airspace
-
ఇరాన్‌పై దాడి.. మూడు దేశాల గగనతలం మూసివేత
టెహ్రాన్:తమపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇవాళ(శనివారం) తెల్లవారుజామున పెద్దఎత్తున దాడులు చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలే టార్గెట్‌గా క్షిపణుల దాడి జరిపింది. దీంతో ఒక్కసారిగా పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రయోగించిన మిసైల్స్ కారణంగా విమాన సర్వీసులు నిలిపివేశారు. ఫ్లైట్ రాడార్ 24, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ప్రకారం.. మూడు దేశాలు( ఇరాన్, ఇరాక్, సిరియా) మీదుగా ఏ విమానమూ ప్రయాణించడం లేదు.ఈ మూడు దేశాల మధ్య విమనాలు ప్రయాణించే గగనతలం మూసివేశారు. అయితే.. దాడులు ముగిసిన అనంతరం గగనతలంలో విమాన సర్వీసుల ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా కొన్ని గంటల పాటు జోర్డాన్, ఇజ్రాయెల్ గగనతలం మూసివేయబడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.The airspace of #Iran, #Iraq, #Jordan, #Syria and #Israel is closed as Israeli war planes attack various locations in Iran for the last few hours. pic.twitter.com/5MEcNGaiNk— Hamdan News (@HamdanWahe57839) October 26, 2024అక్టోబర్ 1న హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇరాన్.. ఇజ్రాయెల్‌పై 200కుపైగా రాకెట్లు, క్షిపణుల ప్రయోగించింది. ఇరాన్ వైమానిక దాడులకు ప్రతీకంగా ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసింది. ఇజ్రాయల్ చేసిన దాడులపై ఇరాన్ స్పందించింది. ‘‘శనివారం తెల్లవారుజాము నుంచి ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇలామ్, ఖుజెస్తాన్, టెహ్రాన్‌లోని సైనిక స్థావరాలను ఐడీఎఫ్ లక్ష్యంగా దాడులు జరిపింది. అయితే ఈ దాడులు పరిమిత నష్టాన్ని మాత్రమే కలిగించాయి" అని ఓ ప్రకటనలో పేర్కొంది. -
బుద్ధిమారని పాక్.. టర్కీకి భారత్ సాయం అందకుండా మోకాలడ్డు!
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. భూకంపంతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న టర్కీకి సాయం అందించేందుకు వెళ్తున్న భారత యుద్ధ విమానాలు తమ గగనతలం మీద నుంచి వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో భారత సీ-17 యుద్ధ విమానం వెనక్కి వచ్చి వేరే దేశం మీదుగా టర్కీకి చేరుకోవాల్సి వచ్చింది. ఈమేరకు భారత మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే భారత యుద్ధవిమానాలు అసలు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లలేదని, ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమతులు కూడా పాకిస్తాన్‌ను భారత్ అడగలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్‌లోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ కూడా ఈ విషయంపై స్పందించారు. భారత యుద్ధవిమానాలు ఎగిరేందుకు పాకిస్తాన్ అనుమతి నిరాకరించిందనే విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. 2021లో కూడా అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పుడు భారతీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చింది కేంద్రం. అప్పుడు కూడా మనం పాక్ గగనతలాన్ని వినియోగించుకోలేదు. మన విమానాలు అఫ్గాన్ నుంచి ఇరాన్ మీదుగా భారత్ చేరుకున్నాయి. రెండు యుద్ధవిమానాలు.. భూకంపం అనంతరం టర్కీకి భారత్ తనవంతు సాయం చేస్తోంది. ఇప్పటివరకు రెండు యుద్ధ విమానాల్లో సహాయక సిబ్బంది, పరికరాలు, ఔషధాలను పంపింది. మొదటి యుద్ధ విమానం సోమవారం రాత్రే టర్కీ చేరుకోగా.. రెండో యుద్ధ విమానం మంగళవారం వేకువజామున టర్కీకి వెళ్లింది. ఈ విమానాల్లో జాతీయ విపత్తు నిర్వహణ దళాలు, ప్రత్యేక శిక్షణ తీసుకున్న డాగ్ స్క్వాడ్లు, డ్రిల్లింగ్ మెషీన్లు, ఔషధాలు, పరికరాలు సహా ఇతర సామగ్రిని భారత్ టర్కీకి పంపింది. First Indian C17 flight with more than 50 @NDRFHQ Search & Rescue personnel, specially trained dog squads,drilling machines, relief material, medicines and other necessary utilities & equipment reaches Adana,Türkiye. Second plane getting ready for departure. @MevlutCavusoglu pic.twitter.com/sSjuRJJrIO — Dr. S. Jaishankar (@DrSJaishankar) February 7, 2023 చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
అమెరికా అణుస్థావరంపై చైనా బెలూన్
వాషింగ్టన్/బీజింగ్: చైనాకు చెందిన నిఘా బెలూన్ అమెరికా గగనతలంపై, అదీ అణు స్థావ రం వద్ద తచ్చాడటం కలకలం రేపింది. దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించింది. విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను వాయిదా వేసుకున్నారు. మూడు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్ కొన్ని రోజులుగా తమ గగనతలంలో అగుపిస్తోందని, అది గురువారం మోంటానాలో ప్రత్యక్షమైందని పెంటగాన్ పేర్కొంది. అది అత్యంత ఎత్తులో ఎగురుతున్నందున వాణిజ్య విమానాల రాకపోకలకు అంతరాయమేమీ లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సున్నిత సమాచారం లీకవకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. బెలూన్ను కూల్చేస్తే దాని శకలాల వల్ల ప్రజలకు హాని కలగవచ్చని ఆర్మీ భావిస్తోంది. అన్ని అంశాలను అధ్యక్షుడు బైడెన్‌కు వివరించినట్లు పెంటగాన్ ప్రకటించింది. అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి మోంటానాలోనే ఉంది. దాంతో ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. చైనాతో చర్చల నిమిత్తం శుక్రవారం రాత్రి బయల్దేరాల్సిన విదేశాంగ మంత్రి బ్లింకెన్ పర్యటన వాయిదా పడింది. వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్ దారి తప్పి అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా పేర్కొంది. ఈ అనుకోని పరిణామానికి చింతిస్తున్నట్టు చెప్పింది. ఈ వివరణతో అమెరికా సంతృప్తి చెందలేదు. ‘‘మా గగనతలంలోకి చైనా బెలూన్ రావడం మా సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే. చైనా చర్య ఆమోదయోగ్యం కాదు. ఈ సమయంలో బ్లింకెన్ పర్యటన సరికాదని భావిస్తున్నాం’’ అని అమెరికా అధికారి ఒకరన్నారు. పరిస్థితులు అనుకూలించాక బ్లింకెన్ చైనా పర్యటన ఉంటుందన్నారు. -
కిమ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన దక్షిణ కొరియా..!
