ANM
-
సీఎం గారూ రెగ్యులర్ చేయండి
సాక్షి, నాగర్‌కర్నూల్: పదహారేళ్లుగా పనిచేస్తున్నామని, తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలంటూ సెకండ్ ఏఎన్ఎంలు పోస్టుకార్డులు రాసి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏజ్ లిమిట్‌తో కొత్త నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు. 2007లో మంది 4025 మంది నియామకం ప్రజలకు క్షేత్రస్థాయిలో వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం 2007లో సెకండ్ ఏఎన్ఎంలను కాంట్రాక్టు పద్ధతిన నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,025 మంది సెకండ్ ఏఎన్ఎంలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాల అమలులో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. శిశువులు, గర్భిణులకు టీకాలు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్, పీహెచ్‌సీల్లో విధులు, ఆయుష్మాన్ భారత్ కార్డుల జారీ తదితర విధులతోపాటు మొత్తం 40 వరకు జాతీయ కార్యక్రమాలు, 32 వరకు ఆన్లైన్ రిపోర్టుల అందజేత వంటి విధుల్లో పాలుపంచుకుంటున్నారు. జీతమూ తక్కువే...: రెగ్యులర్ ఏఎన్ఎంలు నిర్వర్తించే అన్ని విధులు తాము నిర్వర్తిస్తున్నా జీతం మాత్రం రూ.25 వేలు ఉందని సెకండ్ ఏఎన్ఎంలు వాపోతున్నారు. అదనంగా టీఏ, డీఏలు సైతం ఇవ్వడం లేదని లేవని, 16 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని వృద్ధాప్యానికి చేరువవుతున్నా తమ ఉద్యోగాలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం కొత్తగా 1,520 పోస్టులతో ఏఎన్ఎం భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఏళ్లుగా ఆశతో చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎసరు పెట్టినట్లయ్యిందని సెకండ్ ఏఎన్ఎంలు ఆందోళన చెందుతున్నారు. వయోపరిమితితో అనర్హత.. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఏఎన్ఎం నోటిఫికేషన్లో ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వందకు 20 పాయింట్లు వెయిటేజీ కలి్పంచింది. అయితే ఇందులో జనరల్ అభ్యర్థులకు గరిష్టంగా 45 ఏళ్ల వయోపరిమితి విధించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల మినహాయింపు కలి్పంచింది. కానీ, సెకండ్ ఏఎన్‌ఎంలలో చాలావరకు 45 నుంచి 50 ఏళ్ల వయస్సు పైబడినవారే ఉన్నారు. ఏళ్లుగా చాలీచాలని జీతాలతో వైద్యసేవలు అందిస్తూ వృద్ధాప్య దశకు చేరుకుంటున్నా, ఉద్యోగ భద్రత కరువైందని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు. వయసు పైబడుతోంది.. ప్రభుత్వపరంగా చేపట్టే అన్ని ఆరోగ్య కార్యక్రమాల అమలులో కీలకంగా పనిచేస్తున్నాం.16 ఏళ్ల సర్విసుతో అందరి వయస్సు 45 ఏళ్లు దాటింది. ప్రభుత్వ నోటిఫికేషన్ రద్దు చేసి మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి. – హైమవతి, సెకండ్ ఏఎన్ఎం, తాడూరు పీహెచ్సీ, నాగర్‌కర్నూల్ జిల్లా -
తెలంగాణ నర్సుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు.. 27 ఏళ్లుగా సేవలు
వృత్తే దైవంగా,సేవే పరమార్థంగా భావించిన తేజావత్ సుశీలకు ఈ యేడాది ప్రతిష్టాత్మక ‘ఫ్లారెన్స్ నైటింగేల్’ అవార్డు దక్కింది.తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట ప్రాథమిక వైద్యశాలలోఏఎన్ఎంగా సేవలందిస్తున్న సుశీల గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా 27 ఏళ్ల తన కెరీర్ గురించి సుశీల ‘సాక్షి’తో పంచుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన తేజావత్ సుశీల జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా నర్సులు చేస్తున్న ఉత్తమ సేవలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ఏటా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2022, 2023 సంవత్సరాలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించారు. ఇందులో 2022కుగాను ఏఎన్ఎమ్ కేటగిరీలో తెలంగాణకు చెందిన నర్సు తేజావత్ సుశీల రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట సమీపంలో కనీసం రహదారి సదుపాయం కూడా లేని మారుమూల ప్రాంతంలో ఉండే గుత్తికోయలకు అందించిన సేవలకు గుర్తుగా నైటింగేల్ అవార్డును అందించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 1973 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 614 మంది నర్సులు ఉత్తమ నర్సులకు నైటింగేల్ అవార్డులు అందుకున్నారని కేంద్రం తెలిపింది. ‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని వీ వెంకటాయపాలెం అనే గ్రామం మా సొంతూరు. 1996లో ఏఎన్ఎంగా తొలి పోస్టింగ్ మణుగూరులో వచ్చింది. ఆ తర్వాత సుజాతనగర్లో కొన్నాళ్లు పని చేశాను. 2010 నుంచి ఏజెన్సీ ప్రాంతమైన ఎర్రగుంట పీహెచ్సీలో పని చేస్తున్నాను. 27 ఏళ్ల కెరీర్లో పనిలోనే సంతృప్తి వెతుక్కుంటూ వస్తున్నాను. మా ఇల్లు, నాకు కేటాయించిన గ్రామాలు తప్ప పెద్దగా బయటకి పోయిందీ లేదు. హైదరాబాద్‌కు కూడా వెళ్లడం తక్కువే. చదువుకునేప్పటి నుంచి ఈ రోజు వరకు... ఏనాటికైనా ఢిల్లీని చూస్తానా అనుకునేదాన్ని. కానీ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వరకు నా ప్రయాణం ఉంటుందని అనుకోలేదు. దేశ ప్రథమ మహిళ చేతుల మీదుగా అవార్డు అందుకున్న క్షణాలు మరువలేనివి. రెండు ప్రయాణాలు 2010 సమయంలో ఛత్తీస్గడ్ నుంచి గుత్తి కోయలు తెలంగాణకు రావడం ఎక్కువైంది. నా పీహెచ్సీ పరిధిలో మద్దుకూరు సమీపంలో గుత్తికోయలు వచ్చి మంగళబోడు పేరుతో ఓ గూడెం ఏర్పాటు చేసుకున్నట్టు అక్కడి సర్పంచ్ చెప్పాడు. ఆ గ్రామానికి తొలిసారి వెళ్లినప్పుడు ఎవ్వరూ పలకరించలేదు. నేనే చొరవ తీసుకుని అన్ని ఇళ్లలోకి తలుపులు తీసుకుని వెళ్లాను. ఓ ఇంట్లో ఓ మహిళ అచేతనంగా పడుకుని ఉంది. పదిహేను రోజుల కిందటే ప్రసవం జరిగిందని చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మనిషి నీరసించిపోయి ఉంది. ఒళ్లంతా ఉబ్బిపోయి ఉంది. వెంటనే ఆ గ్రామ సర్పంచ్‌ను బతిమాలి ఓ సైకిల్ ఏర్పాటు చేసి అడవి నుంచి మద్దుకూరు వరకు తీసుకొచ్చాను. అక్కడి నుంచి ఆటోలో కొత్తగూడెం ఆస్పత్రికి వచ్చాం. పరిస్థితి విషమించడంతో వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు. 108లో ఆమెను వెంటబెట్టుకుని వరంగల్‌కు తీసుకెళ్లాను. 