Alwar
-
కుల్ఫీ తిన్న 65 మంది చిన్నారులు ఆసుపత్రిపాలు
ఆనందంగా గంతులేసుకుంటూ కుల్ఫీ తిన్న ఆ 65 మంది పిల్లలు ఉన్నట్టుండి అనారోగ్యం బారినపడి ఆసుపత్రి పాలయ్యారు. కుల్ఫీ తిన్న వెంటనే వారు కడుపునొప్పితో తల్లడిల్లి పోయారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్‌లోని అల్వర్ జిల్లాలో కుల్ఫీ తిన్న 65మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. కడుపునొప్పి, వాంతులతో తల్లడిల్లిపోతున్న ఆ చిన్నారులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పిల్లలు ఏ వెండర్ దగ్గర నుంచి కుల్ఫీలు కొనుగోలు చేశారో, వాటి శాంపిల్స్‌ను అధికారులు సేకరించి, పరిశీలన కోసం పంపించారు. ఆరోగ్యశాఖ అధికారి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఈ ఘటన రాజగఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకున్నదన్నారు. చిన్నారులు ఒక వెండర్ దగ్గర కుల్ఫీలు కొనుగోలు చేశారు. వాటిని తిన్నవెంటనే వారికి కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. ఒక్కక్కరుగా పిల్లలంతా అనారోగ్యం బారినపడ్డారు. వెంటనే స్థానికులు వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మరికొందరు చిన్నారులు ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరికి చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్ శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ బాధిత చిన్నారులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం 50 మంది చిన్నారులు కోలుకోగా, వారిని వారి ఇళ్లకు పంపించామన్నారు. మరో 15 మంది చిన్నారులకు ఇంకా చికిత్స కొనసాగుతోంది. వీరు తిన్న కుల్ఫీ శాంపిల్‌ను పరిశీలన కోసం ల్యాబ్‌కు పంపించామన్నారు. చదవండి: రైతు ప్రాణాలు కాపాడిన ఆవు -
దారుణం.. బ్లాక్మెయిల్ చేసి 8 మంది అత్యాచారం
జైపూర్: రాజస్థాన్ అల్వార్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. 8 మంది యువకులు 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రైవేటు ఫోటోలు రహస్యంగా తీసి బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. అంతేకాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి బాధితురాలి నుంచి రూ.50వేలు వసూలు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం గతేడాది డిసెంబర్ 1న ప్రధాన నిందితుడు సోహిల్ తనకు సోదరి వరసయ్యే బాలికకు ఫోన్ చేసి ఓ చోటుకు రమ్మన్నాడు. అక్కడకి రాకపోతే సీక్రెట్‌గా తీసిన ప్రైవేటు చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె భయంతో అక్కడకు వెళ్లింది. ఒంటరిగా వెళ్లిన ఆమెపై సోహిల్, అతని స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరాన్ని ఫోన్లో చిత్రీకరించారు. ఆ తర్వాత నుంచి బాధితురాలిని తరచూ బ్లాక్ చేసి డబ్బు వసూలు చేశాడు సోహిల్. అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఓసారి బాలిక డబ్బు ఇవ్వకపోవడంతో నిందితుడు ఆమె వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. వారిని అరెస్టు చేశాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. చదవండి: భార్యపై అనుమానం.. బెడ్రూంలో సెల్‌ఫోన్ పెట్టి వీడియో రికార్డు.. ఆ తర్వాత! -
‘ఆ మూక హత్యలు మావాళ్లు చేసినవే’
జైపూర్: తన మద్దతుదారుల మూకదాడిలో ఆవుల స్మగ్లర్లు ఐదుగురు హతమయ్యారని చెప్పుకున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహూజాపై ఆల్వార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ దొంగతనం ఆరోపణలపై శుక్రవారం మేవాట్‌కు చెందిన ముస్లింలు చిరంజీలాల్ సైనీ అనే వ్యక్తిని కొట్టి చంపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో అహూజా ‘లావాండి ప్రాంతంలో మా వాళ్ల మూకదాడిలో ఐదుగురు హతమయ్యారు. ఇలాంటిది జరగడం మాత్రం ఇదే మొదటిసారి. ఆవుల దొంగలపై మూకదాడులకు పాల్పడిన మా వాళ్లకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చే పూచీ నాది’అని అంటున్నట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. -
వరుస ఫెయిల్యూర్స్.. అయినా తగ్గలా.. ‘స్లైస్ పే’ రూపంలో గట్టి సక్సెస్ కొట్టి మరీ..
ఫెయిల్యూర్స్ అనేవి ఒకదాని తరువాత ఒకటి వరుస కడితే, ఎవరైనా ఏంచేస్తారు? ‘ఇక చాలు నాయనా’ అని వెనక్కితగ్గుతారు. సక్సెస్‌ను గట్టిగా కోరుకునేవారు మాత్రం ‘తగ్గేదేలా’ అనుకుంటారు. రాజన్ బజాజ్ ఈ కోవకు చెందిన యువకుడు. మూడు ఫెయిల్యూర్స్ తరువాత...‘స్లైస్ పే’ రూపంలో గట్టి సక్సెస్ కొట్టిన ఘనుడు... ‘బజాజ్’ అనే మాట వినిపించగానే పెద్ద పెద్ద కంపెనీలు గుర్తుకు వస్తాయి. అయితే ఈ ‘బజాజ్’కు రాజస్థాన్ అల్వార్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాజన్ బజాజ్‌కు బీరకాయ పీచు బంధుత్వం కూడా లేదు. ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో చదువుపూర్తయిన తరువాత రాజన్ ‘ఫ్లిప్‌కార్ట్’లో ఉద్యోగం చేశాడు. పదినెలల తరువాత... ‘ఇలా అయితే ఎలా?’ అనుకున్నాడు. దీనికి కారణం ఏదైనా ఒక స్టార్టప్ స్టార్ట్ చేసి స్టార్ అనిపించుకోవాలనేది తన కల. ‘ఫ్లిప్‌కార్ట్’లో తనకు చాలా బాగుంది. ఇలా సంతృప్తి పడి అక్కడే ఉంటే, తన కల కూడా కదలకుండా అక్కడే ఉంటుందని తనకు తెలుసు. ఉద్యోగం వదిలేసిన తరువాత... బెంగళూరులో ‘మెష్’ పేరుతో గేమింగ్ కన్సోల్స్, కెమెరా, డీవిడీలు అద్దెకు ఇచ్చే బిజినెస్‌ను స్టార్ట్ చేశాడు. తన బైక్‌పై తిరుగుతూ ఆర్డర్స్ డెలివరీ చేసేవాడు. ‘అద్దెకు తీసుకునే అవకాశం ఉన్నప్పుడు సెకండ్ హ్యాండ్, థర్డ్‌హ్యాండ్ నాసిరకం వస్తువులు మీకేలా?’ అనేది తన నినాదం అయింది. రెండు నెలల తరువాత డెలివరీ బాయ్‌ని నియమించుకున్నాడు. రెంటల్‌కు మార్కెట్ పెద్దగా లేకపోవడం, డ్యామేజీ...మొదలైన కారణాలతో ‘మెష్’కు టాటా చెప్పాడు. ఆ తరువాత ‘కార్ అండ్ బైక్’ రెంటల్ బిజినెస్‌లోకి వచ్చాడు. రోజుకు 20 నుంచి 30 వరకు ఆర్డర్లు వచ్చేవి. యాక్సిడెంట్స్ వల్ల వచ్చే నష్టాలు, కార్ల నిర్వాహణ కష్టం కావడంతో ఈ వ్యాపారానికి కూడా ‘బైబై’ చెప్పాడు. ఆ తరువాత ‘ఫర్నిచర్ రెంటల్’ బిజినెస్‌లోకి దిగాడు. ఇది కూడా నిరాశపరిచింది. ఆగిపోయాడు... ఆలోచించాడు... ‘చేసింది చాలు ఇక రాజస్థాన్‌కు వెళ్లిపోదాం’ అనుకోలేదు. పోయిన చోటే వెదుక్కోవాలి అంటారు కదా! ఆగిపోయాడు. ఆలోచించాడు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘బై–నౌ–పే–లాటర్’ (బీఎన్‌పీఎల్) వెంచర్ గుర్తుకు వచ్చింది. ఆ తరహాలోనే యువతరాన్ని లక్ష్యంగా పెట్టుకొని ‘స్లైస్ పే’ను స్టార్ట్ చేశాడు. ఇఏంఐ పేమెంట్స్ సర్వీస్‌గా చిన్న స్థాయిలో మొదలైన ‘స్లైస్’ ఇండియాలో చెప్పుకోదగ్గ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీగా ఎదిగి, అమెరికన్ మల్టీనేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ‘విసా’తో భాగస్వామ్యం కుదుర్చుకునే స్థాయికి ఎదిగింది. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) లైసెన్స్ తీసుకుంది. ‘స్లైస్’ స్టార్టప్ మెగా సక్సెస్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ‘గతంతో పోల్చితే యంగ్ జెనరేషన్‌కు క్రెడిట్ యాక్సెస్‌ను సులభతరం చేసింది స్లైస్’ అంటారు విశ్లేషకులు. మరి రాజన్‌ను అడిగి చూడండి. ఇలా అందంగా చెబుతాడు... ‘ఫెయిల్యూర్స్ గెలుపు పాఠాలు చెబుతాయి. అవి ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే’ ! చదవండి: Suman Kalyanpur: ఓడిన కోకిల... ఆమె గొంతు కూడా అచ్చు లతా గొంతులాగే.. -
Saloni Sacheti: బాన్సూలీ అంటే ఏమిటో తెలుసా.. ఈ నగలు ధరిస్తే!
