Andhra Pradesh cabinet
-
ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్రమంత్రిమండలి శుక్రవారం సమావేశమైంది. ఈ భేటీలో ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రిమండలి సమావేశంలో తీసుకున్నసచివాలయం పబ్లిసిటీ సెల్లో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మీడియాకు వెల్లడించారు. సంక్షేమ పథకాల షెడ్యూల్డ్... ► నవంబరు 7వ తేదీ..వైఎస్సార్ రైతు భరోసా. ►నవంబరు15.. భూపంపిణీ. ►నవంబరు 28.. విద్యాదీవెన. ►ఖరీప్ 2023–24 ధాన్యం సేకరణకు మార్క్‌ఫెడ్‌కు రూ.5వేల కోట్ల రుణ మంజూరుకు ప్రభుత్వం తరపున అవసరమైన గ్యారంటీ అందించేందుకు కేబినెట్ ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్‌ఆధ్వర్యంలో ఖరీప్ ధాన్యం సేకరణ. ►రాష్ట్రంలో వివిధ కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతినిస్తూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన గత నెల 30వ తేదీన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్టు సమావేశం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రిమండలి. ►రెండు పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలన్న ఎస్ఐపీబీ నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ►రహదారుల,భవనాలశాఖలో 467 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల, భవనాలశాఖ పరిధిలో గెస్ట్హోస్ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోనున్న ఆర్ అండ్ బిశాఖ. ►తూర్పుగోదావరి జిల్లా నల్లజెర్ల, గోపాలపురం, తాళ్లపూడి మండలాలతో కలిపి దేవరాపల్లిలో రవాణాశాఖకు చెందిన యూనిట్ ఆఫీసు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►ఈ కార్యాలయంలో అవసరమైన ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, ఒక హోంగార్డు నియామకానికి ఆమోదం. ►శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 6 మండలాలు (ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, రామగిరి, కనగానపల్లె, సీకే పల్లె)తో కలిపి రవాణాశాఖకు చెందిన యూనిట్ ఆఫీసు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం. ►ఒక మోటారు వెహికల్ ఇన్స్ఫెక్టర్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ ఇంజనీరు, ఇద్దరు సెక్యూర్టీ గార్డులు, ముగ్గురు హోంగార్డుల నియామకానికి కేబినెట్ ఆమోదం. జగనన్న సురక్ష కార్యక్రమంపై కేబినెట్‌కు వివరాలు అందించిన అధికారులు. ►ఇప్పటివరకూ 11710 క్యాంపులు నిర్వహించామని వెల్లడి. ►60 లక్షల మంది శిబిరాల వద్దకు వచ్చారని వెల్లడి ►6.4 కోట్ల మందికి ఇంటివద్దే వైద్య ర్యాపిడ్ పరీక్షలు. ►8,72,212 మందికి కంటి పరీక్షలు చేశామన్న అధికారులు. ►5,22,547 మందికి కంటి అద్దాలు ఇచ్చామన్న అధికారులు. ►11327 మందికి కంటి చికిత్సలు చేయిస్తున్నామన్న అధికారులు. ►జగనన్న సురక్ష కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందన్న మంత్రులు. ►వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి వైద్య సహాయం లభిస్తుందన్న మంత్రులు. ►ఈ కార్యక్రమాన్ని అభినందించిన కేబినెట్. వైద్య పరీక్షల్లో గుర్తించిన వారికి చికిత్స విషయంలో సమగ్రమైన ఫాలో అప్ చేయాలి: సీఎం జగన్ ►గతంలో ఆరోగ్య శ్రీ చికిత్సలు చేయించుకున్నవారు, శిబిరాల ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స అవసరమని భావించిన వారు, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారు. ►ఈ కేటగిరీలకు చెందినవారిపై ప్రత్యుక శ్రద్ధ వహించాలి. ►తీవ్రమైన రోగాలతో బాధపడుతున్నవారిని గుర్తించిన వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ►వారికి అవసరమైన తుదపరి చికిత్సలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందించాలి. ►ఆస్పత్రులకు వారు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వాలి. ►మందులు కూడా సకాలంలో వారికి అందించేలా చర్యలు తీసుకోవాలి. ►చికిత్సలు పూర్తయిన తర్వాతకూడా వారి ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ►జగనన్న సురక్ష శిబిరాలు బాగా జరిగేలా చూడాలని మంత్రులను ఆదేశం. ►శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు మంచి చికిత్స అందేలా చూడాలి. ►వారు ట్రీట్మెంట్ ముగించుకుని తిరిగి ఇంటి వచ్చాక వారికి మందులు అందేలా, తదుపరి చికిత్స అందించేలా చూడాలి. ►ఎవ్వరికీ మందులు అందలేదన్న మాట వినపడకూడదు. ఈ మందులన్నీ ఉచితంగా అందిస్తున్నాం. ►రిఫరెల్ వీడియో కాన్ఫరెన్స్ద్వారా లేదా ఆస్పత్రికి పంపించాలి ►ప్రయాణ ఖర్చులు కింద రూ.500 అందించాలి. ►దీంతోపాటు గ్రామాల్లో గతంలో తీవ్ర రోగాల బారినపడ్డ పేషెంట్లకు కూడా అండగా నిలవాలి. ►వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందించాలి. అవసరమైన పక్షంలో డాక్టర్లకు రిఫరెల్ కూడా చేసే బాధ్యతలను నిర్వర్తించాలి: సీఎం జగన్. ►గతంలో ఆరోగ్య శ్రీకింద చికిత్సలు చేయించుకున్న వారి ఆరోగ్య పరిస్థితులపై కూడా ఆరాతీయాలి. ►అవసరమనుకుంటే వారినికూడా రిఫరెల్కు పంపించాలి. వీరికీ చేయూత నివ్వాలి. ►ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమం. కచ్చితంగా దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ►అత్యంత ఖరీదైన మందులు కూడా ఉచితంగా అందించాలి. ►మంత్రులు అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. జనవరి 1 నుంచి ప్రతినెలా నాలుగు క్యాంపులు ప్రతి మండలంలో నిర్వహిస్తారు: సీఎం జగన్ ►నలుగురు స్పెషలిస్టు డాక్టర్లు కూడా ఇందులో పాల్గొంటారు. ►ప్రతి వారంలో ఒక మండలంలో ఒక గ్రామ సచివాలయంలో క్యాంపు నిర్వహిస్తారు. ►అందులోకూడా పైన చెప్పిన విధంగా రోగులపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ►ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఉధృతంగా ప్రచారం చేపట్టాలి. ►నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15వరకూ మరోసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. ►దిశ యాప్‌ను ఏ రకంగా డౌన్లోడ్ చేశామో, ఆరోగ్య శ్రీ యాప్‌నుకూడా డౌన్లోడ్ చేస్తాం. ►యాప్ ద్వారా ఎంపానెల్ ఆస్పత్రులు ఎక్కడున్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. ►దీనివల్ల సులభంగా ఆరోగ్య శ్రీ చికిత్సలు అందించవచ్చు. ►గ్రామాల్లో ఎక్కడా కూడా పౌష్టికాహార లోపంతోకాని, రక్తహీనతతో బాధపడేవారు కాని ఉండకూడదన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ►వారికి సరైన ఆహారం, మందులు అందిస్తున్నాం. ►ఈ కార్యక్రమంపైనాకూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. ►కంటి సమస్యలతో బాధపడేవారికి కూడా కంటి అద్దాలు ఇస్తున్నాం. మార్కాపురం మెడికల్ కాలేజీలో 21 పోస్టులతో నెఫ్రాలజీ డిపార్ట్మెంటు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. పలాస తరహాలో తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన కిడ్నీ పరిశోధనా కేంద్రం, సూపర్ స్పెషాలిటీఆసుపత్రి, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకూ మంత్రిమండలి ఆమోదం. ►పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాల్టీలో పురపాలకశాఖ భవన నిర్మాణానికి అవసరమైన స్ధలాన్ని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన, మెరుగైన విద్యను అందించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6790 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్ నియమించాలన్న పాఠశాల విద్యాశాఖ నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►6,790 ప్రభుత్వ స్కూళ్లలో ఫ్యూచర్ స్కిల్స్‌పై బోధనకోసం ఇంజినీరింగ్ కాలేజీల మ్యాపింగ్ . ►ట్యాబులు డిజిటల్ పరికరాలు, యాప్‌లు వినియోగంపై విద్యార్థులకు శిక్షణ దీని ఉద్దేశం. ►అలాగే ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో పెట్టే ఐఎఫ్‌పీ ప్యానెల్స్ వినియోగంపైనా వీరు శిక్షణ ఇస్తారు. ►ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే సరిదిద్దుతారు. ►పరికరాల వినియోగంపై టీచర్లనుంచి, విద్యార్థులనుంచి ఫీడ్ బ్యాక్ ఇస్తారు. ►వినియోగం తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారు ►సాంకేతికను వినియోగించుకుని విద్యార్థుల సమర్థతలో పెంచేలా చూస్తారు ►డేటా ప్రైవసీ, సెక్యూరిటీలపై తగిన చర్యలు తీసుకుంటారు. 50 ఎకరాల లోపు ఏపీఐఐసీ కేటాయించిన 285 భూకేటాయింపులకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►భారీ ప్రాజెక్టులకు వివిధ రకాల రాయితీలను కల్పిస్తూ.. స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదలనకు కేబినెట్ ఆమోదం. ►ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ బస్ అండ్ ట్రక్ కాంప్లెక్స్ , డీజిల్ బస్ రిట్రో ఫిటింగ్, బ్యాటరీ ఫ్యాక్ అసెంబుల్డ్ చేసే పెప్పర్ మోషన్ సంస్ధ. ►ఇది రూ.4,640 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 8080 మందికి ఉపాధి అందించనుంది. ►దీంతో పాటు ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకూ కేబినెట్ ఆమోదం. పరిశ్రమలకు భూ కేటాయింపుల విధానంలో మార్పుకు కేబినెట్ ఆమోదం. ►పరిశ్రమలకు మరింత అనుకూలత కోసం నిర్ణయం. ►లీజు విధానం స్థానే సేల్ డీడ్ విధానంలో కేటాయింపు ►పరిశ్రమలకోసం మాత్రమే ఆభూమిని వినియోగించేలా తగిన షరతులతో ఈ విధానం. ►పరిశ్రమలు పెట్టేవారికి ఆర్థిక సంస్థలనుంచి వెసులు బాటుకోసమే నిర్ణయం ►పరిశ్రమలకు భూ కేటాయింపులపై కొత్త పాలసీ రూపకల్పన. న్యూ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి ఆమోదముద్ర వేసిన రాష్ట్ర మంత్రిమండలి. ►అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద గతంలో థర్మల్ పవర్ ప్రాజెక్టుకోసం 1200 ఎకరాలు ఇచ్చిన ఏపీఐఐసీ ►ఇందులో హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►దీనికోసం సబ్ లీజింగ్‌కు అనుమతి ఇచ్చిన కేబినెట్. ►రూ. 95వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఎన్టీపీసీ. ►గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుతో పాటు ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకై ఏపీఐఐసీ ప్రతిపాదనల మేరకు ఎన్టీపీసీ లిమిటెడ్‌కు అనుమతులు మంజారు చేస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రిమండలి. ►తిరుపతి జిల్లా పేరూరులో ఎంఆర్కేఆర్ గ్రూపు హోటల్ నిర్మాణానికి అదనంగా మరో 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ.. తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►వైయస్సార్ జిల్లా గండికోటలోనూ, విశాఖపట్నంలో మేపెయిర్ గ్రూపులకు గతంలో కేటాయించిన భూములు కాకుండా కొత్త సర్వేనెంబర్లలో భూకేటాయింపులు. ►విశాఖపట్నానికి చెందిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్– 1 అధికారిగా నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ►రెండు ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన సాకేత్ మైనేని. ►డేవిస్‌కప్ టీంలో 11 ఏళ్లపాటు కొనసాగిన సాకేత్. ►2016 నుంచి 2017 వరకూ ఇండియా నంబర్ 1గా ఉన్న సాకేత్ మైనేని. ► ఏపీ ఫెర్రోఅల్లాయిస్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు వివిధ రకాల విద్యుత్ డ్యూటీలలో మినహాయింపులు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం. ►ఫెర్రో అల్లాయిస్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ నుంచి కొంత మినహాయింపు. ►స్టీల్ ఇండస్ట్రీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఈ పరిశ్రమలకు తోడ్పాటు నిచ్చేందుకు నిర్ణయం. ►రూ.766 కోట్ల మేర భారాన్ని మోయనున్న ప్రభుత్వం ►దాదాపు 50 వేలమంది ఈ పరిశ్రమలపై ఆధారపడి ఉన్నందున నిర్ణయం తీసుకున్న కేబినెట్. ►902 మెగావాట్ల సామర్ధ్యమున్న సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధకు నంద్యాల, వైఎస్సార్ జిల్లాలలో 5,400 ఎకరాలు ►లీజు ప్రాతిపదికన కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►ఏడాదికి రూ.31వేలు ఎకరాకు చెల్లించనున్న కంపెనీ. ►రెండేళ్లకు 5శాతం చొప్పున పెంపు. ►కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధకు అనుమతిలిస్తూ కేబినెట్ ఆమోదం. ►రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ (01–07–2022 నుంచి) ఇవ్వాలన్న ఆర్ధికశాఖ ప్రతిపాదనను రాటిఫై చేసిన కేబినెట్. ►రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు 3.64 శాతం డీఏ (01–07–2022 నుంచి) ఇవ్వాలన్న ఆర్ధికశాఖ ప్రతిపాదనను రాటిఫై చేసిన కేబినెట్. ►రాష్ట్రంలో 100 ఇన్స్ఫెక్టర్ ఆఫ్ పోలీసు పోస్టులను భర్తీ చేయాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ఇందులో 45 పోస్టులు అప్‌గ్రేడేషన్, 55 సూపర్ న్యూమరరీ పోస్టులు. ►ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలో 22 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. విజయవాడతో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలులో భర్తీ ►సమగ్ర కులగణనకు కేబినెట్ ఆమోదం. ►ఆర్ధిక, సామాజిక, విద్యాపరమైన జీవనోపాధి, జనభాసమతుల్యత అన్న అంశాలపై గణన. ►అణగారిన వర్గాలు మరింత అభ్యున్నతికి ఈ డేటా ఉపయోగపడుతుందన్న సీఎం. ►ఆర్థిక సామాజిక అభివృద్ధి కల్పించేందుకు దోహదపడుతుందన్న సీఎం. ►ప్రభుత్వ పథకాలు అందకుండా ఎవరైనా మిగిలిపోయినా కూడా ఈ గణన ద్వారా తెలుస్తుందని, తద్వారా వారు లబ్ధిపొందుతారన్న కేబినెట్. ►మరిన్ని పేదరిక నిర్మూలనా పథకాలకు, మానవవనరుల అభివృద్ధికి, తారతమ్యాలు తగ్గించేందుకు, అసమానతలు రూపుమాపేందుకు ఈ డేటా వినియోగపడుతుందన్న సీఎం. ►కులగణన చేయాలన్న నిర్ణయాన్ని ఆమోదించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రివర్గసభ్యులు. ►ఎంప్లాయి ఫ్రెండ్లీ గవర్నమెంటు అన్న మాటను మరోసారి నిలబెట్టుకుంటూ ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన లోకల్ కేడర్స్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రాప్ట్ ఆర్డర్ 2023కు ఆమోదం. ►జోనల్ వ్యవస్థలో మార్పులకు కేబినెట్ నిర్ణయం. ►డిస్ట్రిక్ కేడర్‌గా టీచర్లు, జూనియర్ అసిస్టెంట్లు, సమానస్థాయి, అంతకంటే దిగువ. ►జోనల్ కేడర్‌గా జూనియర్ అసిస్టెంట్ పైన ఉన్నవారు. ►మల్టీజోన్ పరిధిలో సెకండ్ లెవల్ గెజిటెడ్ సమానస్థాయి, డిప్యూటీ కలెక్టర్ సమానస్థాయి వారు. ►స్టేట్ లెవల్ కేడర్ అంతా మల్టీజోనల్ కిందకు (ఏపీ సెక్రటేరియట్, హెచ్ఓడీలు, స్టేట్ లెవల్ ఇనిస్టిట్యూషన్స్, కేపిటల్ ఏరియాలో పోలిస్ కమిషనరేట్ మినహాయిస్తే) ►దీనివల్ల 95శాతం పోస్టులు ఆయా స్థానికులకే చెందుతాయి. ►స్థానిక వ్యక్తులకు కనీస విద్యార్హత స్థాయి 10నుంచి 7కు తగ్గింపు. ►ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లను ఆరు జోన్లకు మారుస్తూ నిర్ణయం. ►వీటితోపాటు రెండు మల్టీ జోన్లు. ►ర్నూలులో సెకండ్ నేషనల్ లా యూనివర్సిటీ, స్టేట్ క్వాజీ జ్యుడీషియల్ అండ్ లీగల్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుకు అవసరమైన మరో 100 ఎకరాల భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ఇప్పటికే వీటికోసం 50 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం. ►ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్జూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్, ఏపీ లేబర్ కమిషన్, ఏపీ వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్, ఏపీ వక్ఫ్‌బోర్డు, లోకాయుక్త తదితర సంస్థలకు ఉపయోగం. ►దేవాదాయశాఖలో కేడర్‌ను బలోపేతం చేసేందుకు దేవాదాయశాఖ కమిషనర్ పరిధిలో ఒక డిప్యూటీ కమిషనర్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. ►ఆయా దేవాలయాలు ఆర్జించే ఆదాయాలు ఆధారంగా ఏర్పాటు చేసే పోస్టులకు సంబంధించిన ఆదాయపరిమితిని పెంచిన నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►గతంలో డిప్యూటీ కమిషనర్ పరిధిలో రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉంటే ఇప్పుడు దానిని రూ.7 నుంచి రూ.12 కోట్లకు పరిమితి పెంపు. ►జాయింట్ కమిషనర్ పరిధిలో గతంలో రూ.1 కోటి ఉంటే దానిని రూ.12 కోట్లు కంటే ఎక్కువ పరిమితి పెంపు. ►విశాఖపట్నం జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, యూజర్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆమోదించిన మంత్రిమండలి. ►పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల పునరావాసంలో భాగంగా.. ఏలూరు జిల్లా పరిధిలో పోలవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల పరిధిలో 12,984 కుటుంబాలకు, రాజమహేంద్రవరం జిల్లాలో దేవీపట్నం, కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లో 3,823 కుటుంబాలకు కేటాయించి ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్, భూమి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ భూమి కేటాయింపునకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ను ఉచితంగా చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ►కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్ధకు 4.12 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లెలో ఏపీఐఐసీకి 2.92 ఎకరాల భూమిని కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ►శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అసరమైన భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. ►నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరులో 39.08 ఎకరాల భూమిని రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ బోర్డుకు కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన రాష్ట్ర మంత్రిమండలి. ►రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాల పంపిణీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం నరవలో ప్రముఖ జానపదకళాకారుడు దివంగత వంగపండు ప్రసాదరావు సతీమణి శ్రీమతి వంగపండు విజయలక్ష్మికి 1000 గజాల ఇంటిస్ధలం కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. -
ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం
సాక్షి, విజయవాడ: ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అవ్వనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనుంది. కాగా, ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయిదు రోజుల పాటు జరగనున్నట్లు ప్రాథమిక సమాచారం. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చదవండి: ఆరోగ్యసురక్ష, సీఆర్డీఏపై సీఎం జగన్ సమీక్ష -
అవ్వాతాతలకు 3న పింఛన్లు..
సాక్షి, అమరావతి: ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఏప్రిల్ 1వ తేదీని సెలవు దినంగా ప్రకటించడం, ఆ మరుసటి రోజు ఏప్రిల్ 2 ఆదివారం కావడంతో అవ్వాతాతలకు ఏప్రిల్ 3న పింఛన్లు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ విషయాన్ని పెన్షన్ లబ్ధిదారులకు ముందుగా తెలియజేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ప్రజాభ్యుదయానికి దోహదం చేసే పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇటీవల విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఘనవిజయం వెనుక ముఖ్యమంత్రి జగన్ కృషిని మంత్రివర్గం కొనియాడింది. ప్రభుత్వ విశ్వసనీయత, పనితీరుకు ఈ సదస్సు అద్దం పట్టిందని ప్రశంసించారు. సీఎం జగన్‌ను అభినందిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని హర్షధ్వానాలతో ఆమోదించారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ను మంత్రివర్గం అభినందించింది. నూతన పారిశ్రామిక విధానం 2023–27ను కేబినెట్ ఆమోదించింది. మంత్రివర్గ నిర్ణయాలను సమాచార, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ► సంక్షేమ వసతి గృహాల్లో (హాస్టళ్లు) విద్యార్ధులకు మెరుగైన సౌకర్యాలు, వసతుల కల్పన, సూక్ష్మస్ధాయిలో పర్యవేక్షణకు అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ల సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయం. సంక్షేమ శాఖల్లో ప్రస్తుతం ఉన్న అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్లను (సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్) క్లస్టర్ల వారీగా నియమించేందుకు గ్రీన్ సిగ్నల్. మూడు మండలాలను ఒక క్లస్టర్‌గా నిర్ణయించి ఏడాది కాలపరిమితితో అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామకం ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ► ప్రభుత్వ హైస్కూళ్లలో నైట్ వాచ్మెన్ల నియామకానికి కేబినెట్ ఆమోదం. మొత్తం 5,388 హైస్కూళ్లలో పేరెంట్స్ కమిటీల ద్వారా వాచ్మెన్ల నియామకం. ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల చొప్పున టీఎంఎఫ్ నుంచి గౌరవ వేతనం చెల్లింపు. పలు ముసాయిదా బిల్లులకు ఆమోదం ► ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబల్ యాక్ట్ –2019 (యాక్ట్ నెంబర్ 30 ఆఫ్ 2020) సవరణలకు సంబంధించిన డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ ప్లాన్ అండ్ ట్రైబల్ సబ్‌ప్లాన్ (ఆర్ధిక వనరుల ప్రణాళిక, కేటాయింపు మరియు వినియోగానికి సంబంధించి) యాక్ట్ –2013 సవరణల డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల పదవీకాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ యాక్టు 2019 (యాక్టు 9 ఆఫ్ 2021) సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. ఛైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని మూడు సంవత్సరాల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ పదవీ కాలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ యాక్టు 2019 (యాక్టు 19 ఆఫ్ 2019) సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. కమిషన్ పదవీ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ కమిషన్ యాక్ట్ 1998 సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం. కమిషన్ పదవీ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. పదవీకాలం ముగిసిన తర్వాత అదనంగా మరో రెండేళ్లు పొడిగించేలా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్. ► కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక నియమావళిని అనుసరించి వక్ఫ్ రూల్స్ సవరణకు కేబినెట్ ఆమోదం. ► ఏపీ మహిళా కమిషన్ పదవీ కాలానికి సంబం«ధించి ఏపీ వుమెన్ కమిషన్ యాక్ట్ –1998 సవరణలకు కేబినెట్ ఆమోదం. మహిళా కమిషన్ పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాల నుంచి రెండేళ్లకు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ► గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు 2022 ఆర్డినెన్స్‌కు బదులుగా ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల 2023 బిల్లు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ► ఏపీ కార్ల్– పులివెందులలో అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ కళాశాలల ఏర్పాటుకు ఆమోదం. ► ది మిల్క్ ప్రొక్యూర్మెంట్ (ప్రొటెక్షన్ ఆఫ్ ఫార్మర్స్) అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సేప్టీ ఆఫ్ మిల్క్ స్టాండర్డ్స్ బిల్లు 2023 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. బిల్లు ద్వారా పాడి రైతులు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యం. ► ఆంధ్రప్రదేశ్ మీడియా అక్రిడిటేషన్ రూల్ 2019కు మార్పులు చేస్తూ సమగ్ర నూతన విధానానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. ► జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ 1960 సవరణ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2022 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. ► ఎయిడెడ్, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఆర్డినెన్స్ 2022 ప్రతిపాదనలకు ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ ఆర్డినెన్స్ 2022 స్థానంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారెంటీ బిల్లు 2023కు కేబినెట్ ఆమోదం. ► వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్‌కు నీటి సరఫరా పైప్‌లైన్ కోసం 29.67 ఎకరాలను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. దీంతోపాటు నాలుగులైన్ల రహదారి నిర్మాణానికి అవసరమైన 78.46 ఎకరాల భూమిని కూడా కేటాయింపు ప్రతిపాదనలకు ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్‌వేస్ బిల్లు 2023 ప్రతిపాదనలకు ఆమోదం. ► మున్సిపల్ యాక్ట్ సవరణలకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు అవసరమైన సవరణలకు కేబినెట్ ఆమోదం. ► అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం. రెండు పట్టణ స్థానిక సంస్థలు, 120 రెవెన్యూ గ్రామాలతో కూడిన 11 మండలాలతో కలిపి మొత్తం 896.16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు కానున్న అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ► ఏపీ లెజిస్లేచర్ సెక్రటేరియట్లో సెక్రటరీ జనరల్ పోస్టు భర్తీకి కేబినెట్ ఆమోదం. లోక్‌సభ, రాజ్యసభలో పదవీ విరమణ చేసిన లేదా ప్రస్తుతం సర్వీసులో ఉన్న సెక్రటరీ జనరల్ ఈ పోస్టుకు అర్హులు. ► అనపర్తి, పిడుగురాళ్ల, మైదుకూరు, మైలవరం, ఉదయగిరి, నిడదవోలు మండలాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ భర్తీకి కేబినెట్ ఆమోదం. 18 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ► ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ 1987 సవరణలకు ఆమోదం. ► రిజిస్ట్రేషన్ సేవలకు ఇ–స్టాంపింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. తప్పుడు రిజిస్ట్రేషన్లను నివారించేలా రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సవరణకు కేబినెట్ ఆమోదం. ► ఎక్సైజ్ చట్టం సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► ఆంధ్రప్రదేశ్ చారిటబుల్, హిందూ రిలీజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 ప్రకారం అన్ని దేవస్ధానాల బోర్డుల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదం. దేవాలయాల్లో క్షురకర్మలు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం రూ.20 వేలు కచ్చితం కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు ఆమోదం. కనీసం వంద పనిదినాలు నమోదైన వారికి ఇది వర్తింపు. ► పట్టాదార్ పాస్‌బుక్స్ ఆర్డినెన్స్ 2023 సవరణకు కేబినెట్ ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్ (అప్డేషన్ ఇన్ రీసెటిల్మెంట్ రిజిస్ట్రేషన్) ఆర్డినెన్స్ 2022 లో సవరణలకు కేబినెట్ ఆమోదం. ► మచిలీపట్నంలో 220 గజాల స్థలం మదర్సాకు కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు అంతర్జాతీయంగా ఉర్రూతలూగించిన నాటు...నాటు పాట ద్వారా ఆస్కార్ అవార్డు సాధించిన “ఆర్ఆర్ఆర్’’ చిత్ర యూనిట్‌ను మంత్రివర్గం అభినందించింది. సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, దర్శకుడు రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ బృందానికి కేబినెట్ అభినందనలు తెలియచేసింది. -
AP: 14న రాష్ట్ర కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి : ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో మ.12 గంటలకు ఈ భేటీ ఉంటుంది. బడ్జెట్ సమావేశాలు పురస్కరించుకుని అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది. -
‘వైఎస్సార్ కల్యాణమస్తు’.. ‘షాదీ తోఫా’.. పెళ్లికి పెద్ద సాయం