21 రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఆ తల్లిబిడ్డలు ఇద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత అక్కడున్న వలస గుత్తి కోయలకు నాపై నమ్మకం కలిగింది. ఏదైనా సమస్య ఉంటే సంకోచం లేకుండా చెప్పుకోవడం మొదలు పెట్టారు. రక్తం కోసం బతిమాలాను ఓసారి గుత్తికోయగూడెం వెళ్లినప్పుడు పిల్లలందరూ నా దగ్గరకు వచ్చారు కానీ జెమిలీ అనే ఏడేళ్ల బాలిక రాలేదు. ఏమైందా అని ఆరా తీస్తూ ఆ పాప ఇంట్లోకి వెళ్లాను. నేలపై స్పృహ లేని స్థితిలో ఆ పాప పడుకుని ఉంది. బ్లడ్ శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే మలేరియా పాజిటివ్‌గా తేలింది. వెంటనే పీహెచ్‌సీకి అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకువస్తే పాప పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని డాక్టర్లు చెప్పారు. ఖమ్మం తీసుకెళ్లమన్నారు. ఆక్కడకు వెళ్తే వరంగల్ పొమ్మన్నారు. కానీ డాక్టర్లను బతిమాలి అక్కడే వైద్యం చేయమన్నాను. ఆ పాపది ఓ-నెగెటివ్ గ్రూప్ రక్తం కావడంతో చాలా మందికి ఫోన్లు చేసి బతిమాలి రెండు యూనిట్ల రక్తం సంపాదించగలిగాను. చివరకు ఆ పాప ప్రాణాలు దక్కాయి. మరోసారి ఓ గ్రామంలో ఓ బాలింత చంటిపిల్లకు ఒకవైపు రొమ్ము పాలే పట్టిస్తూ రెండో రొమ్ముకు పాలిచ్చేందుకు తంటాలు పడుతున్నట్టు గమనించాను. వెంటనే ఇన్ఫెక్షన్ గుర్తించి ఆస్పత్రికి తరలించాను. అర్థం చేసుకోవాలి మైదానం ప్రాంత ప్రజలకు ఒకటికి రెండు సార్లు చెబితే అర్థం చేసుకుంటారు. వారికి రవాణా సదుపాయం కూడా బాగుంటుంది. కానీ వలస ఆదివాసీల గుత్తికోయల గూడేల్లో పరిస్థితి అలా ఉండదు. ముందుగా వారిలో కలిసిపోవాలి. ఆ తర్వాత అక్కడి మహిళలను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే భర్త/తండ్రి తోడు రావాలి. వాళ్లు పనులకు వెళితే సాయంత్రం కానీ రారు. వచ్చే వరకు ఎదురు చూడాలి. వచ్చినా పనులు వదిలి ఆస్పత్రికి వచ్చేందుకు సుముఖంగా ఉండరు. ఆస్పత్రి కోసం పని వదులుకుంటే ఇంట్లో తిండికి కష్టం. అన్నింటికీ ఒప్పుకున్నా.... ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే అడవుల్లో ఉండే గుత్తికోయ గ్రామాలకు రవాణా కష్టం. క్షేత్రస్థాయిలో ఉండే ఈ సమస్యలను అర్థం చేసుకుంటే అత్యుత్తమంగా వైద్య సేవలు అందించే వీలుంటుంది. కోవిడ్ సమయంలో మద్దుకూరు, దామరచర్ల, సీతాయిగూడెం గ్రామాలు నా పరిధిలో ఉండేవి. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఈ మూడు గ్రామాల్లో కలిపి ఓకేసారి 120 మందిని ఐసోలేçషన్లో ఉంచాను. ఇదే సమయంలో మా ఇంట్లో నలుగురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రాణనష్టం రాకుండా సేవలు అందించాను. నా పరిధిలో ఉన్న గ్రామాల్లో ఏ ఒక్కరూ కోవిడ్‌తో ఇంట్లో చనిపోలేదు. వారి సహకారం వల్లే వృత్తిలో మనం చూపించే నిబద్ధతను బట్టి మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకప్పుడు అర్థరాత్రి ఫోన్ చేసినా డాక్టర్లు లిఫ్ట్ చేసి అప్పటికప్పుడు సలహాలు ఇస్తారు. అవసరాన్ని బట్టి హాస్పిటల్‌కు వచ్చి కేస్ అటెండ్ చేస్తారు. అదే విధంగా నాతో పాటు పని చేసే ఇతర సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారు. ఇక ఆశా వర్కర్లు అయితే నా వెన్నంటే ఉంటారు. ఏదైనా పని చెబితే కొంత ఆలçస్యమైనా ఆ పని పూర్తి చేస్తారు. వీరందరి సహకారం వల్లే నేను ఉత్తమ స్థాయిలో సేవలు అందించగలిగాను. ఈ రోజు నాకు దక్కిన గుర్తింపుకు డాక్టర్ల నుంచి ఆశావర్కర్ల వరకు అందరి సహకారం ఉంది’’ అని వివరించారు సుశీల. – తాండ్ర కృష్ణగోవింద్ సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం -
ఏపీలోనే ఏఎన్ఎంలు ఎక్కువ
రోగులకు వైద్యసేవల కల్పన, వారి సంరక్షణలో కీలకపాత్ర పోషించే నర్సుల అందుబాటు విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రభాగాన ఉంది. క్షేత్రస్థాయిలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలులో ముఖ్యపాత్ర పోషించే ఏఎన్ఎంలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా మనదే కావడం గమనార్హం. నర్సులు, ఏఎన్ఎం, జీఎన్ఎంల సంఖ్యలో సంబంధిత విద్యలో ఏపీ ముందంజలో ఉందని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ) వెల్లడించింది. ఇందుకు సంబంధించి 2021–22 వార్షిక నివేదికను ఐఎన్‌సీ విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. నర్సులు, జీఎన్ఎం, ఏఎన్ఎంల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలు ముందున్నాయి. – సాక్షి, అమరావతి ఏపీలో 1.39 లక్షల మంది ఏఎన్ఎంలు.. దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్ ఏఎన్ఎంలు 9.82 లక్షల మంది ఉన్నారు. అయితే, ఏపీలోనే అత్యధికంగా 1.39 లక్షల మంది ఉన్నారు. రాజస్థాన్‌లో 1.10 లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 75వేల మంది ఉన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కేవలం 10,219 మందితో 19వ స్థానంలో ఉంది. అయితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రవ్యాప్తంగా 15వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పి సచివాలయానికొక ఏఎన్ఎంను నియమించిన విషయం తెలిసిందే. రిజిస్టర్డ్ నర్సులు దేశవ్యాప్తంగా 24.71 లక్షల మంది ఉన్నారు. తమిళనాడులో అత్యధికంగా 3.32 లక్షల మంది ఉండగా, కేరళలో 3.15 లక్షల మంది, మూడోస్థానంలో ఉన్న ఏపీలో 2.62 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ 53,314 మందితో 14వ స్థానంలో ఉంది. కొత్త కోర్సులు.. సెమిస్టర్ విధానం నర్సింగ్ విద్యలో కౌన్సిల్ అనేక మార్పులు చేసింది. వైద్య రంగంలో వస్తున్న ఆధునిక మార్పుల నేపథ్యంలో సిలబస్‌లో సవరణలు చేసింది. బీఎస్సీ నర్సింగ్ విద్యలో ఇప్పుడు సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరమే ఇది అమల్లోకి వచ్చింది. మరోవైపు.. డాక్టర్ ఆఫ్ నర్సింగ్ ప్రోగ్రాంను, ఈ–లెర్నింగ్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఫౌండేషన్, కోర్, ఎలక్టివ్ కోర్సులు ప్రారంభించింది. గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో పేషెంట్ సెంటర్డ్ కేర్‌ను తీసుకొచ్చింది. ఇందులో రోగి వ్యక్తిగత ప్రాధాన్యతలు, అవసరాలను గుర్తించి సంపూర్ణమైన సేవలు అందించాల్సి ఉంటుంది. నర్సింగ్ కౌన్సిల్ కొన్ని సూచనలు కూడా చేసింది. అవి.. ♦ హెల్త్‌కేర్ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ♦ రోగి విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ♦ వ్యక్తిగత పనితీరుతో రోగికి ఎలాంటి ప్రమాదం కలిగించకుండా వ్యవహరించాలి. ♦స్కిల్ ల్యాబ్, క్లినికల్ లెర్నింగ్ పద్ధతులపై దృష్టి సారించాలి. నర్సింగ్ విద్యలోనూ టాప్–5లో.. ఇక నర్సింగ్ విద్యలోను ఏపీ దేశంలోని టాప్–5 రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. 2022 మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్ సీట్లకు సంబంధించి కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 19,860 సీట్లు ఉండగా, తమిళనాడులో 12వేలు, మధ్యప్రదేశ్‌లో 9వేలు, రాజస్థాన్‌లో 8,165 ఉన్నాయి. ఏపీ 8,030 సీట్లతో ఐదో స్థానంలో ఉంది. తెలంగాణ 4,980 సీట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక ఏఎన్ఎం విద్యకు సంబంధించి 910 సీట్లతో ఏపీ దేశంలో 12వ స్థానంలో, 455 సీట్లతో తెలంగాణ 17వ స్థానంలో ఉంది. మరోవైపు.. జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ) సీట్లు తెలంగాణలో 3,962 ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 7,125 ఉన్నాయి. ఇవి దేశంలోనే అత్యధికంగా కర్ణాటకలో 24,731 సీట్లున్నాయి. ఇక ఏఎన్ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 31 ఉండగా, తెలంగాణలో 16 మాత్రమే ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 545 స్కూళ్లు ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ 18వ స్థానంలో ఉంది. జీఎన్ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 163 ఉండగా, తెలంగాణలో 88 ఉన్నాయి. కర్ణాటకలో ఇవి అత్యధికంగా 520 ఉన్నాయి. -
ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఏఎన్ఎంలు, ఎంపీహెచ్‌ఏల ధర్నా
సుల్తాన్‌బజార్(హైదరాబాద్): కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఏ, ఏఎన్ఎంలను క్రమబద్ధీకరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో గురువారం కోఠి డీఎంహెచ్ఎస్ ప్రాంగణంలో ఏఎన్ఎంలు పెద్దఎత్తున ఆందోళన చేశారు. సమస్యలు పరిష్కరించాలని నినదించారు. సంఘం ప్రధానకార్యదర్శి యాదనాయక్ మాట్లాడుతూ ఏఎన్ఎంలు, ఎంపీహెచ్ఏలు పని ఒత్తడికి గురవుతున్నారని, వారి పనిభారాన్ని తగ్గించాలని అన్నారు. జాబ్‌చార్ట్ ప్రకారం పనిచేయించాలని, సిబ్బంది సెలవులు రద్దు చేయొద్దని కోరారు. పీహెచ్సీ, యూపీహెచ్‌సీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంపీహెచ్(ఎఫ్)ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరారు. బదిలీలు, వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
త్వరలో జ్వర సర్వేలు
సాక్షి, హైదరాబాద్: ఫస్ట్, సెకండ్ వేవ్‌ల సందర్భంగా ప్రభుత్వం గ్రామాలు, బస్తీల్లో జ్వర సర్వేలు చేపట్టింది. జ్వరం వచ్చిన వారందరికీ హోం ఐసోలేషన్ కిట్లను అందజేసింది. దాదాపు 8 లక్షల మంది జ్వర పీడితులకు కిట్లు ఇచ్చి వైరస్ కట్టడికి కట్టుదిట్ట చర్యలు తీసుకున్నారు. ఇది వినూత్న కార్యక్రమం కావడంతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. దీంతో ఈసారి కూడా జ్వర సర్వేలు చేపట్టాలని నిర్ణయించినట్లు వైద్య వర్గాలు చెప్పాయి. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి జ్వర పీడితులను గుర్తించి అక్కడికక్కడే కిట్లను ఇస్తారు. అవసరమైన వారికి కరోనా పరీక్షలు చేయిస్తారు. జ్వరం సర్వేల సమయంలో కోటి హోం ఐసోలేషన్ కిట్లను అందజేయాలని నిర్ణయించారు. సెకండ్ వేవ్‌లో పారాసిట్మాల్, అజిత్రోమైసిన్, లివోసిట్రజిన్, విటమిన్ మాత్రలు, స్టెరాయిడ్స్లతో కూడిన హోంఐసోలేషన్ కిట్లు అందించారు. ఈసారి కిట్లలో స్టెరాయిడ్స్ ఉంచడం లేదని వైద్య వర్గాలు చెప్పాయి. స్టెరాయిడ్స్ అందరికీ అవసరం లేదని, దీనివల్ల గతంలో అనేక మందికి అనారోగ్య సమస్యలు వచ్చాయన్నాయి. కిట్లను త్వరితంగా సిద్ధం చేసేందుకు ఆగమేఘాల మీద ఆర్డర్లు పెట్టారు. మందులను కోట్లలో సేకరించి, వాటిని కిట్లలో ఉంచేందుకు వివిధ కంపెనీలకు బాధ్యత అప్పగించారు. థియేటర్ల సంగతేంటి? కేసులు పెరుగుతుండటం, సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో వివిధ అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ సమాలోచనలు చేస్తోంది. పండుగ సందర్భంగా బస్సులు, రైళ్లు, విమానాలు, ఇతరత్రా వాహనాల్లో ప్రజల రద్దీ ఉంటుంది. మరోవైపు సినిమా హాళ్లు కూడా నిండుతాయి. ఈ నేపథ్యంలో సమగ్రమైన కరోనా జాగ్రత్తలను పాటించాలని, ఆ మేరకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని యోచిస్తున్నారు. ఇక సినిమా హాళ్లలో పక్కపక్కన కూర్చోవడం, గాలి, వెలుతురు పెద్దగా ఉండని స్థితిలో వందల మంది ఉండటంవల్ల వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లలో సగం ఆక్యుపెన్సీకి అవకాశమిస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య వర్గాలు చర్చిస్తున్నాయి. -
తమాషా చేస్తున్నావా?.. డ్యూటీ అంటే లెక్కలేదా?
కణేకల్లు: ‘ఏం తమాషా చేస్తున్నావా? డ్యూటీ అంటే లెక్క లేదా? పని చేయాలనుకుంటున్నావా? లేదా? డ్యూటీ పట్ల ఇంత నిర్లక్ష్యమైతే ఎలా?’ అంటూ కణేకల్లు రెండో సచివాలయ ఏఎన్ఎం పర్థమ్మపై జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కణేకల్లు రెండో సచివాలయాన్ని జేసీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పరిధిలో బాలింతలు, గర్భిణులు, చిన్నారుల గురించి ఏఎన్ఎం పర్థమ్మతో ఆరా తీశారు. ఆమె సరైన సమాధానం ఇవ్వకపోవడంతో రికార్డులు పరిశీలించారు. అందులో ఎలాంటి సమాచారాన్ని నమోదు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై వెంటనే డీఎంహెచ్ఓ డాక్టర్ కామేశ్వరరావుకు ఫోన్ చేసి సచివాలయ ఏఎన్ఎంల పనితీరుపై పర్యవేక్షణ లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. చదవండి: బస్తాలు మోసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న పర్థమ్మకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన సరైన సమాధానాలు ఇవ్వని మహిళా పోలీస్‌పై మండిపడ్డారు. పనితీరు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులను ఆమె హెచ్చరించారు. అనంతరం చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట సర్పంచ్ నిర్మల, వైస్ సర్పంచ్ నబీషా, తహసీల్దార్ ఉషారాణి, ఎంపీడీఓ విజయభాస్కర్, ఈఓఆర్డీ గూడెన్న, ఈఓ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. సేవలు మరింత విస్తృతం చేయండి.. బెళుగుప్ప: సచివాలయాల ద్వారా అందుతున్న సేవలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్యోగులకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ సిరి సూచించారు. బెళుగుప్ప మండలం హనిమరెడ్డిపల్లి సచివాలయాన్ని మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం కాలువపల్లిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పండ్ల తోటల పెంపకాన్ని పరిశీలించారు. పండ్ల తోటల పెంపకం వల్ల దీర్ఘకాలిక దిగుబడులు సాధించే అవకాశమున్నందున సన్న, చిన్న కారు రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ముస్తాఫాకమాల్ బాషా, ఏపీఓ కృష్ణమూర్తి, వీఆర్ఓ చంద్ర, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. చదవండి: దీక్ష చేస్తే కుటుంబాన్నే అవమానించారే బాబూ..! -