సలోని లా కాలేజి విద్యార్థి. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వివిధ మారుమూల ప్రాంత వాసులను కలిసే అవకాశం వచ్చింది. వచ్చామా, పని చూసుకుని వెళ్లామా అనుకోలేదు సలోని. తన ఇంటర్న్‌షిప్‌తోపాటు పర్యటిస్తోన్న గ్రామాల్లో.. ముఖ్యంగా గిరిజనుల ఆర్థికస్థితిగతులు, జీవన శైలి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుంది. వీరికోసం ఏదైనా చేసి మంచి జీవితం ఇవ్వాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఐదుగురు మహిళలతో కలిసి వెదురుతో జ్యూవెలరీని తయారు చేయించడం మొదలు పెట్టింది. ఈ వెదురు నగలు అందంగా ఆకర్షణీయంగా ఉండడంతో విక్రయాలు బాగానే జరిగేవి. గిరిపుత్రికలకు శిక్షణ ఇస్తున్న సలోని అలా 13 నెలలు గడిచిపోయాక సలోని ప్రాజెక్టు వర్క్ పూర్తయింది. దీంతో తన సొంత ఊరు వెళ్లడం, ఇంట్లో వాళ్లు పెళ్లి చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. కానీ వెదురుతో జ్యూవెలరీ తయారు చేస్తూ ఉపాధి పొందవచ్చని గ్రహించిన గిరిజన మహిళలు .. తమ జ్యూవెలరీ వర్క్‌ను మరింత ముందుకు తీసుకెళ్లమని సలోనిని అడగడంతో.. సలోనికి మళ్లీ రంగంలో దిగక తప్పలేదు. వెంటనే ‘బాన్సూలి’ పేరిట ఓ స్టార్టప్‌ను ప్రారంభించి.. గిరిజన మహిళలు సొంత ఊరు వదిలి, వలస వెళ్లకుండా అక్కడే ఆనందంగా, ఆర్థిక భరోసాతో జీవించేలా ఉపాధి కల్పిస్తోంది. అల్వార్ అమ్మాయి రాజస్థాన్‌లోని అల్వార్‌లో మార్వారి జైన్ కుటుంబంలో జన్మించింది సలోని సఛేతి. స్కూలు విద్యాభ్యాసం పూర్తయ్యాక ఢిల్లీ యూనివర్సిటీలో బిఏ హానర్స్ ఫిలాసఫీ చేసింది. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే సలోని కాలేజీలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేది. డిగ్రీలో బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా అందుకుంది. బిఏ తరువాత బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎల్ఎల్బీలో చేరింది. ఎల్ఎల్బీ ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా గుజరాత్‌లోని డ్యాంగ్ జిల్లాలో వివిధ గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకునేది. ఈ క్రమంలోనే గిరిజన ప్రాంతాలను పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు ఉపాధిలేక పేదరికంతో అల్లాడడం చూసింది. పొట్టచేతబట్టుకుని వేరే ప్రాంతాలకు వలసవెళ్తున్న వారి దయనీయ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయి 2009లో ‘బాన్ సూలి’ అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. బాన్సూలీ అంటే బాన్ అంటే వెదురు. సూలీ అంటే నగలు బాన్సూలీ అంటే నగల నమూనా అని అర్థం. బాన్సూలీ ద్వారా డ్యాంగ్ జిల్లా గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఇక్కడ అధికంగా దొరికే వెదరును జూవెలరీ తయారీలో వినియోగించడం విశేషం. సమకాలిన ఫ్యాషన్‌కు అద్దం పట్టేలా వెదురుకు రాళ్లు, రత్నాలు, పూసలు జోడించి జ్యూవెలరీని తయారు చేస్తున్నారు. ఎక్కువ బరువు లేకుండా కేవలం ఏడు నుంచి పది గ్రాముల్లోపే ఆకర్షణీయమైన ఆభరణాలను రూపొందించి విక్రయిస్తున్నారు. తొలినాళ్లలో ఆర్యా, మిమనాస, ద్యుతి, బోగన్ విలియ డిజైన్లను రూపొందించగా, ప్రస్తుతం రెండువందలకు పైగా విభిన్న రకాల డిజైన్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటిలో జ్యూవెలరీతోపాటు లాప్టాప్ స్టాండ్స్, లైట్ స్టాండ్స్, రాఖీలు, దియాలు, కిచెన్, గృహాలంకరణ వస్తువులు కూడా ఉన్నాయి. ప్రారంభంలో బాన్సూలీ డిజైన్లను... ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పేజీలు క్రియేట్ చేసి వాటిల్లో వీరి సరికొత్త వెదురు జ్యూవెలరిని అప్లోడ్ చేసేవాళ్లు. అంతేగాక వివిధ నగరాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేసి వెదురు నగలను ప్రదర్శించేవారు. వీటికి మంచి స్పందన రావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కొరియర్ కంపెనీలతో కలిసి బాన్సూలీ జ్యూవెలరినీ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం బాన్సూలీ పదిహేనులక్షల టర్నోవర్‌తో విజయవంతంగా నడుస్తోంది. దీని ద్వారా దాదాపు నలభై మంది గిరిజన మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఫోర్బ్స్ జాబితాలో... బాన్సూలీ ఉత్పత్తుల విక్రయాలు ఆశించిన దానికంటే అధికంగా జరగడంతో అనేక సంస్థలు సలోని కృషికి గుర్తింపుగా వివిధ అవార్డులతో సత్కరించాయి. ఈ ఏడాది ఫోర్బ్స్ ప్రకటించిన ‘అండర్–30’ జాబితాలో సలోని పేరు ఉండడం విశేషం. ఇవేగాక 3ఎమ్ సీఐఐ ఇన్నోవేటర్ ఛాలెంజ్ అవార్డు, ఎన్ఐఆర్డీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి ‘‘బెస్ట్ స్టార్టప్ అవార్డు’’, టాప్ 18 సోషల్ ఇన్నోవేటర్, సోషల్ సెక్టార్లో ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ అవార్డులను దక్కించుకుంది. ఒక్క గుజరాత్లోనేగాక వెదురు అధికంగా లభ్యమయ్యే ప్రాంతాల్లో బాన్సూలిని విస్తరించనున్నట్లు సలోని చెబుతోంది. చదవండి: Humans Of Patuli: కొత్త చీరలు కొని డొనేట్ చేస్తున్నారు.. ఎందుకంటే.. -
ట్రిపుల్ తలాక్: ఆ వెంటనే మామ గ్యాంగ్‌రేప్
