Ajay Mishra
-
సీపీఆర్‌పై అవగాహన అవసరం
పంజగుట్ట: మన దేశంలో ప్రతి నిమిషానికి 112 కార్డియాక్ అరెస్టులు సంభవిస్తున్నాయని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో 80 శాతం బహిరంగ ప్రదేశాల్లోనే జరుగుతున్నాయని, సీపీఆర్‌పై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ, ప్రెస్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా సీపీఆర్‌పై ఎన్సీసీ విద్యార్థులకు, జర్నలిస్టులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెలలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నిర్వహించనున్న సీపీఆర్ అవగాహన, శిక్షణ కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అజయ్ మిశ్రా మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ మాదిరిగా మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సీపీఆర్‌పై అవగాహన కల్పించాలని కోరారు. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ అశిమా శర్మ మాట్లాడుతూ.. సీపీఆర్ చేసే సమయంలో స్కిల్స్ ఎంతో ముఖ్యమని, బ్రీతింగ్, నాడి చూడాలని, భుజం తట్టి స్పందిస్తున్నారో లేదో చూడాలన్నారు. సీపీఆర్ చేస్తూనే అంబులెన్స్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ మేరకు నిమ్స్‌లో పారామెడికల్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సీపీఆర్ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ బి.విజయ్‌భాస్కర్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, ప్రధాన కార్యదర్శి ఆర్.రవికాంత్ రెడ్డి, కె.మదన్మోహన్రావు, రమణ పాల్గొన్నారు. -
తికాయత్.. ఓ చౌకబారు వ్యక్తి: కేంద్ర మంత్రి
లఖీమ్‌పూర్ ఖేరి(యూపీ): వివాదాస్పద సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులపై కారు దూసుకెళ్లిన కేసులో అరెస్టయిన ఆశిష్ మిశ్రా తండ్రి, కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా.. రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్‌పై నోరు పారేసుకున్నారు. ఎనిమిది మంది మరణానికి కారకుడైన ఆశిష్‌కు తండ్రి అయిన అజయ్.. మంత్రిగా రాజీనామా చేయాలంటూ డిమాండ్చేస్తున్న తికాయత్‌ను ‘చౌక బారు వ్యక్తి’ అంటూ తక్కువచేసి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖేరి ఎంపీ నియోజకవర్గ బీజేపీ మద్దతుదారులనుద్దేశిస్తూ అజయ్ మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ‘ఒకవేళ నేను మంచి వేగంతో కారులో వెళ్తున్నాను అనుకుందాం. అప్పుడు ఊర కుక్కలు వెంటబడతాయి. మొరుగుతాయి. వాటి తీరే అంత. అంతకుమించి నేను చెప్పేదేం లేదు. తికాయత్ గురించి నాకు బాగా తెలుసు. పొట్టకూటి కోసం రాజకీయాలు, ఉద్యమాలు చేస్తుంటాడు’ అంటూ ఆ వీడియోలో అజయ్ వ్యాఖ్యానించారు. అజయ్ వ్యాఖ్యానాల వీడియోపై తికాయత్ స్పందించారు. ‘ఏడాదికాలంగా కుమారుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. అందుకే అజయ్ మిశ్రాకు నాపై కోపం’ అని అన్నారు. Farmer leader @RakeshTikaitBKU is a ‘second rate person’ ; ‘Dogs bark on the side of the road, have nothing to say about them’ - the words of Union minister @ajaymishrteni at a speech in his constituency Lakhimpur Kheri live streamed by his supporters yesterday. pic.twitter.com/96rZTqxqPH — Alok Pandey (@alok_pandey) August 23, 2022 ఇదీ చదవండి: రాజకీయ పార్టీలన్నీ ఉచితాలవైపే -
రైతుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి
లక్నో: లఖింపూర్ ఘటనలో రైతుల పై దాడి విషయమై కేంద్ర మంత్రి కొడుకు ఆశిష మిశ్రా జైలు పాలైన సంగతి తెలిసిందే. అంతేకాదు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలంటూ రైతు నేత రాకేశ్ టికాయత్ రైతులతో కలిసి సుమారు 72 గంటల పాటు నిరసనలు చేపట్టారు. ఐతే అధికారుల హామీతో ఆ నిరసనలు విమించుకున్న సంగతి కూడా విధితమే. ఈ నేపధ్యంలో మంత్రి అజయ్ మిశ్రా లఖింపూర్ ఖేరీలో తన మద్దతుదారులను ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసంగంలో రైతులను ఉద్దేశిస్తూ....సంచలన వ్యాఖ్యలు చేశాడు. కుక్కులు మొరగడం, కారుని వెంబడిచడం గురించి ప్రస్తావిస్తూ...వాటి స్వభావం అలానే ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే మాజీ మంత్రి రైతు నేత గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. రైతులుగా పిలవబడుతున్నవారు పాకిస్తాన్ లేదా కెనడాలో కూర్చొన్న జాతీయేతర రాజకీయ పార్టీలు లేదా ఉగగ్రవాదులు అంటూ విరుచుకుపడ్డారు. ఆఖరికి మీడియా కూడా వారితో కలిసి తనపై ఇలా దుష్ప్రచారం చేస్తుందని కలలో కూడా ఊహించుకోలేదని అన్నారు. బహుశా మీడియాకి కూడా ఇదే బలమనకుంటా, అయినా మీడియా కారణంగా ప్రజలు ఎప్పటికీ తనను ఎలా ఓడించాలో తెలుసుకోలేరంటూ ఎగతాళి చేశారు. ఏనుగు ఎప్పుడూ తన దారిన తను వెళ్తుంటుంది, కుక్కలే ఎప్పుడూ మొరుగుతాయని వ్యగ్యంగా అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.."తాను లక్నోకి కారులో ప్రయాణిస్తున్నాను, అప్పుడు కారు మంచి వేగంగా వెళ్తోంది. ఆ సమయంలో కుక్కలు మొరుగుతాయి లేదా వెంబడిస్తాయి. అది వాటి సహజ స్వాభావం. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ నిరాశపరచలేరు. ఎంతమంది రాకేష్ తికాయత్‌లు వచ్చినా మనల్ని ఏం చేయలేరు. అతను రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి , పైగా అతని రాజకీయ జీవితం ఎక్కువ కాలం సాగదు. తానే ఏ తప్పు చేయలేదంటూ ఆవేదనగా చెప్పుకొచ్చారు. అంతేకాదు తనను తాను ప్రపంచంతో పోరాడుతున్న గొప్ప వ్యక్తిగా అభివర్ణించుకున్నాడు. Farmer leader @RakeshTikaitBKU is a ‘second rate person’ ; ‘Dogs bark on the side of the road, have nothing to say about them’ - the words of Union minister @ajaymishrteni at a speech in his constituency Lakhimpur Kheri live streamed by his supporters yesterday. pic.twitter.com/96rZTqxqPH — Alok Pandey (@alok_pandey) August 23, 2022 (చదవండి: 6న ఎస్కేఎం తదుపరి భేటీ) -
లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం
లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటూ రిటైర్డ్ జడ్జి కమిటీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సదరు జడ్జి ప్రతిపాదనపై స్పందించాలంటూ కోరింది సుప్రీం కోర్టు. అంతేకాదు ఈ స్పందన కోసం ఏప్రిల్ 4వ తేదీని గడువుగా విధించింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన రైతు నిరసనల సందర్భంగా.. రైతుల మీదుగా కారు పనిచ్చి వాళ్ల మరణాలకు కారణం అయ్యాడు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు రాజకీయ విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల నడుమ అశిశ్ మిశ్రా అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో 2022, ఫిబ్రవరి 10వ తేదీన అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది బాధిత కుటుంబం. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు వింటోంది. ఈ మేరకు ఇంతకు ముందు(మార్చి 16న) యూపీ ప్రభుత్వంతో పాటు ప్రధాన నిందితుడు అశిశ్ మెహ్రాకు ‘బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలంటూ’ నోటీసులు సైతం జారీ చేసింది. లఖింపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు చేపట్టిన.. హైకోర్టు రిటైర్డ్ జడ్జి రాకేష్ కుమార్ జైన్ ఇప్పటికే నివేదిక సమర్పించారు కూడా. -
లఖీంపూర్ ఖేరి ఘటన.. మిశ్రాపై వేటు తప్పదా?