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. తమ గగనతలంలోకి మరోసారి కిమ్ దేశానికి చెందిన డ్రోన్లు ప్రవేశిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అవసరమైతే 2018లో కుదుర్చుకున్న సైనిక ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కిమ్ దేశం హద్దులు మీరొద్దని తేల్చి చెప్పారు. గతవారం ఉత్తరకొరియా డ్రోన్లు దక్షిణ కొరియాలోకి ప్రవేశించాయి. నిబంధనలు ఉల్లంఘించి సరిహద్దు దాటి చక్కర్లు కొట్టాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన యూన్ సుక్.. పొరుగు దేశం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తమ సైన్యం ఈ విషయంలో వ్యవహిరించిన తీరుపైనా మండిపడ్డారు. డ్రోన్లు తమ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు సైన్యం సరైన రీతిలో స్పందించాల్సిందని వ్యాఖ్యానించారు. హద్దు మీరినప్పుడు చూస్తూ ఉరుకోవద్దన్నారు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య దశాబ్దాల కాలంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. యూన్ సుక్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పొరుగు దేశంతో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. కిమ్ దేశం నిబంధనలు ఉల్లంఘిస్తే దీటుగా బదులిస్తున్నారు. చదవండి: రష్యా సినిమా హాళ్లలో ఉక్రెయిన్‌పై దాడి దృశ్యాలు.. పుతిన్ కీలక ఆదేశాలు -
Ukraine-Russia War: దిగ్బంధంలో కీవ్
లెవివ్/వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. ఉక్రెయిన్ సైనికులతోపాటు స్థానికుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ రష్యా సైన్యం దూసుకుపోతోంది. కీలక నగరాలపై పట్టు సాధించడానికి గగనతలం నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. రాజధాని కీవ్‌కు ఇతర ప్రాంతాలతో సంబంధాలను ఆక్రమించేందుకు ఈశాన్యంగా చుట్టుముడుతోంది. కీవ్ శివార్లలో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మరోవైపు పోర్టు సిటీ మారియుపోల్‌లో చిన్నారులతో సహా 80 మందికి పైగా పౌరులు తలదాచుకున్న మసీదుపై రష్యా సైన్యం శనివారం క్షిపణులతో భీకర దాడికి దిగింది. మారియుపోల్‌లో యుద్ధ మరణాలు 1,500 దాటినట్లు మేయర్ కార్యాలయం ప్రకటించింది. కీవ్ పరిధిలోని పెరెమోహా గ్రామంలో పౌరులను తరలిస్తున్న వాహన కాన్వాయ్‌పై రష్యా బాంబు దాడి జరగడంతో ఏడుగురు పౌరులు మరణించారు. మైకోలైవ్ నగరంలోనూ రష్యా బీభత్సం సృష్టిస్తోంది. దాడిలో క్యాన్సర్ ఆసుపత్రి, నివాస సముదాయాలు దెబ్బతిన్నాయని అధికారులు చెప్పారు. మారియుపోల్ తూర్పు శివారు ప్రాంతాలను రష్యా సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ వలసలు 26 లక్షలు దాటినట్టు సమాచారం. యుద్ధం ఆపాలంటూ పోప్ ఫ్రాన్సిస్ ట్వీట్ చేశారు. జర్మనీ చాన్స్‌లర్ స్కోల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడారు. కాల్పులు విరమించాలని కోరారు. మరో మేజర్ జనరల్ మృతి యుద్ధంలో రష్యా మరో సైనిక ఉన్నతాధికారిని కోల్పోయింది. మారియుపోల్‌లో తమ దాడిలో రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ కొలేస్నికోవ్ చనిపోయినట్టు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. రష్యా ఇప్పటికే ఇద్దరు మేజర్ జనరల్స్‌ను పోగొట్టుకోవడం తెలిసిందే. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారిని ఆదుకోవడానికి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు కోసం ఉక్రెయిన్, రష్యాలతో చర్చిస్తున్నట్టు ఐరాస చెప్పింది. 12,000 మంది అమెరికా సైనికులు రష్యాతో సరిహద్దులున్న లాత్వియా, ఎస్తోనియా, లిథువేనియా, రొమేనియా తదితర దేశాలకు 12,000 మంది సైనికులను పంపినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ గెలవలేరన్నారు. రష్యాకు ఎదురొడ్డి ఉక్రెయిన్ ప్రజలు అసామాన్య ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. అయితే ఈ యుద్ధంలో తాము భాగస్వాములం కాబోమన్నారు. నాటో సభ్య దేశాల భూభాగాలను కాపాడుకునేందుకు రష్యా సరిహద్దులకు 12,000 అమెరికా సైనికులను పంపించినట్టు చెప్పారు. ఉక్రెయిన్ సైన్యంలోకి... స్నైపర్ వలీ ‘రష్యాపై జరుగుతున్న యుద్ధంలో మాకు సహాయం చేయండి’ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన విజ్ఞప్తి పట్ల కెనడా మాజీ సైనికులు సానుకూలంగా స్పందించారు. కెనడా రాయల్ 22వ రెజిమెంట్‌కు చెందిన పూర్వ సైనికులు ఉక్రెయిన్ సైన్యంలో చేరారు. వీరిలో ప్రపంచంలోనే అత్యుత్తమ స్నైపర్ వలీ కూడా ఉన్నారు. రష్యా అన్యాయమైన యుద్ధం చేస్తోందని, అందుకే ఉక్రెయిన్‌కు అండగా రంగంలోకి దిగానని వలీ చెప్పారు. గతంలో ఇరాక్‌లో ఐసిస్ ఉగ్రవాదులపై పోరాడిన కుర్దిష్ దళాలకు వలీ సాయం అందించారు. వలీ ఒక్కరోజులో కనీసం 40 మందిని హతమార్చగలడంటారు. 2017 జూన్‌లో ఇరాక్‌లో 3,540 మీటర్ల దూరంలో ఉన్న ఐసిస్ జిహాదిస్ట్‌ను సునాయాసంగా కాల్చి చంపాడు. మెలిటోపోల్ మేయర్ కిడ్నాప్ మెలిటోపోల్ మేయర్‌ను రష్యా సైనికులు అపహరించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. రష్యా సైన్యం ఐసిస్ ఉగ్రవాదుల్లా రాక్షసంగా ప్రవర్తిస్తోందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బందీలుగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. రష్యాపై పోరాటం కొనసాగించాలని ఉక్రెయిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మేయర్‌ను రష్యా జవాన్లు కిడ్నాప్ చేస్తున్న వీడియోను ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మీ పిల్లలను యుద్ధానికి పంపొద్దు..రష్యా తల్లులకు జెలెన్స్కీ విజ్ఞప్తి ‘దయచేసి మీ పిల్లలను యుద్ధ రంగానికి పంపకండి, వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకండి’ అని రష్యా మహిళలకు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలను ఉక్రెయిన్‌లో యుద్ధంలోకి దించేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఉద్యోగాలిస్తాం, కేవలం సైనిక శిక్షణ ఇస్తాం అనే మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మొద్దని కోరారు. యుద్ధంలో తమ సైనికులు 1,300 మంది అమరులయ్యారని వెల్లడించారు. కీవ్‌ను స్వాధీనం చేసుకొనేందుకు అమాయకులను రష్యా పొట్టన పెట్టుకుంటోందని ఆరోపించారు. సంక్షోభానికి ముగింపు పలకడానికి ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో చర్చిద్దామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు జెలెన్స్కీ ప్రతిపాదించినట్లు సమాచారం. -
2022 కంటే ముందే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం!