సాక్షి, అమరావతి: నిరుపేద తల్లిదండ్రులకు ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కారాదనే ఉద్దేశంతో ‘వైఎస్సార్ కల్యాణ మస్తు’, ‘షాదీ తోఫా’ పథకాల అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 10వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు భవన నిర్మాణ కార్మికులు, విభిన్న ప్రతిభావంతుల్లో దరఖాస్తు చేసుకున్న 4,536 కుటుంబాలకు ఆర్థిక సాయం కింద రూ.38.18 కోట్లు పంపిణీ చేయనుంది. గతంతో పోలిస్తే సాయం మొత్తాన్ని భారీగా పెంచింది. ఇప్పటికే మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి, వసతిదీవెన, విద్యా దీవెన, విద్యా కానుక లాంటి పథకాలతో పేదింటి బిడ్డల అభ్యున్నతికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కోసం దరఖాస్తు చేసుకునే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది. గత అక్టోబరు నుంచి డిసెంబరు వరకు జరిగిన వివాహాలకు సంబంధించి అందిన దరఖాస్తులను జనవరిలో తనిఖీ చేసి ఫిబ్రవరిలో ఆర్థిక సాయం చెల్లించనుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి దరఖాస్తులను పరిశీలించి నాలుగో నెలలో లబ్ధి అందించనుంది. మరోవైపు చంద్రబాబు తన హయాంలో నమ్మించి నట్టేట ముంచిన పొదుపు సంఘాల్లోని 79 లక్షల మంది అక్కచెల్లెమ్మలను ఆదుకుంటూ 3వ విడత వైఎస్సార్ ఆసరా కింద రూ.6,500 కోట్ల పంపిణీకి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. సంక్షేమం, విద్య, పరిశ్రమలకు ప్రోత్సాహకం, ఆరోగ్యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమాచార, బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వాటిని మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇవీ.. మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లా నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, విద్యాదీవెన ఈ నెలలోనే.. వైఎస్సార్ లా నేస్తం కింద నెలకు రూ.5 వేల చొప్పున 65,537 వేల మంది జూనియర్ న్యాయవాదులకు మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు అందించింది. ఫిబ్రవరి 17న మరో దఫా వైఎస్సార్ లా నేస్తం సాయం పంపిణీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ద్వారా 17 వేల మందికి మేలు చేస్తూ రూ.25 కోట్లు చెల్లించింది. ► ఫిబ్రవరి 24న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్. ► అక్టోబరు – డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన ద్వారా ఫిబ్రవరి 28న పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించనుంది. 10.50 లక్షల మంది విద్యార్థులకు రూ.700 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. మార్చిలో మరిన్ని.. ► ఉగాది సందర్భంగా మూడో విడత వైఎస్సార్ ఆసరా పంపిణీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వారం రోజుల పాటు పండగ వాతావరణంలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సాయం అందించనుంది. 10–04–2019 నాటికి పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు రూ.25 వేల కోట్లు చెల్లిస్తానని పాదయాత్రలో సీఎం జగన్ ప్రకటించారు. మాట ప్రకారం ఇప్పటికే దాదాపు రూ.13 వేల కోట్లకుపైగా అందించారు. తాజాగా మరో రూ.6,500 కోట్లు ఇవ్వనున్నారు. ► అగ్రవర్ణ పేదల్లో 45 – 60 ఏళ్ల వయసు మహిళలకు ఈబీసీ నేస్తం ద్వారా రూ.600 కోట్లు అందించనున్నారు. దాదాపు 4 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ► జగనన్న వసతి దీవెన కింద ఈ ఏడాదికి సంబంధించి దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులకు మేలు చేస్తూ ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.20 వేల వరకూ సాయం అందించనుంది. విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల కోసం దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదించింది. ► విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2వతేదీ నుంచి మధ్యాహ్న భోజన పథకంలో రాగిజావ అందించనున్నారు. వారానికి మూడు రోజుల పాటు అందచేసేందుకు అదనంగా రూ.86 కోట్లు ఖర్చు చేయనుంది. 320 వర్సిటీలకు జగనన్న విదేశీ విద్యాదీవెన.. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా అత్యధికంగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా కీలక మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు క్యూఎస్ ర్యాంకింగ్ టాప్ 200 విశ్వవిద్యాలయాలను పరిగణలోకి తీసుకోగా తాజాగా 320కి పెంచారు. ఇకపై దాదాపు 21 సబ్జెక్టులకు సంబంధించి టాప్ 50 కాలేజీలు లేదా విద్యాసంస్థల్లో సీటు సాధించినవారికి జగనన్న విదేశీ విద్యాదీవెన వర్తించనుంది. ఇప్పటివరకు కేవలం క్యూఎస్ ర్యాంకును మాత్రమే పరిగణలోకి తీసుకోగా ఇకపై టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ ఆధారంగా సీటు సాధించిన వారికి జగనన్న విదేశీ విద్యాదీవెన అందించనుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, అర్హులైన ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనుంది. ప్రజారోగ్యానికి పెద్దపీట.. ► ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రూ.34.48 కోట్ల వ్యయంతో 100 పడకల ఏరియా ఆస్పత్రిగా అప్ గ్రేడ్. 52 అదనపు పోస్టుల భర్తీకి కూడా మంత్రివర్గం ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయి పోస్టుల భర్తీకి ఆమోదం. వైద్యశాఖలో ఇప్పటికే దాదాపు 49 వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ► ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రతి పీహెచ్సీలో సిబ్బంది 12 నుంచి 14 మందికి పెంపు. కొత్తగా 1,610 పోస్టుల భర్తీ. ► డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టులో జిల్లా సమన్వయకర్తలుగా 10 అదనపు పోస్టుల భర్తీతో పాటు సివిల్ అసిస్టెంట్ సర్జన్లను ఫారిన్ సర్వీసు డిప్యుటేషన్ (ఎఫ్‌ఎస్‌డి)పై నియామకం ప్రతిపాదనకు ఆమోదం. విద్యారంగం.. ► కర్నూలులో 50 ఎకరాల్లో రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(ఎన్ఎల్యూ) ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం. ► సబ్జెక్టు టీచర్లుగా అర్హత పొందిన 5,809 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు నెలకు రూ.2500 చొప్పున అలవెన్స్ చెల్లింపు ప్రతిపాదనకు ఆమోదం. ► నాడు – నేడు మొదటి దశలో అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతిపైన ఉన్న అన్ని క్లాసులను డిజిటల్‌గా తీర్చిదిద్దనుంది. ఇందుకోసం ప్రతి తరగతి గదిలో ఒక ఇంటరాక్టివ్ ప్లాట్ ప్లానెల్ (ఐఎఫ్‌పీ) చొప్పున 30,213 ఐఎఫ్‌పీలు ఏర్పాటుకు ఆమోదం. ► కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల బోధనా సిబ్బందికి గౌరవ వేతనం అదనంగా 23 శాతం పెంపుతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లతో (సీఆర్టీలు) సమానంగా గౌరవ వేతనం చెల్లింపు ప్రతిపాదనకు ఆమోదం. పరిశ్రమలకు ప్రోత్సాహం.. ► గ్రానైట్ పరిశ్రమలకు పూర్వ వైభవం కల్పించేలా ప్రోత్సాహాలు. స్మాల్ స్కేల్ గ్రానైట్ పరిశ్రమలకు యూనిట్ విద్యుత్తు రూ.2కు సరఫరా. ► పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టు సంస్థలకు అవసరమైన అనుమతుల జారీకి ఆమోదం. ► ఎకోరన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్ధ సుమారు 1,000 మెగావాట్ల విండ్‌పవర్, 1,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు అనుమతులు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో దశలవారీగా ఇవి అందుబాటులోకి రానున్నాయి. ► అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురంలో 250, కర్నూలు జిల్లా బేతంచర్లలో 118.8 మెగావాట్లు, అనంతపురం జిల్లా కురుబరాహల్లిలో 251.2 మెగావాట్లు, కర్నూలు జిల్లా చిన్న కొలుములపల్లిలో 251.2 మెగావాట్లు, కర్నూలు జిల్లా మెట్టుపల్లిలో 100 మెగావాట్లు, జలదుర్గంలో 130 మెగావాట్లతో విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నిర్ణయం. ► అనంతపురం జిల్లా కమలపాడు, యాడికిలో 250 మెగావాట్లు, శ్రీ సత్యసాయి జిల్లా కొండాపురంలో 250 మెగావాట్లు, నంద్యాల జిల్లా నొస్సంలో 500 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం. మౌలిక వసతుల కల్పన ► ఆదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 500 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు 406.46 ఎకరాలను ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం.అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం పెద్దకోట్ల, దాడితోట గ్రామాల పరిధిలో భూముల కేటాయింపు. ► మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రుణ కోసం రూ.3,940.42 కోట్ల బ్యాంకు గ్యారంటీకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, మచిలీపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య కుదిరిన ఎంఓయూను ర్యాటిఫై చేస్తూ కేబినెట్ ఆమోదం. ► పెట్టుబడులు, మౌలికసదుపాయాలు కల్పన శాఖలో ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ విభాగానికి చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పోస్టు మంజూరు. ► రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తుల నిర్మాణానికి జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు 250 ఎకరాల భూమి లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు ఆమోదం. ► స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) తీసుకున్న విధానపరమైన నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం. మరికొన్ని నిర్ణయాలకు ఆమోదం ►కర్నూలు జిల్లా డోన్‌లో నూతనంగా నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 31 మంది బోధన, 12 మంది బోధనేతర సిబ్బంది భర్తీకి మంత్రిమండలి ఆమోదం. ►వైఎస్సార్ జిల్లా ఫాతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 2015–16లో కేటగిరీ–ఏ తో పాటు తర్వాత విద్యా సంవత్సరాలకు సంబంధించి కేటగిరీ బీ, సీలకు చెందిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు అంశాన్ని స్పెషల్ కేసుగా పరిగణించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ఇందులో భాగంగా రూ.9,12,07,782 చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్. ►1998 డీఎస్సీలో అర్హత సాధించిన 4,534 మంది అభ్యర్థులకు సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులు కల్పించాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. వీరికి మినిమమ్ టైం స్కేల్ (ఎంటీఎస్) వర్తింపజేయనుంది. ప్రాథమిక విద్యాశాఖతో పాటు ఖాళీలను అనుసరించి బీసీ, సాంఘిక సంక్షేమ శాఖ స్కూళ్లలో పోస్టులను భర్తీ చేయనుంది. ►విశాఖపట్నంలో 100 మెగావాట్ల డేటా సెంటర్, ఐటీ అండ్ బిజినెస్ పార్కు, స్కిల్ సెంటర్‌తో పాటు రిక్రియేషన్ సెంటర్ల ఏర్పాటు కోసం 60.29 ఎకరాలు వైజాగ్ టెక్ పార్కు లిమిటెడ్ (వీటీపీఎల్)కు కేటాయింపు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం. వైజాగ్ టెక్ పార్కు ద్వారా 14,825 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ►రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణలో ఉన్న డిగ్రీ కళాశాలకు సంబంధించి 10 ప్రిన్సిపాల్, 138 బోధనా సిబ్బంది, 36 నాన్ టీచింగ్ పోస్టులు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీకి ఆమోదం. ►విజయవాడలోని ఏపీ జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ పోస్టు భర్తీకి ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్‌లో 29 అదనపు పోస్టుల భర్తీ. ►గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ అండ్ స్పోర్ట్స్ స్కూల్‌కు వేకెంట్ ల్యాండ్ టాక్స్ రద్దు ప్రతిపాదనకు ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ మున్సిపాల్టీల చట్టం–1965, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం– 1955లకు సవరణలకు సంబంధించి డ్రాప్ట్ బిల్లుకు ఆమోదం. ►పట్టణ స్థానిక సంస్థల్లో సమగ్ర భూముల రీ సర్వేకు అవసరమైన సవరణలకు ఆమోదం. ►ఏపీ మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీసెస్ కింద పరిపాలనా సౌలభ్యం కోసం డిప్యూటీ డైరెక్టర్ (అకౌంట్స్) పోస్టు ఏర్పాటుకు ఆమోదం. ► ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు భూమి 20 ఏళ్ల లీజుకు కేటాయించేందుకు ఆమోదం. 16 అర్బన్ లోకల్ బాడీస్ (ఒంగోలు, నెల్లిమర్ల, పాలకొండ, శ్రీకాకుళం, వినుకొండ, అనంతపురం, ప్రొద్దుటూరు, కావలి, పిఠాపురం, రాయచోటి, గూడూరు, పెద్దాపురం, కడప, బద్వేలు, వెంకటగిరి, చిలకలూరిపేట)లలో చదరపు మీటరుకు ఏడాదికి రూ.1 కే అద్దె ప్రాతిపదికన కేటాయించాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ►నెల్లూరు బ్యారేజీని నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు బ్యారేజ్‌గా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ►ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో వివిధ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్లో జూనియర్ అసిస్టెంట్ కేడర్‌లో 14 ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ల భర్తీకి నిర్ణయం. విజయనగరంలో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం. లీగల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్స్ సజావుగా నడిచేందుకు వీలుగా సపోర్టింగ్ స్టాప్ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం. ►మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగిస్తూ మంత్రివర్గం ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ వ్యాట్–2023 బిల్లు సవరణ, టీటీడీ ఐటీ విభాగం(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్)లో 34 పోస్టుల భర్తీ, శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్వీఐటీఎస్ఏ)లో 12 పోస్టుల భర్తీకి ఆమోదం. ►పశు సంవర్థకశాఖలో నిపుణుల కొరత తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ పారా వెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ యాక్ట్ 2023 ముసాయిదా బిల్లుకు ఆమోదం. ► ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపీఎస్పీఎఫ్)లో 105 అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం. -
ఏపీ కేబినెట్ సమావేశం 24కు వాయిదా
సాక్షి, అమరావతి: ఈ నెల 22న జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 24కు వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ఒకటో బ్లాక్ మొదటి అంతస్తులో సమావేశం జరుగనుందని తెలిపారు. -