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని సిట్ స్పష్టీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాపై విపక్షాల డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే తక్షణం ఢిల్లీ రావాలని ఆయనకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మీడియా ప్రశ్నలు సంధించగా.. ఆయన సహనం కోల్పోయి మీడియాపై ఫైర్ అయ్యారు. చదవండి: Lakhimpur Violence: మంత్రి మిశ్రా రాజీనామా ప్రసక్తే లేదు: బీజేపీ తనయుడు ఆశిష్ మిశ్రా గురించి అడిగిన జర్నలిస్టులపై కేంద్రమంత్రి దుర్భాషలాడారు. ‘మూర్ఖుడిలా ప్రశ్నలు అడగవద్దు. మీరు మానసికస్థితిని కోల్పోయారా?. ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నారు?. నిర్దోషిని నిందితుడిగా మార్చారు. మీకు సిగ్గు లేదా?. నీవు ఒక దొంగ’ అంటూ జర్నలిస్టుపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మంత్రి మిశ్రా రాజీనామా ప్రసక్తే లేదు: బీజేపీ
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని సిట్ స్పష్టీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాపై విపక్షాల డిమాండ్లు వెల్లువెత్తాయి. అయినా సరే మంత్రి రాజీనామా ప్రసక్తే లేదని బీజేపీ కరాఖండిగా చెప్పేసింది. లఖీంపూర్ హింసాత్మక ఘటన ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించకూడదని సీనియర్ నేత పియూశ్ గోయల్ అన్నారు. చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ లఖీంపూర్ ఘటనలో మంత్రి అజయ్ కుమారుడు నిందితుడిగా ఉన్నారు. ‘ మోదీ సర్కార్‌ను విమర్శించడానికి సరైన కారణాలు లేకనే విపక్షాలు ఇలా సస్పెండ్ అయిన సభ్యుల అంశాన్ని పదేపదే పార్లమెంట్లో లేవనెత్తుతున్నాయి’ అని గోయల్ విమర్శించారు. -
లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరిలో ముందస్తు కుట్రతోనే రైతులను బలితీసుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చడంతో విపక్షాలు బుధవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాకు ఉద్వాసన పలకాలని విపక్షాలు లోక్‌సభలో గట్టిగా డిమాండ్ చేశాయి. నినాదాలతో లోక్‌సభ దద్దరిల్లింది. విపక్ష సభ్యులు పట్టువీడకుండా నిరసనలు కొనసాగించడంతో సభ గురువారానికి వాయిదా పడింది. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలు విపక్ష పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసకెళ్లి మిశ్రాపై వేటు వేయాలని బిగ్గరగా నినాదాలు చేశారు. సిట్ తాజాగా వెల్లడించిన సంచలన విషయాల తాలూకు వార్తా కథనాలు కనిపించేలా ప్రతికలను చేతులతో పట్టుకొని గాల్లో ఊపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి సిట్ దర్యాప్తులో వెల్లడైన విషయాలపై చర్చించాలని వాయిదా తీర్మానానికి రాహుల్ గాంధీ నోటీసు ఇచ్చారు. దీన్ని అనుమతించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ బిర్లా వీరి డిమాండ్‌ను పట్టించుకోకుండా∙విపక్ష ఎంపీల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్నాహ్యం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేమైన తర్వాత ఇవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. ‘ధరల పెరుగుదలపై ముఖ్యమైన చర్చ ఉంది. ఈ అంశాన్ని చర్చకు చేపట్టాలనేది మీ డిమాండే కదా. మీ స్థానాల్లోకి వెళ్లి కూర్చొండి’ అని స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. అయినా లాభం లేకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. పన్నెండు మంది రాజ్యసభ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించడంతో రాజ్యసభ గురువారానికి వాయిదా పడింది. కుదించే ఆలోచన ప్రస్తుతానికి లేదు పార్లమెంటు శీతాకాల సమావేశాలను కుదించే ఆలోచన ప్రస్తుతానికైతే లేదని పార్లమెంటరీ వ్యవ హారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ‘ధరల పెరుగుదల, ఒమిక్రాన్ ముప్పు లాంటి ముఖ్యమైన అంశాలపై చర్చించాలన్న విపక్షాలు తీరా ఇవి చర్చకు వస్తే పాల్గొనకుండా పారిపోవడం విడ్డూరం. ఈ అంశాల్లో మాట్లాడటానికి వారికి ఏమీ లేనట్లే కనపడుతోంది. సమావేశాల నిడివిని కుదిస్తారని పుకార్లను వ్యాప్తి చేయడంలో ప్రతిపక్షాలు బిజీగా ఉన్నాయి’ అని విలేకరులతో అన్నారు. -
Lakhimpur Kheri: లఖీంపూర్ ఖేరీ కేసులో కొత్త ట్విస్ట్
-
Lakhimpur Kheri: లఖీంపూర్ ఖేరీ కేసులో కొత్త ట్విస్ట్..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆశిష్ రైతులపై కావాలనే కాల్పులు జరిపినట్లు పోలీసులు విచారణలో నిర్ధారణ అయ్యింది. ఆశిష్‌తోపాటు అంకిత్‌దాస్ కూడా కాల్పులు జరిపినట్లు ఎఫ్ఎస్ఎల్ తమ నివేదికలో పేర్కొంది. రైతులపైకి వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అన్నదాతలతో సహా మొత్తం 8 మంది మరణించారు. లఖీంపూర్ ఖేరి ఘటనపై ఇద్దరు లాయర్లు రాసిన లేఖ ఆధారంగా సుమోటోగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన విషయం విదితమే. చదవండి: మన రక్షణా దళంలో ఆ ముగ్గురు... స్ఫూర్తి ప్రదాతలు..! -