రష్యా యుద్ధం ప్రకటించగానే ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేసింది. అయితే, ఉక్రెయిన్ గగనతలంపై 2022 కంటే ముందే రష్యా యుద్ధాన్ని ప్రారంభించిందన్న సంగతి మీకు తెలుసా? యుద్ధ భయంతో ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే పౌర విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అమెరికా, నాటో దళాలకు చెందిన కొన్ని మానవరహిత గూఢచారి విమానాలు మాత్రమే ఉక్రెయిన్ గగనతలంపై ఇపుడు కనబడుతున్నాయి. అయితే గగనతలం మూసివేయడం ఉక్రెయిన్‌కు కొత్త కాదు. ఇది 2014కి ముందు ప్రారంభమైంది. ఆ ఏడాది తర్వాత ప్రతి సంక్షోభ సమయంలోనూ ఆకాశ మార్గాలను మూసివేయాల్సిన అనివార్యత ఉక్రెయిన్‌కు ఏర్పడింది. ఎందుకంటే..? 298 మంది అమాయకులు బలి ఆ రోజు 2014 జూలై 17. ఆమ్స్టర్డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయలుదేరిన మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్17 తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా సరిహద్దుకు సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలింది. 283 మంది ప్రయాణికులు, 15 మంది విమాన సిబ్బంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ముందు అందరూ ప్రమాదంగానే భావించారు. తర్వాతే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భూతలం నుంచి క్షిపణి ప్రయోగించి విమానాన్ని కూల్చివేసినట్టు వెల్లడికావడంతో యావత్ ప్రపంచం దిగ్భ్రమకు గురైంది. అసలేం జరిగింది? దక్షిణ ద్వీపకల్పం.. అప్పటి సార్వభౌమ ఉక్రెయిన్‌లో భాగమైన క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద, తమకు అనుకూల తిరుగుబాటు గ్రూపులకు రష్యా మద్దతునిచ్చింది. ఈ సంక్షోభ సమయంలోనే మలేసియా విమానం కూల్చివేత ఘటన జరిగింది. ఈ విమానానికి ఉక్రెయిన్‌లో ఎటువంటి స్టాప్‌లు లేవు. ఉక్రెయిన్- రష్యా సరిహద్దు మీదుగా తూర్పు ఉక్రెయిన్‌లోని కల్లోలిత ప్రాంతాలపై 33,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని క్షిపణితో నేలకూల్చారు. విమానం మూడు ముక్కలై తూర్పు ఉక్రెయిన్‌లోని వివిధ ప్రదేశాలలో నేలపై కూలిపోయింది. మొత్తం 298 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల గ్రూపులు విమానాన్ని కూల్చివేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే, ఈ దారుణ ఘటనలో తమ ప్రమేయం ఉందన్న ఆరోపణలను రష్యా నేటికీ ఒప్పుకోకపోవడం గమనార్హం. నలుగురు వ్యక్తులు, ముగ్గురు రష్యా మాజీ ఏజెంట్లు, విమానాన్ని కూల్చివేసినట్లు అభియోగాలు మోపి దర్యాప్తు సంస్థలు చేతులు దులుపుకున్నాయి. తప్పిన పెను ముప్పు 2014లో జరిగిన ఘటనకు ముందు మరికొన్ని ఉక్రెయిన్ సైనిక విమానాలు కూడా కూల్చివేయబడ్డాయి. అయితే సేఫ్ ఫ్లయింగ్ జోన్లో ఎగురుతున్న పౌర విమానంపై దాడి యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. మలేసియా విమానం కూల్చివేసిన రోజు.. పలు పౌర విమానాలు అదే మార్గంలో ప్రయాణించాయి. ఎయిర్ ఇండియా విమానం ఒకటి అదే జోన్ గుండా ప్రయాణించాల్సి ఉంది. అదృష్టవశాత్తు మిగతా విమానాలు సురక్షితంగా బయటపడ్డాయి. (క్లిక్: భారత్ అభ్యర్థనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రష్యా..) ఉక్రెయిన్‌కు రష్యా దెబ్బ మలేసియా విమానం కూల్చివేత తర్వాత ఉక్రెయిన్ గగనతలం గుండా ప్రయాణించే విమానాల సంఖ్య తగ్గిపోయింది. ముఖ్యంగా తూర్పు ఉక్రెయిన్ గగనతలంపై నుంచి విమాన రాకపోకలు చాలా వరకు తగ్గాయి. ఉక్రెయిన్ గగనతలం సురక్షితం కాదన్న ప్రచారంతో మిగతా ప్రపంచం నుంచి ఉక్రెయిన్ను రష్యా దూరం చేయగలిగింది. మరోవైపు ఆర్థికంగానూ శత్రుదేశాన్ని దెబ్బకొట్టింది. తాజాగా రష్యా దురాక్రమణకు దిగడంతో.. గతానుభవాల దృష్ట్యా ఉక్రెయిన్ ముందుగా గగనతలాన్ని మూసివేసింది. దీంతో ఫిబ్రవరి 24న భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు న్యూఢిల్లీ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఉక్రెయిన్ సరిహద్దులను చేరుకోవడానికి ముందే వెనుదిరిగింది. ఉక్రెయిన్ గగనతలం మీదుగా ప్రయాణించాల్సిన ఇజ్రాయెల్ విమానం కూడా యూ-టర్న్ తీసుకోక తప్పలేదు. (క్లిక్: ఉక్రెయిన్ సంక్షోభం: చిన్నమ్మ ఈ పరిస్థితుల్లో ఉండి ఉంటేనా..) - సాక్షి, వెబ్ స్పెషల్ -
అఫ్గాన్ గగనతలం మీదుగా విమాన రాకపోకలు రద్దు
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ‘అఫ్గాన్ గగనతలం అనియంత్రితం’ అంటూ కాబూల్ విమానాశ్రయం అధికారులు ప్రకటించారు. అఫ్గాన్ గగనతలం ఆర్మీకి బదిలీ అయిందనీ, ఇతర ఏ విమానాలు ప్రయాణించినా దానిని అనియంత్రితంగానే పరిగణిస్తామంటూ కాబూల్ ఎయిర్‌పోర్టు అధికారులు నోటమ్ (పైలట్లకు హెచ్చరిక నోటీస్) విడుదల చేశారు. తదుపరి ప్రకటన చేసే వరకు ప్రజా ప్రయాణాలకు కాబూల్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో అనేక దేశాలు ఆ దేశానికి విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ఎయిర్ ఇండియా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఇతర సంస్థలు పాశ్చాత్య దేశాలకు తమ విమానాలను ఇతర మార్గాల ద్వారా నడిపాయి. ఎయిర్ ఇండియా తన ఏకైక ఢిల్లీ–కాబూల్–ఢిల్లీ సర్వీసును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. -
కాబూల్ ఎయిర్‌స్పేస్ మూసివేత
