన చిరకాల నేరవేరిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది ‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే. ఈమేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేస్తూ ఫ్యాన్‌గర్ల్ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తుంది. తన అభిమాన ఆటగాడు డేవిడ్ బెక్హాంను కలుసుకున్నానంటూ ఆమె మురిసిపోయింది. కాగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ సెమిఫైనల్స్ చూసేందుకు అనన్య హజరైంది. ఈ సందర్భంగా తన అభిమాన ఆటగాడు, మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బేక్హాంను ఆమె కలుసుకుంది. డ్రెస్సింగ్ రూం వద్ద ఫార్మల్ సూట్లో ఉన్న డేవిడ్‌ను స్టేడియంలో ఉన్న అనన్య ఆయనను చూసింది. డేవిడ్ తన ఫ్యాన్స్‌కి చేయి ఊపాడు. అదే సమయంలో అనన్య తన అభిమాన ఆటగాడిని తన ఫోన్ కెమెరాలో క్లిక్ మనిపించింది. ఇక ఆ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ‘ఓకే.. ఐ యామ్ డన్.. ఇది నా చిరకాల కోరిక.. డేవిడ్ బేక్హాం పూర్తిగా నావైపే చేయి ఉపారు’ అంటూ అనన్య మురిసిపోయింది. డిసెంబర్ 14న సెమిఫైనల్స్లో తలపడిన అర్జెంటీనా వర్సెస్ క్రొయేషియా మ్యాచ్ చూసేందుకు అనన్యతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్ నటులు సంజయ్ కపూర్, చుంకీ పాండే, ఆదిత్య రాయ్ కపూర్‌తో తదితరలు హాజరయ్యారు. అలాగే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన సోదరితో కలిసి ఈ మ్యాచ్‌ను వీక్షించారు. 🤩Popular Bollywood actors Sanjay Kapoor, Aditya Roy Kapur & Chunky Panday, tennis star Sania Mirza and other personalities spotted at Nammos, Al Maha Island! #ILoveQatar #Qatar #Qatar2022 #WorldCupQatar2022 #almahaisland pic.twitter.com/yLJFFyxAov — ILoveQatar - Live (@ILQLive) December 13, 2022 చదవండి: ‘సాంగు భళా’: ఈ ఏడాది బాగా అలరించిన సాంగ్స్, అవేంటంటే.. మహేశ్-రాజమౌళి మూవీ నుంచి క్రేజీ అప్డేట్! సూపర్ స్టార్‌కు తండ్రిగా ఆ స్టార్ నటుడు? -
లైగర్ బ్యూటీ ప్రేమలో పడిందా.. ఆ స్టార్ హీరోతోనేనా?
బాలీవుడ్ నటి, లైగర్ బ్యూటీ అనన్య పాండేపై గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఆమె మరో నటుడితో డేటింగ్లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ నటుడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ పార్టీలో అతనితో కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. 'ఆషికీ-2’తో యువతకు చేరువైన నటుడు ఆదిత్య రాయ్ కపూర్. ఈ సినిమా తర్వాత ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆయన గత కొంతకాలంగా నటి అనన్య పాండేతో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో కృతిసనన్ ఏర్పాటు చేసిన దీపావళి పార్టీలో వీరిద్దరు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అప్పటి నుంచి అభిమానులు దృష్టంతా వీరిద్దరిపైనే పడింది. గత రాత్రి బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీపావళి బాష్‌ను గ్రాండ్‌గా నిర్వహించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్ చేయగా.. వారిద్దరు మాట్లాడుకుంటూ కనిపించారు. దీంతో అభిమానులు అనన్య - ఆదిత్య ప్రేమలో ఉన్నారా?’ అని మరోసారి చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న అనన్య.. ఆదిత్య అంటే తనకు ఇష్టమని చెప్పింది ఈ బాలీవుడ్ భామ. దీనిపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. -
రీమేక్‌గా వస్తున్న వెబ్ సిరీస్‌లు..