జైపూర్: రాజస్థాన్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. మామ, భర్త సోదరుడితో కలిసి కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం అల్వార్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. రాజస్ధాన్ ఆల్వార్‌కు చెందిన మహిళ(25)కు తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పిన అనంతరం.. బాధితురాలి మామ(భర్త తండ్రి)లోని మృగాడు బయటికి వచ్చాడు. కొడుకు విడాకులు చెప్పిన మరుక్షణమే తమ్ముడితో కలిసి కొడలిపై లైంగిక దాడికి పాల్పడి పైశాచిక ఆనందాన్ని పొందాడు ఆ ఉన్మాది. మరుసటి రోజు పుట్టింటికి వెళ్లిన బాధితురాలు తండ్రికి జరిగిన ఘటన గురించి చేప్పింది. తండ్రితో కలిసి బాధిత మహిళ సోమవారం భివాండి మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళకు గత శుక్రవారం తన భర్త ట్రిపుల్ తలాక్ చెప్పిన కొద్ది గంటలకే.. అతని అన్న తనపై దాడి చేశాడని, అంతేకాక తన మామయ్యతో పాటు అతని తమ్ముడు లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారం కింద కేసు నమోదు చేసుకుని అమెను వైద్య పరీక్షలు నిమత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ.. బాధిత మహిళ ఫిర్యాదుతో ట్రిపుల్ తలాక్, అత్యాచారం కేసు కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని, ప్రస్తుతం బాధితురాలిని వైద్యపరీక్షల కోసం హస్సీటల్కు పంపించామని పోలీసులు తెలిపారు. అయితే ముస్లిం వర్గానికి చెందిన భర్త తన భార్యకు నోటి మాటగా గానీ, రాత ద్వారా గానీ, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా లేదా ఇంకేరకంగానైనా ‘తలాక్’ను చెప్పడం అక్రమం. దీనిని ముస్లిం మహిళ వివాహ భద్రత చట్టం–2019 (యాక్ట్ నంబర్ 20 ఆఫ్ 2019) చాప్టర్–2లో పొందుపరచబడింది. ఎవరైనా ముస్లిం భర్త ‘తలాక్’ పదాన్ని అతని భార్యపై ప్రయోగిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. -
పెహ్లూ ఖాన్ కేసులో న్యాయం ఫెయిల్?
సాక్షి, న్యూఢిల్లీ : నాడు దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన పెహ్లూఖాన్ మూక హత్య కేసులో ఆరుగురు నిందితులు నిర్దోషులుగా విడుదలవడం అంతే సంచలనం సృష్టించింది. 2017, ఏప్రిల్ నెలలో రాజస్థాన్‌లో అల్వార్ ప్రాంతంలో పాలవ్యాపారి పెహ్లూ ఖాన్ (55)ను ఆవులను కబేళాకు తరలిస్తున్నాడనే అనుమానంపై బజరంగ్ దళ్, బీజేపీకి చెందిన కార్యకర్తలు దాడి చేసి చితకబాదారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన పెహ్లూఖాన్ కొన్ని రోజుల తర్వాత మరణించారు. ఈ సంఘటనను పలువురు సెల్ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అప్పుడది వైరల్ కూడా అయింది. పెహ్లూఖాన్ నుంచి పోలీసులు మరణ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఈ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులను అల్వార్ జిల్లా జడ్జీ బుధవారం నాడు విడుదల చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వమే ఉంది. ప్రభుత్వం ఒత్తిడికి లొంగిపోయిన రాష్ట్ర పోలీసులు కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించి ఉండవచ్చు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమి చేసినట్లు. మూక హత్యలను తీవ్రంగా పరిగణిస్తామని, ముఖ్యంగా గోవుల పేరిట జరుగుతున్న ఘోరాలను కఠిన నేరాలుగా పరిగణిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అందులో భాగంగా మామూలు హత్యల్లా కాకుండా మూక హత్యలను తీవ్రంగా పరిగణిస్తామంటూ ఈ ఏడాది మొదట్లో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ బిల్లును కూడా తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం మరీ రాక్షసంగా ఉందంటూ హిందూత్వ శక్తులు విమర్శించాయి కూడా. ఇలాంటి నేరాలను అరికట్టాలంటే కొత్త చట్టాలేవీ అవసరం లేదని, పోలీసులు చిత్త శుద్ధితో పనిచేస్తే ఉన్న చట్టాలు కూడా సరిపోతాయని ఇప్పుడనిపిస్తోంది. మూక దాడిని చిత్రీకరించిన సెల్ఫోన్లను పోలీసులు సక్రమంగా స్వాధీనం చేసుకోలేదు. పెహ్లూ ఖాన్ మరణవాంగ్మూలాన్ని కూడా పోలీసులు సరిగ్గా రికార్డు చేయలేక పోయారు. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వీడియోలను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడంలో కూడా పోలీసులు విఫలమయ్యారు. ఇదంతా పోలీసుల నిర్లక్ష్యమని భావించలేం. నేరస్థుల పట్ల పోలీసులు చూపించిన సానుకుల వైఖరి. అప్పటి ప్రభుత్వం పట్ల వారు ప్రదర్శించిన గురు భక్తి. ఇప్పుడు ఈ కేసును పైకోర్టులో అప్పీల్ చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. తీర్పును పైకోర్టులో అప్పీల్ చేసినంత మాత్రాన న్యాయం జరుగుతుందని ఆశించలేం. పోలీసు విచారణలో ఎక్కడ పొరపాట్లు జరిగాయో గుర్తించి, మళ్లీ దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేయడం లాంటి చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అదికూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది. -
మూకదాడి కేసులో వారంతా నిర్దోషులే
జైపూర్: పెహ్లూఖాన్ మూకదాడి కేసులో ఆరుగురు నిందితులనూ ఆల్వార్ కోర్టు బుధవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఆవులను తరలిస్తున్నారన్న కారణంతో పెహ్లూఖాన్ (55) అతని కుమారులపై రెండేళ్ల క్రితం మూకదాడి చోటు చేసుకోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెహ్లూఖాన్ చనిపోయారు. ఈ కేసులో నిందితులైన ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేస్తామని రాజస్తాన్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ అన్నారు. తీర్పుకు సంబంధించిన పత్రాలు ఇంకా రాలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది యోగేంద్ర ఖటనా తెలిపారు. కోర్టు తీర్పుతో తాము సంతోషంగా లేమని పెహ్లూఖాన్ కుమారుడు ఇర్షాద్ ఖాన్ అన్నారు. పైకోర్టులో అయినా తమకు న్యాయం అందుతుందని భావిస్తున్నట్లు బాధితుల తరఫు న్యాయవాది ఖాసిం ఖాన్ తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత గులాబ్‌చాంద్ కటారియా మాట్లాడుతూ ఘటన జరిగినపుడు బీజేపీ ప్రభుత్వం తీసుకోదగ్గ అన్ని చర్యలు తీసుకుందన్నారు. కోర్టు నిర్దోషులుగా తీర్పునిచ్చిన వారిలో విపిన్ యాదవ్, రవీంధ్ర కుమార్, కలురామ్, దయానంద్, యోగేశ్ కుమార్, భీమ్ రాతిలు ఉన్నారు. ఈ కేసులో మరో ముగ్గురు మైనర్ నిందితులు ఉన్నారు. -
గాల్లో గిరగిరా తిరిగిన చాపర్..