అఫ్గానిస్తాన్: అఫ్గాన్ రాజధాని కాబూల్ ఎయిర్‌స్పేస్ మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎలాంటి విమాన రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. అయితే అఫ్గాన్‌లో మిగిలిపోయిన భారత పౌరులను తీసుకురావడానికి సోమవారం మధ్యాహ్నం ఎయిరిండియా విమానాలు అక్కడికి వెళ్లాల్సి ఉంది. కానీ ఎయిర్‌స్పేస్ మూసివేయడంతో ఎయిరిండియా సర్వీసులు నిలిచిపోయాయి. అఫ్గాన్ మీదుగా విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. అధికారం తాలిబన్ల వశం కావడంతో దేశం విడిచి వెళ్తున్నారు. అంతేకాదు అఫ్గాన్ మీదుగా అమెరికా నుంచి భారత్‌కు వచ్చే పలు ఎయిరిండియా విమానాలను దారి మళ్లిస్తున్నారు. షికాగో-ఢిల్లీ, శాన్ఫ్రాన్సిస్కో- ఢిల్లీ విమానాలను గల్ఫ్ దేశాలకు తరలిస్తున్నారు. అఫ్గానిస్తాన్ మీదుగా ప్రయాణించే అన్ని విమానాలను దారి మళ్లిస్తుండటంతో అక్కడి ఇతర దేశాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కాబూల్ ఎయిర్‌పోర్టులో రద్దీని తగ్గించేందుకే విమానాలు నిలిపివేశామని అధికారులు పేర్కొన్నారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు ఆర్మీ విమానాల్లో ఎక్కుతున్న అఫ్గాన్లను యూఎస్ బలగాలు అడ్డుకున్నాయి. ఎలాగైనా సరే దేశం వదిలి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోని విమానాల్లోకి ఎక్కడానికి జనాలు ఎగబడుతున్నారు. దీంతో అక్కడే ఉన్న అమెరికా దళాలు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో పౌరులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో ఏర్పడిన తొక్కిసలాటలో అయిదుగురు మృతి చెందారు. After the Taliban swept #Kabul, residents are desperate to flee #Afghanistan. Watch the chaos at the Kabul airport. pic.twitter.com/WbxK1wzHdM — WION (@WIONews) August 16, 2021 -
ఏరోస్పేస్,డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ బెస్ట్ : కేటీఆర్
-
అప్పుడు పాక్ నో.. ఇప్పుడు భారత్ ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు భారత ఎయిర్‌లైన్స్ కీలక అనుమతులను మంజూరు చేసింది. ఇండియా మీదుగా శ్రీలంక వెళ్లేందుకు పాక్ ప్రధాని విమానానికి భారత పౌర విమానయాన శాఖ అనుమతినిచ్చింది. భారత విమానాలకు పాక్ పలుమార్లు ఆంక్షలు విధించినప్పటికీ పాక్‌కు అడ్డు చెప్పకుండా కేంద్రం సానుకూలంగా స్పందించడం విశేషం. కోవిడ్ సంక్షోభం తర్వాత శ్రీలంకలో అధికారికంగా పర్యటిస్తున్న తొలి దేశాధినేత ఇమ్రాన్ ఖాన్. ఈ అధికారిక పర్యటనలో లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ప్రధాని మహీంద్ర రాజపక్సేతో ఇమ్రాన్ చర్చలు జరపనున్నారు. అయితే శ్రీలంక తమ పార్లమెంట్లో ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగాన్ని రద్దు చేసినట్లు ఇప్పటికే ప్రకటించింది. భారత్‌తో ఎలాంటి వివాదం తలెత్తవద్దన్న ఉద్ధేశంతోనే శ్రీలంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొలంబో గెజిట్ పత్రిక తన కథనంలో ప్రచురించింది. అలాగే పార్లమెంటులో ప్రసంగం మినహా అన్ని కార్యక్రమాలు యథావిధిగా కొనసాగనున్నట్లు శ్రీలంక అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా 2019 అక్టోబర్‌లో భారత ప్రధాని మోదీ సౌది అరేబియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తమ దేశం మీదుగా వెళ్లేందుకు మోదీ విమానానికి అనుమతి నిరాకరించి పాక్ కుటిలబుద్ధిని చాటుకుంది. కానీ తాజాగా భారత్ మాత్రం తన ఉదార స్వభావాన్నే చాటుకుంది. చదవండి: ఇమ్రాన్ ఖాన్ కంటే భారత్ ముఖ్యం: శ్రీలంక -
ఇరాన్ గగనతలం మీదుగా విమానాలు వెళ్లనివ్వద్దు
న్యూఢిల్లీ : ప్రస్తుతం ఇరాన్లో నెలకొన్న పరిస్థితుల దృష్యా ఆ దేశ గగనతలం మీదుగా ఎలాంటి విమానాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఇండియన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇరాన్ జనరల్ కమాండర్ ఖాసీం సులేమానిని అమెరికా మిలటరి దళాలు మట్టుబెట్టడంతో ఇరాన్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణమైనా ఇరాన్ దేశం అమెరికాకు చెందిన విమానాలపై దాడులు చేసే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా ఇరాన్ గగనతలం మీదుగా ఇండిగో, ఎయిర్ లైన్స్ విమానాలను దారి మళ్లించే ఏరాట్లు చేస్తున్నట్లు ఇండియన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.(ఇరాన్ వెన్ను విరిగింది!) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున గగనతలం నుంచి డ్రోన్ల సాయంతో సులేమాని ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై క్షిపణి దాడులు నిర్వహించారు. ఈ ప్రమాదంతో ఈ దాడుల్లో సులేమానితోపాటు ఇరాక్‌కు చెందిన హషద్ అల్ షాబి పారామిలటరీ బలగాల డిప్యూటీ చీఫ్, ఇరాన్‌కు మద్దతుగా వ్యవహరించే కొందరు స్థానిక మిలిమెంట్లు మరణించినట్టు ఇప్పటికే బాగ్దాద్ మీడియా వెల్లడించిన విషయం తెలిసిందే. సిరియా నుంచి బాగ్దాద్‌కు వచ్చినట్టుగా భావిస్తున్న సులేమాని విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి రెండు కార్లలో తన సన్నిహితులతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. ఇరాక్‌లో అమెరికా సిబ్బంది రక్షణ కోసమే తాము వైమానిక దాడులకు దిగామని పెంటగాన్ ప్రకటించింది. మా నాయకుడు సులేమానీ చంపినందుకు అమెరికాపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయోతొల్లా అలీ ఖమేనియా హెచ్చరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.(ఉద్రిక్తం.. అమెరికా మరోసారి రాకెట్ల దాడి) -
మోదీ విమానానికి అనుమతి లేదు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మరోసారి తన వక్ర బుద్దిని చాటుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన నేపథ్యంలో భారత్ చేసిన అభ్యర్థనను పాక్ తోసిపుచ్చింది. మోదీ ప్రయాణం చేసే విమానాన్ని తమ గగనతలం మీదుగా అనుమతించేది లేదని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్లో మానవహక్కులను ఉల్లఘించిదన్న కారణాన్ని సాకుగా చూపిస్తూ పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. అనుమతి నిరాకరణకు సంబంధించిన విషయాన్ని లిఖిత పూర్వకంగా భారత హైకమిషనర్‌కు తెలియజేయనున్నట్లు ఖురేషీ తెలిపారు. మరోవైపు కశ్మీరీలకు మద్దతుగా ఈరోజు పాక్ బ్లాక్‌డే నిర్వహిస్తోంది. అంతర్జాతీయ బిజినెస్ ఫోరంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సోమవారం సౌదీ పర్యటనకు వెళ్లనున్నారు. దీంతోపాటు పలువురు సౌదీ నేతలను కూడా కలవనున్నారు. గత నెలలో మోదీ అమెరికా పర్యటన, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐస్‌ల్యాండ్ పర్యటన సందర్భాల్లోనూ పాక్ ఇదే రీతిలో వ్యవహరించింది. బాలాకోట్ దాడుల తర్వాత తన గగనతలాన్ని మూసివేసిన పాక్ కొంతకాలం తర్వాత మళ్లీ తెరిచింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ భారత్‌కు చెందిన విమానాలను రానీయకుండా తమ గగనతలాన్ని మరోసారి మూసివేసింది. -