కోవిడ్ కట్టడిలో వలంటీర్లు, ఏఎన్ఎంల పాత్ర కీలకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్–19 కట్టడి, వ్యాప్తి నియంత్రణలో గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్ఎంలు కీలకపాత్ర పోషించారని నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక ప్రశంసించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కోవిడ్–19 పట్ల అవగాహన కల్పించడంతో పాటు స్వల్ప లక్షణాలున్న వారిని హోమ్ ఐసొలేషన్‌లో ఉంచడంలో వలంటీర్లు ప్రధాన భూమిక పోషించారని పేర్కొంది. రాష్ట్రంలో సమగ్ర హోమ్ ఐసొలేషన్ వ్యవస్థను బాగా నిర్వహించారని కితాబిచ్చింది. గ్రామాల్లో కోవిడ్ లక్షణాలున్న వారిని గుర్తించడం, వారికి పరీక్షలు చేయించడం, హోమ్ ఐసొలేషన్‌లో ఉంచి పర్యవేక్షించడంలో ఏఎన్ఎంలు, వలంటీర్ల కృషి బాగుందని తెలిపింది. కోవిడ్–19 రెండు వేవ్‌లలో వివిధ రాష్ట్రాలు అనుసరించిన హోం ఐసొలేషన్ ఉత్తమ పద్ధతులను నీతి ఆయోగ్ నివేదిక వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర హోం ఐసొలేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు నివేదిక తెలిపింది. నివేదికలో ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ► కోవిడ్–19 లక్షణం లేదా స్వల్పంగా రోగలక్షణాలున్న వారికి ఏఎన్ఎంల సహాయంతో గ్రామ, వార్డు వాలంటీర్లు అవగాహన కల్పించడంతో పాటు వారి పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. ► ఇంట్లో రోగులకు వారి లక్షణాలను ఎలా స్వయంగా పర్యవేక్షించాలనే దానిపై అవగాహన కల్పించడంతో పాటు గృహ సంరక్షణ వస్తు సామగ్రి (ఔషధాలతో సహా) రోగులకు అందించారు. రాష్ట్రం హోమ్ ఐసొలేషన్ సహాయాన్ని కూడా ఏర్పాటు చేసింది. ► అత్యవసర పరిస్థితుల్లో డెస్క్‌లు, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. ► తేలికపాటి లక్షణాలున్న రోగులకు కోవిడ్–19కి పరీక్షలు చేయించారు. ► లక్షణం లేనివారు, స్వల్పంగా రోగలక్షణాలు ఉన్నవారు ఇంట్లో ఒంటరిగా ఉండాలని సూచించారు. అనుభూతి చెందుతున్న వ్యక్తులు అనారోగ్యం, జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలను కలిగి ఉండటం లేదా ముక్కు, గొంతు నొప్పి ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, ఒంటరిగా ఉండాలని సూచించారు. ► అటాచ్డ్ బాత్రూమ్తో కూడిన ప్రత్యేక గది ఉండేలా చూసుకోవాలని సూచించారు. ► ఒక దూతగా వ్యవహరించగల కేర్‌టేకర్.. సంరక్షకులుగా వ్యవహరించాలని సూచించారు ► 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు వైద్యుల ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉండటానికి అనుమతించారు. ► హెచ్ఐవీ, అవయవ మార్పిడి, క్యాన్సర్ రోగులు.. చికిత్స చేసే వైద్యుడి సూచన మేరకు మాత్రమే హోమ్ ఐసొలేషన్‌ను అనుసరించాలని సూచించారు. ► రోగుల పరీక్ష ఫలితాలు నోటిఫై చేసిన తరువాత వారిని ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు వలంటీర్లు సంప్రదించారు. ► రోగుల ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవడంతో పాటు హోమ్ ఐసొలేషన్ కిట్లు (జ్వరం, జలుబుకు చెందిన ఔషధాలతో కూడిన కిట్, మాస్కులు) పంపిణీ చేశారు. ► తూర్పు గోదావరి జిల్లాలోని ఆస్పత్రులపై భారం తగ్గించేందుకు జిల్లా అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. ► గ్రామాల్లో ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► గ్రామాల్లో చాలామందికి తేలికపాటి లక్షణాలున్నా.. స్థలం లేకపోవడంతో ఇళ్లల్లో ఉండలేకపోయే వారిని గుర్తించి ఐసొలేషన్ కేంద్రాల్లో చేర్చి ఇంట్లో వండిన ఆహారాన్ని అందించారు. ► సర్పంచ్‌లు లేదా వలంటీర్ల ద్వారా ఆహారం అందించడంతో పాటు గ్రామ కార్యదర్శులు పర్యవేక్షిస్తూ ప్రథమ చికిత్స అందించారు. అవసరాన్ని బట్టి వైద్య సహాయం ఏర్పాటు చేశారు ► కోవిడ్ కేర్ కేంద్రాల్లో మందులు, ఆక్సిజన్ వంటి అవసరమైన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. ► కోవిడ్ కేర్ కేంద్రాల్లో రోగులకు ఆహార సదుపాయాలు కల్పించారు. కోవిడ్ కేంద్రాలను డాక్టర్లు రోజుకు మూడుసార్లు సందర్శించారు. ► అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. రోగులను క్రమం తప్పకుండా పర్యవేక్షించారు. ► ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలు పరీక్షిస్తూ ఆక్సిజన్ 94 కంటే తక్కువగా ఉన్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా వెంటనే వైద్యులకు సమాచారం అందించడమే కాకుండా వారిని వెంటనే ఆస్పత్రికి పంపించారు. ► మెడికల్ సపోర్ట్, మానిటరింగ్ కింద ఉంచిన వ్యక్తులను గుర్తించడానికి కోవిడ్–19 హెచ్చరిక ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. 8 ఇంట్లో విడిగా ఉంచడం, టెలికమ్యూనికేషన్స్ సాంకేతిక సహాయంతో దీన్ని నిర్వహించారు. ► సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్‌ఫామ్‌లు, మొబైల్ టవర్ సిగ్నల్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ద్వారా పాజిటివ్ కేసులను, వారి పరిచయాలను మ్యాప్ చేశారు. ► అత్యవసర పరిస్థితుల్లో హోమ్ ఐసొలేషన్స్కు హెల్ప్ డెస్క్, ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. -
ఇన్నాళ్లు సేవ చేసినందుకు ఇదా ఫలితం?
-
దారుణం: రాత్రంతా వర్షంలోనే..
సాక్షి, తూర్పుగోదావరి: మహమ్మారి కరోనా భయం మానవత్వాన్ని మంటగలుపుతోంది. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇందుకు అద్దం పట్టే ఘటన తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో చోటుచేసుకుంది. తన భర్తకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఓ ఏఎన్ఎం పడరాని పాట్లు పడ్డారు. రాత్రంతా వర్షంలోనే ఉండిపోయారు. వివరాలు.. బుర్రిలంకకు చెందిన ఓ మహిళ ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త ఇటీవల కోవిడ్-19 బారిన పడటంతో అతడిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఏఎన్ఎం కారణంగా తమకు కూడా కరోనా సోకుతుందనే భయంతో గ్రామస్తులు ఆమెను ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె రాత్రంతా వర్షంలోనే గడిపారు. (కడసారి వీడ్కోలుకు కానరారే!) ఈ విషయం గురించి సదరు ఏఎన్ఎం మాట్లాడుతూ.. సొంత ఇంట్లోకి తనను అడుగుపెట్టనివ్వకుండా గ్రామస్తులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు గ్రామానికి సేవ చేసినందుకు ఇదేనా ఫలితం అంటూ వాపోయారు. కాగా మహమ్మారి సోకిందంటే చాలు సొంత వాళ్లను కూడా శత్రువులుగా భావించే రోజులు దాపురించిన తరుణంలో... సాధారణ ప్రజలతో పాటు ఫ్రంట్‌లైన్ వారియర్లకు కూడా చేదు అనుభవాలు తప్పడం లేదు. ఇక కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు సొంత కుటుంబ సభ్యులే నిరాకరిస్తున్న ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. -
వాగు దాటి.. వైద్యం అందించి..!
సాక్షి, కెరమెరి(ఆసిఫాబాద్) : ఇటీవల కురుస్తున్న వానలకు పొంగిపొర్లుతున్న వాగులను సైతం లెక్కచేయకుండా వైద్య సిబ్బంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 30కు పైగా గ్రామాలు వాగు అవతల ఉండడంతో ఈ కష్టాలు నిత్యం తప్పడం లేదని సిబ్బంది వాపోతున్నారు. కెరమెరి ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో ఏఎన్ఎం సుమలత, హెల్త్ అసిస్టెంట్లు వసంత్, శత్రుఘన్ గురువారం మండలంలోని కరంజివాడ వాగును దాటి వైద్య సేవలిందించారు. నడుము వరకు నీళ్లు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఆంద్‌గూడ, గోండ్ కరంజివాడ, పెద్ద కరంజివాడ గ్రామాలకు వెళ్లి 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరుగురి రోగుల నుంచి రక్త పూతలు సేకరించారు. నలుగురి గర్భవతులకు పరీక్షలు నిర్వహించి మాత్రలు అందించారు. -
అందని నగదు !