రైతుల రైల్ రోకో.. ‘అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందే’
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం మరింత తీవ్రతరమైంది. లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండను నిరసిస్తూ, దానికి బాధ్యుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు సోమవారం నాడు రైల్ రోకో చేపట్టాయి. దేశవ్యాప్తంగా కొనసాగనున్న రైల్ రోకో వల్ల 30 ప్రాంతాల్లో రైల్ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఉత్తర రైల్వే జోన్లో ఎనిమిది రైళ్లు నియంత్రించబడుతున్నాయని ఉత్తర రైల్వే సీఆర్పీఓ సోమవారం తెలిపింది. (చదవండి: లోతైన హృదయం ఉన్న నాయకుడి మాటలివీ) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎక్కడిక్కడే రైళ్లను అడ్డుకుంటామని రైతు సంఘాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. యూపీలోని లఖీంపూర్ జిల్లాలో రైతులపై హింస, ఆ ఘటనలో ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రా తండ్రి అజయ్ మిశ్రా ఇప్పటికీ కేంద్ర మంత్రి పదవిలోనే కొనసాగుతుండటాన్ని నిరసిస్తూ రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్ఛా సోమవారం నాడు దేశ వ్యాప్త రైల్ రోకో చేపట్టింది. (చదవండి: నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు?) ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు రైల్ రోకో ఉంటుందని, అన్ని రాష్ట్రాల్లో స్థానిక రైతు సంఘాలు ఆ ఆరు గంటలపాటు రైలు పట్టాలపైనే నిరసనలు తెలుపుతారని కిసాన్ మోర్ఛా తెలిపింది. లఖీంపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో న్యాయం జరిగేవరకు పోరాడతామని సంయుక్త్ కిసాన్ మోర్చా తెలిపింది. చదవండి: Lakhimpur Kheri Violence: ‘ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తా’ Punjab: Farm law protestors sit on the railway track at Devi Dasspura village in Amritsar following the farmer's union call for 'Rail Roko Andolan' today pic.twitter.com/lQrKImJKso — ANI (@ANI) October 18, 2021 -
మిశ్రాను పదవి నుంచి తప్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో లఖీమ్‌పూర్ ఖేరి ఘటనకు బాధ్యుడిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కోరింది. ఈ మేరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రియాంకా గాంధీ, ఖర్గే, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్ తదితరులతో కూడిన కాంగ్రెస్ బృందం బుధవారం రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. రాజ్యాంగ సంరక్షకుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. లఖీమ్‌పూర్ ఘటనపై పూర్తి వివరాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రధాన నిందితుడి తండ్రి కేంద్రంలో మంత్రిగా ఉండడం వల్ల దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగదని భావిస్తున్నామని అన్నారు. అందుకే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జీలతో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కోరామని చెప్పారు. అజయ్ రాజీనామాతో బాధితులకు న్యాయం జరుగుతుందని రాహుల్ అన్నారు. ‘సెప్టెంబరు 27న నిరసన తెలుపుతున్న రైతులను అజయ్ మిశ్రా బహిరంగంగా బెదిరించారు. మంత్రే ఇలా రెచ్చగొడితే న్యాయం ఎలా లభిస్తుంది? ఘటనలో అజయ్ కొడుకు ఆశిష్ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యాలున్నాయి’ అని వినతి పత్రంలో నేతలు పేర్కొన్నారు. ఆశిష్‌కు బెయిల్ నిరాకరణ లఖీమ్‌పూర్ ఖేరి: లఖీమ్‌పూర్ ఖేరి హింసాకాండ ఘటనలో ప్రధాన నిందితుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు బుధవారం నిరాకరించింది. ఈ కేసులో అంకిత్ దాస్, లతీఫ్ అలియాస్ కాలే అనే ఇద్దరు వ్యక్తులను సిట్ బుధవారం అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టింది. వారిని 14 రోజులపాటు జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. ఆశిష్ మిశ్రాతోపాటు అతడి సహచరుడు ఆశిష్ పాండేకు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ చింతా రామ్ తిరస్కరించారని సీనియర్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ ఎస్.పి.యాదవ్ చెప్పారు. -
‘ఒక్కరి కోసం పార్టీ పరువు బజారుకీడ్చారు’.. బీజేపీకి తిప్పలు తప్పవా?