భారత్‌కు పాక్ షాక్.. మోదీకి నో ఛాన్స్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రధాని నరేంద్రమోదీ విమానం వెళ్లడానికి అనుమతివ్వడంటూ భారత అధికారుల చేసిన విజ్ఞప్తిని పాక్ నిరాకరించింది. సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు మోదీ అమెరికా పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే మోదీ ప్రయాణించే ప్రత్యేక విమానం పాక్ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంది. దీని కోరకు ముందుస్తుగా భారత అధికారులు పాక్ అనుమతి కోరారు. దీనిపై స్పందించిన పాక్ మోదీ విమానానికి అనుమతి ఇవ్వమని స్పష్టం చేసింది. కాగా ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానానికి కూడా పాక్ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితుల అనంతరం పాక్-భారత్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షిణించాయి. దీనిలో భాగంగానే గగనతల మార్గాల నుంచి భారత్ సర్వీసులను పాక్ నిషేధించింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్వయంగా తెలిపినట్లు పాక్ అధికారులు ప్రకటించారు. -
మరోసారి దుర్భుద్ది బయటపెట్టిన పాక్
-
రాష్ట్రపతి విమానానికి పాక్ అనుమతి నో
ఇస్లామాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాక్ అనుమతి నిరాకరించింది. గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించినట్లు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి తెలిపారు. కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై పాక్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. తమ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తామని దాదాపు నెల క్రితమే పాక్ ప్రకటించినా ఈ విషయమై అధికారింగా ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. తాజాగా, రాష్ట్రపతి కోవింద్ విమానానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందిస్తూ.. ప్రముఖ వ్యక్తులు ప్రయాణించే విమానాలను ఏ దేశమైనా సాధారణంగా అనుమతిస్తుంది. పాక్ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం’అని పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి కోవింద్ సోమవారం నుంచి ఐస్లాండ్, స్విట్జర్లాండ్, స్లొవేనియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఉగ్రవాదంతో దేశం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించనున్నారు. -
మరోసారి వక్రబుద్దిని చాటుకున్న పాకిస్తాన్
న్యూఢిల్లీ : దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విదేశీ పర్యటనకు తమ గగనతలం ఉపయోగించుకునేందుకు నిరాకరించింది. మూడురోజుల విదేశీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కోవింద్ సోమవారం ఐస్‌ల్యాండ్‌కు వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో రామ్‌నాథ్ కోవింద్ ప్రయాణించే విమానం పాక్ గగనతలం మీదుగా ఐస్‌ల్యాండ్‌కు వెళ్లేందుకు అనుమతించాలంటూ భారత్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. అనుమతిని నిరాకరిస్తున్నామని పాకిస్తాన్ శనివారం వెల్లడించింది. రామ్‌నాథ్ కోవింద్ ప్రయాణించే విమానం పాక్ గగనతలం మీదుగా వెళ్లేందుకు అనుమతించాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తిని తమ ప్రభుత్వం తోసిపుచ్చినట్టు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి తెలిపారు. కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తమ గగనతలాన్ని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వరాదనే నిర్ణయానికి పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆమోదం తెలిపారని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా ఏ దేశమైన గగనతల అనుమతి అభ్యర్థనను మంజూరు చేస్తాయి. (చదవండి : ‘గాజులు పంపమంటారా’ అంటూ పాక్ రెచ్చగొడుతోంది) కాగా, ఐస్‌ల్యాండ్, స్విట్జర్లాండ్, స్లొవేనియాలో రాష్ట్రపతి కోవింద్ మూడు రోజుల పర్యటన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తన పర్యటనలో భాగంగా ఆయా దేశాల ముఖ్య నాయకులను ఆయన కలుసుకుంటారు. పుల్వామా దాడితో సహా ఈ ఏడాది ఉగ్రవాద ఘటనలు పెరిగిన దృష్ట్యా భారతదేశ ఆందోళనను వారి దృష్టికి కోవింద్ తీసుకువెళ్లే అవకాశాలున్నాయి. ఇటీవల పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం, దీనికి ప్రతిగా పాక్‌లోని బాలాకోట్‌లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత వాయుసేన దాడులు జరపడంతో గత ఫిబ్రవరి 26న పాకిస్థాన్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. అయితే, గత మార్చిలో పాక్షికంగా గగనతలాన్ని తెరిచినప్పటికీ భారతదేశ విమానాలపై మాత్రం నిషేధం అమలు చేస్తోంది. -
భారత్‌పై పాక్ నిషేధం; గందరగోళం
ఇస్లామాబాద్: తమ గగనతలం నుంచి భారత విమానాలు వెళ్లకుండా పాకిస్తాన్ నిషేధం విధించిందా, లేదా అనే దానిపై గందరగోళం కొనసాగుతోంది. గగనతల నిషేధంపై పాకిస్తాన్ మంత్రులు ఇద్దరు భిన్న ప్రకటనలు చేయడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. తమ గగనతలం నుంచి భారత విమానాలు వెళ్లకుండా ఇంకా నిషేధం విధించలేదని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి బుధవారం తెలిపారు. ఇటువంటి నిర్ణయం ఏదైనా తీసుకునే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. భారత్ విమానాలు వెళ్లకుండా తమ గగనతలాన్ని మూసివేసినట్టు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారని ‘డాన్’ పత్రిక వెల్లడించింది. ఇటీవల జరిగిన ఫెడరల్ మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు రాలేదని, దీనిపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తమ గగనతలాన్ని భారత్ ఉపయోగించుకోకుండా సంపూర్ణ నిషేధం విధించాలని తమ దేశం