-
గాల్లో గిరగిరా తిరిగిన ఎంపీ చాపర్
జైపూర్ : బీజేపీ ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టెకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పింది. వివరాల్లోకి వెళితే.. బాలక్‌నాథ్ ఆళ్వార్ నుంచి హెలికాఫ్టర్‌లో ప్రయాణమయ్యారు. అయితే చాపర్ టెకాఫ్ అవుతుండగా నియంత్రణ కోల్పోయింది. భూమికి కొద్ది ఎత్తులోనే గాల్లో గిరగిరా తిరిగింది. దీంతో అక్కడ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చాపర్ ఎక్కడ కూలిపోతుందనే భయంతో అరవడం ప్రారంభించారు. కానీ పైలట్ చాకచాక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత కొద్దిసేపటికే చాపర్ సరైన దిశలో ప్రయాణించిది. ఈ భయానక పరిస్థితి నుంచి బాలక్‌నాథ్ క్షేమంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్వార్ నుంచి బాలక్‌నాథ్ ఎంపీగా విజయం సాధించారు. ఆయనకు మొత్తంగా 7.6 లక్షల ఓట్లు వచ్చాయి. -
అతని మీదే ఉల్టా చార్జ్‌షీట్ వేశారు!
న్యూఢిల్లీ: గో రక్షకుల కిరాకత మూక దాడిలో మృతి చెందిన పెహ్లూ ఖాన్‌కు వ్యతిరేకంగా రాజస్థాన్ పోలీసులు గురువారం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. జంతువధ, జంతు తరలింపు నిషేధ చట్టంలోని సెక్షన్ 5,8, 9ల కింద పెహ్లూ ఖాన్, అతని కొడుకులపై ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అభియోగాలు నమోదు చేశారు. 2017 ఏప్రిల్ 1వ తేదీన అల్వార్‌లో పెహ్లూ ఖాన్, అతని కొడుకులు ఓ వాహనంలో ఆవులను తరలిస్తుండగా.. అతను ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడనే అనుమానంతో గోరక్షకులు కిరాతక చర్యకు దిగారు. వారి వాహనాన్ని అడ్డుకొని.. వారిపై దాడి చేశారు. వృద్ధుడు అన్న కనికరం చూపకుండా గోరక్షకులు అతన్ని చితకబాదడంతో.. రెండురోజుల తర్వాత పెహ్లూ ఖాన్ ప్రాణలు విడిచారు. ఈ నేపథ్యంలో బాధితుడు, మృతుడైన పెహ్లూ ఖాన్‌కు వ్యతిరేకంగానే చార్జిషీట్ దాఖలు చేయడంతో పోలీసులు యూటర్న్ తీసుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ‘గత బీజేపీ ప్రభుత్వం హయాంలో ఈ కేసు విచారణ జరిగింది. ఆ విచారణ అనుగుణంగానే ఇప్పుడు చార్జిషీట్ వేశారు. కేసు విచారణలో ఏమైనా వివక్షలు, అవకతవకలు ఉంటే.. కేసును మళ్లీ పునర్విచారణ జరిపిస్తాం’ అని తెలిపారు. పెహ్లూ ఖాన్ కొడుకు ఇర్షాద్ (25) మాట్లాడుతూ..‘గో రక్షకుల దాడిలో మా నాన్నను కోల్పోయాం. ఇప్పుడు మామీదే స్మగ్లర్లుగా చార్జ్‌షీట్ వేశారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ కేసును సమీక్షించి.. మాపై కేసును ఎత్తివేస్తారని భావించాం. ప్రభుత్వం మారడంతో న్యాయం జరుగుతుందని ఆశించాం. కానీ అలా జరగడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఏసీ కోచ్‌లో మహిళ దారుణ హత్య..!
జైపూర్ : ఆళ్వార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నఇండోర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకున్న దుండగులు అనంతరం ఆమెను హత్యచేసి పరారయ్యారు. వివరాలు.. ఆళ్వార్‌కు చెందిన అంజు యాదవ్, భర్త జితేంద్ర యాదవ్, రెండేళ్ల కుమారుడితో కలిసి ఆదివారం రాత్రి రైలు ప్రయాణం చేస్తోంది. కుమారుడితో కలిసి ఆమె 25వ బెర్త్‌పైన నిద్రించగా.. జితేంద్ర 28వ బెర్త్‌పైన నిద్రిస్తున్నాడు. రాత్రి 2.30 గంటల సమయంలో వారి కుమారుడు ఏడ్వడవంతో జితేంద్ర అక్కడికి వచ్చి చూడగా.. అంజు లేదు. దీంతో బోగిలోని వాష్‌రూమ్‌కు వెళ్లి చూడగా.. ఆమె శవమై కనిపించింది. ట్రైన్ గార్డుని సంప్రదించడానికి ప్రయత్నించగా వీలుపడలేదు. దీంతో చైన్‌లాగి రైలుని ఆపాడు. ఘటనస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు.. మృతదేహాన్ని చిత్తోర్ఘర్ పోలీస్‌స్టేషన్‌కు అక్కడి నుంచి పోస్టుమార్టంకు తరలించారు. ‘నా కొడుకు ఏడుపు విని నిద్రలేచాను. అక్కడికి వెళ్లి చూడగా అంజు లేదు. వాష్‌రూమ్‌కు వెళ్లి చూడగా.. చనిపోయి ఉంది. దుప్పట్టాతో ఆమె మెడకు ఉరి బిగించి ఎవరో హత్య చేశారు. ఒంటిపై ఉన్న నగలు దోచుకెళ్లారు’ అని జితేంత్ర కన్నీరుమున్నీరయ్యాడు. అంజు ఒంటిపై ఉన్న నగల్ని దోచుకున్న దొంగలు అనంతరం ఆమెను హతమార్చి ఉంటారని చిత్తోర్ఘర్ ఎస్ఐ అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహంపై గాయాలున్నాయని తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగతుతోందని చెప్పారు. -
ఆ బాధితురాలికి పోలీస్ ఉద్యోగం
జైపూర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్వార్ గ్యాంగ్‌రేప్ కేసు బాధితురాలికి రాజస్తాన్ ప్రభుత్వం పోలీస్ శాఖ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. గత నెలలో రాజస్తాన్‌లోని థనగాజి-ఆల్వార్ బైపాస్ రోడ్డు వద్ద బైక్‌పై వెళుతున్న దంపతులను అడ్డగించిన ఐదుగురు దుండగులు.. వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి భర్త ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మే 2న స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. మే 4న ఈ జుగుప్సాకరమైన ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దుండగుల్లోని ఒకరు ఈ దుశ్చర్యను తన మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అధికార, ప్రతిపక్షాలు మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. ప్రధాని నరేంద్రమోదీ, బీఎస్సీ ఛీఫ్ మాయావతి, ప్రముఖులంతా ఈ ఘటనను ఖండించారు. రాజకీయంగా దుమారం రేగంతో పోలీసులు సైతం వేగంగా స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావించగా.. బాధితురాలు పోలీసు శాఖలో పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. గ్యాంగ్ రేప్‌లకు పాల్పడే దుండగుల తాట తీస్తానని తెలపడంతో రాజస్తాన్ ప్రభుత్వం ఆ దిశగా అవకాశం కల్పిస్తూ.. బాధితురాలికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. -
‘రాజకీయం చేయం.. న్యాయం చేస్తాం’
జైపూర్ : రాజస్తాన్‌లోని ఆల్వార్‌లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గురువారం పరామర్శించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ దుర్ఘటనపై నాకు సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌తో మాట్లాడాను. ఈ విషయంలో నేను ఎలాంటి రాజకీయాలు చేయాలని అనుకోవడం లేదు. బాధితురాలికి తప్పక న్యాయం చేస్తాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. అయితే ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్ఘటనను తొక్కిపెట్టింది. బాధితురాలు దళిత మహిళ కావడంతో జరిగిందేదో జరిగిపోయింది అంటోంది’ అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై మాయావతి మొసలి కన్నీరు కారుస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ఉపసంహరిస్తారా అని మోదీ.. మాయావతిని ప్రశ్నించారు. గత నెల 26న ఆల్వార్‌లో బైక్‌పై వెళ్తున్న జంటను ఓ ఐదుగురు వ్యక్తులు అడ్డగించి.. భర్తను గాయపరచి.. భార్యపై అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలు దళిత మహిళ కావడంతో ఈ ఘటనపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. -
మాయావతికి మోదీ చురకలు..!