(వెంకటేష్ నాగిళ్ల- సాక్షిటీవీ న్యూఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి): లఖింపూర్ ఖేరి ఘటన తమ కొంప ముంచేలా ఉందని బిజెపి నేతలు వాపోతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి గుదిబండగా మారే అవకాశాలున్నాయి. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై కేంద్రమంత్రి తనయుడి కాన్వాయ్ దూసుకెళ్లి నలుగురు రైతులు మరణించగా, ఆ తర్వాత జరిగిన హింసలో మరో నలుగురు చనిపోయారు. ఈ ఘటన దేశమంతటిని కదిలించింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి అజయ్ మిశ్రా, ఘటనకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తనయుడు ఆశిశ్ మిశ్రాను అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని మందలించేంతవరకు ఆశిశ్ మిశ్రాను అరెస్ట్ చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రైతుల విషయంలో దారుణంగా వ్యవహరించిన తండ్రి, కొడుకులిద్దరిపై చర్యలు తీసుకోవాల్సిన బిజెపి ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. (చదవండి: బడితెపూజ∙తప్పదు!) ఈ వైఖరిపై బిజెపిలో అంతర్గతంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వ్యక్తిని కాపాడే క్రమంలో పార్టీ పరువు బజారుకీడ్చారని పలువురు నేతలు మండిపడుతున్నారు. అయితే దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. యూపిలో యోగి ప్రభుత్వం ఇప్పటికే బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందనే అరోపణలు ఎదుర్కొంటోంది. వివేక్ దూబే ఎన్ కౌంటర్ సహా గతంలో బ్రాహ్మణులకు దక్కిన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి వుంది. (చదవండి: Uthra Murder Case: కసాయి భర్త కేసులో కోర్టు సంచలన తీర్పు) దీన్ని అధిగమించేందుకే రాష్ట్ర క్యాబినెట్‌ను విస్తరించి బ్రాహ్మణ నేత జితిన్ ప్రసాదకు మంత్రివర్గంలో చేర్చుకుంది. అలాగే కేంద్రంలో అజయ్ మిశ్రాకు సహయమంత్రి పదవి ఇచ్చి కీలకమైన హోంశాఖను అప్పజెప్పారు. అయితే అజయ్ మిశ్రా తన దుందుడుకు వ్యవహరంతో రైతులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. దాంతో నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన రైతులపై కాన్వాయ్‌ను నడిపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలా ఆయన పార్టీకి లేని తలనొప్పులు తెచ్చిపెట్టారు. ఆయనపై వెంటనే వేటు వేస్తే ఇప్పుడిప్పుడే బ్రాహ్మణుల కోపం చల్లార్చేందుకు తీసుకున్న చర్యలు నిష్ఫలమవుతాయి. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకునేంతవరకు యోగి ప్రభుత్వం వెయిట్ చేసింది. సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేయడంతో ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. అయితే కేంద్రమంత్రి అజయ్ మిశ్రాపై ఇప్పటికిప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జ్యుడిషియల్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత రాజీనామా చేయించడం లేక మరోటా అనేది తేల్చే అవకాశముంది. ఏది ఏమైనా ఒక సమస్యను పరిష్కరించుకునేందుకు అధిష్టానం ప్రయత్నిస్తే, వారే మరో అతిపెద్ద సమస్యను బిజెపికి సృష్టించారు. దాని ఫలితంగా ఎన్నికల్లో బిజెపి నష్టపోయే పరిస్థితి తలెత్తింది. (చదవండి: అమ్మేది ఎవరో తెలియాల్సిందే.. సీసీపీఏ ఆదేశాలు) -
పోలీస్ కస్టడీకి ఆశిష్
లఖీమ్‌పూర్‌ఖేరి/బహ్రెయిచ్: లఖీమ్‌పూర్ ఖేరి హింసాత్మక ఘటనల కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌కు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈనెల 3వ తేదీన జరిగిన ఘటనల్లో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాను పోలీసులు 14 రోజుల రిమాండ్ కోరగా.. 12 నుంచి 15వ తేదీ వరకు అంటే మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించిందని అధికారులు తెలిపారు. 15వ తేదీ ఉదయంతో రిమాండ్ గడువు ముగియనుంది. ఈ సమయంలో ఆశిష్ మిశ్రాను ఇబ్బందిపెట్టరాదనీ, విచారణ సమయంలో లాయర్ ఆయన పక్కనే ఉంటారని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ చింతారాం షరతు విధించారు. అంతకుముందు, ఓ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. టింకోనియాలో నేడు అంతిమ్ అర్థాస్ లఖీమ్‌పూర్ ఖేరిలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులకు మంగళవారం అంతిమ్ అర్థాస్ (అంతిమ ప్రార్థన) జరుపుతామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తెలిపింది. అసువులు బాసిన రైతులకు నివాళులర్పించేందుకు మంగళవారం షహీద్ కిసాన్ దివస్‌గా పాటించాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో దేశవ్యాప్తంగా రైతులు తమ నివాసాల వెలుపల కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించాలని కోరింది. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న టికోనియా గ్రామంలో జరిగే అంతిమ ప్రార్థన కార్యక్రమానికి రాకేశ్ తికాయత్ సహా రైతు నేతలు తరలిరానున్నారు. ఇలా ఉండగా, లఖీమ్‌పూర్‌ఖేరి బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరగాలంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సోమవారం లక్నోలో జీపీవో పార్కు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. -
ఆ సమయంలో ఆశిష్ ఎక్కడ?