నిజామాబాద్ రూరల్ మండలం కాలూరు గ్రామానికి చెందిన సావిత్రి (పేరు మార్చాం) గత ఏడాది నవంబర్‌లో డెలివరీ అయింది. ఇప్పటి వరకు ఆమెకు అందవల్సిన నగదు ప్రోత్సాహకం అందలేదు. నగదు ప్రోత్సాహకానికి సంబంధించి అన్ని వివరాలు స్థానిక ఆశవర్కర్ ద్వారా నమోదు చేసుకుంది. అయినా ఫలితం లేదు. ఇది ఒక కాలూరు మహిళకు సంబంధించింది సమస్య కాదు.. జిల్లా వ్యాప్తంగా ఆరు వేల మంది నగదు ప్రోత్సాహకం అందక ఎదురుచూస్తున్నారు. సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో ప్రతి నెలా సుమారు 1100 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గర్భిణులకు, బాలింతలకు కేసీఆర్ కిట్ కింద ప్రోత్సాహకాలు అందించవల్సి ఉంటుంది. మహిళ గర్భం దాల్చిన వెంటనే స్థానిక ఆశ ఏఎన్ఎం ద్వారా పేరు నమోదు చేసుకొని రూ. 3000 చొప్పున మొదటిసారిగా పొందుతారు. రెండవ విడత ప్రభుత్వ ఆస్పతిలో ప్రసవం అయితే ఆడపిల్లలకు రూ.5000, మగపిల్లవాడు పుడితే రూ.4000 అందిస్తారు. మూడవ విడత పిల్లలకు స్థానిక ఏఎన్ఎం వద్ద టీకాలు ఇప్పిస్తే రూ.2000 అందిస్తారు. చివరి విడత 4వ విడతలో పిల్లలకు జెఈ, మిస్సల్స్ వాక్సిన్ ఇస్తే రూ.3000 అందిస్తారు. ఇలా నగదు ప్రోత్సాహకం విడతలు వారీగా అందించవల్సి ఉంది. జిల్లాలో ప్రస్తుతం 6 వేల మంది గర్భిణులు వివిధ దశలలో నగదు ప్రోత్సాహకానికి స్థానిక ఏఎన్ఎం వద్ద పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం 2 కోట్ల 44 లక్షల రూపాయలు అందించవల్సి ఉంది. గత నాలుగు నెలలుగా ఈ నగదు ప్రోత్సాహకం అందడం లేదు. సుఖమైన ప్రసవం, పేద , మధ్యతరగతి వారికి డెలవరీ సక్రమంగా జరగడం, మాతృ శిశుమరణాలు తగ్గించడానికి నగదు ప్రోత్సాహకం అందిస్తున్నారు. ఇప్పటి వరకు నగదు ప్రోత్సాహకం సక్రమంగా అందడం లేదు. జిల్లాలోని 32 పీహెచ్‌సీల పరిధిలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆలస్యం ఎందుకంటే.. గతంలో కేసీఆర్ కిట్ నగదు ప్రోత్సాహకాలకు సంబంధించి ఆశ, ఏఎన్ఎంలు టీఎస్ ఆన్లైన్ ద్వారా వీరి వివరాలు నమోదు చేయగానే హైదరాబాద్ నుంచి వీరికి అందవల్సిన ప్రోత్సాహకం వారి బ్యాంకు ఖాతాలో నేరుగా వేసేవారు. గత నాలుగు నెలల నుంచి టీఎస్ ఆన్లైన్ బదులు టీసీఎస్ సంస్థకు ఈ పక్రియను అప్పగించారు. కొన్ని నమోదు పద్ధతులను మార్చడం వల్ల గతంలో నమోదు అయిన పేర్లను గుర్తించకలేకపోవడంతో ఈ పక్రియ ఆలస్యమై నగదు ప్రోత్సాహకం అందడం లేదు. ఈ ప్రక్రియ ప్రస్తుతం సరిచేసే పనిలో ఉన్నతాధికారులు ఉన్నారు. నమోదులో అనేక ఆటంకాలు... నగదు ప్రోత్సాహకానికి సంబంధించి గర్భిణుల వివరాల నమోదులో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిబంధనల ప్రకారం గర్భం దాల్చిన మహిళ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు హెల్త్‌చెకప్‌లు చేయించుకోవాలి. అనంతరం ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు గర్భిణుల పేర్లను నమోదు చేస్తారు. ఈ విధానంలో కొందరు హెల్త్చెకప్ చేయించుకోకుండా పేర్లను నమోదు చేయించుకోవడం, మరోవైపు గర్భిణులు రెండు నెలల తరువాత , మూడు నెలలకుపైబడి పేర్ల నమోదుకు రావడం జరుగుతోంది. దీని వల్ల పేర్లు నమోదు కాకుండా నగదు ప్రోత్సాహకం అందుకోలేకపోతున్నారు. మరోవైపు బ్యాంకు ఖాతాలను ఇవ్వకపోవడం, ఆధార్‌కార్డులను సమర్పించకపోవడం ప్రధాన కారణం. వైద్యసిబ్బంది పదేపదే చెప్పినా ధ్రువపత్రాలు సమర్పించడంలో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీరా ప్రసవం అయిన తరువాత డబ్బులు అందడం లేదని ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువగా కొనసాగుతున్నాయి. త్వరలో అందిస్తాం.... పెండింగ్‌లో ఉన్న నగదు ప్రోత్సాహకాలు త్వరలో అందుతాయి. గర్భిణులు నిబంధనల ప్రకారం పక్కా సమాచారం నమోదు చేస్తే తప్పకుండా నగదు ప్రోత్సాహకం హైదరాబాద్ నుంచి వారి ఖాతాలో జమచేస్తారు. ఏమైన పొరపాట్లు ఉంటే నగదు ప్రోత్సాహకం అందించడం కష్టం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరుగుతోంది. – డా.సుదర్శనం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
ఉద్యోగ భద్రతపై తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి
సాక్షి, అమరావతి : ఉద్యోగ భద్రత విషయంలో గ్రామీణ స్థాయి మహిళా నర్స్ వర్కర్ల (ఏఎన్ఎం)కు ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఉద్యోగ భద్రతపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఆయన ఏఎన్ఎంలకు సూచించారు. తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా పూర్తికాకముందే.. విష ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన తప్పుబట్టారు. ఏఎన్ఎంల ఆందోళనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయన తన శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏఎన్ఎంలను ఉద్యోగాల నుంచి తీసివేస్తారన్న ప్రచారం ఎందుకు జరుగుతోందని అధికారులను ఆయన ఆరా తీశారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ తనకు చెప్పారని పేర్కొన్న ఆళ్ల నాని.. ఈ అంశంపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. ఏఎన్ఎంల ఉద్యోగ భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరంలేదని, రాష్ట్రవ్యాప్తంగా 7,418 మంది ఏఎన్ఎంలు.. కాంట్రాక్టు, సెకండ్ ఏఎన్ఎం, ఈసీ ఏఎన్ఎం తదితర కేటగిరీల్లో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల్లో భాగంగా 13,540 మంది ఏఎన్ఎంలను నియమిస్తున్నామని, ఈ పోస్టుల కోసం పైమూడు పద్ధతుల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలు కూడా దరఖాస్తు చేసుకొని.. పరీక్షలకు హాజరుకావొచ్చునని వెల్లడించారు. ఇలా పరీక్షలు రాసేవారికి 10శాతం వెయిటేజీ కూడా ఇస్తున్నామని తెలిపారు. సచివాలయ పోస్టులకు ఎంపిక కాకపోయినా ఇప్పుడున్న ఉద్యోగాల్లో ఏఎన్ఎంలను యథావిధిగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సచివాలయ పోస్టులకు ఎంపికైన వారికి వేతన అంతరంపై ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంటుందని, ఎవ్వరికీ ఎలాంటి నష్టం రాకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని తెలిపారు. -
ఏఎన్ఎం నిర్లక్ష్యం.. చిన్నారులకు శాపం!
సాక్షి, చీరాల (ప్రకాశం): ఓ ఏఎన్ఎం తీవ్ర నిర్లక్ష్యం కారణంగా నలుగురు చిన్నారుల ప్రాణం మీదకు వచ్చింది. జ్వరానికి వాడాల్సిన టాబ్లెట్లు కాకుండా షుగర్వ్యాధికి వాడే మందులు వేయడంతో ఆ చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చీరాలలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారులు కోలుకున్నారు. కొద్ది సమయం మించితే నలుగురు చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసేవి. ఈ సంఘటన శనివారం చీరాల మండలం విజయనగర్‌కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగర్ కాలనీకి చెందిన 45 రోజుల చిన్నారులు డి.