AP: ముందస్తు ఏరువాక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రానున్న ఖరీఫ్‌లో జలాశయాల కింద రైతులకు ముందుగానే సాగునీరు అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ సీజన్‌ను ముందుగా ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. గోదావరి, కృష్ణా డెల్టాలతో పాటు సోమశిల కింద ఉన్న ప్రాజెక్టులు, రాయలసీమ ప్రాజెక్టుల నుంచి ఖరీఫ్‌కు ముందస్తుగా నీటిని విడుదల చేయాలని గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. తుపానుల బారిన పడి రైతులు పంటలు నష్టపోకుండా ఉండేలా ఖరీఫ్‌కు ముందస్తు నీటి విడుదల ప్రణాళికకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు మే, జూన్ నెలల్లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్ రంగంలో హెల్త్ హబ్‌లకు భూములను కేటాయించడంతో పాటు పలు పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీకి భూములు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. 2022–27 ఏపీ ఎగుమతుల ప్రోత్సాహక విధానానికి, 2022–27 ఏపీ లాజిస్టిక్ విధానానికి పచ్చ జెండా ఊపింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకరుల సమావేశంలో వివరించారు. వరుసగా వారు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు నీటితో మూడో పంటకు అవకాశం ► వైఎస్సార్ హాయాంలో పుష్కలంగా వర్షాలు కురిశాయి. ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం జగన్ హయాంలోనూ పుష్కలంగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు బాగున్నాయి. దీంతో రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్‌కు ముందస్తుగా నీటి విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని రైతులకు ముందుగా తెలిజేయడం ద్వారా ముందస్తు ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన ఏర్పాట్లును చేసుకుని సమాయత్తం అవుతారు. ► గతంలో ఆగస్టులో నీటిని విడుదల చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఖరీఫ్‌కు వివిధ ప్రాజెక్టుల నుంచి ముందుగానే నీటిని విడుదల చేస్తున్నాం. దీనివల్ల నవంబర్, డిసెంబర్లలో వచ్చే తుపానుల బారిన పడకుండా రైతులు పండించిన పంట చేతికి వస్తుంది. అలాగే రబీకి కూడా ముందస్తుగా నీటిని విడుదల చేయడం వల్ల మూడో పంట కింద అపరాలు, ఇతర పంటలు సాగు చేసుకునే అవకాశం రైతులకు కలుగుతుంది. ► గోదావరి డెల్టాకు జూన్ 1వ తేదీన నీటి విడుదల చేయనున్నాం. పోలవరం రివర్ స్లూయిస్ డెడ్ స్టోరేజీ నుంచి, ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేస్తాం. కృష్ణా డెల్టాకు, గుంటూరు చానల్‌కు జూన్ 10వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తాం. పులిచింతలలో 33 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులిచింతల పునరావాసానికి రూ.100 కోట్లు చెల్లించడంతో ఇది సాధ్యమైంది. దీంతో పట్టిసీమతో సంబంధం లేకుండా కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తాం. ► పెన్నా బేసిన్‌లోని గండికోట, బ్రహ్మంసాగర్, చిత్రావతి, వెలిగల్లు, సోమశిల ప్రాజెక్టుల నుంచి జూన్ 10న సాగునీటిని విడుదల చేస్తాం. సోమశిలలో 56 టీఎంసీల నీరు ఉంది. రాయలసీమలో ఎస్ఆర్బీసీ పరిధిలోని అవుకు, గోరుకల్లు నుంచి జూన్ 30వ తేదీన నీటిని విడుదల చేస్తాం. నాగార్జున సాగర్ కింద కుడిగట్టు ఆయకట్టుకు జూలై 15న నీళ్లిస్తాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఆధారంగా నీటి విడుదలపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ఆర్బీకేల ద్వారా అన్ని విధాలా భరోసా ► ఖరీఫ్‌కు ముందస్తుగా సాగునీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులతో పాటు సమస్తం రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ► కొన్ని ప్రాంతాల్లో ఖరీప్ సీజన్ ముందుగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా ప్రారంభం కావడంతో ధాన్యం సేకరణలో సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని ప్రాజెక్టుల కింద ముందస్తుగా ఖరీఫ్ సీజన్ ప్రారంభించడంతో ధాన్యం సేకరణలో సమస్యలు తలెత్తవని భావిస్తున్నాం. అలాగే మూడో పంట ద్వారా పంటల మార్పిడికి అవకాశం కలుగుతుంది. సాగునీటి విడుదల షెడ్యూల్ ఆధారంగా సాగు నీటి సలహా మండలి సమావేశాలను ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. సంక్షేమ క్యాలెండర్ అమలుకు ఆమోదం ► ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం మే, జూన్ నెలల్లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలకు కేబినెట్ ఆమోదించింది. సీఎం మే 13వ తేదీన ముమ్మిడివరంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా, మే 16న వైఎస్సార్ రైతు భరోసా ప్రారంభిస్తారు. మే 19న పశువులకు చెందిన అంబులెన్స్‌లను విజయవాడలో ప్రారంభిస్తారు. ► జూన్ 6న 4,014 కమ్యునిటీ హైరింగ్ కేంద్రాల నుంచి 3 వేల ట్రాక్టర్లు, 402 కంబైన్డ్ హార్వెస్టర్లను పంపిణీ చేయనున్నారు. ఖరీఫ్–21లో పంటలు నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమాను జూన్ 14న, జూన్ 21న అమ్మ ఒడి పథకం అమలు చేస్తాం. కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు ఇలా.. ► కృష్ణా జిల్లా పామర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(పీహెచ్సీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)గా అప్‌గ్రేడ్. 38 అదనపు పోస్టులు మంజూరు. అప్‌గ్రెడేషన్ కోసం రూ.8.18 కోట్లు వ్యయం. ► పులివెందులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు. 26 టీచింగ్, 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ. ► వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సదుపాయాలు, ఫాంగేట్ మౌలిక సదుపాయాలు, తదితర పనుల కోసం ఆర్థిక సంస్థల నుంచి రూ.1,600 కోట్ల రుణ సమీకరణకు ఆమోదం. ► మార్క్‌ఫెడ్‌లో 8 డిప్యుటీ మేనేజర్లు, 22 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు మంజూరు. ► నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో దివంగత మంత్రి గౌతం రెడ్డి పేరుతో వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటు. ► నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్ ప్లాంట్ పెట్టనున్న క్రిబ్కో. వ్యాపార కార్యకలాపాల్లో మార్పుల కారణంగా ఎరువులకు బదులు బయో ఇథనాల్ ఉత్పత్తి చేస్తామన్న క్రిబ్కోకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ► ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తలో 16 అదనపు పోస్టుల మంజూరుకు ఆమోదం. ► రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే చర్యలకు కేబినెట్ ఆమోదం. కోవిడ్ లాంటి విపత్తుల నేపథ్యంలో ప్రతి జిల్లా కేంద్రం, కార్పొరేషన్లలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే చర్యల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ హబ్స్‌లో ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థలకు భూముల కేటాయింపు. మచిలీపట్నంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నిర్మించనున్న ఆస్పత్రి కోసం ఎకరా భూమి కేటాయింపునకు ఆమోదం. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ముక్తినూతలపాడులో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం 3 ఎకరాలు, నెల్లూరు రూరల్ మండలం కొత్తూరులో అత్యాధునిక ఆస్పత్రికి 4 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం. రూ.100 కోట్లకు పైబడి పెట్టుబడితో పాటు 50 శాతం పడకలు ఆరోగ్య శ్రీకి కేటాయించాలనే నిబంధన. వైఎస్సార్ జిల్లా చిన్నమాచుపల్లిలో 3 ఎకరాల్లో మెడికల్ హబ్ కింద ఏర్పాటు కానున్న ఆస్పత్రికి భూమి కేటాయింపు. ► సూళ్లూరుపేట మండలం మన్నార్ పోలూరు, పడమటి కండ్రిగ గ్రామాల్లో 11.19 ఎకరాల భూమి టెక్స్టైల్ పార్క్‌కు కేటాయింపు. ► శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ డివిజన్ మడకశిర మండలం ఆర్.అనంతపురంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏపీఐఐసీకి 235 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం. ఇదే గ్రామంలో మరో 63.16 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు. మడకశిర మండలంలోని గౌడనహళ్లిలో 318.14 ఎకరాలు, ఇక్కడే మరోచోట 192.08 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, పశు సంవర్థక, మినరల్స్, టెక్స్టైల్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం. ► పెనుగొండలో మెగా స్పిరిట్యువల్ సెంటర్, టూరిస్ట్ బేస్ క్యాంప్‌నకు 40.04 ఎకరాలు ఇచ్చేందుకు అనుమతి. ► తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం గౌడమాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి 41.77 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం. ► అన్నమయ్య జిల్లా కొత్తకోట మండలం కోటవూరులో టూరిజం రిసార్ట్‌కు 10.50 ఎకరాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్. ► కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో రిసార్ట్ కోసం ఏపీటీడీసీకి 56 ఎకరాలు కేటాయింపు. ► విశాఖపట్నం జిల్లా ఎండాడలో కాపు భవన్ నిర్మాణానికి అర ఎకరం స్థలం కేటాయింపునకు ఆమోదం. ► బాపట్ల జిల్లా అద్దంకిలో వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్, వేస్ట్ కంపోస్ట్ ప్లాంట్ నిర్మాణాలకు 19 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం. ► నంద్యాల జిల్లా ప్యాపిలిలో హార్టికల్చర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ కోసం 25.93 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం. ► బాపట్ల జిల్లాలో రేపల్లె కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు. ఆ మేరకు సవరించిన సరిహద్దులకు కేబినెట్ ఆమోదం. ► పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో నర్సపూర్ అగ్రికల్చర్ కంపెనీ లిమిటెడ్‌కు ఇచ్చిన 1,754.49 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్‌కు ఇచ్చి, ప్రస్తుతం ఆ భూమిని అనుభవిస్తున్న లీజుదారులకు ఎకరా కేవలం రూ.100 చొప్పున పూర్తి హక్కులతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపునకు కేబినెట్ ఆమోదం. దీని వల్ల 1000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ► పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తూ గతంలో జారీ చేసిన జీవో సవరణకు కేబినెట్ ఆమోదం. ► జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపునకు ఆమోదం. గత ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తూ జారీ చేసిన జీవో ప్రకారమే ప్రస్తుతం స్థలాల కేటాయింపు. -
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ముహుర్తం ఖరారు
సాక్షి, విజయవాడ: మంత్రివర్గ విస్తరణ అనంతరం నూతన కేబినెట్ తొలిసారి మే 12న సమావేశం కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. -
AP: కొలువు తీరిన నూతన మంత్రివర్గం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త మంత్రివర్గం సోమవారం కొలువు తీరింది. 25 మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చదువుతూ ఉండగా.. ఆ ప్రకారం వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగారు. ఆ వెంటనే సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త, పాత మంత్రులు, అధికారులకు తేనీటి విందుకు హాజరయ్యారు. కాగా, ఆదివారం రాత్రి కొత్త మంత్రులు జాబితాను సీఎం కార్యాలయం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు పంపించింది. అంతకు ముందే గవర్నర్ 24 మంది పాత మంత్రుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారికంగా పత్రికా ప్రకటన జారీ చేశారు. ముఖ్యమంత్రి సూచన మేరకు 24 మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారని, ఇది వెంటనే అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో తెలిపారు. కొత్త వారు 14 మందికి స్థానం సరిగ్గా 34 నెలల రెండు రోజులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. అధికారం చేపట్టిన కొత్తలోనే.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తానని సీఎం బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో కొంత జాప్యం చోటుచేసుకున్నప్పటికీ, ఈ నెల 7వ తేదీన 24 మంది మంత్రులు రాజీనామాలు సమర్పించారు. అనుభవం, సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్.. పాత, కొత్త కలయికతో కొత్త మంత్రివర్గాన్ని కూర్పు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. పాత మంత్రివర్గంలోని 11 మందిని మళ్లీ మంత్రివర్గంలో తీసుకుంటుండగా, కొత్తగా 14 మందికి స్థానం కల్పించారు. -