న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి హింసాత్మక ఘటనలో హత్య అభియోగాలను ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సిట్ విచారణలో పొంతన లేని సమాధానాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు చాలా ప్రశ్నలకి ఆయన సమాధానమే ఇవ్వలేదని సమాచారం. నలుగురు రైతుల్ని బలిగొన్న వాహనం దూసుకుపోయిన ఘటన సమయంలో ఆశిష్ మిశ్రా ఎక్కడ ఉన్నాడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసుల్లో విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు లఖీమ్‌పూర్ ఖేరిలో హింస చెలరేగినప్పుడు తాను అక్కడికి 4–5 కి.మీ. దూరంలో జరుగుతున్న రెజ్లింగ్ పోటీల వద్ద ఉన్నట్టుగా ఆశిష్ విచారణలో వెల్లడించారు. అజయ్ మిశ్రా స్వగ్రామమైన భవానీపూర్‌లో నిర్వహించిన ఈ రెజ్లింగ్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరవడానికి కేంద్ర మంత్రి వెళుతుండగానే అక్టోబర్ 3న హింసాత్మక ఘటనలు చెలరేగి నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ ఎదుట లొంగిపోయిన ఆశిష్‌ని 12 గంటల సేపు ప్రశ్నించిన తర్వాత శనివారం అర్ధరాత్రి దాటాక మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా... అతనిని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సీనియర్ ప్రాసిక్యూషన్ అధికారి ఎస్పీ యాదవ్ చెప్పారు. తదుపరి విచారణని సోమవారానికి వాయిదా వేశారు. ఆ మూడు పాయింట్లు.. ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన మూడు పాయింట్లు గమనిస్తే ఆశిష్ వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారని అర్థమవుతోందని సిట్ పోలీసులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం... ► లఖీమ్‌పూర్ ఖేరిలో వాహనం దూసుకుపోయిన ఘటన జరిగినప్పుడు తాను రెజ్లింగ్ కార్యక్రమంలో ఉన్నానని ఆశిష్ చెప్పారు. అయితే రెజ్లింగ్ కార్యక్రమం దగ్గర పహారాగా ఉన్న పోలీసు సిబ్బంది ఆశిష్ ఆ కార్యక్రమానికి వచ్చినప్పటికీ 2 నుంచి 4 గంటల మధ్య కనిపించకుండా పోయారని వెల్లడించారు. ► ఆశిష్ మిశ్రా సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఆయన ఉండే ప్రాంతాన్ని పరిశీలిస్తే ఆ సమయంలో హింసాకాండ జరిగిన స్థలంలోనే ఉన్నారని తేలింది. ఇదే విషయాన్ని సిట్ అధికారులు నిగ్గదీసి అడిగితే ఆశిష్ మళ్లీ మాట మార్చి ఆ సమయంలో తాను తమ రైస్‌మిల్లుకి కూడా వెళ్లానని, హింస చెలరేగిన ప్రాంతానికి అది దగ్గరలో ఉందని, ఈ రెండు ప్రదేశాలు ఒకే మొబైల్ టవర్ కిందకి వస్తాయంటూ వాదించారు. ఈ రెండు అంశాలూ ఆశిష్ మిశ్రాకు వ్యతిరేకంగా ఉండబట్టే అరెస్టు జరిగిందని సమాచారం. ► రైతుల ఊసే లేకుండా దాఖలు చేసిన రెండో ఎఫ్ఐఆర్ (డ్రైవర్‌ను, బీజేపీ కార్యకర్తలను ఆందోళనకారులు కొట్టి చంపిన కేసు)లో పరిశీలించినా ఆశిష్ అన్నీ నిజాలు చెప్పడం లేదని అర్థమవుతుంది. రైతుల మీదకి దూసుకుపోయిన వాహనం తనదేనని అంగీకరించిన ఆశిష్ ఆ సమయలో తాను అందులో లేనని మొదట్నుంచి చెబుతూ వస్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్లో ఆశిష్ అనుచరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవింగ్ సీటులో ఉన్నది ఆశిష్ కాదని, అతని డ్రైవర్ హరిఓం అని చెబుతున్నారు. డ్రైవింగ్ సీటులో డ్రైవర్ హరిఓం ఉన్నాడని, అతను తెల్ల చొక్కా లేదంటే కుర్తా ధరించాడని ఎఫ్ఐఆర్లో కూడా రాశారు. వీడియో పరిశీలనలో కూడా తెల్లచొక్కా ధరించిన వ్యక్తే నడుపుతున్న పోలీసులు గుర్తించారు. అయితే ఆస్పత్రికి తీసుకువచ్చిన డ్రైవర్ మృతదేహంపై పసుపు చొక్కా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఆశిష్ వాస్తవాలు దాచి పెడుతున్నారని తెలుస్తోందని సిట్ పోలీసుల వాదనగా ఉంది. -
అజయ్ మిశ్రా వైదొలగాల్సిందే
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరిలో రైతుల్ని బలి తీసుకున్న ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాం«ధీ డిమాండ్ చేశారు. మిశ్రా రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఎవరూ తమని నిరోధించలేరని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ బాధిత రైతు కుటుంబాలకు మద్దతుగా కిసాన్ న్యాయ్ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీనుద్దేశించి ప్రియాంక మాట్లాడుతూ రైతుల్ని బలి తీసుకున్న ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు యూపీలో న్యాయం జరగదన్నారు. బాధిత కుటుంబాలు న్యాయం కోరుకుంటున్నాయే తప్ప డబ్బు కాదన్నారు. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలెవరికీ లఖీమ్‌పూర్ ఖేరికి వెళ్లే తీరిక దొరకలేదన్నారు. ‘‘సోన్‌భద్ర మారణకాండలో ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఉన్నావ్, హత్రాస్ సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో న్యాయం జరగలేదు. ఈ కేసులోనూ అదే జరుగుతోంది. లఖీమ్‌పూర్ ప్రజలకి కూడా న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయింది’’ అని అన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తమతో చర్చించడానికి యూపీ ప్రభుత్వం క్రిమినల్స్‌ని పం పిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రియాంక వెల్లడించారు. మతం రంగు పులమొద్దు: వరుణ్ గాంధీ లఖీమ్‌పూర్ ఉదంతాన్ని హిందువులు, సిక్కుల మధ్య గొడవగా మార్చే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ హెచ్చరించారు. ఇలాంటి ప్రయత్నాలు ప్రమాదకర పరిణామాలను దారి తీస్తాయని, మానిపోయిన పాత గాయాలను మళ్లీ రేపుతాయంటూ ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. స్థానిక ఆధిపత్య శక్తుల వల్లే పేద రైతులు బలయ్యారని స్పష్టం చేశారు. నిరసన వ్యక్తం చేసే రైతులను ఉద్దేశించి ‘ఖలిస్తానీ’ అని మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం దేశ ఐక్యతను పణంగా పెట్టొద్దని వరుణ్ గాంధీ కోరారు. సాగు చట్టాలపై రైతుల ఆందోళనలకు ఆయన మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. -
ఆశిష్ మిశ్రా అరెస్ట్
న్యూఢిల్లీ/లక్నో/లఖీమ్‌పూర్: యూపీలోని లఖీమ్‌పూర్‌ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌ను శనివారం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అరెస్ట్ చేసింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు శుక్రవారం అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మొదటి విడత సమన్లకు బదులివ్వని ఆశిష్‌మిశ్రా శుక్రవారం పోలీసులిచి్చన రెండో విడత సమన్లకు స్పందించారు. ఆశిష్ శనివారం ఉదయం 10.30 గంటలకు సిట్ కార్యాలయానికి రాగా డిప్యూటీ ఐజీ ఉపేంద్ర అగర్వాల్ నేతృత్వంలో అధికారుల బృందం 11 గంటలపాటు ప్రశి్నంచి, రాత్రి 11 గంటల సమయంలో అదుపులోకి తీసుకుంది. విచారణకు ఆశిష్ సహకరించడం లేదని, అతడిని కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు చెప్పా రు. ఈనెల 3న యూపీ డిప్యూటీసీఎం మౌర్య పర్యటన సమయంలో వాహనం ఢీకొని నలుగురు రైతులు చనిపోయిన ఘటన సమయంలో ఆశిష్ మిశ్రా ఒక వాహనంలో ఉన్నారని పేర్కొంటూ పోలీసులు ఆయనపై హత్య కేసు నమోదు చేశా రు. రైతులపై హింసను ముందస్తు ప్రణాళికతో చేపట్టిన ఉగ్రదాడిగా రైతు సంఘాలు అభివరి్ణంచాయి. వాళ్లని అరెస్ట్ చేయాలి.. లఖీమ్‌పూర్ ఘటనకు కారకులైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని, ఆయనతోపాటు ఆయన కుమారుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)నేత యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులకు నివాళులర్పించేందుకు 12వ తేదీన టికోనియాలో కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు ఒప్పుకోకుంటే నలుగురు రైతుల అస్తికలతో 11వ తేదీన షహీద్ కిసాన్ యాత్ర చేపడతామన్నారు. 