బాబు, తేళ్ల బాబు, తేళ్ల పాప, రేణుమళ్ల పాపలకు శనివారం గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో ఐటీవీ వ్యాక్సిన్లు (పోలియో రాకుండా రోటావైరస్, పెంటాలెవల్) ఇంజెక్షన్లు ఏఎన్ఎం భాగ్యలక్ష్మి వేశారు. ఈ వ్యాక్సిన్లు వేసినప్పుడు సహజంగా చిన్నారులకు జ్వరం వస్తుంది. జ్వరం తగ్గేందుకు ప్రతి చిన్నారికి పారాసెట్మాల్ టాబ్లెట్ ఇవ్వాలి. ఏఎన్ఎం అజాగ్రత్తతో జ్వరం తగ్గేందుకు ఇచ్చే బిళ్లలు (టాబ్లెట్)లకు బదులు మెట్ఫార్విన్ (షుగర్ బిళ్లలు) చిన్నారుల తల్లిదండ్రులకు ఏఎన్ఎం అందించింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు అవి మింగించారు. నలుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 45 రోజుల చిన్నారులు అస్వస్థతతకు గురి కావడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఏఎన్ఎంను కలిశారు. పొరపాటున జ్వరం బిళ్లలకు బదులు షుగర్ మాత్రలు అందించానని చెప్పడంతో వెంటనే నలుగురు శిశువులను తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రైవేటు చిన్న పిల్లల వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. నలుగురు శిశువులు నిద్రలోకి వెళ్తే చేతికి అందేవారు కారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రైవేట్ వైద్యశాల చిన్నపిల్లల వైద్య నిపుణులు నలుగురు చిన్నారులకు హుటాహుటిన ప్రథమ చికిత్సతో పాటు పొట్టలోకి పైపు పంపించి మందు బిళ్లలు బయటకు రప్పించడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో అటు చిన్నారుల తల్లిదండ్రులు ఇటు వైద్యశాఖ అధికారులు ఉపశమనం పొందారు. రెండు గంటల ఆలస్యమైతే తమ పిల్లలు తమకు దక్కేవారు కాదని వారు చెప్పడం అందరిని కలచివేసింది. ఏఎన్ఎం అజాగ్రత్తగా వ్యవహరించి చిన్న పిల్లల వైద్య సేవలపై నిర్లక్ష్య ధోరణితో వ్యహరించడంతో ఏఎన్ఎం భాగ్యలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని శిశువుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పీహెచ్సీ వైద్యురాలు శ్రీదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లిన నలుగురు శిశువులను పరామర్శించి ప్రాణాపాయం లేకుండా వైద్య సేవలు అందించేలా దగ్గరుండి పర్యవేక్షించారు. 45 రోజులున్న శిశువుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పీహెచ్సీ వైద్యురాలు శ్రీదేవి తెలిపారు. ఏఎన్ఎంపై చర్యలు చిన్నారులకు వ్యాక్సిన్లు వేసి జ్వరం టాబ్లెట్లకు బదులు షుగర్ టాబెట్లు ఇచ్చిన ఏఎన్ఎం భాగ్యలక్ష్మిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే చార్జి మెమో ఇచ్చాం. సంఘటనను డీఎం అండ్ హెచ్‌వోకు వివరించా. జిల్లా ఉన్నతాధికారులు ఏఎన్ఎంపై చర్యలు తీసుకుంటారు. - శ్రీదేవి, పీహెచ్సీ వైద్యురాలు -
‘104’ సమస్యలు
ఆదిలాబాద్: గ్రామీణులకు మెరుగైన వైద్యం అం దించే 104 వాహనాలను మరమ్మతు సమస్యలు వెంటాడుతున్నాయి. 2008లో ప్రారంభించిన వా హనాలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడంతో ఒక్కొక్కటిగా మూలనపడుతున్నాయి. జిల్లా అధికారులు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు వెచ్చించి మరమ్మతులు చేయిస్తున్నా.. అంతకుమించి ఖర్చయ్యే పక్షంలో చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు వాహనాలు మూలకుపడ్డాయి. వైద్య పరికరాల సరఫరా కూడా లేకపోవడంతో మూలనపడడానికి కారణమవుతోంది. వాహనాల్లోని సిబ్బందిని కుదించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వీటి వైపు రాకపోవడంతో సరైన వైద్యం అందడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 24 ‘104’ వాహనాలు నిత్యం గ్రామాల్లో విద్య శిబిరాలు నిర్వహిన్నాయి. మొదట్లో ఇవి హెచ్ఏంఆర్ఐ అదీనంలో ఉన్నా తర్వాత ప్రభుత్వం తన అదీనంలోకి తీసుకుంది. జిల్లాల విభజనకు ముందు 17 సీహెచ్ఎన్సీ(కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రీషన్ సెంటర్)లకు అప్పగించింది. జిల్లాల విభజన అనంతరం ఉమ్మడి జిల్లాలో ఏడు ఉప ఆరోగ్య వైద్యాధికారి కార్యాలయాలకు వీటి బాధ్యతలను అప్పగించింది. మొదట్లో ప్రతి వాహనంలో ముగ్గురు ఏఎన్ఎంలు, ఫార్మాసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్, డీఈఓ, డ్రైవర్ చొప్పున విధులు నిర్వర్తించేవారు. వైద్య శిబిరం నిర్వహించే చోట సంబంధిత పీహెచ్సీ వైద్యాధికారి, గ్రామంలోని ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యేవారు. ప్రభుత్వం సిబ్బందిని కుదిస్తూ ప్రతీ వాహనంలో ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్లకే పరిమితం చెసింది. డీఈఓలను క్లస్టర్ కార్యాలయాల్లో నియమించింది. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించే సమయంలో ఆయా పరిధి పీహెచ్సీ వైద్యాధికారి, మొదటి రెండవ ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న చోట వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు కానరావడం లేదు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారుల కొరతతోపాటు సిబ్బందికి పనిభారంతో గైర్హాజరు అవుతున్నారు. దీంతో గ్రామీణులకు సరైన వైద్యం అందడం లేదు. కానరాని వైద్య పరికరాలు. హిమోగ్లోబిన్ శాతాన్ని పరీక్షించే హెచ్‌బీ ట్యూబ్‌లు, రక్త పరీక్షల కోసం నమూనాలు సేకరించే పిపెట్లు వాటిపై ఉండే గుర్తులు చెదిరి పోవడంతో పరీక్షల సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. పిపెట్లకు పగుళ్లు వచ్చినా గత్యంతరం లేక వాటినే వినియోగిస్తూన్నారు. 15 వాహనాల్లో బరువు తూచే యంత్రాలు పని చేయడం లేదు. చిన్నపిల్లల బరువు చూడడానికి ఏర్పాటు చేసిన బేబీ వేయింగ్ మిషన్లు అటకెక్కాయి. గర్భిణుల ఎత్తు కొలవడం, చిన్నపిల్లల్లో వయస్సుకు తగ్గ ఎదుగుదల ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన హైట్ చార్టులు సుమారు 12 వాహనాల్లో కనిపించడం లేదు. ఉన్న వాహనాల్లో చిరగడంతో పనికి రాకుండా పోయాయి. గర్భిణుల్లో పిండం కదలికల్లో వచ్చే శబ్దాలను అంచనా వేస్తూ ఎదుగుదల తదితర చర్యలను నిర్ధారిస్తూ వైద్యం అందించడానికి ఇచ్చిన ఫీటర్స్కోప్లు మూలనపడ్డాయి. గ్లూకోమీటర్లతో షుగర్ శాతం తెలుసుకోవడం కష్టంగా మారింది. బీపీ మీటర్లు మూలకుపడడంతో పరీక్షల సమయంలో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతుకు నోచుకోక.. వాహనాల్లో బ్యాటరీలు మొరాయిస్తున్నాయి. టీవీల ద్వారా ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించడానికి ప్రతీ వాహనంలో రూ.50 వేల విలువైన టీవీ, డీవీడీలు ఏర్పాటు చేశారు. ఇవి వాహనాల్లో ఉన్నా బ్యాటరీలకు రీచార్జి లేక బ్యాటరీలు మూలనపడడంతో పని చేయడం లేదు. మంచిర్యాల, ఉట్నూర్ ప్రాంతాల్లోని మూడు వాహనాల్లో టీవీలు లేవని తెలిసింది. గతంలో ఓ వాహనంలోని టీవీ కనిపించకపోవడంతో ఏడీసీ స్థాయి అధికారిపై కేసు నమోదైంది. చాలా వాహనాల్లో సైరన్లు మూగబోయాయి. హెడ్లైట్లు తప్పితే వాహనం చుట్టూ ఉండే లైట్లకు మరమ్మతులు లేక వెలగడం లేదు. అత్యవసర సమయంలో వాహనంలో లోపల ఉన్న సిబ్బంది క్యాబీన్లోని డ్రైవర్ ఇతర సిబ్బందితో మాట్లాడటానికి ఉపయోగించే ఇంటర్ కమ్ ఫోన్ సౌకర్యాలు కనుమరుగు అయ్యాయి. వాహనంలో రెండు వైపుల రూ.60 వేలతో ఏర్పాటు చేసిన టెంట్లు పని చేయడం లేదు. కుర్చీలు, టేబుళ్లు విరిగిపోవడంతో వైద్య శిబిరం నిర్వహించే చోట గ్రామస్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. మందుల సరఫరా అంతంతే.. మొదట్లో ప్రతి వాహనంలో వంద రకాల మందులు సరఫరా అయ్యేవి. ఇందుకోసం ప్రభుత్వం నెలకు సుమారు రూ.40 వేలు కేటాయించేది. దీంతో జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్(సీడీసీ) నుంచి 104లకు చేరేవి. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు దాదాపు 53 రకాల మందులు సరఫరా చేయాల్సి ఉండగా 20 రకాలు కూడా సరఫరా కావడం లేదని తెలిసింది. గ్రామాల్లో ఎక్కువగా ఉపయోగించే షుగర్, బీపీ, అస్తమా మందులు వస్తున్నా ఇతర వ్యాధులకు సంబంధించిన మందులు పూర్తి స్థాయిలో సరఫరా లేదు. దీంతో ప్రైవేట్‌గా కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. -
ఏఎన్ఎంల సేవలు గోరంతే..!