ఇది సామాజిక కేబినెట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక మహా విప్లవం తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించిన ధీరోదాత్తుడు సీఎం జగన్ అని కొనియాడారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని మరోసారి నిరూపించారని చెప్పారు. అన్ని రంగాల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగ లేదన్నారు. ఈసారి 25 మంది మంత్రుల్లో 70% బడుగు బలహీన వర్గాల వారే ఉన్నారన్నారు. మొదటి నుంచి వైఎస్సార్సీపీ ఈ వర్గాలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. చంద్రబాబు ఏ సందర్భంలోనూ బీసీలకు న్యాయం చేయలేదని, ఏనాడూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండలేదన్నారు. ఇప్పటి వరకు కేబినెట్లో ముగ్గురు మహిళలుండగా ఈసారి నలుగురికి అవకాశం ఇచ్చారన్నారు. ఇది ఎన్నికల కోసం చేసిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కాదని తెలిపారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. సామాజిక న్యాయం నినాదం కాదు.. నిజం ► సామాజిక న్యాయం అన్నది నినాదం కాదని, నిజం చేసిన ఏకైక సీఎం జగన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు బీసీలకు పదవులిస్తున్నారు. అన్నీ పరిశీలించాకే కేబినెట్ తుది జాబితా ఇచ్చారు. ► తరతరాలుగా పేదరికంలో ఉన్న వర్గాలను పైకి తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఏర్పాటైనప్పటి నుంచి మనసా వాచా కర్మణా అడుగులు వేస్తోంది. వైఎస్ జగన్ పార్టీ పెట్టింది మొదలు ఇదే విధానంతో ముందుకు వెళ్తున్నారు. ► పాదయాత్ర సమయంలో అన్ని బీసీ కులాలతో సమావేశమై.. వారి ఇబ్బందులపై అధ్యయనం చేయించి, ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేసి బీసీలకు తాను చేయబోయే మంచి గురించి జగన్ వివరించారు. 2019లో అధికారంలోకి రాగానే వాటిని ఆచరణలో పెట్టారు. ► గత కేబినెట్లో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, 11 మంది ఓసీలకు అవకాశం కల్పించడం విప్లవాత్మక చర్య. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు కేబినెట్‌తో పోలిస్తే ఇది చాలా గొప్పది. బాబు బీసీలకు ఏమీ చేయలేదు. చంద్రబాబు అడ్డగోలుగా కేబినెట్‌ను నడిపారు ► సోమవారం ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల జాబితాను పరిశీలిస్తే సీఎం జగన్.. బీసీలకు 10, ఎస్టీ 1, మైనారిటీ 1, ఎస్సీలకు 5 స్థానాలు కేటాయించారు. బీసీలకు ఆత్మబంధువు అని చెప్పుకునే చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేదు. ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం తప్ప. ► 2014లో 19 మందితో చంద్రబాబు ఆ వర్గాల వారికి 12 పదవులు మాత్రమే ఇస్తే.. ఇవాళ మేము 17 పదవులు ఇచ్చాం. నాడు ఎస్టీ, మైనార్టీలకు చోటే లేదు. అప్పుడు ఓసీ వారు 11 మంది కాగా, మిగిలిన అన్ని వర్గాల వారు కేవలం 8 మంది మాత్రమే. ► చంద్రబాబు తన కుమారుడిని కేబినెట్లోకి తీసుకోవడం కోసమే మంత్రి వర్గంలో మార్పులు చేశారు. 19 మందిలో ఐదుగురిని తీసేసి, 11 మందిని కొత్తగా తీసుకుని మొత్తం 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఓసీలు 15 మంది ఉన్నారు. చంద్రబాబు ఇలా అడ్డగోలుగా కేబినెట్‌ను నడిపారు. అందరూ అర్థం చేసుకుని సహకరిస్తున్నారు.. ► మొదటి నుంచీ సీఎం జగన్ రాజకీయ సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో 56 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పిస్తే.. ఇప్పుడు 70 శాతానికి పెంచారు. గతంలో ముగ్గురు మహిళలు ఉండేవారు. ఈ రోజు నలుగురుకి అవకాశం కల్పించారు. ► నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇస్తూ ఏకంగా చట్టమే చేశారు. ఇది ఎన్నికల కోసం చేసింది కాదు. ఈ విషయాన్ని మేధావులు అందరూ గమనించాలి. ► కేబినెట్ పదవి అన్నది అధికారమే తప్ప హక్కు కానేకాదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే 25 కేబినెట్ బెర్తులు మాత్రమే ఉన్నాయి. అందరికీ మంత్రులుగా అవకాశం రాదు. కొంత మందికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తాం. పదవి వస్తే ప్రాధాన్యత ఇచ్చినట్లు కాదు. రాకపోతే ప్రాధాన్యత ఇవ్వనట్లు అసలే కాదు. ఈ విషయాన్ని అందరు ఎమ్మెల్యేలూ అర్థం చేసుకుని, సహకరిస్తున్నారు. ► దివాళా తీసిన టీడీపీ ఎక్కడ అలజడి రేగుతుందా.. అని ఎదురు చూస్తోంది. అసంతృప్తి ఉన్నట్లు ఎల్లో మీడియా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మా పార్టీలో అసంతృప్తికి చోటు లేదు. అవకాశం రాలేదనుకుంటే పొరపాటే ► రాబోయే ఎన్నికల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించే నాయకులను జిల్లా స్థాయిలో కొంత మందిని, రాష్ట్ర స్థాయిలో మరికొంత మందిని వాడుకుంటాం. రకరకాల బాధ్యతలు ఇచ్చి ప్రా«ధాన్యత కల్పిస్తాం. అవకాశం రాలేదని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ► ఇక్కడ ప్రతి ఎమ్మెల్యేకు బీ ఫారం ఇచ్చి గెలిపించుకున్నది సీఎం జగన్ మాత్రమే. అందరిపై సీఎం జగన్‌కు ఒకే రకమైన అభిప్రాయం ఉంది. రాగద్వేషాలకు అతీతంగా కేబినెట్ కూర్పు చేశారు. జిల్లాలు, సామాజిక వర్గాలను బట్టి కూర్పులో ప్రాధాన్యత ఇచ్చారు. ► మహాయజ్ఞంలా రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోంది. వెనుకబడిన వర్గాలకు మొదటిసారిగా భారీ స్థాయిలో మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించారు. డిప్యూటీ స్పీకర్‌గా వీరభద్రస్వామికి అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ముదునూరు ప్రసాదరాజు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా మల్లాది విష్ణు, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు చైర్మన్‌గా కొడాలి నానిని నియమించి ప్రాధాన్యత కల్పించారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అందరిని బ్యాలెన్స్ చేయడంలో సీఎం జగన్ సఫలీకృతం అయ్యారు. ► సీఎం దృష్టిలో పార్టీ పదవి, మంత్రి పదవి రెండూ ఒక్కటే. ఎక్కడైనా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తే నాయకులు సర్ది చెబుతున్నారు. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. -
సామాజిక మహా విప్లవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సరికొత్త సామాజిక మహా విప్లవం ఆవిష్కృతమయ్యింది. తొలిసారిగా 2019 నాటి కేబినెట్ కూర్పులో మొత్తం 25కు గాను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే 14 మంత్రి పదవులిచ్చి వారిని మెజారిటీ వర్గంగా కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. సామాజిక న్యాయాన్ని స్వయంగా ఆచరించి చూపిస్తూ... తాజా పునర్వ్యవస్థీకరణలో ఏకంగా ఆ సంఖ్యను 17కు పెంచారు. దీంతో సోమవారంనాడు కొలువు దీరనున్న కొత్త కేబినెట్లో బలహీనవర్గాలకు చెందిన మంత్రుల సంఖ్య 70 శాతానికి చేరుతోంది. ఇక ఆది నుంచి బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు... సొసైటీకి బ్యాక్ బోన్ (వెన్నెముక) క్లాస్ అని చెబుతున్న సీఎం... వారికి దీనిలో 10 బెర్తులు కేటాయించి కొత్త చరిత్రను ఆరంభించారు. అనుభవం, సామాజిక కూర్పు, జిల్లాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇదివరకటి కేబినెట్లో ఉన్న 11 మందిని కొనసాగించాలని జగన్ నిర్ణయించారు. కాకపోతే అందులోనూ ఇద్దరు ఓసీలు కాగా, మిగిలిన వారంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు చెందిన వారు కావటం గమనార్హం. మహిళలకు సైతం సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ... ఇప్పటిదాకా ముగ్గురే ఉండగా ఇపుడా సంఖ్యను నాలుగుకు పెంచారు. అగ్రకులాల నుంచి నలుగురు కాపు, నలుగురు రెడ్డి కులస్తులకు మాత్రం కేబినెట్లో స్థానం కల్పించి... కొడాలి నానికి (కమ్మ) రాష్ట్ర అభివృద్ధి మండలి ఛైర్మన్‌గా, విజయనగరానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామికి (వైశ్య) డెప్యూటీ స్పీకర్‌గా, ముదునూరి ప్రసాదరాజుకు (క్షత్రియ) చీఫ్ విప్‌గా, మల్లాది విష్ణుకు (బ్రాహ్మణ) రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. తెలుగుదేశానికి పూర్తి భిన్నంగా... టీడీపీకి బీసీలే వెన్నుముక.. బీసీలు లేనిదే టీడీపీ లేదంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎప్పుడూ చెబుతారు తప్ప నిజంగా బీసీలకు చేసిందేమీ లేదని తాజా పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పలువురు సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. గతంలో బాబు హయాంలో ఎప్పుడూ మెజారిటీ మంత్రివర్గ స్థానాలు అగ్రకులాలకే కేటాయించేవారని, సగానికన్నా ఎక్కువ స్థానాలను బలహీనవర్గాలకు కేటాయించిన పరిస్థితి టీడీపీ చరిత్రలో ఎప్పుడూ లేదని వారు గుర్తుచేస్తున్నారు. గతంలో 2017లో తన కుమారుడు లోకేష్ కోసం మంత్రివర్గాన్ని విస్తరించిన చంద్రబాబునాయుడు... 25 మంది మంత్రుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంఖ్యను 10కే పరిమితం చేశారని,, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి ఒక్కరంటే ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదని... ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు ఆయా వర్గాల నుంచి ఓట్ల కోసం ఒక్కొక్కరికి హడావుడిగా స్థానమిచ్చి నాటకమాడారని వారు గుర్తు చేస్తున్నారు. సామాజిక న్యాయానికి అటు చంద్రబాబు ... ఇటు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యం చూస్తుంటే నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇదీ... వైఎస్సార్ సీపీ సామాజిక న్యాయం ► రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆదరణ, ఆశీస్సులు, మద్దతుతో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలతో వైఎస్సార్సీపీ ఆఖండ విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ► 2019 జూన్ 8న 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 14 మంది (56 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా సామాజిక, రాజకీయ విప్లవానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఓసీ వర్గాల నుంచి 11 మందికి (44 శాతం) మంత్రి పదవులు ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇంత భారీ ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. ► ఐదుగురికి ఉప ముఖ్యమంత్రులు ఇస్తే.. అందులో నాలుగు పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే కట్టబెట్టారు. తద్వారా సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి సీఎం వైఎస్ జగన్ చాటి చెప్పారని రాజకీయ పరిశీలకులు అప్పట్లో ప్రశంసించారు. ► శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను నియమించారు. రాష్ట్ర శాసన మండలి చరిత్రలో తొలి సారిగా చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్ రాజు, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంను నియమించారు. ► శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే.. అందులో 18 మంది (56.25) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే అవకాశం కల్పించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభలో వైఎస్సార్సీపీకి నాలుగు స్థానాలు దక్కితే.. అందులో రెండింటిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించారు. కార్పొరేషన్, పరిషత్ ఎన్నికల్లోనూ.. ► జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వెఎస్సార్సీపీ చేజిక్కించుకుంది. అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో.. 648 మండలాలకు గాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకుంటే.. అందులో ఈ వర్గాలకు 67 శాతం పదవులు కేటాయించారు. ► 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే.. వాటి చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. ► నామినేటెడ్ పదవుల్లో.. నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి, అమలు చేసిన తొలి ప్రభుత్వం వైఎస్సార్సీపీ సర్కారే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి ప్రభుత్వం వైఎస్ జగన్ సర్కారే. ► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చారు. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 (39 శాతం) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం డైరెక్టర్ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, మూడు ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. విప్లవాత్మక నిర్ణయాల అమల్లో మరింత ముందుకు.. ► సామాజిక న్యాయ సాధనలో దేశంలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో సీఎం వైఎస్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. ► 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఓసీ వర్గాలకు చెందిన ఎనిమిది మందికి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మందికి చోటు కల్పించారు. ఇందులో పది మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు.. ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అంటే మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు. సామాజిక న్యాయంలో ఇది మహా విప్లవంగా రాజకీయ పరిశీలకులు, సామాజికవేత్తలు అభివర్ణిస్తున్నారు. ► 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో మహిళలకు మూడు మంత్రి పదవులు ఇస్తే.. పునర్ వ్యవస్థీకరణలో నలుగురికి మంత్రి పదవులను ఇవ్వడం ద్వారా మహిళా సాధికారతకు తాను ఇస్తున్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. చంద్రబాబు సామాజిక మోసం ► విభజన నేపథ్యంలో బీజేపీ, జనసేనతో జట్టుకట్టిన టీడీపీ.. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని దక్కించుకుంది. 2014 జూన్ 8న 19 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఓసీలకు 11 మంది (58 శాతం)కి.. ఆరుగురు బీసీలకు, ఇద్దరు ఎస్సీలకు.. వెరసి బీసీ, ఎస్సీలకు 42 శాతం మందికి చోటు కల్పించిన చంద్రబాబు సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కారు. ► కొడుకు నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి సభ్యున్ని చేసిన చంద్రబాబు.. 2017 ఏప్రిల్ 2న తొలిసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. 25 మందితో ఏర్పాటు చేసిన ఆ మంత్రివర్గంలో ఏకంగా 15 మంది ఓసీల(60 శాతం)కు పదవులు ఇచ్చారు. కేవలం ఎనిమిది పదవులు బీసీలకు, రెండు పదవులు ఎస్సీలకు ఇచ్చారు. అంటే బీసీ, ఎస్సీలకు మంత్రివర్గంలో కేవలం 40 శాతం పదవులే ఇచ్చారు. ► బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు రాజీనామా చేయడంతో ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు 2018 నవంబర్ 11న రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. కనీసం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాని వ్యక్తికి.. ఆ పదవికి ఎన్నికయ్యేందుకు తగిన సమయం లేకున్నా ఓట్ల కోసం గిరిజన వర్గానికి చెందిన కిడారి శ్రావణ్‌కుమార్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించడం చంద్రబాబు సామాజిక మోసానికి నిలువెత్తు నిదర్శనం. ► మైనార్టీ వర్గానికి చెందిన మహ్మద్ ఫరూక్‌కు అదే సమయంలో మంత్రివర్గంలో చోటు కల్పించారు. చివరి సారిగా మంత్రివర్గ విస్తరణను కలుపుకున్నా.. 13 మంది ఓసీలకు.. 12 మంది ఇతర వర్గాలకు పదవులు కేటాయించి సామాజిక న్యాయాన్ని అపహాస్యం చేశారు. -
AP: కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు!