15న దసరా రోజున ప్రధాని, హోం మంత్రి దిష్టి»ొమ్మల దహనం, 18న రైల్ రోకో, 26న మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. లఖీమ్‌పూర్‌ఖేరి హింస సందర్భంగా బీజేపీ కార్యకర్తలను చంపిన వారిని దోషులుగా భావించడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నా రు. నలుగురు రైతులను చంపినందుకు ప్రతిచర్యగానే ఈ ఘటన చోటుచేసుకుందని వ్యాఖ్యానించారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. లఖీమ్‌పూర్ హింస దోషులను చట్టం ముందు నిలబెట్టాల్సింది పోయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. రైతులను అణచివేసినట్లే, చట్టాలనూ పక్కనబెట్టాలని చూస్తోం దన్నారు. అదేవిధంగా, లఖీమ్‌పూర్ ఘటనలకు నిరసనగా ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా నివాసం ముట్టడికి వెళ్తున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. సిట్ బృందం ఆశిష్ మిశ్రాను ప్రశి్నంచడంతో దీక్షను విరమిస్తున్నట్లు కాంగ్రెస్ నేత సిద్ధూ ప్రకటించారు. సీజేఐని ప్రశంసించిన దుష్యంత్ దవే లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చూపిన చొరవను సుప్రీం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే ప్రశంసించారు. ఘటనలపై విచారణ సమయంలో ఆయన చాలా బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించారన్నారు. కోర్టులు ప్రజల పక్షాన నిలుస్తాయన్న భరోసాను సీజేఐ కలి్పంచారన్నారు. సమావేశంలో తికాయత్, యోగేంద్రయాదవ్ -
‘రైతులను నాశనం చేసినవాళ్లు .. రాజకీయంగా ఎదిగినట్లు చరిత్రలేదు’
హైదరాబాద్: రైతులను నాశనం చేసినవాళ్లు.. రాజకీయంగా ఎదిగినట్లు చరిత్రలో లేదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికార దాహంతో నలుగురు రైతులను కేంద్రమంత్రి కొడుకు పొట్టన బెట్టుకున్నాడని విమర్శించారు. అజయ్ మిశ్రా మాటల వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఉన్నారని తెలిపారు. అజయ్ మిశ్రాను అరెస్టు చేయడంలో యోగి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. చనిపోయిన రైతు కుటుంబాల పక్షాన దేశమంతా నిలబడాల్సిన తరుణంలో.. యోగి సర్కారు దీనికి భిన్నంగా.. రైతులను పరామర్శించడానికి వెళ్లిన ప్రియాంక గాంధీపై కర్కశంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అజయ్ మిశ్రాను మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శాంతి యుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై మోడీ, అమిత్‌షాలు మరణ శాసనం చేస్తే.. అజయ్ మిశ్రా ఆయన కొడుకు అమలు చేశారని మండిపడ్డారు. యూపీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. ఈ ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని అన్నారు. చనిపోయిన రైతు కుటుంబాల కుటుంబానికి లక్ష చోప్పున ఆర్థిక సహయం అందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చదవండి: రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు: కేసీఆర్ -
సీఎస్‌గా అజయ్‌మిశ్రా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్రకుమార్ జోషి మంగళవారం పదవీ విర మణ చేయనున్నారు. సీనియారిటీ, సమర్థతలను పరిగణనలోకి తీసుకుని కొత్త సీఎస్ ఎంపికపై నేడు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త సీఎస్ రేసులో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ముందంజ లో ఉన్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన మిశ్రాకు సీనియారిటీ కలిసి వస్తుండటంతో ఆయననే సీఎస్‌గా నియమించే అవకాశాలు అధికంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, 1989 బ్యాచ్‌కు చెందిన సోమేశ్‌కుమార్ పనితీరు పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న సానుకూల దృక్పథం కూడా కొత్త సీఎస్ ఎంపికలో కీలకంగా మారే అవకాశముంది. మిశ్రాను సీఎస్‌గా నియమిస్తే 2020 జూన్ వరకు పదవి లో కొనసాగుతారు. ఆ తర్వాత సోమేశ్‌కుమార్‌కు సీఎస్‌గా అవకాశం కల్పించాలనే యోచనలో సీఎం ఉన్నట్టు సమాచారం. సోమేశ్ కుమార్ పదవీ విరమణ సమయం 2023 డిసెంబర్ నెలాఖరుకు ఉంది. అసెంబ్లీ ఎన్నికల వరకు సీఎస్‌గా ఒకే అధికారిని కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తే మాత్రం, జోషి వారసుడిగా సోమేశ్‌కుమార్‌ను సీఎస్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం తరఫున సన్మానం ఎస్కే జోషి పదవీ విరమణ సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్ 9వ అంతస్తులోని సమావేశ మందిరంలో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొననున్నారు. -
కొత్త సీఎస్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్ర కుమార్ జోషి ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన పదవీకాలం మరో వారం రోజులే మిగిలి ఉండటంతో కొత్త సీఎస్ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీ, సమర్థత, స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త సీఎస్ ఎంపికపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకోనున్నారు. సీఎస్ పదవి రేసులో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేరు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వీరిద్దరిలో ఒకరిని సీఎస్‌గా నియమించే అవకాశాలున్నాయని సచివాలయ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్లు చాలా మందే.. సీనియారిటీపరంగా సీఎస్ రేసులో తెలంగాణ కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ అధికారులు బీపీ ఆచార్య, బినయ్‌కుమార్, 1984 బ్యాచ్ అధికారి అజయ్ మిశ్రా, 1985 