లక్నో : బీఎస్పీ చీఫ్ మాయావతికి ప్రధాని నరేంద్ర మోదీ చురకలంటించారు. ఆళ్వార్ గ్యాంగ్‌రేప్‌పై మాయావతి మొసలి కన్నీరు కార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, మహిళలకు రక్షణ లేదంటూ స్పీచ్‌లు దంచికొడుతున్న బీఎస్పీ అధినేత రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. ఓ పక్క అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి మద్దతునిస్తూ.. మరోపక్క కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం మాయావతికే చెల్లిందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్, డియోరాలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక కాంగ్రెస్ చీఫ్ తరచూ న్యాయ్, న్యాయ్, న్యాయ్ అంటూ స్మరిస్తారని, మరి పట్టపగలే మహిళపై అత్యాచారం జరిగితే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జరిగిందేదో జరిగిపోయిందనే తీరుగా రాజస్తాన్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. (చదవండి : భర్త కళ్లెదుటే దారుణం..!) కాగా, గత నెల 26న భర్తతో కలిసి బైక్‌పై వెళ్తున్న ఓ దళిత మహిళపై ఐదుగురు కామాందులు దాడి చేసి అకృత్యానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులను బెదిరింపులకు గురిచేస్తోందని మాయావతి శనివారం విమర్శించారు. ఆళ్వార్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగనుండటంతో నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దళితులు అయినందునే న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు కలగజేసుకుని కేసును విచారించాలని, నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుందా..!
లక్నో : రాజస్థాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో ఏప్రిల్ 26న దళిత మహిళపై జరిగిన అత్యాచార ఘటనను అణచివేసేందుకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని బీఎస్పీ చీఫ్ మాయావతి విమర్శలు గుప్పించారు. ఐదుగురు కీచకులు ఓ మహిళపై అకృత్యానికి పాల్పడితే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బాధిత కుంటుంబాన్ని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పబ్బం కోసం కాంగ్రెస్ నిందితులను వెనకేసుకొస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బాధితురాలికి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని, ఘటన వివరాలను సుమోటాగా స్వీకరించి సుప్రీం కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. (చదవండి : భర్త కళ్లెదుటే దారుణం..!) ఇక రాష్ట్రంలో ఓ పక్క ఎన్నికలు జరుగుతుండగా.. మరోపక్క పట్టపగలే మహిళలకు రక్షణ లేకుండా పోతోందని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఇవేవీ కనిపించవా అని అన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాజకీయ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోవడం ఈసీని ప్రశ్నించారు. మహిళల గౌరవానికి భంగం కలిగే విధంగా అసభ్యంగా మాట్లాడే పొలిటీషన్స్ వ్యాఖ్యల్ని సుమోటాగా స్వీకరించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక అంబేద్కర్ పేరుతో పుట్టుకొచ్చిన కొన్ని సేవా సంస్థలు కాంగ్రెస్, బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని, అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని బీఎస్పీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. -
‘నా ఓటు ఒక్క రక్బార్ ఖాన్‌ను అయినా కాపాడుతుందా?’
చంఢీగడ్ : ప్రంపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సార్వత్రిక ఎన్నికలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. మోదీ హయాంలో ఉగ్రవాదం, నక్సలిజం తగ్గింది అంటూ బీజేపీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. మరి దేశం లోపల పెరిగిన హింస, అసంతృప్తి మాటేంటి అంటున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశ వ్యాప్తంగా మూక దాడులు పెరిగిపోయాయి. గో రక్షణ పేరిట దేశ వ్యాప్తంగా ముస్లింల మీద లెక్కలేనన్ని దాడులు జరిగాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గో రక్షణ పేరిట జరిగే మూక దాడుల గురించి తలచుకోగానే టక్కున గుర్తుకు వచ్చేది ఉత్తరప్రదేశ్ దాద్రీలో జరిగిన సంఘటన. మహ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి ఆవును చంపి.. మాంసాన్ని విక్రయిస్తున్నారనే అనుమానంతో కొందరు హిందూ కార్యకర్తలు అతని మీద దాడి చేసి చంపేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇలాంటిదే మరో సంఘటన రాజస్తాన్ ఆల్వార్‌లో కూడా చోటు చేసుకుంది. ఈ దాడిలో 9మంది మరణించారు. ఈ దాడిలో కుటుంబ పెద్దలను కోల్పోయిన రెండు హరియాణా కుటుంబాల ప్రస్తుత పరిస్థితి గురించి.. ఈ ఎన్నికల్లో వారు ఎవరికి ఓటు వేయాలని భావిస్తున్నారు వంటి అంశాల గురించి వారి మాటల్లోనే.. హరియాణాలోని నూహ్ జిల్లాకు 20 కిలోమీటర్ల దూరంలో రక్బార్, పిహ్లూ కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరి ప్రధాన జీవనాధారం పశుపోషణ. ఆవులను పెంచి.. తద్వారా లభించే పాడిని అమ్ముకుని కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు. ఈ క్రమంలో పశువులను కొనుగోలు చేసేందుకు మరి కొందరితో కలిసి రాజస్తాన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు గో మాంసాన్ని అమ్ముతున్నారనే అనుమానంతో వీరి మీద దాడి చేశారు. ఈ దాడిలో రక్బార్, పిహ్లూలు కూడా మరణించారు. దాంతో ఈ రెండు కుటుంబాలు కుప్పకూలిపోయాయి. రక్బార్కు ఏకంగా ఏడుగురు సంతానం. వారి పోషణ భారం అంతా రక్బార్ భార్య ఆమినా మీద పడింది. ఓ వైపు భర్త చనిపోయిన దుఃఖం.. మరోవైపు కుటుంబ పోషణ ఆమినాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే విధికి ఆ కుటుంబం మీద ఇంకా పగ తీరినట్టు లేదు. 