ఒక భాషలో హిట్టయిన సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం చూస్తూనే ఉంటాం. ఈ ధోరణి ఇప్పుడు వెబ్ సిరీస్‌ల విషయంలోనూ కనిపిస్తోంది. హిట్ వెబ్ సిరీస్‌లు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతున్నాయి. వెబ్ తెరపై వ్యూయర్స్‌ను ఎట్రాక్ట్ చేసేందుకు ఇంగ్లిష్ కథలను మన భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఈ ఇంగ్లిష్ కథల్లో నటిస్తున్న ఇండియన్ తారలెవరో చూద్దాం. వెంకటేశ్ కెరీర్లో దాదాపు పాతిక రీమేక్ సినిమాలు ఉంటాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు వెంకీ వెబ్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తొలిసారి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ చేశారు. అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’ అనే వెబ్ సిరీస్‌కి అడాప్షన్ ఈ ‘రానా నాయుడు’. అంటే.. రీమేక్. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేశ్‌తో పాటు రానా, ప్రియా బెనర్జీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ ద్వయం దర్శకత్వం వహించారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఏడాదే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ‘రే డోనోవన్’ కథ విషయానికి వస్తే... బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, స్పోర్ట్స్ పర్సన్స్ వంటి వారికి ఎదురైన సమస్యలను పరిష్కరిస్తుంటాడో వ్యక్తి. కానీ తన కుటుంబ సభ్యులు ఎవరైనా సెలబ్రిటీలకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే వాటి జోలికి మాత్రం వెళ్లడు. కుటుంబసభ్యులతో అతనికి ఎటువంటి భేదాభిప్రాయాలు వచ్చాయి? అతని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా జైలుకు వెళ్లారా? అనే అంశాల నేపథ్యంలో సాగుతుందీ వెబ్ సిరీస్. ఈ సిరీస్‌కి రీమేక్‌గా వస్తున్న ‘రానా నాయుడు’ ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. మరోవైపు బ్రిటిష్ వెబ్ సిరీస్ ‘ప్రెస్’ అడాప్షన్ ‘ది బ్రోకెన్ న్యూస్’లో నటించారు సోనాలీ బెంద్రే. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన తర్వాత సోనాలీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చింది ఈ వెబ్ సిరీస్ కోసమే. వినయ్ వైకుల్ డైరెక్ట్ చేసిన ‘ది బ్రోకెన్ న్యూస్’లో సోనాలీతో పాటు జైదీప్ అహ్లావత్, శ్రియా పిల్గొన్కర్ ప్రధాన పాత్రధారులు. ఈ సిరీస్‌లో అమీనా ఖురేషీ పాత్రలో కనిపిస్తారు సోనాలి. స్క్రిప్ట్ ప్రకారం.. ముంబైలో ‘ఆవాజ్ భారత్’, ‘జోష్ 24/7’ అనే రెండు న్యూస్ చానల్స్ ఉంటాయి. ‘ఆవాజ్ భారత్’ చానెల్ హెడ్‌గా ఉంటారు అమీనా. ఈ రెండు న్యూస్ చానెల్స్ టీఆర్పీ రేటింగ్ కోసం ఎలా పోటీ పడ్డాయి? టీఆర్పీని పెంచే క్రమంలో ఈ న్యూస్ చానెల్స్‌లోని సీనియర్ ఉద్యోగులు ఎలాంటి ఒత్తిడికి లోనయ్యారు? వాటి పరిణామాలు, పరిస్థితుల సమాహారంగా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. ‘ది బ్రోకెన్ న్యూస్’ ఈ నెల 10 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే బ్రిటిష్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్‌లో నటిస్తున్నారు బాలీవుడ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్. సందీప్ మోడి దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో శోభితా ధూళిపాళ్ల, అనిల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రధారులు. ఆర్మీలో పని చేసిన అనుభవం ఉన్న ఓ వ్యక్తి ఒక ప్రముఖ హోటల్లో నైట్ మేనేజర్ డ్యూటీ చేస్తుంటాడు. ఇదే సమయంలో వ్యాపారవేత్త ముసుగులో చట్టవిరుద్ధంగా ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తుంటాడు మరో వ్యక్తి. ఈ వ్యాపారవేత్తను గమనించేందుకు ప్రభుత్వం కూడా అతని కదలికలపై ఓ స్పై టీమ్‌ను నియమిస్తుంది. ఇదే సమయంలో నైట్ మేనేజర్‌తో పరిచయం ఉన్న ఓ యువతి హత్యకు గురవుతుంది? ఈ హత్యకు కారకులు ఎవరు? ఆమెను ఎందుకు హత్య చేశారు. స్పై టీమ్‌కు, నైట్ మేనేజర్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే అంశాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. నిజానికి ఇందులో హృతిక్ రోషన్ చేయాల్సింది కానీ ఫైనల్‌గా ఆదిత్యా రాయ్ చేతికి వచ్చి చేరింది. పైన పేర్కొన్న వెబ్ సిరీస్‌లే కాదు.. మరికొన్ని హాలీవుడ్ సిరీస్‌లు రీమేక్ కానున్నాయి. -