సాక్షి, అమరావతి: దాదాపు మూడేళ్ల తరవాత పునర్వ్యవస్థీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు రాబోతున్నారు. ఇప్పటిదాకా ఉన్న కేబినెట్ నుంచి 10 మంది వరకూ... ఆయా జిల్లాల అవసరాలు, సామాజిక కూర్పు, అనుభవం ఆధారంగా ఇకపైనా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్ర కేబినెట్లో అగ్రవర్ణాలకు చెందిన వారు 44 శాతం ఉండగా... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే మెజారిటీ సంఖ్యలో 56 శాతంగా ఉన్నారు. అయితే తాజా పునర్వ్యవస్థీకరణలో బలహీనవర్గాల శాతం మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో చంద్రబాబు నాయుడి కేబినెట్లో 25 మంది మంత్రులకు గాను మెజారిటీ.. అంటే 13 మంది అగ్రవర్ణాల వారుండగా, బలహీనవర్గాలు 12 మందే ఉండి 48 శాతానికే పరిమితమయ్యారు. దానికి భిన్నంగా బలహీనవర్గాలకు పెద్ద పీట వేసి వారిని రాజ్యాధికారంలో మరింత కీలక భాగస్వాములను చెయ్యాలనే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటి నుంచీ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే 56 శాతం కేబినెట్ బెర్తులు వారికే కేటాయించారు. ఇపుడు ఆ సంఖ్యను మరింత పెంచబోతున్నారు. గవర్నరుకు రాజీనామాలు మంత్రివర్గంలో మొత్తం 25 మంది సభ్యులుండగా ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి మరణించడం తెలిసిందే. మిగిలిన 24 మంది మంత్రులూ పార్టీ బాధ్యతలు తీసుకోవటానికి స్వచ్ఛందంగా రాజీనామా చేయటంతో... వారి రాజీనామాలను ఆమోదించాలని సిఫార్సు చేస్తూ గవర్నర్‌కు లేఖ పంపారు. వీటిని గవర్నర్ ఆమోదించాక రాజ్‌భవన్ అధికారికంగా ప్రకటన విడుదల చేస్తుంది. అనంతరం కొత్త మంత్రుల జాబితాను సీఎం జగన్.. గవర్నర్‌కు పంపనున్నారు. మంత్రివర్గం కూర్పుపై సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కసరత్తు ఆదివారం మధ్యాహ్నానికి కొలిక్కి వస్తుందని, ఆ వెంటనే కొత్త మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపుతారని వైఎస్సార్సీపీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటిదాకా ఉన్నవారు 10 మంది కొనసాగుతారని, కొత్తగా 15 మంది చేరుతారని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. వారందరికీ ఆదివారం మధ్యాహ్నం గవర్నర్‌కు జాబితా పంపించిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేసి సమాచారమిస్తారని, సోమవారంనాడు అందుబాటులో ఉండాల్సిందిగా చెబుతారని తెలియవచ్చింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాక్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో వేదికను సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయిస్తారు. కాగా 2019 జూన్ 8న కూడా మంత్రులు ఇదే ప్రదేశంలో ప్రమాణ స్వీకారం చేయటం గమనార్హం. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార ఏర్పాట్లను వివిధ శాఖలకు విధులను అప్పగిస్తూ జీఏడీ (రాజకీయ) కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను కూడా సాధారణ పరిపాలన (ప్రోటోకాల్) విభాగం ఇప్పటికే సిద్ధం చేసింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక కొత్త, పాత మంత్రులు, అతిధులకు మధ్యాహ్నాం 1 గంటకు సచివాలయంలో తేనేటీ విందు (హైటీ) ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాస్ ఉంటేనే అనుమతి నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే వారు ప్రభుత్వం జారీ చేసిన అధికారిక పాస్‌లను వెంట తెచ్చుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ పేర్కొన్నారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే సభా స్థలంలోకి అనుమతిస్తామన్నారు. సోమవారం ఉదయం 10 గంటలలోపు రావాలన్నారు. కేవలం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే లోటస్ జంక్షన్ నుంచి కరకట్ట మీదుగా ప్రయాణించేందుకు నిర్ధేశించారని తెలిపారు. గుంటూరు, మంగళగిరి పరిసర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, అభిమానులు, వాహనదారులు ఎన్ఆర్ఐ ఆసుపత్రి జంక్షన్, మంగళగిరి, డాన్‌బాస్కో స్కూల్, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం మీదుగా సభా స్థలికి చేరుకోవాలన్నారు. విజయవాడ, ఇతర జిల్లాల నుంచి వచ్చే వారు ఉండవల్లి సెంటర్, పెనుమాక, కృష్ణాయపాలెం మీదుగా రావాలని చెప్పారు. మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం దృష్ట్యా తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు తదితర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మేరకు అందరూ సహకరించాలని కోరుతూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. -
పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ మాకు కీలకం: సజ్జల
-
ఉన్న వనరులను మెరుగ్గా వాడదాం
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా ఉత్పన్నమైన గడ్డు పరిస్థితులు, ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలకు మించి సవరించిన అంచనాలను ప్రతిపాదించవద్దని ఆర్థిక శాఖ సూచించింది. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించడమే లక్ష్యంగా వచ్చే ఆర్థిక ఏడాది (2022 – 23) బడ్జెట్ ప్రతిపాదనలను ఆన్లైన్లో వచ్చే నెల 6వ తేదీలోగా పంపాలని అన్ని శాఖలకు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బడ్జెట్ అంచనాలు, వాస్తవ వ్యయంలో భారీ వ్యత్యాసం లేకుండా కచ్చితమైన వివరాలతో బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మేనిఫెస్టోలో పథకాలు, నవరత్నాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర సాయంతో రాష్ట్ర అభివృద్ధి పథకాలు, విదేశీ సాయంతో చేపట్టిన ప్రాజెక్టులు, నాబార్డు ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధి పథకాలకు సంబంధించిన పూర్తి డేటాతో బడ్జెట్ ప్రతిపాదనలు అందించాలని పేర్కొంది. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడంతోపాటు వేగంగా పారిశ్రామికీకరణ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే లక్ష్యంగా గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా, విద్య, వైద్యం రహదారులు, రవాణా రంగాలకు ఆస్తుల కల్పన బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించింది. ఆదాయ వనరులు, ఆదాపై దృష్టి బడ్జెట్ కేటాయింపులు లేని పనులకు ఎలాంటి బిల్లులను అనుమతించబోమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని కొనసాగుతున్న పనులకే బడ్జెట్ ప్రతిపాదనలు అందించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లు, సుంకాలు, ఫీజుల ఆధారంగానే రెవెన్యూ రాబడి అంచనాలను రూపొందించాలని, పాత బకాయిల వసూళ్లను కూడా బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొనాలని సూచించింది. వీలైనంత మేర ఆదాయ వనరుల ఆర్జనపై శాఖలు దృష్టి సారించాలని పేర్కొంది. అన్ని శాఖల అధిపతులు వేతనాలు కాకుండా ఇతర అంశాల్లో కనీసం 20 శాతం మేర వ్యయాన్ని ఆదా చేసేలా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలని నిర్దేశించింది. సంక్షేమానికి ఎప్పటి మాదిరిగానే.. గతంలో మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి ఉప ప్రణాళికల ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్థిక శాఖ పేర్కొంది. మహిళలు, పిల్లల కోసం అమలు చేసే పథకాలు, కార్యక్రమాలకు ప్రత్యేకంగా బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలని సూచించింది. మహిళల కోసం నూటికి నూరు శాతం కేటాయింపులు, 30 నుంచి 99 శాతం కేటాయింపులు ప్రతిపాదనలను వేర్వేరుగా పంపాలని తెలిపింది. 18 ఏళ్లలోపు పిల్లలకు పూర్తిగా వంద శాతం, అంతకంటే తక్కువ కేటాయింపుల ప్రతిపాదనలు వేర్వేరుగా సమర్పించాలి. ఆర్ధిక శాఖ అనుమతించిన ఔట్ సోర్సింగ్ కన్సల్టెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు మాత్రమే బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలి. ఆర్ధిక శాఖ అనుమతిలేని వాటికి బడ్జెట్ ప్రతిపాదనలు చేయరాదు. అత్యవసరమైతేనే.. అత్యవసరమైతే మినహా ఎలాంటి సహాయక సిబ్బందిని విభాగాలు ప్రతిపాదించవద్దని ఆర్థిక శాఖ పేర్కొంది. వాహనాల కొనుగోళ్లపై నిషేధం కొనసాగుతుంది. అత్యవసర సర్వీసులకు మినహాయింపు వాహనాల కొనుగోలు ప్రతిపాదనలను పంపకూడదు. మంజూరైన పోస్టులకు వాస్తవ అవసరాల మేరకు వేతనాల బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలి. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు అవసరమైన వేతనాలను ప్రతిపాదించాలి. బడ్జెట్ అంచనాలు, వాస్తవ వ్యయానికి వ్యత్యాసం ఉంటున్న నేపథ్యంలో శాఖలు వాస్తవ నిధుల అవసరాన్ని సరిగా అంచనా వేసి ప్రతిపాదనలు చేయాలి. సబ్సిడీల కోసం అవసరమైన కేటాయింపులను వివరణాత్మకంగా రూపొందించాలి. బకాయి చెల్లింపులకు సంబంధించి ఏదైనా పెద్ద కేటాయింపును ప్రతిపాదిస్తే పూర్తి వివరాలను అందించాలి. -
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధతతో పాటు కోవిడ్–19 నివారణ, నియంత్రణ చర్యలు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నగరాలు, పట్టణాల్లో మధ్యతరగతి వర్గాల ప్రజలకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి సంబంధించి విధివిధానాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. విజయనగరం, ఒంగోలులో విశ్వవిద్యాలయాల ఏర్పాటు, మరిన్ని 104 వాహనాల కొనుగోలు, పశు వైద్యానికి సంబంధించి అంబులెన్స్‌ల ఏర్పాటు తదితర విషయాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
నేడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం
-
AP Budget 2021: ఇది అందరి బడ్జెట్
సాక్షి, అమరావతి: తొలిసారిగా మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ... అందుకు తగ్గట్టే కేటాయింపులు చేసిన జెండర్ బేస్డ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రాబోతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచిన 2021–22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఈ బడ్జెట్ ఆమోదం కోసం రాష్ట్ర ఉభయ సభలనూ ఒకరోజు ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి మూడు నెలలకు గాను రూ.70,983 కోట్ల మేర ఓటాన్ అకౌంట్‌కు గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఇపుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీకి సమర్పించబోతున్నారు. నిజానికి గడిచిన రెండేళ్లుగా యావద్దేశ ఆర్థిక వ్యవస్థను కోవిడ్ కకావికలం చేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సైతం ఇబ్బందులు ఎదుర్కొంటుండగా... కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక వనరులు కూడా బాగా తగ్గిపోయాయి. అయినప్పటికీ కరోనా సంక్షోభ కాలంలో ప్రజల కష్టాలను తీర్చిడమే లక్ష్యంగా 2021–22 ఆర్థిక ఏడాది వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేశారని, మొత్తం బడ్జెట్ పరిమాణం రూ.2.25 లక్షల కోట్ల నుంచి 2.30 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్ ఇది. హామీలు నెరవేరుస్తూ కేటాయింపులు... వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలో కూడా ఎన్నికల మేనిఫేస్టోలోని నవరత్నాల్లో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడమే ప్రధాన లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద ఎత్తున బిల్లులను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టడమే కాకుండా భారీగా చేసిన అప్పుల ప్రభావం ఈ సంవత్సరం బడ్జెట్ మీదా కనిపిస్తోంది. గత సర్కారు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడంతో పాటు పాత బిల్లుల చెల్లింపులు కూడా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతించిన మేరకు అప్పులు చేసైనా సరే అన్ని వర్గాల ప్రజలను కరోనా కష్టాల్లోంచి గట్టెక్కించడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ రూపకల్పనకు మార్గనిర్దేశం చేశారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం, జల వనరులు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం.. తదితర అంశాలకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుకకు రూ.18,000 కోట్లు వైఎస్సార్ పెన్షన్ కానుక కింద సామాజిక పెన్షన్‌ను వచ్చే జనవరి నుంచి రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచనున్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.18,000 కోట్లు కేటాయింపులు చేయనున్నారు. తొలిసారిగా జెండర్ బడ్జెట్ స్పృహతో.. అక్క చెల్లెమ్మలకు, 18 సంవత్సరాల్లోపు పిల్లలకు ఎంత ఖర్చు చేయనున్నారనే వివరాలను ప్రత్యేకంగా బడ్జెట్లో స్పష్టం చేయనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు ఈ బడ్జెట్లో ఉప ప్రణాళికలను ప్రవేశ పెట్టనున్నారు. మరో పక్క వృథా దుబారా, ఆర్బాటపు వ్యయాలకు చెక్ పెడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని, అన్ని రంగాల అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు కేటాయింపులను బడ్జెట్లో ప్రతిపాదించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఈ ఆర్థిక సంవత్సరం అమలు చేయనున్న నవరత్నాల్లోని పథకాలను ఏ నెలలో అమలు చేయనున్నామనే వివరాలతో క్యాలెండర్ ప్రకటించారు. ఇందుకు నిధుల లోటు రాకుండా బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. ‘ఈబీసీ నేస్తం’కు కేటాయింపులు ఈ బడ్జెట్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఈబీసీ మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకానికి కేటాయింపులు చేయనున్నారు. కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాలకు గత రెండేళ్లలో ఎంత ఆర్థిక సాయం అందించిందనే వివరాలతో పాటు ఈ బడ్జెట్లో ఎంత మేర ఆర్థిక సాయం చేయనున్నారో స్పష్టం చేయనున్నారు. సామాజిక పెట్టుబడిగా భావిస్తున్న వైద్య ఆరోగ్య రంగం, విద్యా రంగంలో నాడు–నేడు కార్యక్రమాల ద్వారా కల్పించే మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుల కోసం కల్పించే మౌలిక సదుపాయాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి బడ్జెట్ బయట నుంచి నిధులు సమీకరణ చేయడం వల్ల ఆ మేరకు కేటాయింపులు బడ్జెట్లో ప్రతిబింబించవని, అయినా ఆ రంగాలకు భారీగా నిధులు వ్యయం చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వ్యవసాయానికి పెద్దపీట వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ అనుంబంధ రంగాలన్నింటికీ కలిపి ఈ బడ్జెట్లో 29 వేల కోట్ల రూపాయల నుంచి 30 వేల కోట్ల రూపాయల కేటయింపులు ఉండవచ్చునని అధికార వర్గాల సమాచారం. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ సబ్సిడీతో పాటు రైతు భరోసాతో పాటు మల్టీపర్పస్ కేంద్రాల ఏర్పాటు, మార్కెటింగ్, ధరల స్థిరీకరణ నిధి, తదితర రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నారు. ఈ రంగానికి బడ్జెట్ బయట నుంచి కూడా నిధుల సమీకరణ చేయనున్నారు. ఆర్థికంగా రాష్ట్ర ఖజానా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి సుదీర్ఘ కసరత్తు అనంతరం మొత్తం రూ.2.25 లక్షల కోట్ల నుంచి రూ.2.30 లక్షల కోట్లతో 2021–22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ ప్రసంగం కోవిడ్ ఉధృతి నేపథ్యంలో గురువారం ఉదయం 9 గంటలకు గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ రాజభవన్ నుంచి అసెంబ్లీ, మండలి సభ్యులనుద్ధేశించి వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. అనంతరం ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పిన తర్వాత సభ ఆమోదించనుంది. అనంతరం 2021–22 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీకి సమర్పిస్తారు. ఇదే సమయంలో శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతారు. అనంతరం అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను చదువుతారు. ఇదే సమయంలో శాసన మండలిలో రహదారుల–భవనాల శాఖ (డిప్యుటీ సీఎం) మంత్రి ధర్మాన కృష్ణ దాసు వ్యవసాయ బడ్జెట్ సమర్పిస్తారు. ఆ తర్వాత ఉభయ సభల్లో శాఖల పద్దులు ప్రవేశపెట్టి, ఆమోదం పొందుతారు. చివరగా ద్రవ్య వినమయ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాక సమావేశాలు నిరవధికంగా వాయిదా పడనున్నాయి. అంతకు ముందు గురువారం ఉదయం 8 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేయనుంది. -