7మంది సంతానం.. భార్య మంచానికే పరిమితం... రక్బార్ మరణించిన నాలుగు నెలలకే దురదృష్టం యాక్సిడెంట్ రూపంలో ఆమినాను వెంటాడింది. ఈ ప్రమాదంలో ఆమినా వెన్నెముక పూర్తిగా దెబ్బతింది. దాంతో ఆమె పూర్తిగా మంచానికే పరిమితమయ్యింది. ఆఖరుకి మలమూత్ర విసర్జనకు కూడా లేవలేని పరిస్థితి ఆమినాది. ప్రస్తుతం ఆమినా అమ్మగారింట్లో ఉంది. ఈ విషయం గురించి ఆమినా తల్లి కరిమాన్ మాట్లాడుతూ.. ‘ఆ రోజు జరిగిన దారుణంలో నా అల్లుడితో పాటు మరో ఎనిమిది మంది చనిపోయారు. నా కూతురు సగం చచ్చిపోయింది. అంటే ఈ దాడిలో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదిన్నర. వైద్యం కోసం ఆమినాను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లడం చాలా ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం రెండు పూటలా తినడానికే గతి లేదు.. ఇక వైద్యులు చెప్పిన మందులు, ఆహారం ఇవ్వడం మా తరం కాదంటు’న్నారు కరీమాన్. ఈ మూక హత్యలపై ప్రస్తుతం ఆల్వార్ కోర్టులో కేసు నడుస్తుంది. అయితే ఎన్ని ఇబ్బందుల తలెత్తిప్పటికి కూడా కేసును మాత్రం వాపసు తీసుకోమంటున్నారు ఆమినా, ఆమె తల్లి కరిమాన్. ఈ క్రమంలో కొందరు సామాజిక కార్యకర్తలు ఆమినా కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఆమినాకు పెన్షన్‌తో పాటు ఈ కుటుంబానికి బీపీఎల్ కార్డ్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ పోషణ భారం అంతా పెద్ద కుమార్తె మీదనే పడిందంటున్నారు ఆమినా. ఆమె పేరు షాహిలా అని.. ప్రస్తుతం తమ అమ్మగారింటికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో పశువులను మేపుతూ కుటుంబానికి ఆధారంగా నిలిచిందన్నారు. తనను ఇక్కడకు పిలవాలని అనుకుంటాము. కానీ రక్షణ గురించి ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాం అన్నారు. ముస్లిం అనే మా నాన్నను చంపారు.. రక్బార్ ఖాన్‌తో పాటు మరో ఎనిమిది మంది మీద దాడి చేశారని చెప్పుకున్నాం కదా. ఆనాటి దాడిలో గాయపడి మరణించిన వారిలో పిహ్లూ కూడా ఉన్నాడు. ఈ విషయం గురించి పిహ్లూ కొడుకు మాట్లాడుతూ.. ‘మా నాన్న, నేను మరి కొందరం రాజస్తాన్‌లోని సంతకు వెళ్లి పశువులు బేరం చేశాము. అందుకు సంబంధించిన రశీదులు కూడా మా దగ్గర ఉన్నాయి. పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాం. ఆ సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి మా మీద దాడి చేశారు. మా దగ్గర ఉన్న రశీదులను చింపి వేశారు. మేం ఆవులను చంపుతున్నామనే అనుమానంతో మా మీద దాడి చేయలేదు. మేం ముస్లింలం కాబట్టే దాడి చేశారు. ఎందుకంటే ఈ ఘటనలలో వారు మేం ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ని ఏం చేయలేదు. కారణం అతడు హిందువు.. అతని పేరు అర్జున్’ అని చెప్పుకొచ్చాడు. అంతేకాక ‘ప్రస్తుతం కోర్టు ఖర్చులకు, కుటుంబ పోషణకు నెలకు దాదాపు రూ. 30 వేలు ఖర్చవతున్నాయి. కానీ నా సోదరుడు నెలంతా కూలి పనికి వెళ్తే మాకు దక్కుతుంది కేవలం ఏడు వేల రూపాయలే. ఈ సొమ్మును కూడా అధికభాగం కేసు కోసమే వినియోగిస్తున్నామ’ని చెప్పుకొచ్చారు. అంతేకాక ‘ప్రస్తుతం మా ప్రాంతంలో చాలా మంది ఆవులను పెంచాలంటనే భయపడుతున్నారు. దాని బదులు గొర్రెల్ని, మేకల్ని మేపడం మంచిదని భావిస్తున్నారు. ఆవుల్ని మేపితే ఏదో ఒక రోజు మేం కూడా చనిపోతాం అనే భయం ప్రస్తుతం ప్రతి ముస్లింలో ఉందన్నా’డు. ఏ పార్టీకి ఓటు వేయ్యాలి... ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు అప్పుడప్పుడు మా ఇళ్లకు వస్తుంటారు. ఈ కేసులో మేం తప్పక విజయం సాధిస్తామని చాలా ధైర్యంగా చెబుతారు. ఎందుకంటే వారి తరఫున బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా ఉన్నారు. వారికి మద్దతు కూడా తెలిపాడు. కోర్టులోనే తేల్చుకుంటామని పేర్కొన్నాడు అని తెలిపారు. మరి ఈ ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేస్తారని ప్రశ్నించగా.. ‘మా ఓటు ఎంతమంది రక్బార్ ఖాన్, పిహ్లూలను కాపాడగల్గుతుందని ప్రశ్నించారు. ఆవులను, గెదేలను పెంచే వారి మీద ఎలాంటి దాడులు జరగనివ్వం అని హామీ ఇచ్చేవారికే మా ఓటు. కానీ ఇంతవరకూ ఎవరు మాకు అలాంటి హామీ ఇవ్వలేకపోయార’ని ఇరు కుటుంబ సభ్యులు వాపోయారు. -
‘నా మెడ పట్టి లాక్కెళ్లారు.. ఉరి తీయాలి’
జైపూర్ : రాజస్తాన్‌లోని ఆల్వార్‌లో ఓ వివాహితపై పట్టపగలు ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఈ దారుణం గత నెల 26న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్లో ఉన్న వివరాలు.. ‘గత నెల 26న నేను నా భర్తతో కలిసి వెళ్తున్నాను. ఆ సమయంలో కొందరు వ్యక్తులు మా బైక్‌ను అడ్డగించారు. నా మెడ పట్టి లాక్కెళ్లారు. నా భర్త కళ్ల ముందే నన్ను వివస్త్రగా మార్చి నాపై దారుణానికి ఒడిగట్టారు. ఈ గ్యాంగ్‌కు ఓ సభ్యుడు లీడర్‌గా వ్యవహరించాడు. వారి పైశాచికత్వం అంతటితో ఆగలేదు. ఈ ఘోరాన్ని వీడియో తీశారు. పోలీసులకు చెప్తే ఈ వీడియోను బయటపెట్టి మమ్మల్ని అల్లరి చేస్తామని బెదిరించడమే కాకుండా మా వద్ద నుంచి డబ్బులు కూడా డిమాండ్ చేశార’న్నారు. బాధితురాలి భర్త మాట్లాడుతూ.. ‘ఈ దారుణం నుంచి కోలుకోవడానికి మాకు సమయం పట్టింది. నా భార్య మెడ పట్టి లాక్కెళ్లిన వారికి ఉరి శిక్ష పడాలి. అప్పుడే నా భార్యకు కాస్త మనశ్శాంతి లభిస్తుంది. అయితే ఈ విషయం గురించి బయటకు తెలిస్తే.. మాకు అండగా నిలబడాల్సిన సమాజం.. నా భార్యనే అవమానిస్తుంది. దాంతో ఈ విషయం గురించి నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశాను. అయితే నేను గత నెల 30న ఫిర్యాదు చేస్తే.. వారు ఈ నెల 2న ఎఫ్ఐఆర్ నమోదు చేశార’ని తెలిపాడు. అంతేకాక ‘ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో కూడా నిందితులు మాకు ఫోన్ చేసి బెదిరించడం ప్రారంభించారు. దాని గురించి కూడా ఎస్పీతో చెప్పాను. ఆయన నిందితులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చార’ని బాధితురాలి భర్త తెలిపాడు. ‘మా ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం అధికారులంతా ఎన్నికల విధుల్లో విధుల్లో బిజీగా ఉన్నారు.. ఎలక్షన్లు