పోలీస్ ఆఫీసర్‌గా బాలీవుడ్ బ్యూటీ
పోలీసాఫీసర్ డ్యూటీ చేయనున్నారట మృణాళ్ ఠాకూర్. ‘సూపర్ 30’, ‘బాల్తా హౌస్’, ‘తుఫాన్’ వంటి చిత్రాలతో బాలీవుడ్లో మంచి నటిగా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా మరో హిందీ చిత్రానికి సై అన్నారు. తమిళ హిట్ ‘తడమ్’ (తెలుగులో రామ్ చేసిన ‘రెడ్’) హిందీ రీమేక్‌లో మృణాళ్ ఒక హీరోయిన్గా నటించనున్నారు. ఆదిత్యారాయ్ కపూర్ హీరోగా నటించనున్న ఈ చిత్రంతో వర్థన్ కేట్కర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో ప్రారంభం కానుంది. తమిళ ‘తడమ్’లోని అరుణ్ విజయ్ పాత్రను ఆదిత్య చేస్తుంటే.. విద్యాప్రదీప్ రోల్‌ను మృణాళ్ చేయనున్నారని తెలిసింది. నార్త్‌లో మంచి సినిమాలు చేస్తున్న మృణాళ్ సౌత్ ఎంట్రీ కూడా ఖరారైంది. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మృణాళ్ హీరోయిన్గా చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : టక్ జగదీష్ : 'ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు' MAA Elections 2021 : మసకబారుతున్న 'మా' ప్రతిష్ట.. -
ఆకట్టుకుంటున్న సడక్ 2 ట్రైలర్
ముంబై : సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ఆదిత్యారాయ్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా మహేశ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన సడక్ 2 ట్రైలర్ వచ్చేసింది. 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ సడక్‌కు ఇది సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి రవివర్మ పాత్రలో నటిస్తున్న సంజయ్ తన భార్య(పూజా భట్) చనిపోవడంతో ట్యాక్సీ డ్రైవర్ వృత్తిని మానేసి ప్రశాంత జీవితం గడుపుతుంటాడు. దేవుడి పేరుతో ప్రజలను మభ్యపెడుతన్న నకిలీ బాబా గుట్టును బయటపెట్టడానికి ఆలియా ప్రయత్నిస్తుంటుంది. సంజయ్, ఆదిత్యారాయ్ కపూర్ల సహకారంతో నకిలీ బాబా గుట్టును ఆమె ఎలా బహిర్గతం చేస్తుందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. (ఓటీటీలో సడక్ 2) నకిలీ బాబా పాత్రలో మకర్ దేశ్ పాండే, గుల్షన్ గ్రోవర్, జిష్ణు సేన్ గుప్తా తదితరులు నటిస్తున్నారు. విశేష్ ఫిలింస్ బ్యానర్ పేరు మీద ముఖేశ్ భట్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో 21 ఏళ్ల తర్వాత మహేశ్ భట్ మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో తొలిసారి ఆలియా నటించిన చిత్రమిది. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడటం, ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు యూనిట్ మొగ్గుచూపింది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈనెల 28న విడుదల కానుంది. కాగా సంజయ్ దత్ మంగళవారం నానావతి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్న తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ బారీన పడినట్లు సమాచారం. సంజయ్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్నట్లు తెలిసింది.('సంజయ్.. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసు') -
ఓటీటీలో సడక్ 2
ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సడక్ 2’. ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్, పూజా భట్ కీలక పాత్రలు చేశారు. తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో తొలిసారి ఆలియా నటించిన చిత్రమిది. 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘సడక్’కి ఇది సీక్వెల్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఆలియా, సంజయ్ దత్ లుక్స్‌ను విడుదల చేశారు. నేడు ‘సడక్ 2’ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో థియేటర్లు మూతపడటం, ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు యూనిట్ మొగ్గుచూపింది. ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈనెల 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
రెండు ఉన్మత్త ఆత్మలు.. ఒక ప్రేమ..
ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటిస్తున్న ‘మలంగ్’ లేటెస్ట్ పోస్టర్ హీట్ పెంచుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఆదిత్య, దిశ, అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో సముద్రం ఒడ్డున ఆదిత్య, దిశ గాఢ చుంబనంలో మునిగిపోయినట్టు చిత్రీకరించారు. ఈ పోస్టర్‌ను దిశా పటానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి.. ‘రెండు ఉన్మత్త ఆత్మలు.. ఒక ప్రేమ.. మలంగ్’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ సినిమా ట్రైలర్ జనవరి 6న విడుదలకానుంది. రాజ్, కలియుగ్, ఏక్ విలన్, ఆష్కీ 2 తదితర సినిమాలకు దర్శకత్వం వహించిన మొహిత్ సూరి ఈ సినిమా తెరకెక్కించారు. క్రైమ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ‘మలాంగ్’ సినిమాలో కీలకమైన ఓ ముద్దు సన్నివేశం కోసం హీరోహీరోయిన్లు రెండు రోజులు శిక్షణ తీసుకున్నారట. కునాల్ ఖేము, అమృత ఖాన్విల్కర్, ఏంజెలా క్రిస్లింజ్కి, షాద్ రాంధ్వా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 7న ‘మలంగ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ప్రతి అడుగూ విలువైనదే
కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నారు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. మహేశ్ భట్ దర్శకత్వంలో సంజయ్ దత్, పూజా భట్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ ముఖ్య తారాగణంగా తెరకెక్కుతున్న సినిమా ‘సడక్ 2’. మహేశ్‌భట్ దర్శకత్వంలోనే 1991లో వచ్చిన ‘సడక్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా చాలా ఎమోషనల్ అయ్యారు ఆలియా. ‘‘సడక్ 2’ సెట్స్‌పైకి వెళ్లింది. మా నాన్నగారు (మహేశ్ భట్) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అపారమైన, అందమైన, ఓ ఎమోషనల్ పర్వతాన్ని ఎక్కబోయే చిన్న ఎలుకగా నన్ను నేను ఊహించుకుంటున్నాను. నేను ఈ పర్వత శిఖరాన్ని చేరుకోగలనని అనుకుంటున్నాను. ఇది అనుకున్నంత ఈజీ కాదని తెలుసు (తండ్రి డైరెక్షన్లో, సీనియర్స్‌తో కలిసి నటించడాన్ని ఉద్దేశించి). ఒకవేళ మధ్యలో నేను పడిపోతే తిరిగి పుంజుకోగలననే నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం వేసే ప్రతి అడుగూ విలువైనదే’’ అని ఆలియా అన్నారు. తండ్రి మహేశ్ భట్ దర్శకత్వంలో తొలిసారి నటిస్తున్నారు ఆలియా. ఇక దాదాపు 20ఏళ్ల తర్వాత ‘సడక్ 2’ సినిమా కోసం మహేశ్ భట్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. 1999లో వచ్చిన ‘కారతూష్’ చిత్రం తర్వాత మహేశ్ భట్ ఇంకో సినిమాకు దర్శకత్వం వహించలేదు. -
పదకొండు కిలోలు పెరగాలి!