బ్యాచ్ అధికారిణి పుష్పా సుబ్రమణ్యం, 1986 బ్యాచ్ అధికారులు సురేశ్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, రాజేశ్వర్ తివారి, 1987 బ్యాచ్ అధికారులు రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, 1988 బ్యాచ్ అధికారులు శాలిని మిశ్రా, ఆధర్ సిన్హా, 1989 బ్యాచ్ అధికారులు సోమేశ్‌కుమార్, శాంతి కుమారి ఉన్నారు. వీరిలో బీపీ ఆచార్య, సురేశ్ చందా, రాజేశ్వర్ తివారి సమర్థులైన అధికారులుగా పేరున్నా, ప్రభుత్వంతో ఉన్న సంబంధాల రీత్య సీఎస్ రేసులో వీరి పేర్లు వినిపించడం లేదు. బినయ్‌కుమార్, పుష్పాసుబ్రమణ్యం, హీరాలాల్ సమారియా, రాజీవ్ రంజన్, వసుధ మిశ్రాలు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఇక మిగిలిన వారిలో అజయ్‌మిశ్రా, సోమేశ్‌కుమార్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే అజయ్ మిశ్రా 2020 జూన్‌లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయనకు సీఎస్‌గా అవకాశం కల్పిస్తే ఆరు నెలలు ఆ పదవిలో కొనసాగుతారు. సోమేశ్‌కుమార్ 2023 డిసెంబర్ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయనకు అవకాశం కల్పిస్తే నాలుగేళ్ల పాటు సీఎస్ పదవిలో కొనసాగనున్నారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు సీఎస్‌గా ఒకే అధికారిని కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తే సోమేశ్‌కుమార్‌కు సీఎస్ పదవి వరించే అవకాశాలున్నాయి. అజయ్ మిశ్రా రిటైరైన తర్వాత సోమేశ్కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
‘విద్యుత్’ సీఎండీల పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) సీఎండీ ఎ.గోపాల్‌రావు, టీఎస్ రెడ్కో వైస్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.జానయ్యతో పాటు మరో 21 మంది డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా బుధవారం ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు వారంతా తమ పదవుల్లో కొనసాగుతారని పేర్కొన్నారు. ప్రభాకర్‌రావు పదవీకాలం వచ్చేనెల 4న ముగియనుండగా.. మిగిలిన సీఎండీలు, డైరెక్టర్ల పదవీకాలం ఈ నెల 31తో పూర్తికానుండటంతో ప్రభుత్వం వారి పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జెన్కో డైరెక్టర్లు పీహెచ్ వెంకటరాజం (హైడల్), ఎం.సచ్చిదానందం (ప్రాజెక్ట్స్), ఎ.అశోక్‌కుమార్ (హెచ్ఆర్), బి.లక్ష్మయ్య (థర్మల్), ఎ.అజయ్ (సివిల్), ట్రాన్స్‌కో డైరెక్టర్లు జి.నర్సింగ్‌రావు (ప్రాజెక్ట్స్), టి.జగత్‌రెడ్డి(ట్రాన్స్మిషన్), జె.సూర్యప్రకాశ్ (ఎత్తిపోతల), బి.నర్సింగ్‌రావు (గ్రిడ్ ఆపరేషన్), టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు జె.శ్రీనివాస్ రెడ్డి (ఆపరేషన్స్), టి.శ్రీనివాస్ (ప్రాజెక్ట్స్), కె.రాములు (కమర్షియల్), జి.పర్వతం (హెచ్ఆర్), సీహెచ్ మదన్మోహన్రావు (పీఅండ్ఎంఎం), ఎస్.స్వామిరెడ్డి (ఐపీసీ), టీఎస్ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు బి.వెంకటేశ్వరరావు (హెచ్ఆర్), పి.మోహన్‌రెడ్డి (ప్రాజెక్ట్స్), పి.సంధ్యారాణి (కమర్షియల్), పి.గణపతి (ఐపీసీ, పీఏసీ), డి.నర్సింగ్‌రావు (ఆపరేషన్స్) పదవీకాలం పొడిగింపు పొందిన వారిలో ఉన్నారు. -
కరెంటు బిల్లులు పెరగవ్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ఉండదు. చార్జీల పెంపు లేకుండా ప్రస్తుత టారిఫ్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరం(2019–20)లో యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా సోమవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) కార్యదర్శికి రహస్య లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచొద్దని సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ చార్జీలు యథాతథంగా ఏప్రిల్ 1తో ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో అమలవుతాయని ఆదేశిస్తూ త్వరలో ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఏఆర్ఆర్ లేనట్టే! :దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)ల యాజమాన్యాలు ఇప్పటి వరకు 2019–20 సంవత్సరానికి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికను ఈఆర్సీకి సమర్పించలేదు. గతేడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో వాయిదాను కోరాయి. ఏటా నవంబర్ చివరిలోగా రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ అంచనాలను ఆర్థిక అవసరాల నివేదిక (ఏఆర్ఆర్) రూపంలో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఈఆర్సీకి సమర్పించాలని విద్యుత్ చట్టంలోని నిబంధనలు పేర్కొంటున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పడనున్న ఆర్థిక లోటు అంచనాలు, దీన్ని అధిగమించేందుకు ఎంత మొత్తంలో చార్జీలు పెంచాలన్న అంశాన్ని ఈ నివేదికలో డిస్కంలు ప్రతిపాదించాలి. డిస్కంలు ప్రతిపాదించిన చార్జీల పెంపుపై ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. అనంతరం వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాల్సిన విద్యుత్ టారిఫ్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఏటా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి వారం రోజుల ముందే ఈఆర్సీ టారిఫ్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రస్తుత విద్యుత్ చార్జీలను వచ్చే ఏడాది యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీని కోరిన నేపథ్యంలో డిస్కంలు ఈఆర్సీకి 2019–20కు సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికను సమర్పించకపోవచ్చని ఇంధన శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈఆర్సీ చైర్మన్ ఎంపిక ఎప్పుడు ? టీఎస్ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్ గత జనవరి 9న పదవీ విరమణ పొందారు. అంతకుముందే సభ్యులిద్దరూ పదవీ విరమణ చేయడంతో గత రెండు నెలలుగా కమిషన్ ఖాళీగా ఉంది. కొత్త చైర్మన్, సభ్యుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఎంపిక కమిటీ.. ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త చైర్మన్, సభ్యుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. -
గరళంపై ఇక కఠినం!