ముగిసిన తర్వాత చర్యలు తీసుకుంటామ’ని ఎస్పీ తమతో చెప్పినట్లు బాధితురాలి భర్త వెల్లడించాడు. ఈ విషయం గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం స్టేషన్లో ముగ్గురు అధికారులు మాత్రమే ఉన్నారు. అయినప్పటికి ఈ కేసు గురించి దర్యాప్తు ప్రారంభించాము. నిందితుల్లో ఇద్దరిని చోటేలాల్, అశోక్‌గా గుర్తించాము. వారిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశామ’ని వెల్లడించారు. అయితే ఈ కేసు రాజస్తాన్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. నిర్భయ ఘటన కన్నా ఇది దారుణమైన సంఘటన అని బీజేపీ పేర్కొంది. అంతేకాక మహిళల భద్రత విషయంలో రాజస్తాన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించింది. ఈ ఘటన పట్ల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుండటమే కాక బాధితులు ఫిర్యాదు చేసినప్పటికి.. ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ప్రభుత్వం ఎస్పీని సస్పెండ్ చేయడమే కాక.. మహిళల రక్షణకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించింది. -
ఓ అజ్ఞాత విజ్ఞాని
చెన్నైలో లజ్ సెంటర్ నుంచి ఎల్డామ్స్ రోడ్డు వేవు నడుస్తున్నప్పుడు దారిలో చాలా ప్రసిద్ధ్దమైన అడ్రసులు. ఇంగ్లీషువారికాలంలోనే కోర్టుల్లో వారినే తన ఆంగ్లభాషా వైశిష్ట్యంతో అబ్బుర పరిచిన రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి హాలు తగుల్తుంది. అది దాటగానే అమృతాంజనం ఆఫీసు, పక్కన ఆంధ్రదేశ చరిత్రలో భాగమయిన శ్రీభాగ్ ఒడంబడిక జరిగిన శ్రీ భాగ్ బంగళా, తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి పార్కు. అయితే అటు వెళ్లేటప్పుడు ఇవేవీ గుర్తుకురావు. శాస్త్రిహాలుకి ముందుగా రోడ్డు పక్క రోడ్డుమీదే గుట్టగా పోసిన కొన్ని లక్షల పాతపుస్తకాల దుకాణం కనిపిస్తుంది. దీనికి గది, తాళాలు, పుస్తకాలకి రక్షణా ఏమీలేదు. ఆరుబయట– రోడ్డుమీదే పరిచిన దుకాణం. ఎండా, వానా, తుఫాన్, గాలి దుమారం ఏది వచ్చినా తట్టుకుంటూ గత అయిదు దశాబ్దాలుగా నడుస్తున్న సెకండ్ హ్యాండ్ దుకాణం. పుస్తకాలమీద పెద్ద టార్పాలిన్ కప్పి ఉంటుంది. ఆ గుట్ట ముందు – తపస్సు చేస్తున్నట్టు ఓ ముసలాయన కూర్చుంటాడు. అతని పేరు ఆళ్వార్. వొంటిమీద షర్టు లేదు. ఆయన పెరియార్ రామస్వామి నాయకర్ భక్తుడు. అందుకని తర్వాతి రోజుల్లో ఆయనలాగ గెడ్డం పెంచాలి. నగరంలో వేలాది మేధావులకు, విద్యార్థులకు, రచయితలకు ఆ గుట్ట ఆటపట్టు. ఎప్పుడూ ఆ గుట్ట చుట్టూ ఖరీదయిన దుస్తులు వేసుకున్న వారూ, మే«ధావులూ పుస్తకాలు తిరగేస్తూ కనిపిస్తారు. రోజర్స్ థెసారెస్ , పాపిలియాన్, షేక్సి ్పయర్ సమగ్ర రచన సర్వస్వం, థామస్ హార్డీ రచనలు –ఇలా వేటి గురించయినా చెప్పగలడు. ఇంకా వైద్యం, ఇంజనీరింగ్, అకౌంటెన్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – ఈ విభాగాలలో ఎన్నో అరుదయిన పుస్తకాలు దొరుకు తాయి .ముద్రణలో లేని పుస్తకమా? ఇదొక్కటే అడ్రసు. కస్టమర్లు తప్పిపోయిన పాతమిత్రుడిని కలిసినట్టు పుస్తకాలను కరుచుకువెళ్లడం అక్కడ తరచుగా కనిపించే దృశ్యం. విశేషమేమిటంటే ఐయ్యేయస్ çపరీక్షలకి వెళ్ళే గ్రాడ్యుయేట్లు మధుర, తిరుచ్చి వంటి సుదూరమయిన ప్రాంతాలనుంచి అరుదయిన పుస్తకాలకి ఇక్కడికి వస్తారు. ఈ 50 సంవత్సరాలలో ఆ పుస్తకాల గుట్టకి తరచు వచ్చే కొందరు మహానుభావుల పేర్లు – సుప్రసిద్ధులైన భారతీ దాసన్ ఆయన కస్టమర్. పుళమై పిత్తన్, ముత్తులింగం వంటి కవులు వతనుగా వచ్చే వారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచీ సెంథిల్, గౌండర్ మణి, ఎస్. వి. శేఖర్, చో రామస్వామి ఆయన సోదరుడు అంబి తరచు వచ్చేవారు. హీరో జయశంకర్ ఇక్కడ కూర్చుని టీ తాగి వెళ్లేవాడు కొన్ని రోజులు –ఇతను మైసూరు మహారాజా సామరాజ వొడయార్కీ, అప్పటి ముఖ్యమంత్రులు రామస్వామి రెడ్డియార్, అన్నాదురైకి పుస్తకాలు ఇచ్చి వచ్చేవాడు. ఇతని అసలు పేరు ఆర్. కె. నమ్మాళ్వార్. కాని అందరికీ అతను ఆళ్వార్. ఆళ్వార్ షాపు లజ్ దగ్గర పెద్ద బండగుర్తు. ఎప్పుడో 60 ఏళ్ల కిందట కడుపు పట్టుకుని విల్లుపురం దగ్గర వానియం పాలయం నుంచి చెన్నైలో దిగాడు ఆళ్వారు. 1950లో ఇక్కడ ఈ దుకాణానికి ప్రారంభోత్సవం చేశాడు. అప్పటి ముఖ్యమంత్రి –‘‘ఇక్కడ వ్యాపారం చేసుకోవయ్యా’’ అని అనుమతి ఇచ్చారు. ఆ మాట ఇనుపకవచంలాగా సంవత్సరాల తరబడి పోలీసుల బారిన పడకుండా కాపాడింది. రోడ్డుపక్క ఈ పుస్తకాల గుట్ట పోలీçసులకి కన్నెర్రే, ఈ మధ్య ఎవరో పోలీసులమంటూ వచ్చి కొన్ని వేల పుస్తకాలే పట్టుకుపోయారు. మళ్ళీ తిరిగి ఇస్తే ఒట్టు. ఈ పుస్తకాల వ్యాపారానికి ముందు ఆళ్వార్ నెప్ట్యూన్ స్టూడియోలో లైట్ బోయ్‌గా పనిచేశాడు. కొన్ని సినిమాల్లో నటించాడు – మనోహర, స్వర్గవాసల్, తిలివిషం మొదలైనవి. మరి ఈ లక్షల పుస్తకాలు ఆళ్వార్కి ఎలా చేరుతా యి? కనీసం 10 మంది ఇంటింటికీ తిరిగి పుస్తకాలను కొని తీసుకు వస్తారు. రమణన్ అనే అతను 17 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాడు. అతనికిప్పుడు 73 సంవత్సరాలు. ధనరాజ్ అనే కుర్రాడు పాతికేళ్లుగా ఈ పని చేస్తున్నాడు. ఇతని వ్యక్తిగత జీవితం ఇంకా ఆçసక్తికరం. వెనుక ఇంట్లో పని చేసే పనిమనిషి– ‘మేరీ’ని ఆళ్వార్ పెళ్లి చేసుకున్నాడు. ప్రేమా? అని మేరీని అడిగితే సిగ్గుపడింది. విచిత్రమేమిటంటే ఈ మతాతీత వివాహం పెద్దలు చేసినది! మేరీకి ఎప్పుడు పెళ్లయిందో గుర్తు లేదు. ఆ మాటకు వస్తే తన వయస్సు ఎంతో తెలీదు! వాళ్లకి నలుగురమ్మాయిలు. ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. ‘‘నేను విజ్ఞానాన్ని పంచుతానని అందరూ అంటారు. ఆ మాట ప్రభుత్వం అనుకుని నా వ్యాపారం సాగనిస్తే మేలు’’ అంటాడు ఆళ్వార్. ఈ మధ్య చాలాసార్లు అటువేపు వెళ్లాను. ఇప్పుడక్కడ పుస్తకాల గుట్టలేదు. ఆళ్వార్ లేడు. ఏమయింది? వారం రోజుల కిందట – తన 95వ యేట – ఆళ్వార్ కన్నుమూశాడు. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
ముస్లింను ప్రేమించాడని కొట్టి చంపారు!