... అంటున్నారు ఆదిత్య రాయ్ కపూర్. మోహిత్ సూరి దర్శకత్వంలో ఆదిత్య రాయ్ కపూర్, దిశా పాట్నీ, అనిల్ కపూర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మళంగ్’. ఈ సినిమాలో ఆదిత్యరాయ్ కపూర్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. తన పాత్ర కోసం పదకొండు కిలోలు పెరగనున్నారట. ‘‘ఈ సినిమా కోసం నా శరీరాన్ని భారీగా మార్చేయనున్నా. ఆ వర్క్ కూడా స్టార్ట్ చేశాను’’ అన్నారు ఆదిత్య. ‘ఆషికీ 2’ తర్వాత మోహిత్ సూరి, ఆదిత్య కలసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి. -
కొత్త ప్రయాణం
‘సడక్ 2’ ప్రయాణం మొదలైంది. ఈ చిత్రం కోసం లొకేషన్ సెర్చ్ స్టార్ట్ చేశారు దర్శకుడు మహేశ్ భట్. తన 70వ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ భట్ ‘సడక్ 2’ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఆయన దర్శకత్వం వహించనున్న చిత్రమిదే కావడం విశేషం. 1999లో మహేశ్ భట్ చివరగా ‘కార్తూస్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘సడక్ 2’ కి సన్నాహాలు మొదలెట్టారు. 1991లో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సడక్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో సంజయ్ దత్, పూజాభట్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ‘‘సడక్ 2’ ప్రయాణం అధికారికంగా మొదలైంది. లైఫ్‌ను మార్చే కొత్త ప్రయాణం ఆరంభమైన అనుభూతి కలుగుతోంది. డెహ్రాడూన్, కేదార్నాథ్ ప్రదేశాలను షూటింగ్ కోసం పరిశీలించాం’’అన్నారు పూజాభట్. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. -
సహజీవనానికి సై అంటున్న హీరోయిన్!
ముంబై: ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపిస్తున్న చిత్రం బాఘీ. ఈ మూవీ హీరోయిన్ శ్రద్ధాకపూర్ మరోసారి తన నటనతో విమర్శల ప్రశంసలు దక్కించుకుంది. అయితే శ్రద్ధాకపూర్ ఈ మధ్య ఎందుకో మరి సహజీవనం చేయడానకి సిద్ధమైందట. హీరో ఆదిత్యారాయ్ కపూర్ ఏం చెప్పినా 'ఓకే జాను' అంటుంది. ఇంతకి సంగతేంటి అనుకుంటున్నారా.. బాఘీ తర్వాత ఓ కొత్త మూవీలో నటిస్తుంది. ఆ మూవీ టైటిల్ 'ఓకే జాను'. యువ జంట సహజీవనం చేయడం అనే అంశంపై ఈ మూవీ కథాంశం ఉంటుంది. ఆదిత్యారాయ్ తో సహజీవనం చేస్తూ రొమాన్స్ చేయనుంది. బాఘీ విడుదలై వారం రోజులు కూడా గడవకముందే తన తర్వాతి ప్రాజెక్టుపై శ్రద్ధగా వర్క్ చేస్తుంది శ్రద్ధా. ఇంకా చెప్పాలంటే బాఘీ రిలీజైన రోజే షూటింగ్ లో పాల్గొంది. తన మూవీ గురించి టాక్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందని, కానీ బిజీగా ఉండటం వల్ల అది సాధ్యమవడం లేదని కాస్త బాధగా ఉందట. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఒకే కన్మణి' మూవీకి ఇది హిందీ రీమేక్. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో 'ఓకే బంగారం' పేరుతో డబ్ చేశారు. హిందీలో 'ఆషికీ 2' జోడీ ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ మరోసారి ఒకే తెరమీద కనిపించనున్నారు. శ్రద్ద నటించిన 'రాక్ ఆన్ 2' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. -