సాక్షి, హైదరాబాద్: కాలుష్యాన్ని వ్యాపింపచేస్తూ, ప్రజలకు ఇబ్బందికరంగా మారిన పరిశ్రమలు, ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. కాలుష్యాన్ని వెదజల్లుతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇలాంటి పరిశ్రమలపై నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం అరణ్యభవన్‌లో వివిధ విభాగాలపై మంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పీకే ఝా, అటవీ అభివృద్ధిసంస్థ వైస్ చైర్మన్, ఎండీ రఘువీర్, పీసీబీ మెంబర్ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, ఈపీటీఆర్ఐ ఎండీ కల్యాణ చక్రవర్తి, బయో డైవర్సిటీ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శిల్పి శర్మ, టీఎస్ కాస్ట్ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో కాలుష్యం కోరలు చాస్తోందని, తెలంగాణలో అలాంటి పరిస్థితులు రాకుండా వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్లాస్టిక్ వినియోగానికి చెక్... రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కూడా ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి చెక్ పెట్టేలా చర్యలు చేపట్టనున్నట్టు మంత్రి చెప్పారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జ్యూట్, క్లాత్ బ్యాగులను వాడేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 మైక్రాన్లకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం ఉన్నా, కంపెనీలు విచ్చలవిడిగా ప్లాస్టిక్ బ్యాగులను తయారు చేస్తున్నాయని, అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాలం చెల్లిన వాహనాలకు చెక్.. కాలం చెల్లిన వాహనాల నుంచి వచ్చే కర్బన ఉద్గారాల కారణంగా స్వచ్ఛమైన గాలి కలుషితమవుతోందని, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు కాలం తీరిన వాహనాలకు చెల్లు చీటీ పాడాలని మంత్రి సూచించారు. కాలం చెల్లిన వాహనాలకు చెక్ పెట్టేందుకు నిరంతరం కాలుష్య ప్రమాణ తనిఖీలు నిర్వహించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. వాతావరణ మార్పులకు సంబంధించి కచ్చితమైన సమాచారం ఇచ్చే విధంగా ఈపీటీఆర్ఐ పరిశోధనలు చేపట్టాలన్నారు. -
మన విద్యుత్ విధానం దేశానికే ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ నాయకత్వం లో తక్కువ సమయంలోనే తెలంగాణ విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు అనితర సాధ్యమైనవని, ఈ విజయాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్నారు. తెలంగాణ రాష్ట్రం చిమ్మ చీకట్ల నుంచి నిరంతర వెలుగుల వైపు ఎలా ప్రయాణించిందనేది ఇతర రాష్ట్రాల కు ఒక పాఠంలా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ పీఆర్వోగా పనిచేస్తు న్న ట్రాన్స్‌కో జీఎం గటిక విజయ్ కుమార్ తెలుగులో ‘తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం’, ఇంగ్లిష్‌లో ‘ద సాగా ఆఫ్ సక్సెస్ ఆఫ్ తెలంగాణ పవర్ సెక్టార్’ పుస్తకాలను రచించా రు. ఈ 2 పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మతో కలిసి ఎస్కే జోషి సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయలో జరిగిన కార్యక్రమం లో జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభా కర్ రావు, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సీఎం సీపీఆర్వో వనం జ్వాలా నర్సింహరావు, పుస్తక రచయిత గటిక విజయ్ కుమార్ పాల్గొన్నారు. పుస్తకంలో ఏముంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడున్న విద్యుత్ సంక్షోభం, ఏపీ చేసిన కుట్రలు, వాటన్నింటినీ అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాలు, విద్యుత్ విషయంలో సాధించిన రికార్డులు, తలసరి విద్యుత్ వినియోగం, సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంశాల్లో అగ్రగామిగా నిలవడానికి కారణాలు, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ తదితర బృహత్తర పథకాల్లో విద్యుత్ శాఖ బాధ్యతలు, బంగారు తెలంగాణ నిర్మాణంలో విద్యుత్ రంగం ఎంతటి కీలక భూమిక పోషిస్తున్నది తదితర అంశాలన్నింటినీ ఈ పుస్తకాల్లో వివరించారు. పుస్తక రచయిత విజయ్ కుమార్‌ను కార్యక్రమానికి హాజరైన ప్రముఖులంతా అభినందించారు. -
నెలాఖరులోగా హరితహారం పూర్తవ్వాలి
సాక్షి, హైదరాబాద్: నాలుగో విడత హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ఆదేశించారు. జిల్లాల వారీగా కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాల కుదింపు అనుమతించబోమని, అన్ని జిల్లాలు ఈ నెలాఖరుకల్లా తమ లక్ష్యాలను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. హరితహారం పురోగతిపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అటవీ అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మళ్లీ రెండు వారాల తర్వాత హరితహారంపై చీఫ్ సెక్రటరీ సమీక్ష ఉంటుందని ఈలోగా లక్ష్యం మేరకు పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ పీ.కె.ఝా, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్.ఎం.డోబ్రియల్ పాల్గొన్నారు. -
విద్యుత్ సంస్థలకు కొత్త డైరెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల పాలక మండలిలకు ప్రభుత్వం కొత్త డైరెక్టర్లను నియమించింది. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి పదవీ కాలాన్ని 2019 మార్చి 31 వరకు పొడిగించడంతోపాటు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీఎస్రెడ్కో) వైస్ చైర్మన్, ఎండీగా జానయ్యను నియమించింది. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 12 కొత్త డైరెక్టర్ల నియామకంతోపాటు ఇప్పటికే పనిచేస్తున్న 9 మంది డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించింది. కొత్తగా నియమితులైన 12 మంది డైరెక్టర్లు 2019 మే 31 వరకు పదవుల్లో కొనసాగుతారని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా నియమితులైన డైరెక్టర్లు.. టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లుగా రాములు (కమర్షియల్, డీపీఈ, అసెస్మెంట్, ఎనర్జీ ఆడిట్), పర్వతం(హెచ్ఆర్ అండ్ ఐఆర్), మదన్ మోహన్(పీఅండ్ఎంఎం),స్వామిరెడ్డి (ప్రాజెక్ట్స్) నియమితులయ్యారు. టీఎస్ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లుగా మోహన్‌రెడ్డి (ప్రాజెక్ట్స్), సంధ్యారాణి(కమర్షియల్), గణపతి (ఐపీసీ అండ్ ఆర్ఏసీ), నర్సింగ్‌రావు (ఆపరేషన్స్), మహమ్మద్ యూనస్ (పీ అండ్ ఎంఎం)లను నియమించారు. ఎన్పీడీసీఎల్లో డైరెక్టర్(ఆపరేషన్స్)గా పనిచేస్తున్న బి.నర్సింగ్రావును ట్రాన్స్‌కో డైరెక్టర్ (గ్రిడ్ ఆపరేషన్స్)గా నియమించారు. జెన్కో డైరెక్టర్లుగా లక్ష్మయ్య(థర్మల్), అజయ్ (సివిల్) నియమితులయ్యారు. ఎన్ఎండీసీలో డైరెక్టర్ (కమర్షియల్)గా పనిచేస్తున్న టీఆర్కే రావు ను జెన్కోలో డైరెక్టర్ (ఇంధన నిర్వహణ)గా రెండేళ్ల పదవీ కాలంతో నియమించారు. పదవీ కాలం పొడిగింపు.. టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు జె.శ్రీనివాస్, టి.శ్రీనివాస్ (ఐపీసీ, ఆర్ఏసీ), టీఎస్ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు బి.వెంకటేశ్వరరావు (హెచ్ఆర్), ట్రాన్స్‌కో డైరెక్టర్లు జి.నర్సింగ్‌రావు (ప్రాజెక్టులు), టి.జగత్‌రెడ్డి (ట్రాన్స్మిషన్), జె.సూర్యప్రకాశ్ (ఎత్తిపోతల), జెన్కో డైరెక్టర్లు సీహెచ్.వెంకటరాజం (హైడల్), ఎస్.అశోక్‌కుమార్ (హెచ్ఆర్), ఎస్.సచ్చిదానందం (ప్రాజెక్ట్స్)ల పదవీ కాలాన్ని 2019 మార్చి 31 వరకు పొడిగించింది.