ఆదిలాబాద్‌టౌన్: పేదలకు నాణ్యమైన సర్కారు వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తోంది. ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినప్పటికీ ఆశించిన ఫలితాలు ఆచరణలో మాత్రం కానరావడం లేదు. వైద్యాధికారుల నిర్లక్ష్యమో లేక ఏఎన్ఎంల అలసత్వమేమో కానీ గర్భిణులు, బాలింతలు,చిన్నారులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని తెలుస్తోంది. గత వారం రోజుల క్రితం సిరిసిల్ల జిల్లాకు చెందిన రెండు బృందాలు జిల్లాలోని పలు సబ్ సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ సెంటర్లలోని సౌకర్యాలు, వసతులపై ఆరా తీశారు. కొంతమంది ఏఎన్ఎంలకు రక్త పరీక్షలు చేయడం రాదని, గర్భిణులు, బాలింతల వివరాలు పొంతన లేని విధంగా నమోదు చేసినట్లు వారి పరిశీలనలో బయటపడింది. ఈ వివరాలతో కూడిన నివేదికను ఆ బృందాలు డీఎంహెచ్‌ఓతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు సమర్పించారు. వారి తప్పులను సవరించుకునే విధంగా వైద్యశాఖ చర్యలు చేపడుతోంది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జిల్లాలో తనిఖీ బృందాల పర్యటన.. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 126 సబ్ సెంటర్లు ఉండగా, సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆరుగురు సూపర్వైజర్ సభ్యులు ప్రభలత, రాజునాయక్, జె.రత్నాకర్‌రావు, రమేష్, సుశీల, యాదగిరి రెండు బృందాలుగా ఏర్పడి అక్టోబర్ 30 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు జిల్లాలోని 32 సబ్ సెంటర్లలో పర్యటించారు. బేల, చప్రాల, భోరజ్, ఆనంద్‌పూర్, బోరిగాం, కోకస్మన్నూర్, తర్నం, ముత్నూర్, ఖానాపూర్, లోకారి, పరస్వాడ(బి), కుచ్లాపూర్, భరంపూర్, రాంపూర్, భీంసరి, మావల, కేశవపట్నం, ఘన్పూర్, కేస్లాపూర్, యేందా, నాగల్కొండ, కప్పర్ల, అందర్‌బంద్, గిరిగావ్, గుడిహత్నూర్, మన్నూర్, మర్లపల్లి, బోథ్, గిర్నూర్, జాతర్ల, రాంపూర్(కె), లక్కారం సబ్ సెంటర్లను పరిశీలించారు. వీటిలో గాదిగూడ పీహెచ్సీ పరిధిలోని పరస్వాడ, ఝరి పీహెచ్సీ పరిధిలోని లోకారి, ఇచ్చోడ పీహెచ్సీ పరిధిలోని బోరిగాం, సైద్పూర్ పీహెచ్సీ పరిధిలోని చప్రాల, బేల పీహెచ్సీ పరిధిలోని బేల సబ్‌సెంటర్, అంకోలి పీహెచ్సీ పరిధిలోని మావల, నర్సాపూర్ పీహెచ్సీ పరిధిలోని కేశవపట్నం, సొనాల పీహెచ్సీ పరిధిలోని ఘన్పూర్ సబ్‌స్టేషన్‌లో పనిచేసే ఏఎన్ఎంల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీరిలో కొంతమందికి హెమోగ్లోబిన్ రక్త పరీక్షలు చేయరాకపోవడం, ఆశ కార్యకర్తలు గర్భిణులను ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడం, అంగన్వాడీల రికార్డులకు ఏఎన్ఎంల రికార్డులకు బాలింతలు, గర్భిణుల వివరాల పొంతన లేకుండా ఉండడం, వ్యాక్సినేషన్ సరిగా లేకపోవడంతోపాటు వివిధ కారణాలను చూపుతూ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. వైద్యసేవలు అంతంతే.. జిల్లాలోని సబ్సెంటర్లలో విధులు నిర్వర్తించే కొంతమంది ఏఎన్ఎంల సేవలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ విషయం రాష్ట్ర తనిఖీ బృందం పరిశీలనలోనే తేటతెల్లమైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పీహెచ్సీ పరిధిలోని మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణ లేకపోవడంతో కొంతమంది ఏఎన్ఎంలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఆరోగ్య కేంద్రాల ఆవరణలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడం, సమయపాలన పాటించకపోవడం, వారంలో ఒకట్రెండు రోజులు మాత్రమే ఉప కేంద్రాలను తెరవడం, గ్రామాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించకపోవడం, నామమాత్రంగానే విధులు నిర్వహిస్తున్నారనే విషయాలన్ని బృందం సభ్యుల దృష్టికి వచ్చింది. జాబ్ చార్ట్ ప్రకారం సబ్సెంటర్కు ఇద్దరు ఏఎన్ఎంలు ఉంటే ఒకరు సబ్సెంటర్లో ఉండాలి, మరొకరు గ్రామాల్లో ప్రజలకు సీజనల్ వ్యాధులు, తదితర వాటిపై అవగాహన కల్పించాలి. గర్భిణులకు ఐరన్ మాత్రలు అందజేయాలి. మాతా, శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాలి. గర్భిణులకు హెమోగ్లోబిన్ రక్త పరీక్షలు చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలి. కుటుంబ నియంత్రణ పాటించేలా చర్యలు తీసుకోవడంతోపాటు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. పీహెచ్సీ పరిధిలోని వైద్యులతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయించాలి. ఉదయం నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించాలి. కిషోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, రుతుచక్రం గురించి అవగాహన కల్పించాలి. కానీ జిల్లాలో కొంతమంది ఏఎన్ఎంలు ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ఇటీవల సిరిసిల్ల సూపర్వైజర్ల బృందం జిల్లాలోని 32 సబ్ సెంటర్లను పరిశీలించింది. ఇందులో నుంచి కొన్ని సెంటర్లలో కొంతమంది ఏఎన్ఎంలకు హెచ్‌బీ పరీక్షలు చేయడం రాదనే విషయాన్ని బృందం సభ్యులు నివేదికలో పొందుపర్చారు. గర్భిణులు, బాలింతల వివరాలు వేర్వేరుగా నమోదు చేసిన అంగన్వాడీ, ఏఎన్ఎంల రికార్డుల్లో వ్యత్యాసం ఉంది. కొంతమంది ఆశ కార్యకర్తలు గర్భిణులను ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లడం లేదనే విషయాన్ని నివేదికలో తెలిపారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటాం. విధుల్లో ఎవరైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పవు. – రాజీవ్‌రాజ్, డీఎంహెచ్ఓ, ఆదిలాబాద్ -
డాక్టర్ మెడపట్టి గెంటివేశాడని ఏఎన్ఎం ఆవేదన
నెల్లూరు, వెంకటగిరి: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం బాలింతలను తీసుకువచ్చిన ఏఎన్ఎంపై కమ్యునిటీ హెల్త్‌సెంటర్ వైద్యాధికారి అనుచితంగా ప్రవర్తించడంతో సోమవారం ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల జోక్యంతో వివాదం సర్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శ్రీకాళహస్తి మండలంలోని ఇలగనూరు వైద్యారోగ్య కేంద్రం పరిధిలో జ్యోతి అనే మహిళ ఏఎన్ఎంగా పనిచేస్తోంది. ఆమె ప్రతి సోమవారం బాలింతలకు వెంకటగిరి సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తుంటుంది. ఈ క్రమంలో నలుగురు బాలింతలను ఆపరేషన్‌కు సిద్ధంచేసి ఆదివారం సీహెచ్‌సీ వైద్యుడు శ్రీనివాస్‌కు సమాచారం అందించింది. సోమవారం ఉదయం శ్రీనివాస్ ఆస్పత్రిలో మరో గైనకాలజిస్ట్ సెలవుపై వెళ్లారని, ఆపరేషన్లు నిర్వహించడంలేదని జ్యోతికి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆమె తన ఏరియా పరిధిలోని బాలింతలకు ఆ సమాచారం చేరవేశారు. అయితే అప్పటికే ఇద్దరు బాలింతలు ఆస్పత్రికి చేరుకోగా మరో ఇద్దరు మార్గమధ్యలో ఉన్నారు. కాగా జ్యోతి తను విధులు నిర్వర్తించే ఎంపేడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లింది. తోటి ఏఎన్ఎంల ద్వారా వెంకటగిరి ఆస్పత్రిలో కు.ని ఆపరేషన్లు చేస్తున్నారని తెలుసుకుంది. తన ఏరియా పరిధిలోని బాలింతలకు మాత్రం ఎందుకు నిరాకరించారో తెలసుకుందామని ఆమె ఆస్పత్రికి వెళ్లింది. ఆ సమయంలో ఎనిమిది మందికి ఆపరేషన్లు చేసేందుకు సిద్ధం చేస్తున్న వైద్యుడు శ్రీనివాస్ వద్దకు వెళ్లి మాట్లాడింది. తాను తీసుకువచ్చిన బాలింతలకు ఎందుకు ఆపరేషన్లు నిర్వహించడం లేదని అడిగింది. గిరిజన, దళితవర్గాలకు చెందిన బాలింతలు వ్యయప్రయాసలతో ఆస్పత్రికి వస్తే తిరిగి పంపడం ఏంటని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహనికి గురైన శ్రీనివాస్ కు.ని ఆపరేషన్లు అత్యవసర సేవలా?, గురువారం చేస్తాం. అప్పుడు బాలింతలను తీసుకురావాలని ఆగ్రహం వ్యక్తం చేశాడు. చేస్తే అందరికీ చేయాలని, లేకుంటే వాయిదా వేయాలని తాను అనడంతో ఆగ్రహానికి గురైన డాక్టర్ మెడపట్టి గెంటివేశాడని ఏఎన్ఎం జ్యోతి విలపిస్తూ అక్కడున్న బాలింతలకు చెప్పింది. విషయం తెలుసుకున్న ఏఎన్ఎం బంధువులు, కొందరు బాలింతలు ఆస్పత్రి వద్దకు చేరుకుని వైద్యుడు శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈనేపథ్యంలో డాక్టర్ ఇచ్చిన సమాచారంతో ఎస్సై నాగయ్య ఆస్పత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. ఇరువర్గాలతో మాట్లాడారు. డాక్టర్ ఏఎన్ఎంకు క్షమాపణ చెప్పడంతో వివాదం సర్దుమణిగింది. గతంలోనూ వివాదాలు వైద్యాధికారి శ్రీనివాస్ వ్యవహారశైలిపై గతంలోనూ వివాదాలు చోటుచేసుకున్నాయి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జాన్ భార్యకు ఆస్పత్రిలో ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయగా వేసిన కుట్లు ఊడిపోయాయి. దీనిపై ప్రశ్నించిన జాన్‌తో వివాదం జరిగింది. పోస్టుమార్టం కేసుల్లో జాప్యం జరుగుతున్న వైనంపై బంధువులతో వివాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. రెండురోజుల క్రితం వెంకటగిరి పరిధిలో జరిగిన ఓ మహిళ హత్యకేసులో స్థానికంగా శవపరీక్ష చేయకపోవడంతో పోలీసులు నెల్లూరుకు వెళ్లాల్సి వచ్చింది. -