తుపాన్ వేగంతో సాయం
సాక్షి, అమరావతి: నివర్ తుపాను బాధితులను సత్వరమే అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. పంట నష్టం అంచనాలను డిసెంబర్ 15నాటికి పూర్తి చేసి 31 నాటికి రైతులకు పరిహారాన్ని అందిస్తామని ప్రకటించింది. తుపాను బాధితులందరికీ తక్షణం రూ.500 చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించింది. పోలవరం ఎత్తు ఒక్క సెంటీమీటరు కూడా తగ్గించేది లేదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైంది. తుపాను సహాయ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. డిసెంబర్లో 5 ప్రత్యేక పథకాలు/ కార్యక్రమాలను ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదించింది. మొత్తం 22 అంశాలపై కేబినెట్ చర్చించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరులకు వివరించారు. శరవేగంగా సహాయ చర్యలు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా నివర్ తుపాను బాధితులందరికీ తక్షణం రూ.500 చొప్పున పరిహారం చెల్లించాలని కేబినెట్ నిర్ణయం. డిసెంబర్ 15నాటికి పంటనష్టం అంచనాలు పూర్తి చేసి 31నాటికి రైతులకు పంట నష్ట పరిహారం పంపిణీ. పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో 80 శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరా. ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగిన చోట మార్గదర్శకాల ప్రకారం త్వరగా పరిహారం చెల్లింపు. 2న ‘ఏపీ అమూల్... చేయూత, ఆసరా లబ్ధిదారులకు పాడి పశువుల పంపిణీ మహిళల ఆర్థిక స్వావలంబనకు అమూల్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఏపీ అమూల్’ ప్రాజెక్టు కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం. డిసెంబరు 2న ‘ఏపీ అమూల్’ ప్రాజెక్టు ప్రారంభం. మొదట విడతగా వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోని 400 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చేయూత, ఆసరా లబ్ధిదారుల్లో ఆప్షన్లు ఎంపిక చేసుకున్న మహిళలకు ఆవులు, గేదెల యూనిట్ల పంపిణీ. 9,899 బల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 10న గొర్రె పిల్లలు, మేక పిల్లల పంపిణీ ఇదే కార్యక్రమం కింద 2.49 లక్షల యూనిట్ల గొర్రెలు, మేకల పంపిణీకి మంత్రివర్గం ఆమోదం. 14 గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలు, ఒక గొర్రెపోతు లేదా మేకపోతు కలిపి ఒక యూనిట్‌గా పరిగణన. చేయూత, ఆసరా పథకాల ద్వారా డిసెంబరు 10న లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. 15న ఉచిత పంటల బీమా మొత్తం పంపిణీ 2019–20 ఖరీఫ్‌కు సంబంధించి పంటల బీమా మొత్తాన్ని డిసెంబరు 15న పంపిణీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం. 2016–19 వరకు మూడేళ్లలో రైతులు రూ.871.26 కోట్లు బీమా ప్రీమియం కింద చెల్లించాల్సి వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించిన తరువాత రైతులకు ఇబ్బందులు తొలగాయి. 2019 ఖరీఫ్ నుంచి ప్రభుత్వమే రైతుల తరపున రూ.1,030.74 కోట్లు బీమా ప్రీమియం చెల్లించింది. 2019–20 ఖరీఫ్ బీమా పరిహారం కింద రూ.1227.77 కోట్లను డిసెంబరు 15న రైతులకు చెల్లించాలని నిర్ణయం. 21న భూముల సమగ్ర రీసర్వేకు శ్రీకారం ‘వైఎస్సార్ – జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షణ’ పథకం కింద సమగ్ర భూసర్వే ప్రాజెక్టు డిసెంబరు 21న ప్రారంభం. రూ.927 కోట్లతో ల్యాండ్ సర్వే ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం. డ్రోన్లు, రోవర్లు, బేస్ స్టేషన్ల ద్వారా పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహణ. సర్వే రాళ్లను ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందచేస్తుంది. 25న పేదలకు 30.60 లక్షల ఇళ్ల పట్టాలు ‘పేదలు అందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా డిసెంబరు 25న రాష్ట్రంలో 30.60 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీకి మంత్రివర్గం ఆమోదం. కోర్టు కేసులు ఉన్న చోట మినహా మిగిలిన అన్ని చోట్లా ఇళ్ల పట్టాలు పంపిణీ. లబ్ధిదారులకు డీపట్టాలు పంపిణీ చేసి కోర్టు కేసులు పరిష్కారం అయ్యాక కన్వెయిన్స్ డీడ్ ఇవ్వాలని నిర్ణయం. పేదలకు పంపిణీ చేసేందుకు రూ.23 వేల కోట్ల విలువైన 66,518 ఎకరాలను సేకరించారు. 11 వేల పంచాయతీల్లో 17,500 లే అవుట్లలో ఇళ్ల స్థలాలు పేదలకు పంపిణీ చేస్తారు. వైఎస్సార్–జగనన్న’ కాలనీలు... పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాల్లో ‘వైఎస్సార్–జగనన్న కాలనీల’ పేరిట పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వడానికి మంత్రివర్గం ఆమోదించింది. వీటి నిర్మాణ పనులను డిసెంబరు 25న ప్రారంభిస్తారు. 28.30 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తుంది. మొదటి దశలో 8,494 లే అవుట్లలో దాదాపు 16 లక్షల ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించి 2022 జూన్ నాటికి పూర్తి చేస్తారు. ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షల చొప్పున తొలి దశలో ఇళ్లను దాదాపు రూ.28,800 కోట్లతో పూర్తి చేస్తారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తారు. మిగిలిన 13 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని 2021 డిసెంబరులో ప్రారంభించి 2023 జూన్ నాటికి పూర్తి చేస్తారు. మొత్తం వైఎస్సార్–జగనన్న కాలనీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అర్హులైన లబ్ధిదారులకు ఏపీ టిడ్కో ఇల్లు రూపాయికే పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏల చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదించింది. టీడీపీ సర్కారు పెండింగ్‌లో ఉంచిన డీఏలతో సహా మూడు డీఏలు చెల్లించాలని నిర్ణయించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 3.144 శాతం పెంపు 2018 జూలై నుంచి వర్తింపజేస్తూ 2021 జనవరి నుంచి చెల్లించనుంది. 2019 జనవరి నుంచి మరో 3.144 శాతం డీఏ పెంపు వర్తింపు. ఇది 2021 జూలై నుంచి చెల్లిస్తారు. 2019 జూలై నుంచి మరో 5.24 శాతం డీఏ పెంపు. ఇది 2022 జనవరి నుంచి చెల్లిస్తారు. మొత్తం మీద డీఏ పాత బకాయిల కింద రూ.11 వేల కోట్లు, ఇక నుంచి ఏటా రూ.4,400 కోట్ల అదనపు భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. లాక్డౌన్ సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు నెలలపాటు జీతాలు, పింఛన్లలో విధించిన కోతల మొత్తాన్ని చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మార్చి పెండింగ్ జీతాలను డిసెంబరులో, ఏప్రిల్ పెండింగ్ జీతాలను 2021 జనవరిలో చెల్లిస్తారు. ‘పోలవరం’ సెంటీమీటరు కూడా తగ్గించం పోలవరం ఎత్తును ఒక్క సెంటీమీటరు కూడా తగ్గించేది లేదని మంత్రివర్గం స్పష్టం చేసింది. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ తన అనుకూల మీడియాతో కలసి దుష్ప్రచారం చేయటాన్ని ఖండించింది. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును ముందు ఆమోదించిన అసలైన డిజైన్ ప్రకారమే నిర్మిస్తామని స్పష్టం చేసింది. స్పిల్ వే పనులను యుద్ధ ప్రాతిపతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఆమోదం – డ్యాం రిహాబిలిటేషన్, ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండు, మూడు దశలను మంత్రివర్గం ఆమోదిస్తూ రూ.776.50 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ నిధులను ప్రపంచబ్యాంకు సమకూరుస్తుంది. సోమశిల – కండలేరు కాలువ సామర్థ్యాన్ని 12 వేల క్యూసెక్కుల నుంచి 24వేల క్యూసెక్కులకు పెంచుతూ పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.918 కోట్లతో 45కి.మీ. మేర కాలువ పనులు, రెండు బ్రిడ్జీలు సహా పలు పనులు చేపడతారు. అనంతపురం జిల్లా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో 10 టీఎంసీల నీటి నిల్వ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముంపు బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం రూ.240.53 కోట్లు ఇచ్చేందుకు అనుమతించింది. నాలుగు గ్రామాల పరిధిలో 1,729 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం అందిస్తారు. ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయర్ నార్త్ ఫీడర్ కాలువ విస్తరణ పనులకు మంత్రివర్గం ఆమోదించింది. రూ.632కోట్లు వెచ్చించి దాదాపు 100కి.మీ. మేర కాలువ సామర్థ్యం పెంచుతారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. ఏపీ పల్నాడు ఏరియా డ్రౌట్ మిటిగేషన్ ప్రాజెక్టŠస్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుకు ఆమోదించింది. ఇందులో భాగంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ స్కీం, వైఎస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను చేపడతారు. కృష్ణా–కొల్లేరు సెలైనిటీ మిటిగేషన్ ప్రాజెక్ట్ కార్పోరేషన్ లిమిటెడ్ పేరిట స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. ఇతర నిర్ణయాలు ఇవీ... ఆన్లైన్ జూదంపై ఉక్కుపాదం మోపాలని మంత్రివర్గం నిర్ణయించింది. ‘ఏపీ గేమింగ్ యాక్ట్ – 1974’ చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. రూ.25 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటును మంత్రివర్గం ఆమోదించింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ‘వైఎస్సార్–జగనన్న ’ మెగా ఇండస్ట్రియల్ హబ్ రాయితీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హబ్ ద్వారా వేలాదిమందికి ఉపాథి అవకాశాలు కల్పిస్తారు. నాణ్యమైన పశుదాణా ఉత్తత్తి, పంపిణీ, ధరల నియంత్రణకు ఉద్దేశించిన బిల్లు ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతారు. భూ వినియోగ మార్పిడి చట్ట సవరణ కోసం ఉద్దేశించిన ముసాయిదాను మంత్రివర్గం ఆమోదించింది. 2006 నాటి చట్టాన్ని ప్రభుత్వం సవరించనుంది. దీనిపై ఇదివరకే ఆర్డినెన్స్ జారీ చేసింది. అనంతపురం జిల్లా పెనుకొండలో గొర్రెల పెంపకం శిక్షణ కేంద్రం కోసం రూ.2.50కోట్లు ఖర్చు చేస్తారు. ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ చట్టం 2020 ముసాయిదా బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. మత్స్య, ఆక్వా రంగాల సమగ్రాభివృద్ధికి దోహదపడేలా ఈ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులు ప్రవేశపెడతారు. నాగార్జున సాగర్ వద్ద విజయపురి సౌత్‌లో రెసిడెన్సియల్ కాలేజీ, మైదానం, సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణం కోసం విద్యాశాఖకు ప్రభుత్వం 21 ఎకరాలను కేటాయించింది. విజయనగరం జిల్లా కురుపాం మండలం తేకరఖండిలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ కోసం జేఎన్టీయూకు 105.32 ఎకరాల కేటాయింపు. 29,752 హెక్టార్లలో పంట నష్టం... ప్రాథమిక అంచనాల ప్రకారం నివర్ తుపానుతో 29,752 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ఉన్నతాధికారులు అంచనా వేశారు. 16,290 హెక్టార్లలో వరి, 7,362 హెక్టార్లలో మినుము, 3,571 ఎకరాల్లో పత్తి, 2,529 ఎకరాల్లో ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. 1,371 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. నవంబరు 23–26 మధ్య నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో 288.80 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఇది 188శాతం అధికం. తుఫానుతో ముగ్గురు చనిపోగా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 673 ఇళ్లు దెబ్బతిన్నాయి. -
వైద్యుల్లో పీఆర్సీ జోష్
సాక్షి, అమరావతి: ఇటీవలి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బోధనాస్పత్రుల్లో వైద్యులకు పీఆర్సీ సిఫార్సుల ప్రకారం జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ ఆస్పత్రుల్లోని వైద్యుల్లో ఆనందం వెల్లువెత్తింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా ఆస్పత్రుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి వైద్యులు క్షీరాభిõÙకం చేశారు. సీఎం వైఎస్ జగన్ ఫొటో ముందు కేక్‌లు కట్‌చేసి సంతోషాన్ని పంచుకున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 110 శాతం, అసోసియేట్లకు 60 శాతం, ప్రొఫెసర్లకు 50 శాతం వరకూ వేతనం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికి సుమారు రూ. 312 కోట్లు ప్రభుత్వానికి అదనపు భారం పడుతుంది. ఆర్థికంగా రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా.. తమ సమస్యలు గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఆర్సీ ఇచ్చారని, మాట ఇస్తే వెనక్కి తగ్గరనే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారని ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ డా.జయదీర్ అన్నారు. 2016లోనే పీఆర్సీ ఇవ్వాల్సి ఉన్నా అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. తాజా పీఆర్సీ వల్ల 3 వేల మంది వైద్యులకు లబ్ధి చేకూరుతుందన్నారు. కడప రిమ్స్‌లో సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తున్న వైద్యులు కోవిడ్ సేవలు.. ఆయుష్ వైద్యులకు లబ్ధి కోవిడ్ సేవల్లో భాగంగా ఆయుష్ వైద్యులను నియమించడం 300 మంది వైద్యులకు లబ్ధి జరిగిందని, ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని ఆయుష్ వైద్యుల సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయుష్ వైద్యులకు ఉద్యోగ భద్రత కలి్పంచాలని సీఎంకు విన్నవించింది. -
నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయం ఒకటో బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా చేసేందుకు ఇటీవల విడుదల చేసిన ప్రత్యేక పారిశ్రామిక విధానానికి (జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం పథకం) కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే నూతన ఇసుక విధానంపై కేబినెట్ చర్చించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. మచిలీపట్నం పోర్టుకు సంబంధించి డీపీఆర్‌పై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