భావిస్తున్నట్టు పాకిస్తాన్ శాస్త్ర, సాంకేతిక మంత్రి ఫవాద్ చౌద్రీ మంగళవారం ట్వీట్ చేయడంతో కలకలం రేగింది. అఫ్గానిస్తాన్‌కు వెళ్లే భారత వాణిజ్య విమానాలను కూడా రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. దీంతో భారత్‌కు పాక్ గగనతల దారులను మూసివేసిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఎటువంటి నిషేధం విధించలేదని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి ప్రకటనతో స్పష్టమైంది. బాలాకోట్ వైమానిక దాడికి ప్రతీకారంగా ఫిబ్రవరిలో పాకిస్తాన్ గగనతల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నాలుగున్నర నెలల తర్వాత జూలై 16న నియంత్రణలను పూర్తిగా ఎత్తివేయడంతో భారత్, పాకిస్తాన్ల మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరాచీ గగనతలం మూసివేత కరాచీ మీదుగా వెళ్లే మూడు గగనతల దారులను మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నోటీస్ టు ఎయిర్‌మెన్ (నోటమ్) జారీ చేసింది. ఈ నిషేధం అన్ని అంతర్జాతీయ విమాన సంస్థలకు వర్తించనుందని పాక్ విమానయాన అధికారులు స్పష్టం చేశారు. ఆగస్టు 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ నిషేధ సమయంలో విమానాలు కరాచీ మీదుగా కాకుండా, వేరే దారి ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. (ఇది చదవండి: పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్ లాస్) -
పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్ లాస్
కరాచీ: బాలాకోట్ దాడికి ప్రతీకారంగా విధించిన గగనతల నిషేధంతో భారత్‌తోపాటు పాకిస్తాన్ కూడా నష్టపోయింది. భారత్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధం కారణంగా రూ.345 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. పాక్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వర్ ఖాన్ ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భారత్ విమానాల రాకపోకలపై విధించిన గగనతల నిషేధం కారణంగా పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కూడా కొన్ని సర్వీసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో పౌర విమానయాన విభాగం రూ.345 కోట్ల మేర నష్ట పోయింది. మొత్తమ్మీద ఇది చాలా పెద్ద నష్టం. అయితే, భారత్‌కు ఇంతకు రెండింతలు నష్టం వాటిల్లింది’ అని అన్నారు. సరిహద్దులకు సమీపంలో మోహరించిన యుద్ధ విమానాలను భారత్ ఉపసంహరించుకున్న తర్వాతే గగనతల నిషేధాన్ని తొలగించినట్లు పాక్ విమానయాన శాఖ కార్యదర్శి షారుఖ్ నుస్రత్ తెలిపారు. పాక్ భూభాగంలోని బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం ఫిబ్రవరిలో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యకు ప్రతీకారంగా భారత ప్రయాణికుల విమానాలు తమ గగనతలం మీదుగా రాకపోకలు సాధించడంపై పాక్ నిషేధం విధించింది. దీంతో పాక్ భూభాగం మీదుగా అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులను ఎయిరిండియా తగ్గించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఎయిరిండియా రూ.430 కోట్ల మేర నష్టపోయింది. పాక్ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు కొద్ది రోజులకు ముందు పాక్ తీసుకున్న ఈ నిర్ణయం ఎయిరిండియాకు పెద్ద ఊరటనిచ్చింది. -
విమాన ప్రయాణీకులకు భారీ ఊరట
న్యూఢిల్లీ : బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం నాలుగున్నర నెలల పాటు తన గగనతలంపై విధించిన నియంత్రణలను పాకిస్తాన్ మంగళవారం ఎత్తివేసింది. పౌర విమాన సేవలకు గగనతలాన్ని అనుమతిస్తున్నట్టు ప్రకటన జారీచేయడంతో భారత్, పాకిస్తాన్ల మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ రూట్లలో దేశ గగనతలాన్ని తక్షణమే తెరుస్తున్నట్టు పాక్ పౌరవిమానయాన అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్తాన్ ప్రకటనతో భారత్ సైతం ఇరు దేశాల మధ్య సాధారణ విమాన సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్టు సవరించిన ఎయిర్‌మెన్ నోటీస్ (నోటం)లో పేర్కొంది. ఇరు దేశాల ప్రకటనతో భారత్, పాకిస్తాన్ల మధ్య గతంలో నడిచిన అన్ని రూట్లలో పౌర విమాన సేవలను పునరుద్ధరిస్తారు. తాజా ఉత్తర్వులతో విమాన ప్రయాణీకులకు, విమానయాన సంస్ధలకు భారీ ఊరట లభించింది. భారత్, పాక్‌ల తాజా ఉత్తర్వులతో ఇరు దేశాల గగనతలాల్లో ఎలాంటి నియంత్రణలు లేకుండా మూసివేసిన ఎయిర్ రూట్లలో విమానాల రాకపోకలు ప్రారంభమవడం ఊరట ఇస్తుందని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. -
యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం
ఇస్లామాబాద్: సరిహద్దుల్లోని యుద్ధ విమానాలను భారత్ తరలిస్తే తప్ప తమ దేశం గుండా వాణిజ్య విమానాలకు గగనతలం తెరవబోమని పాకిస్తాన్ విమానయాన కార్యదర్శి షారుక్ నుస్రత్ స్పష్టంచేశారు. పుల్వామా తీవ్రవాద దాడి అనంతరం పాక్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ తీవ్రవాద స్థావరాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 26 తర్వాత నుంచి పాక్ తన గగనతలంపైనుంచి భారత విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. నుస్రత్ ఆదేశాలతో పాక్ విమానయాన శాఖకు చెందిన సెనేట్ స్టాండింగ్ కమిటీ భారత అధికారులకు సమాచారమిచ్చింది. ‘పాక్ గగనతలం తెరవాలని భారత ప్రభుత్వం సంప్రదించింది. మేం అందుకు సిద్ధం. అయితే ముందుగా సరిహద్దుల్లోని వైమానిక స్థావరాల నుంచి యుద్ధ విమానాలను భారత్ ఇతర ప్రాంతాలకు తరలించాలి’ అని నుస్రత్ పేర్కొన్నారు. గగనతలం తెరవడంపై ఓ పాక్ సీనియర్ అధికారి స్పందించడం ఇదే మొదటిసారి. పాక్ గగనతలం మూసివేతపై ఆంక్షలు జూలై 12 వరకు పొడిగించారు. ఏదిఏమైనా పాక్ గగనతల మూసివేతతో భారత విమానయాన పరిశ్రమకు తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ.. పాక్ గగనతల మూసివేత కారణంగా దూరపు మార్గాల్లో విమానాలు ప్రయాణించడం ద్వారా ఎయిరిండియా రూ.430 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపారు. -
పాక్ గగనతల ఆంక్షలతో మనకు ఇక్కట్లు!