జంటగా షాపింగ్ చేస్తున్న కత్రినా, ఆదిత్య
-
'ఆమె ఇన్వాల్వ్మెంట్ అద్భుతం' : టబు
సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ను మరో హీరోయిన్ పొగడటం చాలా అరుదు. అయితే ఇటీవలి కాలంలో నటీమణులు ...ఇతర నటులను పొగడటం తరుచు జరుగుతోంది. చాలామంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తమ తోటి నటీమణులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదే బాటలో సీనియర్ హీరోయిన్ టబు... టాప్ హీరోయిన్లలో ఒకరైన కత్రినా కైఫ్‌ను ఆకాశానికి ఎత్తేసింది. ఫితూర్ సినిమాలో టబు, కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్నారు. హీరోయిన్గా కెరీర్ ముగిసిన తరువాత ప్రస్తుతం స్పెషల్ క్యారెక్టర్స్‌లో మాత్రమే కనిపిస్తోంది టబు. అదే బాటలో ఫితూర్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో అలరించింది. ఈ సందర్భంగా తన కో-స్టార్ కత్రినా కైఫ్‌పై పొగడ్తల వర్షం కురిపించింది. 'ఇప్పటివరకు నేను కలిసి పనిచేసిన వారిలో కత్రినానే హార్డ్ వర్కింగ్ హీరోయిన్, నటన పట్ల ఆమె ఇన్వాల్వ్మెంట్ అద్భుతం అనిపించింది' అంటూ కత్రినాపై ప్రశంసలు కురిపించింది. అదే సమయంలో క్యాట్ కూడా టబుపై తన గౌరవాన్ని చూపించింది. ' ఈ సినిమాలో నమ్మలేని విషయం టబు నా తల్లిపాత్రలో కనిపించటం' అంటూ కామెంట్ చేసింది. ఆదిత్యరాయ్ కపూర్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఫితూర్, చార్లెస్ డికెన్స్ రచించిన గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ నవల ఆధారంగా తెరకెక్కింది. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతోంది. -
గర్ల్ ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్!
ఇద్దరి మధ్య ఏమీ లేదు లేదంటూనే శ్రద్ధాకపూర్ కోసం వజ్రాల ఉంగరం కొనేశాడు ఆదిత్యారాయ్ కపూర్. తన చిత్రం ప్రమోషన్లో ఎంతో బిజీగా ఉన్నా.. షాట్ గ్యాప్‌లో షాపింగ్‌కు ట్రైచేశాడీ కుర్ర హీరో. ‘దావత్ ఎ ఇష్క్’ చిత్రం ప్రచార కార్యక్రమం కోసం సహనటి పరిణీతి చోప్రాతో సూరత్ వెళ్లే క్రమంలో ఆదిత్యా... ఓ జ్యువెలరీ షాప్‌ను విజిట్ చేశాడట. అక్కడ రద్దీ ఉండటంతో తిరిగి వచ్చేశాడట. తరువాత నగల వ్యాపారిని తన హోటల్‌కు రప్పించుకొని డైమండ్ రింగ్ కొనేశాడనేది ‘ది మిర్రర్’ కథనం. -