వర్షాల జోరు.. సాగు బాగు
సాక్షి, అమరావతి: ‘దేవుడి దయ వల్ల ఈ ఏడాది కూడా వర్షాలు బాగా పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 27 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఒకటీ రెండు మండలాలు మినహా అన్ని చోట్లా పుష్కలంగా వర్షాలు కురిశాయి. వ్యవసాయం చక్కగా సాగుతోంది. రాష్ట్రంలో లక్ష్యానికి మించి వరినాట్లు, పంటల సాగు ఇప్పటికే పూర్తయింది. రిజర్వాయర్లు నిండుతున్నాయి. నీళ్లకు ఇబ్బంది ఉండదు’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. బుధవారం సచివాలయంలో తన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై మంత్రులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. విద్యా సంస్థల ప్రారంభం విషయమై చర్చకు వచ్చినప్పుడు.. వచ్చే నెల 5 నుంచి స్కూళ్లు ప్రారంభిస్తున్నారంటే పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని మంత్రి శంకరనారాయణ ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలనేది మన నిర్ణయం కాదు. ఇది కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతోంది. వారెలా చెబుతారో అలా చేయాలి’ అన్నట్లు తెలిసింది. సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు విశ్వసనీయ సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. ► జగనన్న విద్యా కానుక పథకం కింద మదరసాలను కూడా చేర్చాలన్న మంత్రి అంజాద్ బాష సూచన మేరకు ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ► కరోనా వైరస్ బారిన పడి, కోలుకుని సమావేశానికి హాజరైన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అంజాద్‌బాషల ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి ఆరా తీసినట్లు తెలిసింది. పలువురు మంత్రులు నిధుల మంజూరు గురించి సీఎంకు విన్నవిస్తుండగా.. ‘మనం ఈ విషయాలు మాట్లాడుకుంటుంటే ఆయన (ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్) మనవైపు ఎలా చూస్తున్నారో చూడండి’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
1.50 కోట్ల కుటుంబాలకు ‘వైఎస్సార్ బీమా’
అమరావతి: బియ్యం కార్డు ఉండీ కుటుంబం ఆధార పడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ బీమా’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం ఆమోదించింది. గతంలో ఎల్ఐసీతో కలసి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేది. అయితే దీనిని కొంత కాలం క్రితం ఉపసంహరించుకుంది. దీంతో పేదలకు ప్రయోజనం కల్పించే ఈ పథకాన్ని పూర్తిగా సొంత నిధులతో అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్రంలో 1.50 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కల్పించే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.583.50 కోట్లు ఖర్చు చేయనుంది. బియ్యంకార్డుదారుల కుటుంబం ఆధారపడే 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వ్యక్తి సహజ మరణం పొందితే బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు బీమా పరిహారం ఇస్తారు. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తారు. 51 – 70 ఏళ్ల వ్యక్తి శాశ్వత వైకల్యం పొందినా, ప్రమాదవశాత్తు మరణించినా బాధిత కుటుంబానికి రూ.3 లక్షలు ఇస్తారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న ఇతర నిర్ణయాలు ఇలా ఉన్నాయి. ‘తూర్పు’లో 2 వేల ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ – తూర్పు గోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు బల్క్ డ్రగ్ పార్క్‌లలో ఒకటి రాష్ట్రానికి తీసుకురావాలని నిర్ణయించారు. అందుకోసం ఏపీఐఐసీకి అనుబంధంగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదించారు. – 2 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ బల్క్ డ్రగ్ పార్కు ద్వారా వచ్చే 8 ఏళ్లలో రూ.6,960 కోట్ల పెట్టుబడులు వస్తాయని, రూ.46,400 కోట్ల అమ్మకాలు జరుగుతాయని ప్రభుత్వం అంచాన వేస్తోంది. తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే ఈ క్లస్టర్ ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ క్టస్టర్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.730 కోట్లు ఖర్చు చేస్తుంది. – శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు కోసం రైట్స్ కంపెనీ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను మంత్రివర్గం ఆమోదించింది. ఈ పోర్టు మొదటి దశ కింద దాదాపు రూ.3,669.95 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ దశలో భాగంగా 2024–25నాటికి 12.18 ఎంటీపీఏ కార్గోను హ్యాండ్లింగ్, 2039–40 నాటికి 67.91 ఎంటీపీఏ కార్గో హ్యాండ్లింగ్ చేయాలన్నది లక్ష్యం. ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్ – ఏపీ ఆక్వాకల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) చట్టం–2006 సరవరణల ఆర్డినెన్స్‌కు ఆమోదం. తద్వారా సీడ్ కంపెనీల అక్రమాలకు అడ్డుకట్ట పడి, ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్ అందుతుంది. – పరిశ్రమల శాఖ రూపొందించిన రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం–2020కి ఆమోదం. – చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 26 టీచింగ్, 14 నాన్ టీచింగ్ పోస్టులు, వైఎస్సార్ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 27 టీచింగ్, 8 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు. – విశాఖపట్నం జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్ కేంద్రంలో రూ.510 కోట్లతో అదనంగా 115 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్ల ఏర్పాటు. – వైఎస్సార్ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్ సబ్ డివిజన్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం. పులివెందుల పోలీస్ సబ్‌డివిజన్ నుంచి రాయచోటి శివారు గ్రామాలు 120 కి.మీ. దూరంలో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. రాయచోటిలో కొత్తగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఆమోదం. వైఎస్సార్ జిల్లాకు కొత్తగా 76 హోంగార్డు పోస్టులు మంజూరు. – పంచాయతీరాజ్ శాఖలో తొలిసారిగా 51 డివిజనల్ అభివృద్ధి అధికారుల పోస్టులను మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. -
మంత్రులుగా చెల్లుబోయిన, సీదిరి
సాక్షి, అమరావతి/ విజయవాడ పశ్చిమ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో కొత్తగా నియమితులైన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు బుధవారం రాజ్‌భవన్‌లో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మధ్యాహ్నం 1.29 గంటలకు వారి చేత ప్రమాణం చేయించారు. కొత్తగా మంత్రివర్గంలో చేరుతున్న వారి పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ప్రకటించారు. తొలుత వేణుగోపాలకృష్ణ, తరువాత అప్పలరాజు ఇద్దరూ దైవసాక్షిగా పదవీ ప్రమాణం చేశారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో నిరాడంబరంగా సాగిన ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఉపముఖ్యమంత్రిగా నియమితులైన ధర్మాన కృష్ణదాస్, మంత్రులు ఆళ్లనాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పాదాభివందనాన్ని వారించిన సీఎం జగన్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వద్దకు వెళ్లి ఆయనకు పాదాభివందనం చేశారు. అనంతరం సీఎం వైఎస్ జగన్‌కు పాదాభివందనం చేయబోయారు. ఆయన వెంటనే అడ్డుకుని వారిని వారించారు. బీసీలకు పెద్ద పీట: ధర్మాన కృష్ణదాస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంత్రివర్గంలోనూ, రాజకీయ పదవుల్లోనూ బీసీలకు పెద్ద పీట వేశారని ఉపముఖ్యమంత్రిగా నియమితులైన ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రమాణస్వీకారోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడారు. ► ఒకేసారి ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత వైఎస్ జగన్‌దే. ► మంత్రివర్గ కూర్పులో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను తీసుకుని అందరికీ సామాజిక న్యాయం చేశారు. ► నాకు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలియచేస్తున్నా. రాజ్‌భవన్‌లో చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజులతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయిస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. చిత్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెట్లెక్కే కాళ్లను పార్లమెంటు మెట్లు ఎక్కించారు: శ్రీనివాసవేణుగోపాలకృష్ణ ► శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి సుభాష్ చంద్రబోస్‌ను రాజ్యసభకు పంపడం ద్వారా చెట్లెక్కే కాళ్లను పార్లమెంటు మెట్లు ఎక్కించిన ఘనత వైఎస్ జగన్‌దే. ► దివంగత రాజశేఖరరెడ్డి 2006, జూలై 22న నన్ను జడ్పీ చైర్మన్‌ను చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020, జూలై 22న నన్ను రాష్ట్రమంత్రిని చేశారు. పారదర్శకతతో పనిచేస్తా: అప్పలరాజు ► నాపై నమ్మకం ఉంచి మంత్రి పదవిని ఇచ్చినందుకు పారదర్శకతతో పని చేస్తా. ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి కృషి చేస్తా. జడ్పీటీసీ నుంచి మంత్రి పదవి వరకు చెల్లుబోయిన... తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం శంకరగుప్తం శివారు అడవిపాలెంలో చెల్లుబోయిన వెంకన్న, సుభద్రమ్మ దంపతులకు 1962లో శ్రీనివాస వేణుగోపాలకృష్ణ జన్మించారు. 2001లో రాజోలు జడ్పీటీసీ సభ్యునిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 2006లో మరోసారి జడ్పీటీసీ సభ్యునిగా గెలిచి, జడ్పీ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఏపీలో పీసీబీ సభ్యుడిగా పనిచేశారు. వైఎస్సార్సీపీలో చేరి, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి 2014లో పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి తోట త్రిమూర్తులుపై విజయం సాధించి, ఇప్పుడు మంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుతం ఆయన ఏపీ బాక్సింగ్ సంఘ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వైద్య వృత్తి నుంచి మంత్రి వరకు సీదిరి... శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ గ్రామంలో సీదిరి దానమ్మ, నీలయ్య దంపతులకు 1980లో సీదిరి అప్పలరాజు జన్మించారు. పదో తరగతిలో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి జనరల్ మెడిసిన్‌లో ఎండీ పట్టా పొందారు. కొంతకాలం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనంతరం 12 ఏళ్లపాటు కాశీబుగ్గలో వైద్యసేవలు అందించారు. 2017లో వైఎస్సార్ సీపీలో చేరి, పార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో పలాస నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, మహిళా శిశు సంక్షేమ శాఖ శాసనసభా కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు భార్య శ్రీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాలీబాల్ క్రీడాకారుడి నుంచి డిప్యూటీ సీఎం వరకు కృష్ణదాస్... గతంలో జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడు అయిన ధర్మాన కృష్ణదాస్ స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబగాం. ఆయన 1952లో జన్మించారు. విశాఖ బుల్లయ్య కాలేజీలో బీకాం చదివి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో 15 ఏళ్లపాటు ఉద్యోగం చేశారు. 2003లో రాజకీయ ప్రవేశం చేసి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున, 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా, విజయనగరం జిల్లా పార్టీ పరిశీలకుడిగా గతంలో పనిచేశారు. 2014లో ఓడినా... మళ్లీ 2019లో గెలిచి మంత్రి పదవి చేపట్టారు. గతంలో జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడు అయిన కృష్ణదాస్ ఐదేళ్ల క్రితం థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రపంచ వాలీబాల్ పోటీలకు జాతీయ జట్టు మేనేజర్‌గా పనిచేశారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయనకు సోదరుడు. సాక్షి, అమరావతి: మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదోన్నతి కల్పించారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. శాఖలు కూడా మార్చారు. మంత్రివర్గంలో కొత్తగా చేరిన ఇద్దరు మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు. ► ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి పొందిన ధర్మాన కృష్ణదాస్‌కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలను ఇచ్చారు. ఇటీవలి వరకూ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ వద్ద ఉన్న ఈ శాఖలను.. ధర్మానకు కేటాయించారు. ► మంత్రివర్గం నుంచి వైదొలగిన మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు వద్ద ఉండిన పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖలను సీదిరి అప్పలరాజుకు కేటాయించారు. ► ఇక చెల్లుబోయినకు బీసీ సంక్షేమ శాఖను ఇచ్చారు. ఇప్పటి వరకూ ఈ శాఖ మంత్రిగా ఉన్న ఎం.శంకరనారాయణను రోడ్లు–భవనాలు శాఖకు మార్చారు. ఇప్పటి వరకూ మంత్రి హోదాలో ధర్మాన కృష్ణదాస్ రోడ్లు, భవనాల శాఖను చూసేవారు. బోసు, వెంకటరమణారావు రాజీనామాల ఫలితంగా వీరి శాఖలు నిబంధనల ప్రకారం సీఎం వైఎస్ జగన్ వద్ద ఉండేవి. కొత్త మంత్రులు చేరడంతో ఈ మార్పులు అవసరమయ్యాయి. కొత్త మంత్రుల శాఖలు ఇలా.. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ బీసీ సంక్షేమం సీదిరి అప్పలరాజు పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ పదోన్నతి ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మార్పు ఇలా.. శంకరనారాయణ రోడ్లు, భవనాల శాఖ -
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు శాఖలను కేటాయించారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ధర్మాన కృష్ణదాస్‌కు డిప్యూటీ సీఎం పదవితోపాటు, రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. ధర్మాన వద్ద ఉన్న రోడ్లు, భవనాల శాఖను మంత్రి శంకర్ నారాయణకు కేటాయించారు.(మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణం) సీదిరి అప్పలరాజుకు మత్స్య, పశుసంవర్ధక శాఖ బాధ్యతలు అప్పగించారు. శంకర్ నారాయణ వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించారు. కాగా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మత్య్స, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇటీవల రాజ్యసభకు ఎన్నిక కావడంతో.. వారు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.(కొత్త మంత్రులకు జనసేన ఎమ్మెల్యే అభినందనలు) -
ఏపీకి ఇద్దరు కొత్త మంత్రులు