ఏఎన్ఎం జీతాల పెంపు
సాక్షి, హైదరాబాద్: ఏఎన్ఎంల జీతాలను పెంచు తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణ యం తీసుకున్నారు. ఈ మేరకు వారి జీతాలను రూ.10 వేల నుంచి రూ.21 వేలకు పెంచుతూ ఆదివారం ఫైలుపై సంతకం చేశారు. 2003లో యూరోపియన్ కమిషన్ ప్రాజెక్టు కింద 710 మంది ఏఎన్ఎంలను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం వారి నెల జీతం రూ.10 వేలుగా ఉంది. ఈ నేపథ్యంలో వారి జీతాలను పెంచాలన్న ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని ఫైలుపై సంతకం చేశారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. ఇటీవల సీఎంను కలసి సెకండ్ ఏఎన్ఎంల జీతాలు కూడా పెంచాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన సీఎం.. వారి జీతాలను పెంచే ప్రతిపాదనలను పరిశీలిస్తామని భరోసా ఇచ్చారు. -
‘సమ్మె విరమిస్తేనే...’
మణికొండ: డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రెండవ ఏఎన్ఎంలు సమ్మె విరమిస్తేనే వారి సమస్యలను పరిశీలిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు మణికొండలోని మంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. వారు ఆందోళనకు సిద్ధ పడుతుండగానే మంత్రి బయటకు వచ్చి వారితో చర్చించి వినతిపత్రం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగటం తగదన్నారు. రెండవ ఏఎన్ఎంల విషయంలో తాను ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించామని, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ పథకం కేంద్రం మంజూరు చేయాల్సి ఉన్నందునే ఆలస్యం జరుగుతుందన్నారు. సమ్మె విరమించి తన వద్దకు వస్తేనే దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. దాంతో వారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీఐటీయూ నేతలు జైపాల్‌రెడ్డి, తెలంగాణ మెడికల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి బలరాం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న 4వేల మంది రెండ వ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలన్నా రు. 10 పీఆర్సీ ప్రకారం ఏఎన్ఎంలకు బేసిక్ జీతం రూ. 21.300లతో పాటు డీఏ, హెచ్ఆర్ఏలు సైతం వర్తింపజేయాలని ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోనందునే సమ్మెకు దిగామన్నారు. కార్యక్రమం లో కవిత, రోజా, రమాదేవి, అనిత, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి ముట్టడి
హైదరాబాద్: తమ డిమాండ్లను తీర్చి, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఎన్‌ఎంలూ మంత్రి నివాసం ముట్టడికి యత్నించారు. సోమవారం ఉదయం మణికొండలోని మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి వద్దకు భారి ఎత్తున చేరుకున్న ఏఎన్ఎంలు ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి సమ్మె విరమించి వస్తే సమస్య సరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు. -
మంత్రి ఇంటి ముట్టడికి రెండో ఏఎన్ఎంల యత్నం
బాన్పువాడ టౌన్ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇల్లును ముట్టడించేందుకు రెండో ఏఎన్ఎంలు ప్రయత్నించారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంనుంచి మంత్రి ఇంటి వరకు ర్యాలీగా వచ్చారు. సీఐ వెంకటరమణరెడ్డి, ఎస్సై సంపత్‌లు సిబ్బందితో కలిసి వారిని అడ్డుకున్నారు. దీంతో ఏఎన్ఎంలు రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేశారు. రెండో ఏఎన్ఎంలను వెంటనే రెగ్యులర్ చేయాలని, పదో పీఆర్సీ ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని, 35 రోజుల క్యాజువల్ లీవ్, 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌బాబు డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి తనయుడు సురేందర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా మహిళా కన్వీనర్ నూర్జహాన్, సీఐటీయూ నాయకులు ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి ఇంటి ఎదుట రెండో ఏఎన్ఎంల ధర్నా
సూర్యాపేట : తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రెండో ఏఎన్ఎంలు శనివారం సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నివాసం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కొలిశెట్టి యాదగిరిరావు, గురూజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2016 జనవరిలో కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచి జీఓ 14ను విడుదల చేసినప్పటికీ అందులో రెండో ఏఎన్ఎంలను గుర్తించకపోవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో సుమారు 4 వేల మంది సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. పదో పీఆర్సీ ప్రకారం.. నెలకు రూ.21,300 వేతనం పెంచి, ప్రసూతి సెలవులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి పీఎస్ డీఎస్వీ శర్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు రమాదేవి, కల్యాని, యశోద, సువర్ణ, దేవేంద్ర, స్వప్న, రజియాబేగం, కవిత, కమల, భారతి, రజిత తదితరులు పాల్గొన్నారు. -
15వ రోజుకు చేరిన సమ్మె
కొనసాగుతున్న సెకండ్ ఏఎన్ఎంల సమ్మె పరిగి: సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సెకండ్ ఏఎన్ఎంల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. సోమవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట కొనసాగించారు. ఒంటి కాలుపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ..10వ పీఆర్సీ ప్రకారం రూ. 21300 కనీస వేతనం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు తమ విధులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాలుగు మండలాల సెకండ్ ఏఎన్ఎంలు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. -
ఏఎన్ఎంల వినూత్న నిరసన
సిద్దిపేట : రెండో ఏఎన్ఎంలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఏఎన్ఎంలు వినూత్న నిరసన తెలిపారు. స్థానిక క్లస్టర్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి ఆందోళన చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు సరస్వతీ, రజిత, నాగమణి, విజయ, రేణుక, యాదమ్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ వచ్చినా మావి బిక్షపు బతుకులే
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తెలంగాణ కాంట్రాక్టు 2వ ఏఎన్ఎంల ఆధ్వర్యంలో బిక్షాటన చేశారు. రాష్ట్రంలో 4వేల మంది 2వ ఎఎన్ఎంలు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారని, గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక కూడ ఇక మా బతుకులు బిక్షపు బతుకులుగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఆర్.వాణి, కుమార్, కిరణ్మయి, మమత, రజిత, సమత, సబిత తదితరులు పాల్గొన్నారు. -
రోడ్లు ఊడ్చి ఏఎన్ఎంల నిరసన
మహబూబ్‌నగర్ క్రైం : రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న 4వేలమంది రెండో ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పర్వతాలు, విజయవర్ధన్ రాజు మాట్లాడుతూ కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఏఎన్ఎంలను గుర్తించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. 2వ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం ఎదుట నిర్వహించిన సమ్మె, శనివారం నాటికి ఆరో రోజుకు చేరింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఏఎన్ఎంలకు 10వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనాలు అమలుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్, చంద్రకాంత్, భాగ్యవతి, రాజేశ్వరి, మంజుల, కల్పన, వరలక్ష్మి, పుష్ప, సువర్ణ, లత, గొవిందమ్మ, సుమిత్ర పాల్గొన్నారు.