జైపూర్ : ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని ఓ ముస్లింను కొట్టి చంపిన ఘటన మరవక ముందే రాజస్తాన్‌లో మరో మూక హత్య చోటుచేసుకుంది. బార్మర్‌లో ఓ దళిత యువకుడు ముస్లిం యువతిని ప్రేమిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపారు. కేత్‌రామ్ బీమ్(22) అనే యువకుడు మెహబూబ్ ఖాన్ ఇంట్లో కొద్ది రోజులుగా పనిచేస్తున్నాడు. ఈ తరుణంలో ఆ కుటుంబంలో ఉన్న ఓ యువతితో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇది కాస్త ప్రేమకు దారితీయడంతో ఆ యువతి కుటుంబ సభ్యులు అతన్ని పలుమార్లు హెచ్చరించారు. అయినా వినకపోవడంతో దారుణంగా కొట్టి చంపారు. గత శుక్రవారం హయత్‌ఖాన్, సదామ్ ఖాన్లు వారి పోలానికి రావాలని తన సోదరున్ని పిలిచినట్లు కేత్‌రామ్ సోదరుడు హరిరామ్ మీడియాకు తెలిపారు. అప్పటికే అక్కడ ఉన్న మరికొందరు అతని చేతులు కట్టేసి చచ్చే వరకు తన తమ్ముడిని చితకబాదారని ఆరోపించారు. శవాన్ని కొంత దూరం తీసుకెళ్లి పడేయడంతో మూడు రోజులనంతరం అతని డెడ్‌బాడీ దొరికిందన్నారు. ఇక పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో సైతం కేత్‌రామ్ కొట్టడం వల్లనే చనిపోయాడని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఓ వైపు దేశవ్యాప్తంగా మూకదాడులపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేత్‌రామ్ మృతి ఈ ఆందోళనలకు అగ్గిరాజేసినట్లైంది. మరోవైపు అల్వార్ జిల్లాలో చోటు చేసుకున్న మూక దాడిలో పోలీసుల నిర్లక్ష్యమే వల్లే బాధితుడు రక్బర్ ఖాన్ మృతి చెందినట్లు తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
ఆ టైమ్‌లో టీ బ్రేక్ అవసరమా..?
సాక్షి, న్యూఢిల్లీ : ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారనే అనుమానంతో అల్వార్‌లో 28 ఏళ్ల అక్రం ఖాన్‌పై అల్లరి మూకల దాడిపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు ఎదురవుతున్నాయి. మూకల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లడంలో చోటుచేసుకున్న జాప్యంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఆపద సమయంలో పోలీసులు టీ విరామం తీసుకోవడంపై విచారణకు ఆదేశించింది. మరోవైపు బాధితుడిని ఆస్పత్రికి తరలించడంలో జాప్యంపై రాజస్తాన్ పోలీసులు సైతం విచారణకు అత్యున్నత కమిటీని ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన లాలావండి గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంఘర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌కు బాధితుడిని తీసుకువెళ్లేందుకు పోలీసులకు మూడు గంటలు పైగా సమయం పట్టడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చావుబతుకుల్లో ఉన్న బాధితుడిని ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లడంతో.. అక్రం ఖాన్ ప్రాణాలు విడిచాడు. ఖాన్ తన స్నేహితుడు అస్లాంతో కలిసి హర్యానాలోని తమ గ్రామానికి రెండు ఆవులను తీసుకువెళుతుండగా, రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లా లాలావండి గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద వీరిపై మూక దాడి జరిగింది. ఈ ఘటనలో అక్రం ఖాన్ ప్రాణాలు విడువడంతో మూక హత్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత
జైపూర్ : రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా మండావర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధర్మ్‌పాల్ చౌదరీ గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరణించారు. తీవ్ర గుండె నొప్పితో గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చిక్సిత పొందుతూ మృతి చెందారు. భారతీయ జనతా పార్టీ నుంచి 2003లో మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ధర్మ్‌పాల్ ఆ తర్వాత 2008, 2014లో కూడా మండావర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన ధర్మ్‌పాల్, జాట్ల ఉద్యమ సమయంలో ముఖ్య భూమిక పోషించారు. 2016లో ఓ జర్నలిస్టును ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడుతున్న టేపు బయటపడ్డ విషయంలో వార్తల్లో నిలిచిని ధర్మ్‌పాల్, ఆ జర్నలిస్టు తాను చెప్పింన దాన్ని వక్రీకరించి వార్తను తప్పుగా రాసినందుకే అలా అన్నానని వివరణ ఇచ్చారు. -
అమానుషం.. కొడుకు పెట్టే హింస భరించలేక...
జైపూర్ : వృద్ధాప్యంలో ఉన్న తల్లికి సేవలు చేయటం ఆ కొడుకు భారమైపోయింది. అమానుషానికి తెగబడ్డాడు. ఇష్టం వచ్చినట్లు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కన్న కొడుకు పెట్టే హింసను కొన్ని రోజులు భరించిన తల్లి చివరకు ప్రాణాలు వదిలింది. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జోగేంద్ర చౌదరి స్థానికంగా ఓ స్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు . తండ్రి చనిపోవటంతో తల్లి కొడుకు జోగేంద్ర వద్దకు చేరింది. అయితే వయో భారం, పైగా ఈ మధ్యే పక్షవాతం సోకటంతో ఆమె సొంతగా పనులు చేసుకోలేకపోతోంది. దీంతో ఇంట్లో వాళ్ల సాయం తీసుకుంటోంది. ఈ క్రమంలో జోగేంద్రకు.. అతని భార్యకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్యపై కోపంతో జోగేంద్ర తల్లిని హింసించటం ప్రారంభించాడు. ఆ బాధలను భరించలేక తొమ్మిది రోజుల క్రితం ఆ కన్నతల్లి కన్నుమూసింది. అయితే ఆమె మనవడు మాత్రం జోగేంద్ర ఓరోజు తల్లిని హింసిస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో వైరల్ అయి చివరకు విషయం పోలీసుల దాకా చేరటంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అమానుషం.. కొడుకు పెట్టే హింస భరించలేక...
-
నిర్లక్ష్యం.. చెత్త కుప్పలో ఆధార్ కార్డులు
సాక్షి, రాజస్థాన్: అధికారుల నిర్లక్ష్యం ప్రజా సేవలకు ఎంత విఘాతం కలిగిస్తుందో మరోసారి బయటపడింది. అల్వార్ జిల్లాలోని ఓ చెత్తకుప్పలో వేల కొద్ది లెటర్లు, ఆధార్ కార్డులు దర్శనమిచ్చాయి. ఏడాదిగా వీటిని బట్వాడా చేయకుండా ఇలా పడేసినట్లు తెలుస్తోంది. గద్బసాయి అటవీ ప్రాంతంలోని డంప్ యార్డ్‌లో కొందరు వ్యక్తులు రెండు సంచులలో వీటిని తీసుకొచ్చి పడేశారు. అటుగా వెళ్తున్న కొందరు గ్రామస్థులు అది గమనించి థానా ఘజి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పోలీసులు సంచులను సోదా చేయగా వాటిలో 3000 వేల ఉత్తరాలు, 100కు పైగా ఆధార్ కార్డులు బయటపడ్డాయి. అందులోని లేఖలన్నీ సంఘనర్ గ్రామానికి చెందిన అడ్రస్‌లతో ఉన్నట్లు స్టేషన్ హెడ్ ఆఫీసర్ అమిత్ కుమార్ తెలిపారు. బట్వాడా చేయకుండా వీటిని పడేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన అన్నారు. లేఖలు, ఆధార్ కార్డులతోపాటు పెళ్లి శుభలేఖలు కూడా అందులో ఉన్నట్లు తెలుస్తోంది. సరిస్కా ప్రాంతం పక్కనే ఉండటంతో బహుశా ఆ పోస్టల్ కార్యాలయం నుంచే ఇవి వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. విషయాన్ని పోస్టల్ ఉన్నతాధికారులకు చేరవేశామని అమిత్ వెల్లడించారు. కాగా, ఘటనపై స్పందించేందుకు పోస్టల్ శాఖ అధికారులు నిరాకరించారు.