సాక్షి, న్యూఢిల్లీ : కిర్గిస్థాన్‌లో జరిగిన ‘షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్’ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు పాకిస్తాన్ గగనతలం నుంచి కాకుండా ఓమన్ గగనతలం మీదుగా వెళ్లిన విషయం తెల్సిందే. భారత వైమానిక దళం గత ఫిబ్రవరి నెలలో పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాలకోట్లో బాంబులు కురిపించిన సంఘటనకు ప్రతీకారంగా పాకిస్థాన్ ప్రభుత్వం భారత విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లకుండా నిషేధం విధించింది. భారత్ చేసిన విజ్ఞప్తిని మన్నించి సుహృద్భావ చర్యగా భారత్‌పై విధించిన గగనతలం ఆంక్షలను 72 గంటలపాటు ఎత్తివేసేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. అయినప్పటికీ ప్రధాని విమానం పాక్ గగనతలం నుంచి కాకుండా ఓమన్ గగనతలం మీదుగా వెళ్లింది. ఇందుకు బదులుగా పాకిస్తాన్ జూన్ 15వ తేదీన ఎత్తివేయాలనుకున్న గగనతల ఆంక్షలను జూన్ 28వ తేదీ వరకు పొడిగించింది. ప్రధాని లాంటి వారు ప్రత్యేక విమానంలో ఎలా తిరిగైనా పోవచ్చని, మిగతా భారతీయ పౌరుల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ గగనతలం ఆంక్షల వల్ల అర గంట నుంచి రెండు గంటల వరకు ప్రయాణ సమయం పెరగడమే కాకుండా చార్జీలు కూడా ఎక్కువ అవుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నట్లు ‘ఏర్ ప్యాసింజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తెలిపారు. మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లాలంటే అరగంట, యూరప్ దేశాలకు వెళ్లాలంటే రెండు గంటలు ఎక్కువ సమయం పడుతోందని ఆయన చెప్పారు. సాధ్యమైనంత త్వరగా గగనతలం ఆంక్షలను పాకిస్తాన్ ఎత్తివేసేలా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. -
పాక్ మీదుగా వెళ్లను
న్యూఢిల్లీ/బీజింగ్: కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో ఈ నెల 13–14 తేదీల్లో జరిగే షాంఘై సహకార సదస్సు (ఎస్సీవో)కు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లరాదని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు. తమ గగనతలం మీదుగా మోదీ విమానం వెళ్లేందుకు పాక్ అంగీకరించినప్పటికీ కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్, ఒమన్, ఇతర మధ్య ఆసియా దేశాల మీదుగా మోదీ విమానం కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్కు చేరుకుంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‡ తెలిపారు. ఈ ప్రయాణానికి సంబంధించి రెండు రూట్లను భారత ప్రభుత్వం ఖరారుచేసిందన్నారు. కాగా, భారత ప్రధాని మోదీ విమానంలో ఎస్సీవో సదస్సుకు తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు ప్రత్యేకంగా అనుమతిస్తామని పాక్ విమానయానశాఖ మంత్రి సర్వార్‌ఖాన్ చెప్పారు. మోదీ ప్రయాణించే ఎయిరిండియా బోయింగ్ 747–400 విమానం ఢిల్లీ నుంచి బిష్కెక్కు వెళ్లి తిరిగివచ్చేందుకు వీలుగా 72 గంటలపాటు పాక్ గగనతలంలో రాకపోకల్ని అనుమతిస్తామని పేర్కొన్నారు. ఎస్సీవోలో చైనా, భారత్, పాక్, కిర్గిజిస్తాన్ సహా 8 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. మరోవైపు షాంఘై సహకార సదస్సుకు హాజరయ్యేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బయలుదేరినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా జిన్‌పింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారని వెల్లడించింది. ఎస్సీవో సదస్సు సందర్భంగా జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాతో పాటు భారత్‌పై కూడా వాణిజ్య యుద్ధం మొదలుపెట్టిన నేపథ్యంలో అమెరికాను కలసికట్టుగా ఎదుర్కోవడంపై జిన్‌పింగ్, మోదీ చర్చించే అవకాశముందని ప్రభుత్వవర్గాలు చెప్పాయి. ఎస్సీవోతో పటిష్ట సంబంధాలు: మోదీ బిష్కెక్లో జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)లో అంతర్జాతీయ భద్రత, ఆర్థిక సహకారమే ప్రధాన అజెండాగా ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తన బిష్కెక్ పర్యటన ద్వారా ఎస్సీవో దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని ధీమా వ్యక్తం చేశారు. భారత రాయబారిగా వీడాంగ్ భారత్‌తో సత్సంబంధాలను పెంపొందించుకునే దిశగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ దౌత్యవేత్త సున్ వీడాంగ్ భారత్‌లో తమ కొత్త రాయబారిగా నియమించింది. విదేశాంగ మంత్రి జైశంకర్ 2009–13 మధ్యకాలంలో చైనాలో భారత రాయబారిగా పనిచేసిన కాలంలో వీడాంగ్‌తో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చైనా విదేశాంగశాఖ పాలసీ–ప్రణాళికా విభాగంలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న వీడాంగ్‌ను భారత్‌లో తమ రాయబారిగా నియమించింది. భారత్‌లో చైనా రాయబారిగా ఉన్న లో జుహుయీనిని విదేశాంగశాఖ సహాయమంత్రిగా నియమించింది. -
గగనతల పటిష్టతకు కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: ముంబై, ఢిల్లీలతోపాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గగన తలాన్ని మరింత పటిష్టపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే వైమానిక రక్షణ వ్వవస్థకు అవసరమైన క్షిపణులు, లాంచర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ యూనిట్లను అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అలాగే దీనిలో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నట్లు మిలటరీ వర్గాలు వెల్లడించాయి. గత కొన్నేళ్లుగా డ్రాగన్ కంట్రీ చైనా వైమానిక శక్తిని గణనీయంగా పెంచుకుందని.. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా గగన తలాన్ని పటిష్టపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకుందని ఆ వర్గాలు వివరించాయి. వైమానిక పటిష్టతకు అవసరమైన రాడార్లు, క్షిపణులు, డ్రోన్స్, యుద్ధ విమానాలను కొనుగొలు చేసేందుకు అమెరికాతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే సుమారు 2 బిలియన్ల డాలర్ల విలువ గల సముద్ర పరిరక్షణ డ్రోన్లను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో సభ్యత్వం లేని దేశానికి డ్రోన్లను విక్రయించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతోపాటు సుమారు రూ.40 వేల కోట్లతో రష్యా నుంచి ఎస్–400 ట్రియాంప్ వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలను కొనుగొలుకు సంబంధించిన ఒప్పందం తుది చర్చల్లో ఉంది. అలాగే 5 వేల కిలోమీటర్ల లక్ష్యాలను చేదించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని 5ను కూడా త్వరలోనే ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. -
గాల్లో 261మంది.. క్షణాల్లో తప్పిన పెను ప్రమాదం!