అది నా కెరీర్ కు ఒక మలుపు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ లో తన ప్రస్థానం కొనసాగించటానికి ‘ఆషికి-2’ సినిమా అనేది ఒక గొప్ప మలుపని ఆదిత్యారాయ్ కపూర్ అంటున్నాడు. 28 ఏళ్ల ఆదిత్య ‘లండన్ డ్రీమ్స్’, యాక్షన్ రీ ప్లే’, ‘గుజారిష్’ తదితర సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ‘నాకు మొదటినుంచీ ఏదో ఒక రోజు కెరీర్లో మంచి మలుపు వస్తుందనే నమ్మకం ఉంది. అయితే ‘యే జవానీ దివానీ’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. మోహిత్ సూరి నేతృత్వంలో రూపొందించిన ‘ఆషికి-2’సినిమాలో ప్రధాన భూమిక నాదే. సోలో హీరో సినిమా అవకాశాలు రాలేదని నేను ఏనాడూ బాధపడలేదు. ఏ నిర్మాత అయినా వాణిజ్యపరంగా ఇబ్బందులు లేని కథానాయకుడు ఉండాలని కోరుకుంటాడు. అందువల్ల ఈ విషయంలో నేను ఎవరినీ నిందించదలుచుకోలేదు. అయితే అదృష్టం ‘ఆషికి-2’సినిమా రూపంలో వరించింది. చిన్న చిన్న పాత్రలు చేసే రోజుల్లో ఏనాడూ నిరాశకు గురికాలేదు. 2013లో విడుదలైన సినిమాల్లో ‘ఆషికి-2’ రికార్డు సృష్టించింది’ అని అన్నాడు. ఈ సినిమాలో ఆదిత్య... మద్యానికి అలవాటుపడిన యువకుడి పాత్రలో కనిపిస్తాడు. -
మేమిద్దరం తిండిబోతులం
నిజజీవితంలోనూ తాను తిండిబోతునని నిజాయతీగా ఒప్పుకునే పరిణీతి చోప్రాకు సరిపోయే సినిమానే దొరికింది! ఆదిత్యరాయ్ కపూర్‌కు జోడీగా ఈమె దావత్ ఏ ఇష్క్‌లో నటిస్తోంది. ఇద్దరం తిండిబోతులం కాబట్టే షూటింగ్ సెట్లపైనే స్నేహితులమయ్యామని చెబుతోంది. హబీబ్ ఫైజల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పరిణీతి హైదరాబాద్‌లోని ఓ దుకాణంలో సేల్స్‌గాళ్‌గా పనిచేసే గుల్రెజ్గా కనిపిస్తుంది. కెబాబ్‌లు, బిర్యానీతో ఎంతటి వారినైనా కట్టిపడేసే బావర్చీగా ఆదిత్య నటిస్తున్నాడు. చిన్న ఘర్షణ కారణంగా వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ‘నేను తిండిబోతును. ఈ విషయంలో ఆది నాతో పోటీ పడతాడని షూటింగ్ సమయంలోనే అర్థమయింది. మా ఇద్దరికీ తిండి అంటే చాలా ఇష్టం. ప్లేట్లకు ప్లేట్లు సెట్లపైనే లాగించే వాళ్లం. ఈ సినిమాలో నేను బాగా తినాలి. దీని కథ నాకోసమే రాశారేమో అనిపించింది’ అని వివరించింది. దావత్ ఏ ఇష్క్ పాటల విడుదల కోసం ఢిల్లీలో శుక్రవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో పరిణీతి మాట్లాడుతూ ఈ సంగతులన్నీ చెప్పింది. హైదరాబాద్‌తోపాటు లక్నో, ముంబైలో సినిమా షూటింగ్ జరిగింది. లక్నో వంటకాల పుణ్యమాని ఆదిత్య, తాను విపరీతంగా బరువెక్కామంటూ ఈ 25 ఏళ్ల బ్యూటీ నవ్వేసింది. ‘మాతోపాటు అనుపమ్ ఖేర్ బాగా లాగించేవారు. ఆయన కొన్నాళ్లు లక్నోలోనూ ఉండడం వల్ల అక్కడి స్థానిక వంటకాలు, హోటళ్ల గురించి బాగా తెలుసు’ అని వివరించింది. 2012 హబీబ్ తీసిన ఇషక్జాదేలో పరిణీతి ముస్లిం యువతిగా కనిపించగా, ఈ సినిమాలోనూ ముస్లింగా నటించడం విశేషం. రెండు సినిమాల్లోనూ ముస్లింగా కనిపించినా, పాత్రలు మాత్రం వేర్వేరుగా ఉంటాయని తెలిపింది. దావత్ ఏ ఇష్క్‌లో ఈమె హైదరాబాద్ హిందీ మాట్లాడుతుందని దర్శకుడు హబీబ్ అన్నాడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాను వచ్చే నెల ఐదు నుంచి థియేటర్లలో చూడవచ్చు. సాజిద్ వాజిత్ ద్వయం ఈ సినిమా కోసం బాణీలు అందించింది.