ముంబై : సెకన్ల వ్యవధిలో పెను ప్రమాదం తప్పింది. గాల్లోని తమ ప్రాణాలు కలిసిపోతాయని భావించిన 261 మంది ప్రయాణికులు, ప్రమాదం నుంచి సెకన్లలో బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. ఓ మహిళ పైలెట్ చూపించిన తెగువ ఇంతమంది ప్రాణాలను కాపాడ గలిగింది. వివరాల్లోకి వెళ్తే... ఫిబ్రవరి 7న రాత్రి 8 గంటల తర్వాత ముంబై నుంచి భోపాల్ వెళ్తున్న ఎయిరిండియా ఎయిర్‌బస్ ఏ1631, ఢిల్లీ నుంచి పుణే వెళ్తున్న విస్తార యూకే997 ముంబై ఎయిర్ స్పేస్‌లో ఎదురెదురుగా వచ్చాయి. దాదాపు 100 అడుగుల దగ్గరగా ఈ రెండు విమానాలు వచ్చాయి. విస్తార విమానంలో 152 మంది ప్రయాణికులుండగా.. ఎయిరిండియా విమానంలో 109 మంది ప్రయాణికులున్నారు. ఇరు విమానాలు దగ్గరకు సమీపిస్తున్న తరుణంలో ఆ విమానాల పైలెట్లకు ఆటోమేటిక్ వార్నింగ్ అలర్ట్‌లు వెళ్లాయి. సెకన్లలో రెండు విమానాలు ఢీకొట్టుకోబోతున్నాయన్న తరుణంలో, వెంటనే స్పందించిన ఎయిరిండియా మహిళా పైలెట్ అనుపమ కోహ్లి అడ్వయిజరీ ఆదేశాలను పాటిస్తూ... ఎయిర్‌క్రాఫ్ట్‌ను సురక్షితమైన దూరంగా మరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విస్తార విమానం అదే అవరోహణ మార్గంలో ప్రయాణించింది. ఎట్టకేలకు తమ పైలెట్ సరియైన సమయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవడంతో, పెను ప్రమాదం నుంచి బయటపడినట్టు ఎయిరిండియా అధికారులు చెప్పారు. ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలు పాటిస్తూ వెళ్తోందని, విస్తారా పైలెటే తప్పుడు మార్గంలో విమానాన్ని నడిపినట్టు ఎయిరిండియా అధికారులు ఆరోపించారు. విస్తారా ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలకు విరుద్ధంగా ప్రయాణించినట్టు పేర్కొన్నారు. తాను విమానాన్ని సురక్షితమైన మార్గంలోకి మరలించకముందు రెండు విమానాలు కేవలం 100 అడుగుల దూరంలోనే ఉన్నట్టు కోహ్లి, తన రెజుల్యూషన్ అడ్వయిజరీకి రిపోర్టు చేసింది. విస్తారా సైతం ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. తన ఇద్దరు పైలెట్లను విధుల నుంచి తొలగించింది. ఎయిరిండియా 27వేల అడుగుల స్థాయిలో ప్రయాణిస్తుండగా.. విస్తార విమానం 8 గంటల తర్వాత 27,100 అడుగుల స్థాయికి వచ్చింది. ఈ క్రమంలో ఈ రెండు విమానాలు ప్రమాదం అంచు వరకు వెళ్లాయి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ ప్రమాదంపై విచారణ చేపడుతోంది. -
పాక్ ఆంక్షలతో భారత్ విమానాలకు దెబ్బ!
న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భారత్ నిర్వహించిన సర్జికల్ దాడుల ప్రభావం దేశంలోని వాణిజ్య విమానాలపై పడింది. దాయాది పాకిస్థాన్ తన గగనతలంలో తక్కువ ఎత్తులో విమాన ప్రయాణాలను నిషేధించింది. దీంతో అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి వెళ్లే విమానాలు రూటు (మార్గం) మార్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. లాహోర్ మీదుగా వెళ్లే విమానాలు లాహోర్ దాటుతున్నప్పుడు 29వేల అడుగుల కన్న ఎక్కువ ఎత్తులో ప్రయాణించాలంటూ పాక్ ఏవిషయేషన్ అధికారులు తాజాగా నోటమ్ (వైమానిక సిబ్బందికి నోట్) జారీచేశారు. అక్టోబర్ నెలంతా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. గత సోమవారం కరాచీ నగరం విషయంలోనూ పాక్ ఇలాంటి ఉత్తర్వులు జారీచేసింది. కరాచీ మీదుగా వెళ్లే విమానాలు 33వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుందని ఆంక్షలు విధించింది. తక్కువ ఎత్తులో వెళ్లే గగనతల మార్గాన్ని పాక్ తన యుద్ధ విమానాల కోసం రిజర్వు చేసినట్టు కథనాలు వచ్చాయి. పాక్ తాజా ఆంక్షల నేపథ్యంలో భారత్ విమానాలు సురక్షితంగా ప్రయాణించేందుకు సుదూర మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుందని, దీంతో దేశం నుంచి వెళ్లే విమానాలు ఆలస్యమయ్యే అవకాశముందని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఇంటర్నేషనరల్ ఎయిర్‌లైన్స్ మాత్రమే భారత్-పాక్ మధ్య విమానాలు నడుపుతున్నది.